baba ramdev
-
పతంజలి ఆయుర్వేద్ ఆదాయం అదుర్స్!
న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2023–24) రూ.9,335 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది. లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్‌లో కొంత వాటాలు విక్రయించడం ఆదాయం పెరిగేందుకు సాయపడింది.అలాగే, గ్రూప్‌లోని ఇతర కంపెనీల రూపంలో మెరుగైన ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీ సమర్పించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర ఆదాయం రూ.2,875 కోట్లు 2023–24లో వచ్చినట్టు వెల్లడించింది. నికర ఆదాయాన్ని గమనిస్తే.. (కేవలం అమ్మకాల ద్వారా వచ్చిన) అంతక్రితం ఆర్థిక సంవ్సరం కంటే 14 శాతం తక్కువగా రూ.6,460 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.2,901 కోట్లుగా నమోదైంది. 2022–23 సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద్ రూ.7,534 కోట్ల ఆదాయంపై రూ.578 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.ఆదాయం తగ్గినప్పటికీ, నికర లాభం ఐదు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పతంజలి ఫుడ్స్‌లో వాటాల విక్రయం, ఇతర ఆదాయం ఇందుకు దోహదపడింది. ప్రకటనలు, ప్రచారం కోసం 9 శాతం అధికంగా రూ.422 కోట్లు వ్యయం చేసింది. పతంజలి ఆయర్వేద్ తన నిర్వహణలోని హోమ్, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని రూ.1,100 కోట్లకు పతంజలి ఫుడ్స్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది జూలైలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పతంజలి ఆయుర్వేద్ ఫలితాల్లో కనిపించనుంది. దివాలా పరిష్కార చట్టం కింద రుచి సోయా సంస్థను పతంజలి గ్రూప్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చడం గమనార్హం. -
విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది. -
లైసెన్స్ రద్దైన 14 ఉత్పతుల అమ్మకాలు నిలిపేశాం: పతంజలి
ఢిల్లీ: లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను ఆపేశామని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరఖండ్ ప్రభుత్వం పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూచించినట్లు చెప్పింది. అదేవిధంగా లైసెన్స్ రద్దు అయిన ఈ 14 ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు సైతం నిలిపివేయాలని పలు మీడియా సంస్థలకు తెలిపామని పతంజలి అఫిడవిట్లో పేర్కొంది.ఇక.. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తప్పుదోవ పట్టించేలా పతంజలి వాణిజ్య ప్రకటనలు ఇచ్చిందని నిర్ధరణ కావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ సంస్థకు సంబంధించిన 14 రకాల ఉత్పత్తుల తయారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం లైసెన్స్ రద్దుచేసిన 14 రకాల తమ ఉత్పత్తుల అమ్మకాల నిలిపి వేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. -
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: యోగా విషయంలో బాబా రాందేవ్ చేస్తున్న కృషి మంచిదే కానీ.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పతంజలి ఆయుర్వేద సంస్థ, బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలపై నమోదైన తప్పుడు ప్రకటనల కేసుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రభావం అధికంగా ఉందని. దానిని సరైన మార్గంలో ఉపయోగించాలని బెంచ్ సూచించింది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ ధర్మాసనం పేర్కొంది. పతంజలి తరపున సీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. తమ ప్రకటనలు ఇంకా ప్రచురిస్తున్న టీవీ ఛానెల్‌లకు పతంజలి లేఖలు రాసిందని, సందేహాస్పద ఉత్పత్తుల అమ్మకాలను పంజలి నిలిపివేసిందని కోర్టు చెప్పారు. రామ్‌దేవ్ యోగా కోసం చాలా చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించగా.. యోగా కోసం ఆయన ఏం చేశారన్నది మంచిదే కానీ పతంజలి ఉత్పత్తుల విషయం భిన్నమైందని జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. అలాగే బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది.అనంతరం మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పతంజలిని కోరింది. అఫిడవిట్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఉత్పత్తుల స్టాక్స్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కరణ కేసుపై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై తదుపరి విచారణ జూలై 9న చేపడతామని పేర్కొంది. -
తప్పుడు ప్రకటనలకు విరుగుడు ఎలా?
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది. క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్‌లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు. ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్‌లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోనిపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు. ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి. కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు చికిత్స కల్పిస్తామంటూ రామ్‌దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు. గురుగ్రామ్‌లో రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్‌దేవ్ హెచ్ఐవీ/ఎయిడ్స్‌ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్‌దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్‌దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు. దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు. ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం. మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పతంజలి ధిక్కార కేసులో మళ్లీ అక్షింతలు
న్యూఢిల్లీ, సాక్షి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తదనంతర కోర్టు ధిక్కారణ పరిణామాల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం విచారణలోనూ ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. పేపర్లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చినా కూడా.. కోర్టు వాళ్లను వదలకపోవడం విశేషం. ‘‘ఇవాళ్టి న్యూస్పేపర్లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా?.. ఆ క్షమాపణల తాలుకా అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులోనే ఉన్నాయా?’’ అంటూ ద్విసభ్య ధర్మాసనం పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే.. క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చిందని, సమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ఈ ప్రకటన ఇచ్చిందని పతంజలి తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలియజేశారు. అలాంటప్పుడు.. గతంలో ఇచ్చిన ప్రకటనల మాదిరే ఈ క్షమాపణల ప్రకటన ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ, పతంజలి న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రకటనల కోసం పతంజలి భారీగా ఖర్చు చేసిందని రోహత్గీ చెప్పగా.. దానివల్ల మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు పతంజలిపై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు రూ.100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి వచ్చిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అనుమానాలున్నాయని బెంచ్ పేర్కొంది. అయితే ఆ అభ్యర్థనతో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రోహత్గి కోర్టుకు వివరణ ఇచ్చారు. మరోవైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులను తమ కంపెనీ ఉత్పత్తులు నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ గతంలో ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఆ తప్పుడు ప్రకటనల కేసులో ఇవాళ విచారణ ఉండగా, పతంజలి ఆయుర్వేద్ దేశవ్యాప్తంగా పలు ప్రముఖ జాతీయ దినపత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇచ్చింది. కోర్టును తాము ఎప్పుడూ గౌరవిస్తామని, తప్పులు మరోసారి చేయబోమంటూ అందులో పేర్కొన్నారు. -
మీరేమీ అమాయకులు కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. బాబా రాందేవ్ అంత అమాయకుడు ఏం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాందేవ్ బాబాది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును మంగళవారం జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు భౌతికంగా హాజరయ్యారు. ‘మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం’ అని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దానికి రాందేవ్ స్పందిస్తూ.. తాము అనే పరీక్షలు చేశామని కోర్టుకు తెలిపారు. ‘మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు’ అని జస్టిస్ హిమా కోహ్లి సీరియస్ అయ్యారు. ‘మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదు’ అని మరో న్యామమూర్తి జస్టిస్ ఏ అమానుల్లా అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. చదవండి: మేమేం గుడ్డివాళ్లం కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం -
పతంజలి కేసు.. రాందేవ్‌పై మళ్లీ సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ, సాక్షి: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు బుధవారం తిరస్కరించింది. అంతేకాదు.. తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ‘‘వాళ్లు ఏదో పేపర్ మీద మొక్కుబడిగా క్షమాపణలు రాసి మాకు ఇచ్చారు. ఆ క్షమాపణల్ని మేం తిరస్కరిస్తున్నాం. పైగా ఉద్దేశపూర్వక ఉల్లంఘనలుగానే పరిగణిస్తాం’’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. నిర్ణీత సమయంలోపు మాకు అఫిడవిట్లు పంపాలన్న ధ్యాసే వాళ్లకు లేనట్లు ఉంది. పైగా రాం దేవ్, బాలకృష్ణలు తమ క్షమాపణలను ముందుగా మీడియాకు తెలియజేశారు. వాళ్లు పబ్లిసిటీనే నమ్ముకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది చిన్న తప్పా? ఆ సమయంలో పతంజలి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫిడవిట్లలో లోపం ఉందని ధర్మాసనానికి వివరించబోయారు. అయితే ‘లోపం’ అనే మాట చాలా చిన్నదంటూ ధర్మాసనం రోహత్గీకి బదులిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ‘‘ ఈ వ్యవహారంలో ఉత్తరాఖండ్ అధికారులు ఏం చేయలేదు. లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు సక్రమంగా పని చేయలేదు?. ఆ ముగ్గురు అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని బెంచ్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్, బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపై ఫైర్ పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీపై సుప్రీం కోర్టు మండిపింది. ‘‘తప్పుడు ప్రకటన విషయంలో.. 2021లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి లేఖ రాసింది. దానికి బదులుగా లైసెన్సింగ్ అథారిటీకి సదరు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది అని కోర్టు పేర్కొంది. ఇలా ఆరుసార్లు జరిగినా ఉత్తరాఖండ్ అధికార యంత్రాగం మౌనంగా ఉండిపోయిందని, పైగా కేంద్రం లేఖలు రాసినా ఎలాంటి నివేదిక రూపొందించలేదని కోర్టు గుర్తు చేసింది. కాబట్టే, ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆ సమయంలో కోర్టుకు హాజరైన ఉత్తరాఖండ్ ఫుండ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ మిథిలేష్ కుమార్ రెండు చేతులు జోడించి ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. తాను 2023లో బాధ్యతలు స్వీకరించానని, అంతకుముందే ఇది జరిగిందని, తనను వదిలేయాలంటూ ఆయన కోర్టుకు వివరించారు. అయితే కోర్టు మాత్రం కనికరించలేదు. ఆ మందులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా.. చర్యలు ఇప్పుడు తీసుకున్నారా? అంటూ జస్టిస్ హిమా కోహ్లీ పెదవి విరిచారు. దీంతో క్షమాపణలు తెలిపిన ఆయన.. కఠిన తీసుకుంటామంటూ కోర్టుకు స్పష్టం చేశారు. ఎట్టకేలకు అఫిడవిట్లు.. ఇదిలా ఉంటే.. పతంజలి నుంచి తప్పుడు ప్రకటన వ్యవహారంలో సుప్రీం కోర్టు గతంలోనే ఈ ఇద్దరు నిర్వాహకుల్ని హెచ్చరించింది. దీంతో.. చట్టం, వాణిజ్య ప్రకటనలు, మార్కెట్ నిబంధనలను ఇకపై ఉల్లంఘించబోమంటూ సర్వోన్నత న్యాయస్థానానికి గత ఏడాది నవంబరు 21న పతంజలి తరఫున వీరు ప్రమాణ పత్రం సమర్పించారు. అయినప్పటికీ ఆ హామీలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం వారిద్దరిపై కోర్టు ధిక్కారం కింద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ప్రమాణ పత్రం ఉల్లంఘనలపై చిత్తశుద్ధితో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఈ పొరపాటును పునరావృతం కానివ్వబోమని వాగ్దానం చేశారు. దీనికిగాను వారిద్దరూ విడివిడిగా మంగళవారం సాయంత్రం అఫిడవిట్లు దాఖలు చేశారు. అదే సమయంలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద సంస్థ తీరును ఆ అఫిడవిట్లో కేంద్రం తప్పుబట్టింది. పైగా కరోనాను తగ్గిస్తుందంటూ కరోనిల్ పేరిట పతంజలి చేసిన ప్రచారంపై సంస్థను అప్పట్లోనే హెచ్చరించినట్లు వెల్లడించింది. అయితే ఈ నివేదికపైనా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. IMA పిటిషన్.. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణల్లో.. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. ఆ సమయంలో ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లు మూసుకుని ఉందంటూ కేంద్రంపై మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. -
‘తప్పయింది.. నన్ను క్షమించండి’, సుప్రీం కోర్టులో బాబా రాందేవ్
న్యూఢిల్లీ : ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయర్వేద కో-ఫౌండర్ బాబా రాందేవ్, ఆ కంపెనీ సీఈఓ ఆచార్య బాలకృష్ణలను సుప్రీం కోర్టు మందలించింది. పతంజలిపై కేంద్రం సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉందని ప్రశ్నించింది. బాబా రాందేవ్ గతంలో.. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న కొందరు మరణిస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత వైద్య సంఘం (ఐఎంఎ) గత ఏడాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయ స్థానం పలు మార్లు విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలంటూ చివరిసారి ఫిబ్రవరిలో జరిపిన విచారణలో భాగంగా పతంజలి తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ తగదు తాజాగా, అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు స్వయంగా సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మరోసారి బాబారామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు న్యాయాస్థానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అంతేకాదు ఆధునిక వైద్యం కోవిడ్-19 వైరస్‌లను నయం చేయలేవన్న బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలపై కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని వ్యాఖ్యానించింది. అఫిడవిట్ ‘అవాస్తవం’,‘మోసం’ గత నెలలో యాడ్స్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసినందుకు రాందేవ్, బాలకృష్ణపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ను ‘అవాస్తవం’,‘మోసం’గా అభివర్ణించింది. అంతేకాదు, పతంజలి గత ఏడాది తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇవ్వడంపై స్పందించింది. తాము (కోర్టు) ఇచ్చిన ఆదేశాల గురించి పతంజలి మీడియా యూనిట్(pmpl) కు తెలియదన్న వాదన తోసిపుచ్చింది. #WATCH | Yog Guru Ramdev leaves from Supreme Court. He appeared before the court in the misleading advertisement case filed against the Patanjali Ayurveda. He tendered an unconditional apology before the Supreme Court for violating the apex court's order for misleading… pic.twitter.com/y9oz8vl1IL — ANI (@ANI) April 2, 2024 నన్ను క్షమించండి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పతంజలి ఆయుర్వేద్ తరపు న్యాయవాది, బాబా రాందేవ్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని క్షమాపణలు కోరారు. క్షమాపణలతో దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేశారు. ఇది ధిక్కారమే అవుతుందని అని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మీకిదే చివరి అవకాశం బాబా రాందేవ్, బాలకృష్ణలకు చివరి అవకాశంగా ఒక వారంలో సరైన పద్ధతిలో అఫిడవిట్లను దాఖలు చేయాలి. ఏప్రిల్ 10న కోర్టు విచారణకు మీరిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రకటన కేసులో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వెల్లగక్కింది. ఈసారి కోర్టుకు హాజరైన ఆయనపై నేరుగానే మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్భంలో బేషరతుగా ఆయన చెప్పిన క్షమాపణలను సైతం కోర్టు తోసిపుచ్చింది. పతంజలి కేసులో తమ ఆదేశాల్ని పాటించడం లేదంటూ రాందేవ్ బాబాతో పాటు ఆయన అనుచరుడు బాలకృష్ణపై కోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో మంగళవారం ఈ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చర్యలకు సిద్ధంగా ఉండండి.. మరోసారి కోర్టుకు రండి’ అంటూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కిందటి నెలలో పతంజలి తరఫున వాళ్లు చెప్పిన బేషరతు క్షమాణలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ‘‘మీ వివరణతో మేం సంతృప్తి చెందలేదు. మీ క్షమాపణల్ని మేం అంగీకరించం’’ అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వ్యక్తిగతంగా ఆ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారని.. ఇక్కడి నుంచే క్షమాపణలు చెబుతున్నారని.. కోర్టు ఏం ఆదేశిస్తే దానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని.. వాళ్ల తరఫు లాయర్ చేతులు జోడించి మరీ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ‘‘కోర్టు ఆదేశించినా కూడా మీరు అదే ప్రకటనలు ఇచ్చారంటే ఎంత ధైర్యం?. అసలు ఆ ప్రకటనల్లో శాశ్వత ఉపశమనం అన్నారు. అంటే దానర్థం ఏంటి?.. పూర్తిగా వ్యాధిని నయం చేస్తారనా?..’’ అని కోర్టు పతంజలి నిర్వాహకులిద్దరినీ ప్రశ్నించింది. అఫిడవిట్లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో కళ్లు మూసుకుని కూర్చుందంటూ గత విచారణలో(ఫిబ్రవరి 27న) కేంద్రంపైనా సుప్రీం కోర్టు మండిపడింది. బాబా పతంజలి స్పందన లేకపోవడంతో.. రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే పలుమార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని తెలిపింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు..ఆ యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది కూడా. ఈ క్రమంలో.. జారీ చేసినా నోటీసులకు పతంజలి స్పందించలేదు. ఆపై విచారణలో.. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దానిలో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని వ్యాఖ్యానిస్తూ.. క్షమాపణలు తెలియజేసింది. తాజాగా వారు కోర్టు ముందుకు వచ్చారు. IMA పిటిషన్.. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణల్లో.. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. పతంజలి సంస్థ కూడా డాక్టర్లను కించపరిచేలా వ్యవహరించటం సరికాదని పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గోసాయిచిట్కా ప్రకటనలేనా?
ఏ ఉత్పత్తికైనా ప్రచారం కావాలి. ప్రచారానికి ప్రకటనలివ్వాలి. ప్రకటనల్లో చెప్పేదంతా సంపూర్ణ సత్యమని ఎవరూ అనుకోరు కానీ, ప్రజల్ని మభ్యపెట్టేలా అసత్యాల్ని వ్యాప్తిలో పెడితేనే చిక్కు. మరీ ముఖ్యంగా, జీవితాలను ప్రభావితం చేసే ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై అసత్య వాణిజ్య ప్రకటనలు ప్రమాదకరం. పాపులర్ యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ప్రకటనలు సరిగ్గా ఇలాగే ‘తప్పుదోవ పట్టించేలా, అసత్యపూర్వకం’గా ఉన్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రకరకాల జబ్బులు నయమవుతాయంటున్న సదరు ఉత్పత్తుల ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. పైగా, ‘దేశం మొత్తాన్నీ ఇలా ఓ సంస్థ మోసం చేస్తూ ఉంటే’, కేంద్రం చోద్యం చూడడాన్ని సుప్రీమ్ కోర్ట్ తప్పుబట్టింది. అలాంటి ప్రచారం చేయరాదని ఉత్తర్వులిచ్చినా సరే ఉల్లంఘించినందుకు గాను సంస్థ ఎండీకి కోర్టు ధిక్కార నోటీసులివ్వడం విశేషం. స్థానిక ఉత్పత్తులతో విపణిలో బహుళ జాతి సంస్థలను మించాలని చూస్తున్న రామ్‌దేవ్ మాత్రం ఇదంతా ఆయుర్వేదంపై, తన మూలికా వ్యాపారంపై సాగుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. టూత్‌పేస్ట్‌ల నుంచి ఆహార ఉత్పత్తులు, మందుల దాకా అన్నీ అందిస్తున్న పతంజలి సంస్థ ఆధునిక వైద్య విధానాలకూ, కోవిడ్ టీకాకరణకూ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2022లో కోర్టుకెక్కింది. ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కోవిడ్ వేళ అల్లోపతి వైద్యుల్ని తక్కువ చేసేందుకు రావ్‌ుదేవ్ ప్రయత్నించారు. ఆ వ్యవహార శైలిని 2022 ఆగస్ట్‌లో సుప్రీమ్ కోర్ట్ ప్రశ్నించింది. అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించేవాటిని తక్షణమే ఆపేయాలంటూ గత నవంబర్‌లో సుప్రీమ్ ఆదేశించింది. అప్పట్లోనే పతంజలి తరఫు వకీలు సైతం తమ ఉత్పత్తుల ప్రకటనకు సంబంధించి ఇకపై చట్టాన్ని ఉల్లంఘించబోమని కోర్టుకు విన్నవించారు. ఔషధ సామర్థ్యంపై మీడియాలో ప్రకటనలివ్వబోమని కూడా హామీ ఇచ్చారు కానీ కట్టుబడ లేదు. 2006లో ఆరంభమైన పతంజలి శరవేగంతో పైకి వచ్చింది. ప్రపంచమంతా కోవిడ్‌తో అతలా కుతలం అవుతున్నప్పుడు 2020 జూన్‌లో కోవిడ్‌కు మందు కనుక్కున్నామంటూ రామ్‌దేవ్ ప్రకటించారు. ‘కరోనిల్, శ్వాసారి’ మందుల్ని ఆవిష్కరించారు. అయితే, సంస్థ ఇచ్చిన పత్రాలన్నిటినీ క్షుణ్ణంగా సమీక్షించేంత వరకు సదరు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్ని ఆపేయాలంటూ ‘ఆయుష్’ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. అయినా పతంజలి తన పంథా మానలేదు. సరికదా... కరోనా వేవ్‌లు కొనసాగుతుండగానే 2021 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నియమానుసారం కోవిడ్ చికిత్సలో అండగా కరోనిల్ మందును వాడవచ్చని ‘ఆయుష్’ నుంచి ధ్రువీకరణ పత్రం వచ్చినట్టు అబద్ధమాడింది. కానీ, ఏ సాంప్రదాయిక ఔషధ సామర్థ్యాన్నీ తాము పరీక్షించనే లేదనీ, అసలు ధ్రువీకరించనే లేదనీ ఐరాస ఆరోగ్య సంస్థ ప్రకటించేసరికి బండారం బయటపడింది. ఇదొక్కటే కాదు... పతంజలి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదమే. 2015లో దేశంలో మ్యాగీ నూడుల్స్‌పై రచ్చ రేగినప్పుడు భారత ఆహార భద్రత, నియంత్రణ సంస్థ ఆమోదమైనా లేకుండానే, పతంజలి ఆటా నూడుల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆనక నోటీసిచ్చింది. అలాగే, ‘దివ్యపుత్రజీవక్ బీజ్’ వాడితే చాలు అబ్బాయే పుడతా డంటూ 2015లో మరో మందును మార్కెట్లోకి తేవడమూ వివాదమైంది. ఇక, 2016లో పతంజలి ఆమ్లా రసం వినియోగానికి పనికిరాదంటూ రక్షణ దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాన్ని అమ్మ కాన్ని నిలిపేసింది. నిరుడు ‘దివ్య దంత మంజన్’ను శాకాహార ఉత్పత్తిగా పేర్కొంటూ దానిలో ఒక జాతి చేపను వాడడమూ రగడయింది. పతంజలి వ్యవహారశైలిపై ప్రత్యర్థుల అభ్యంతరాలు చెప్పడం నిజమే కానీ, ప్రపంచ సంస్థలన్నీ కట్టగట్టుకొని దానిపై కుట్ర చేస్తున్నాయనే మాట అసంబద్ధం. యోగాతో ఎయిడ్స్, క్యాన్సర్లను తగ్గించవచ్చంటూ 2006లోనే ప్రకటించిన రామ్‌దేవ్ వ్యాపార ప్రయాణం రెండు దశాబ్దాలవుతున్నా నేటికీ అనుమానాస్పదమే. రామ్‌దేవ్ మాటల్నే కాదు, పతంజలి ప్రకటనల్నీ ఆరోగ్యశాఖ కొట్టిపారేస్తున్నా సరే... అవే అసత్యాలు విస్తృత ప్రకటన లుగా వ్యాప్తిలో ఉండడం దురదృష్టం. ఏ ఔషధమైనా సరే ఔషధ రెగ్యులేటర్ల కఠిన పరీక్షల్లో పాసై, నిర్ణీత చికిత్సకు ఉపయోగమని ఆమోదం పొందడం అల్లోపతిలో గీటురాయి. అలాగని సంప్రదాయ ఔషధ విధానాలన్నిటినీ కొట్టిపారేయమని కాదు కానీ, పరీక్షకు నిల్చి ఫలితాలతో గెలిస్తేనే ప్రపంచంలో ప్రామాణికత. పతంజలి తన ఉత్పత్తుల టముకు ఎంత మోగిస్తున్నా, అధీకృత శాస్త్రీయసంస్థలేవీ వాటికి ఆమోదముద్ర వేయలేదు. సాధారణ ఆరోగ్యం కోసమని స్పష్టంగా చెప్పే సంప్ర దాయ మందుల్ని నమ్మకం మీద వాడవచ్చు కానీ, కరోనా లాంటి నిర్ణీత వ్యాధుల నివారణకు పరమౌషధం అన్నప్పుడు శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు కీలకం. అందులో వెనుకబడ్డ పతంజలి తీరా శాస్త్రీయ వైద్యవిధానాలపై అపనమ్మకం రేపుతోంది. సర్వ రోగ నివారిణి తమదే అన్నట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే అనవసర ఆరోగ్య సంక్షోభమే. నకిలీ వైద్యులు, గోసాయిచిట్కాలతో ఇల్లు ఒళ్ళు గుల్లవుతాయి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతర కర యాడ్స్) యాక్ట్–1954 లాంటివి ఎప్పటి నుంచో ఉన్నా, పకడ్బందీగా అమలు చేయడంలో నిర్లిప్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సుప్రీమ్ చేసిన వ్యాఖ్యలు కీలకమై నవి. అరచేతిలో ఆరోగ్య స్వర్గం చూపే ప్రకటనల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంస్థలపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇక నైనా, బుద్ధి తెచ్చుకొని పతంజలి తీరు మార్చుకోవాలి. తలబొప్పి కట్టిన పాలకులు బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధి చూపాలి. – సభావట్ కళ్యాణ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
ఇక టెక్ గురూ.. సాఫ్ట్వేర్ బిజినెస్‌లోకి రాందేవ్ బాబా!
యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాందేవ్ బాబా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం ఆయన రాణిస్తున్నారు. తాజాగా రాందేవ్ బాబా నేతృత్వంలోని కంపెనీ సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్నాలజీ సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పుణేకు చెందిన అష్దాన్ ప్రాపర్టీస్ రోల్టాకు అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించిన కొద్ది వారాలకే బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 830 కోట్లు ఆఫర్ చేసింది. పతంజలి ఆయుర్వేద్ తన ఆఫర్‌ను చేర్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో సంస్థ చేరికను ప్యానెల్ నిర్ణయిస్తుంది. మూడుసార్లు దివాలా.. కమల్ సింగ్ అనే వ్యక్తి రోల్టాను డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రమోట్ చేశారు. ఈ సంస్థ జనవరి 2023లో దివాలా ప్రక్రియలో చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూ. 7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ. 6,699 కోట్లు బకాయిపడింది. రోల్టా మొదటిసారిగా 2016లో విదేశీ కరెన్సీ రుణాలను డిఫాల్ట్ చేసింది. మూడుసార్లు దివాలా తీసివేసిన తర్వాత ఆఖరికి యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఎన్సీఎల్టీకి చేరింది. ఇదీ చదవండి: టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి.. కంపెనీ డిఫెన్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్‌లలో సేవలు అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ కాలంలో ఆదాయం రూ.38 కోట్లు మాత్రమే. రోల్టాకు ఉన్న రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ముంబైలోని ఆస్తులు బిడ్డర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ హోమ్ డెలివరీ అప్లికేషన్ కోసం రోల్టా ఐటీ మౌలిక సదుపాయాలను పతంజలి ఆయుర్వేద్ పరిశీలిస్తున్నట్లు ఈటీ నివేదిక పేర్కొంది. -
పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ
న్యూఢిల్లీ: పతంజలి ఇన్స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. -
ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే భారీ జరిమానా తప్పదని సుప్రీం మంగళవారం ఆదేశించింది. అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో కూడిన అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు చాలా తీవ్రంగా పరిగణి స్తుందని పేర్కొన్న సుప్రీం ప్రతీ తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ. 1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది. తదుపరి విచారణకు కేంద్ర నివేదికతో రావాలి ఇక మీదట పతంజలి ఆయుర్వేదం భవిష్యత్తులో అలాంటి ప్రకటనలను, పత్రికలలోప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశించింది అంతేకాదు 'అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద' అనే చర్చగా మార్చకూడదని, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొనాలని బెంచ్ కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూడాలని కూడా భారత అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ధర్మాసనం కోరింది. గతేడాది కూడా కోర్టు మందలించింది గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ.. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రామ్‌దేవ్‌ను కోర్టు మందలించిన సంగతి తెలిసిందే. -
రూ.1.3 కోట్ల కారులో బాబా రామ్‌దేవ్ - వీడియో వైరల్
ప్రముఖ యోగా గురువు 'బాబా రామ్‌దేవ్' సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 డ్రైవ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కారు ఎవరిదీ, దాని ధర ఎంత, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారుని పతంజలి CFA దివ్యాంశు కేసర్వాణి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఆటో వార్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్‌దేవ్ బాబా ఈ కారుని కొనుగోలు చేయలేదని యూపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్‌లోని పతంజలి గ్రూప్ సీఎఫ్ఓ ఇచ్చారని తెలిపారు. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర సుమారు రూ. 1.3 కోట్లు వరకు ఉంటుంది. సెడోనా రెడ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం వీడియోలో చూడవచ్చు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే.. నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ & ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. View this post on Instagram A post shared by AUTO WAAR (@auto.waar) -
వైరల్ వీడియో: లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్
-
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. రెజ్లర్లకు బాబా రాందేవ్ సపోర్ట్
ఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై భారత్ స్టార్ రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై న్యాయం చేయాలని కోరుతూ స్టార్ రెజ్లర్లు కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ తన మద్దతు ప్రకటించారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు బాబా రాందేవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని కామెంట్స్ చేశారు. అంతకుముందు కూడా రెజ్లర్ల ఆందోళనపై బాబా రాందేవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రెజ్లర్లు ఒలింపిక్స్‌లో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబురాలు చేసుకున్నాం. న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి’ అని ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ అరెస్ట్‌పై కూడా బాబా రాందేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ అరెస్ట్ కాలేదన్నారు. ఈ విషయంలో తాను ప్రకటనలు మాత్రమే చేయగలనన్నారు. అతడిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని వ్యాఖ్యలు చేశారు. Wrestlers Protest : Baba Ramdev ने कर दी Brijbhushan Singh को ठोकने की बात! #ramdev #babaramdev #wrestlersprotest #brijbhushansingh #brijbhushansharansingh #vineshphogat #bajrangpunia #sakshimalik @b_bhushansharan @Phogat_Vinesh @SakshiMalik pic.twitter.com/09ECqfVpfy — Haryana Tak (@haryana_tak) May 27, 2023 ఇది కూడా చదవండి: ‘9 ఏళ్ల పాలన.. 9 ప్రశ్నలు.. మోదీపై విద్వేషంతోనే ఇదంతా..’ -
దేశ జనాభా నియంత్రణపై బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు యోగా గురువు బాబా రామ్‌దేవ్ కృతజ్ఞతలు తెలిపారు. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్‌లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్ దేవ్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్‌దేవ్ సూచించారు. -
అయితే, ఇప్పుడు మీ సమయం విలువ పూర్తిగా పడిపోయింది సార్!
అయితే, ఇప్పుడు మీ సమయం విలువ పూర్తిగా పడిపోయింది సార్! -
కోవిడ్ తర్వాత దేశంలో క్యాన్సర్ విజృంభిస్తోంది: రాందేవ్
పనాజి: భారత్‌లో కరోనా విజృంభణ తర్వాత క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గోవా మిరామర్ బీచ్‌లో శనివారం పతాంజలి యోగా సమితి నిర్వహించిన యోగా క్యాంప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి విజృంభణ తర్వాతే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారు అని ఆయన ప్రసంగించారు. అయితే బాబా రాందేవ్ అభిప్రాయాన్ని.. వైద్య నిపుణులు తోసిపుచ్చుతున్నారు. గోవాలోని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ విభాగం మాజీ అధికారి, ప్రముఖ ఆంకాలజిస్ట్ శేఖర్ సాల్కర్ స్పందిస్తూ.. ప్రపంచ జనాభాతో పాటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతీ రెండేళ్లకొకసారి క్యాన్సర్ కేసుల్లో ఐదు శాతం పెరుగుదల చోటుచేసుకోవడం సాధారణమే అని డాక్టర్ శేఖర్ స్పష్టం చేశారు. 2018లో భారత్‌లో లక్షకు 85 క్యాన్సర్ కేసులు వెలుగు చూసేవి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష జనాభాకు 104 క్యాన్సర్ కేసులకు చేరింది. క్యాన్సర్ కేసులు తగ్గడం అనేది ఉండదు. అలాగే కరోనా లాంటి మహమ్మారితో దానిని ముడిపెట్టడం సరికాదని, అందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవని అన్నారాయన. డాక్టర్ శేఖర్ గోవా బీజేపీ మెడికల్ సెల్‌కు చీఫ్ కూడా. సెలబ్రిటీలపై ప్రజల్లో కొంత నమ్మకం ఉంటుందని, వాళ్లు బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలంటూ పరోక్షంగా రాందేవ్‌కు చురకలంటించారాయన. అమెరికాలో ప్రతీ లక్ష జనాభాకు 500 క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయని, ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. సరైన జీవనశైలిని అవలంభించకపోతే క్యాన్సర్ రేటులో అమెరికాను భారత్ మించి పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
సినిమాలు, టీవీ సీరియల్స్‌లోనూ అశ్లీలతే!
పనాజి: టీవీ సీరియల్స్, సినిమాల్లో అశ్లీలత, పో* చిత్రాల ప్రభావం.. దేశంలో యువతరంపై తీవ్రంగా ఉంటోందని ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ అంటున్నారు. ఈరోజుల్లో.. పో* చిత్రాలు ఎక్కువగా నిర్మితం అవుతున్నాయి. సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు, ఆఖరికి ఇంటిల్లిపాది చూసే టీవీ సీరియళ్లలోనూ అశ్లీలత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కంటెంట్ యువతను ఎక్కడికో తీసుకెళ్తోంది. వాళ్లు వాటితోనే ప్రయాణిస్తున్నారు అని మిరామర్ బీచ్‌లో(గోవా)లో జరిగిన మూడు రోజుల యోగా క్యాంప్ సందర్భంగా రామ్‌దేవ్ ఈ కామెంట్లు చేశారు. అందుకే ఆధ్యాత్మికం, యోగా వైపు మళ్లాలని ఆయన యువతకు సూచించారు. ఇక ఎటువంటి మందులు తీసుకోకుండా సహజంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రజలను మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమని చెప్పారు బాబా రామ్‌దేవ్. సనాతనం అనేది అన్ని మతాలను కలిపే వారధని.. అందుకే దానిని అనుసరించాలని తాను ఎల్లప్పుడూ ప్రజలను కోరుతున్నానని యోగా గురు చెప్పారు. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిద్ధలోనే కాదు.. సనాతనం అనేది ఇస్లాం, క్రైస్తవంలోనూ ఉంది. సనాతనం అనేది ఏమాత్రం వివాదాస్పదమైన పదం కాదని అన్నారు. ఏదైనా నిర్దిష్ట మతం లేదంటే రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు అని రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు. -
రామ్‌దేవ్ అసభ్యకరమైన కామెంట్లు.. సారీ చెప్పాల్సిందే!
ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రామ్‌దేవ్ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాందేవ్‌పై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్‌దేవ్.. మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్‌దేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్‌దేవ్‌పై మండిపడ్డారు. అలా మొదలైంది.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ ప్రసంగిస్తూ.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్, సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్‌ను సైతం ప్రశ్నించారాయన. महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7 — Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022 సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. -
పతంజలి పేరు ఇకపై వాడొద్దు! బాబా రాందేవ్‌పై ఫైర్
లక్నో: పతంజలి బ్రాండ్ పేరిట పలు విక్రయాలు చేపడుతున్న బాబా రామ్‌దేవ్, ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్‌పై మండిపడ్డారు బీజేపీ నేత ఒకరు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించొద్దని గురువారం డిమాండ్ చేశారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేపడతానని హెచ్చరించారు ఆ బీజేపీ నేత. యూపీ కైసర్‌గంజ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రామ్‌దేవ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్ గ్రామ పంచాయతీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ.. పతంజలి బ్రాండ్‌పై మండిపడ్డారు. యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్‌దేవ్.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ‘‘వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, చివరకు.. లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. రామ్‌దేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్‌ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆ మహానుభావుడి స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజ్ భూషణ్ ఇలా తన ప్రకటనలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. ఇదీ చదవండి: సచిన్ పైలట్‌పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు -
సినీ తారలపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: యోగా గురువు బాబా రాందేవ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్, డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించారు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ.. వాళ్ల గురించి దేవుడికి మాత్రమే తెలుసని అన్నారు. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని ఆరోపించారు. ‘సినిమా పరిశ్రమను డ్రగ్స్ చుట్టుముట్టింది. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం’ అని వెల్లడించారు. రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణానంతరం బీటౌన్ స్టార్స్ డ్రగ్స్ వాడకంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాందేవ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'Salman Khan भी लेता है Drugs, Actresses का तो भगवान ही मालिक है' बाबा रामदेव का Bollywood Industry पर आरोप मुरादाबाद में दिया भाषण pic.twitter.com/GH1PgKi9zi — News24 (@news24tvchannel) October 15, 2022 -
లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు. నెయ్యిలో కల్తీ అబద్ధం పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు. ఇమేజ్ కాపాడుకుంటాం.. ‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది. లంపీకి పరిష్కారం దిశగా.. పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు. త్వరలో నాలుగు ఐపీవోలు ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు. -
అల్లోపతిపై విమర్శలేల?
న్యూఢిల్లీ: అల్లోపతి తదితర వైద్య పద్ధతులను విమర్శించడం సరికాదని యోగ గురు బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రోగుల సమస్యలకు, లక్షలాది మరణాలకు అల్లోపతే కారణమంటూ జారీ చేసిన ప్రకటనలను తీవ్రంగా తప్పుబట్టింది. కోవిడ్ ఉధృతికాలంలో ఇలాంటి పలు ప్రకటనలను పతంజలి సంస్థ జారీ చేసిందని ఐఎంఏ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘రామ్‌దేవ్‌కు ఏమైంది? అల్లోపతిపై తీవ్ర విమర్శలు చేస్తూ, డాక్టర్లంటే ఏదో హంతకులన్నట్టుగా వారందరినీ తప్పుబడుతూ వార్తా పత్రికల్లో భారీ ప్రకటనలా? ఏమిటిది? ఇలా ఎలా చేస్తారు?’’ అంటూ సీజేఐ తప్పుబట్టారు. ‘ఆయనంటే మాకు గౌరవం. యోగాకు ప్రాచుర్యం కల్పించారు. టీవీల్లో రామ్‌దేవ్ యోగా ప్రోగ్రాంలను మేమూ చూసేవాళ్లం. మీ వైద్య విధానం గొప్పదనం గురించి చెప్పుకోవచ్చు. కానీ ఇలా ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదు’ అన్నారు. రామ్‌దేవ్ అనుసరిస్తున్న ఆయుర్వేదమో, లేదా మరేదైనా విధానమో మాత్రమే అన్ని రోగాలకూ నివారిణి అని గ్యారెంటీ ఇవ్వగలరా అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌కు సూచించారు. కేంద్రానికి, పతంజలి ఆయుర్వేద సంస్థకు నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా గత వారం రామ్‌దేవ్‌ను మందలించడం తెలిసిందే. -
‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్‌దేవ్‌కు హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్‌దేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్ అనుప్ జైరాం భంభాని. మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఇదీ చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..
హరిద్వార్: పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్‌లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు. -
బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్ద ఫుడ్ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్ ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్నెస్ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది. పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్‌లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు. చదవండి: గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..! -
మాకు అప్పులే లేవు..బ్యాంకులకు వేలకోట్లు చెల్లించేశాం!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ రుణరహితంగా ఆవిర్భవించినట్లు తాజాగా ప్రకటించింది. బ్యాంకులకు చెల్లించవలసిన రూ.2,925 కోట్లను చెల్లించినట్లు తెలియజేసింది. దీంతో పూర్తిస్థాయిలో రుణ భారానికి చెక్ పెట్టినట్లు వెల్లడించింది. బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద గ్రూప్ కంపెనీ రుచీ సోయా ఇటీవల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)ను చేపట్టిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 4,300 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఈ నిధులతో కొంతమేర రుణ చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా తెలియజేసింది. రుచీ సోయా రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ తాజాగా ట్వీట్ చేశారు. కాగా..ఎఫ్‌పీవో కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో రుచీ సోయా రూ. 1,950 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు పేర్కొన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే రూ.2,925 కోట్లను ఇందుకు వెచ్చించడం గమనార్హం! స్టేట్‌బ్యాంక్ అధ్యక్షతన బ్యాంకు ల కన్సార్షియంకు చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా పేర్కొంది. ఈ కన్సార్షియంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నాయి. 2019లో దివాలా చట్ట ప్రక్రి యలో భాగంగా రుచీ సోయాను రూ. 4,350 కోట్లకు పతంజలి సొంతం చేసుకున్న విషయం విదితమే. కాగా, రుణ చెల్లింపుల వార్తల నేపథ్యంలో రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 938 వద్ద ముగిసింది. చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
నంబర్ వన్‌పై రుచీ సోయా గురి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని లక్షిస్తున్నట్లు పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ చీఫ్ బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేదతోపాటు అనుబంధ సంస్థ రుచీ సోయా ఇండస్ట్రీస్ టర్నోవర్ రూ. 35,000 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. రుచీ సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) ప్రారంభంకానున్న సందర్భంగా రామ్‌దేవ్ విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. రానున్న కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ నుంచి ఫుడ్ బిజినెస్‌ను విడదీసి లిస్టెడ్ కంపెనీ రుచీ సోయాలో విలీనం చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయాను టాప్ ర్యాంక్ కంపెనీగా నిలపాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ రూ. 45,996 కోట్ల టర్నోవర్ సాధించినట్లు ప్రస్తావించారు. షేరుకి రూ. 615–650 గురువారం(24) నుంచి ప్రారంభమైన రుచీ సోయా ఎఫ్‌పీవో ఈ నెల 28న(సోమవారం) ముగియనుంది. షేరుకి రూ. 615–650 ధరల శ్రేణిలో ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 4,300 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా రుణరహితంగా మారాలని రుచీ సోయా ఆశిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,290 కోట్లు అందుకుంది. కాగా.. పతంజలి గ్రూప్‌లోగల పలు కంపెనీలను దశలవారీగా లిస్టింగ్ చేయనున్నట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేశాక పతంజలి గ్రూప్ నాన్‌ఫుడ్, సంప్రదాయ ఔషధాలు, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా 2019లో రుచీ సోయాను పతంజలి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌పీవో నేపథ్యంలో రుచీ సోయా షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 873 వద్ద ముగిసింది. -
రుణ రహితంగా పతంజలి: రాందేవ్ భారీ ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి గ్రూపు 2020–21లో రూ.30,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా రుచి సోయా రూపంలో రూ.16,318 కోట్ల ఆదాయం సమకూరడం కలిసొచ్చింది.. దివాలా పరిష్కారానికి వచ్చిన రుచిసోయా కంపెనీని గతేడాది పతంజలి దక్కించుకున్న విషయం తెలిసిందే. 3-4 ఏళ్లలో గ్రూపులోని కంపెనీల రుణాలను పూర్తిగా తీర్చేసి, రుణ రహితంగా మారాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాబా రామ్‌దేవ్ మంగళవారం వర్చవల్‌గా నిర్వహించిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు. రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) రూపంలో వచ్చే నిధుల్లో అధిక మొత్తాన్ని రుణాల చెల్లింపునకు వినియోగించనున్నామని రామ్‌దేవ్ తెలిపారు. పతంజలి గ్రూపులోని ఎఫ్ఎంసీజీ వ్యాపారమైన పతంజలి ఆయుర్వేద్ లిస్టింగ్‌పై త్వరలోనే సమాచారం ఇస్తామంటూ ఐపీవోపై సంకేతం ఇచ్చారు. ఎంత మేర వ్యాపారాన్ని వేరు చేయాలి? పతంజలి ఆయుర్వేద్‌ను ఎప్పుడు లిస్ట్ చేయాలన్నది త్వరలోనే తెలియజేస్తామన్నారు. 10-24 శాతం మధ్య వృద్ధి పతంజలి గూటికి చేరిన రుచిసోయా పనితీరుపై ఎదురైన ప్రశ్నకు.. ‘‘రుచి సోయా వ్యాపారంలో 24 శాతం పురోగతి ఉంది. పతంజలి టర్నోవర్ రూ.11,000 కోట్ల నుంచి 2020-21 లో రూ.14,000 కోట్లకు పెరిగింది. గ్రూపు కంపెనీల్లో 10-24 శాతం మధ్య వ్యాపార వృద్ధి నెలకొంది. త్వరలోనే పతంజలి గ్రూపు రూ.4,300 కోట్ల మేర రుచి సోయా ఎఫ్‌పీవో నిర్వహించనుంది. రుచి సోయాకు రూ.3,300 కోట్ల రుణ భారం ఉంది. ఎఫ్‌పీవో రూపంలో సమీకరించే నిధుల్లో 40 శాశాన్ని రుణాలను తీర్చేందుకు వినియోగిస్తాం’’ అని బాబా రామ్‌దేవ్ వివరించారు. గ్రూపు మొత్తం రుణ భారం ఎంతన్నది ఆయన వెల్లడించలేదు. కరోనా కారణంగా తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం లేదన్నారు. పతంజలి పరివాహన్ పేరుతో తమకు సొంత రవాణా విభాగం ఉన్నట్టు చెప్పారు. 3-4 ఏళ్లలో గ్రూపు కంపెనీల రుణ భారాన్ని పూర్తిగా తీర్చివేసే ప్రణాళికలతో ఉన్నట్టు పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ సైతం తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులు పతంజలి గ్రూపు పెట్టుబడుల గురించి బాబా రామ్‌దేవ్ వివరిస్తూ.. రానున్న ఐదేళ్లలో రూ.5,000-10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. -
Ramdev యూటర్న్: వ్యాక్సిన్ తీసుకుంటా, వారు దేవదూతలు
సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్ యూ టర్న్ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు రాందేవ్. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు. అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. రాందేవ్‌కు లీగల్ నోటీసు లిచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాందేవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చదవండి : వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. తాను టీకా తీసుకోలేదని, సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగావ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెయ్యికోట్ల రూపాయల పరువు నష్టం దావా హెచ్చరిక అనంతరం రాందేవ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు టీకా అవసరం లేదని రాందేవ్ వాదించారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్ ఉత్తరాఖండ్ డివిజన్ ఐఎంఏ పరువు నష్టం నోటీసును పంపించిన సంగతి తెలిసిందే. "స్టుపిడ్ సైన్స్" అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పక పోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. వ్యాక్సినేషన్ విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దోశద్రోహ చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 10 వేల మంది డాక్టర్లు చనిపోగా, లక్షల మంది ప్రజలు అల్లోపతి వైద్యం వల్ల మరణించారన్న రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలాగే ఈ విషయంలో రాందేవ్ వాదనలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధమని ఉత్తరాఖండ్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ ఖన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్ -
మీ నాన్న వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాందేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది. జూమ్ సమావేశంలో పైవిధంగా మాట్లాడారు. దుండగుడు రాందేవ్, మహాదొంగ రాందేవ్ వంటి పదాలు తనపై వస్తున్నాయని చెబుతూ నవ్వుకున్నారు. అయితే ‘నీ తండ్రి కూడా అరెస్ట్ చేయడు’ ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. Ramdev challenges Modi Govt into arresting him, says "UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA" Over to you, @narendramodi @AmitShah !! pic.twitter.com/73qd8AVLZE — Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021 -
బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు
డెహ్రడూన్: కరోనా వైరస్‌ను నియంత్రించడంతో అల్లోపతి వైద్యం విఫలం చెందిందని యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి వైద్యంపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి పరిహారంగా రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. రూ.వెయ్యి చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‌కు లేఖ రాసింది. రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
ఏనుగుపై యోగా : ట్రెండింగ్‌లో రాందేవ్
సాక్షి, లక్నో: పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు, యోగాసనాలకు పెట్టింది పేరైన బాబా రామ్‌దేవ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒక ఆశ్రమంలో ఏనుగు మీద యోగా నేర్పిస్తూ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై సానుభూతితో పాటు కొంతమంది నెటిజనులు రకారకాల మీమ్స్ తో, యాక్ట్ ఆఫ్ గ్రావిటీ అంటూ వ్యంగ్యోక్తులతో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బాబా రాందేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్ లో యోగా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబాగారు బింకంగా అవేమీ పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే లేచి సర్దుకున్నరాందేవ్ అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర విచిత్ర భంగిమలు, ఫోజులతో గతంలో వార్తల్లో నిలిచిన రాందేవ్ తాజాగా ఏనుగుమీద యోగాతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. అంతేకాదు గతంలో సైకిల్ తొక్కుతూ రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇపుడు విపరీతంగా షేర్ అవుతోంది. Baba Ramdev had said Corruption will fall if Narendra Modi becomes PM pic.twitter.com/qauXNgISqG — Joy (@Joydas) October 13, 2020 #NirmalaSitharaman on #BabaRamdev be like:- pic.twitter.com/avFn4K7WH6 — sarcastic guy (@thejoe1785) October 13, 2020 Aree phir se Gir Gye abhi to Cycle se gire the..😆😆😂😂 pic.twitter.com/YKwhnWP4qU#BabaRamdev — Md Iquebal Hossain (@Iquebal_) October 14, 2020 -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
చరిత్రలో ఆగస్టు5 నిలిచిపోతుంది : బాబా రాందేవ్
అయోధ్య : రామాలయానికి భూమి పూజ జరిగిన ఆగస్టు 5 ను చారిత్రకరోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివర్ణించారు. తరతరాలు ఈ రోజును గర్వంగా గుర్తుంచుకుంటాయని అన్నారు. భారత్‌లో కొత్త చరిత్ర లిఖించబడిందని, ప్రజలందరూ ఈరోజును పరస్కరించుకొని సంబరాలు జరుపుకోవాలన్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా బాబా రాందేవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ నిర్మాణంతో దేశంలో రాజరాజ్యానికి నాంది పలికినట్లయ్యిందన్నారు. ఈ చారిత్రక ఘట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు తొలిగిపోతాయని రామరాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు. (లైవ్ అప్డేట్స్; అయోధ్యలో భూమిపూజ) రాముడికి, హనుమంతుడికి నరేంద్రమోదీ అపర భక్తుడని, అలాంటి ప్రధాని మనకుండటం ప్రజలందరి అదృష్టమని అన్నారు. హిందూ ధర్మం గర్వించేలా చేసిన ప్రధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భద్రత , కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 175 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయెధ్య రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్య నగరమంతా రామనామంతో మార్మోమోగిపోతుంది. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’) -
కరోనాకు ఔషదాన్ని విడుదల చేస్తున్నాం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించారు. మరో 120 కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యాయి. తాజాగా యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనా నివారణకు 'కరోనిల్' అనే ఆయుర్వేద ఔషదాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పతంజలి యోగ్‌పీఠ్ సహవ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. పతంజలి సంస్థ తయారుచేసిన ఔషదం 80 శాతం సక్సెస్‌ను చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు బాలకృష్ణ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. చదవండి: 'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్' Proud launch of first and foremost evidence-based ayurvedic medicine for #corona contagion, #SWASARI_VATI, #CORONIL, is scheduled for tomorrow at 12 noon from #Patanjali Yogpeeth Haridwar🙏🏻 pic.twitter.com/K7uU38Kuzl — Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020 -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ (షాద్‌నగర్): ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు ఆయన మంగళవారం హాజరై రాత్రి అక్కడే బస చేశారు. వార్షికోత్సవంలో రెండోరోజైన బుధవారం ఉదయం జరిగిన ధ్యాన కార్యక్రమంలో గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా దేవ్ మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగా సాధన చేయాలని, అప్పుడే సమాజం బాగుంటుందన్నారు. అనం తరం ఆశ్రమంలో మొక్కను నాటి, రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డుకు యోగర్షి స్వామీ రాందేవ్ మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ ధ్యాన వేడుకలకు 2వరోజు 40వేల మంది హాజరైనట్లు నిర్వహకులు తెలిపారు. -
నాకు ఇద్దరు సమానమే: బాబా రాందేవ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహిన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని కలవబోతున్నట్లు యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో రాందేవ్ మాట్లాడుతూ..తనకు హిందువులు, ముస్లీంలు ఇద్దరు సమానమని..ముస్లీం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నానని అన్నారు. ముస్లీం ప్రజలకు అన్యాయం జరిగితే వారి నిరసనలకు మద్దతిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని..అయితే రాజ్యాంగానికి లోబడే నిరసనలు తెలపాలని ఆయన సూచించారు. తాను హిందు, ముస్లీం ప్రజలు ఘర్షణ పడాలని కోరుకోనని, ముసీం ప్రజలకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడతానని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం పోరాడే అన్ని రకాల నిరసనలకు తాను మద్దతిస్తానని అన్నారు. జిన్నా వాలా భావాలకు తాను వ్యతిరేకమని, భగత్ సింగ్ భావాలకు తాను సంపూర్ణ మద్దతిస్తానని బాబా రాందేవ్ తెలిపారు. చదవండి: శ్రీరాముడు ముస్లింలకూ ఆరాధ్యుడే -
రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్ రుణాలు
న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద కంపెనీ... రుచి సోయా కంపెనీని కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ల నుంచి రూ.3,200 కోట్ల రుణాన్ని పొందింది. ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియంతో ఒప్పందం కుదిరిందని పతంజలి ఆయుర్వేద ఎమ్డీ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. ఇందులో ఎస్బీఐ వాటా రూ.1,200కోట్లు. బకాయిల చెల్లింపుల్లో విఫలం కావడంతో రుచి సోయాపై 2017 డిసెంబర్లో దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. పతంజలి ఆయుర్వేద కంపెనీ సమరి్పంచిన రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది. -
ముస్లింలూ రాముడిని ఆరాధిస్తారు : రాందేవ్ బాబా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 99 శాతం ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. ముస్లింలూ శ్రీరాముడిని గౌరవిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. రాముడు కేవలం హిందువులకు మాత్రమే కాదని, ముస్లింలకూ ఆరాధ్యుడని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై వ్యాఖ్యానిస్తూ తాను దీన్ని జాతీయ సమైక్యతా కోణంలో చూస్తానని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం హిందువుల సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందర కట్టడంగా, భారతీయుల కలలు సాకారం చేసే రీతిలో మందిర నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. క్యాథలిక్‌లకు వాటికన్, ముస్లింలకు మక్కా, సిక్కులకు స్వర్ణ మందిరం ఎలాగో హిందువులకు అయోధ్య అటువంటిదని అన్నారు. -
తీర్పుపై భగవత్, రాందేవ్‌ల రియాక్షన్..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాగతించారు. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అయోధ్య కేసులో తీర్పు జాప్యమైనా తాజా తీర్పును స్వాగతిస్తామని అన్నారు. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయోధ్య వివాదంపై గతంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ విఫలమైందని అన్నారు. భారతీయులను హిందూ, ముస్లింలుగా తాము చూడబోమని చెప్పారు. శాంతి, సుహృద్భావం వెల్లివిరియాలి : రాందేవ్ అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమేనని అన్నారు. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టేనని చెప్పారు. అయోధ్య వివాదంసై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని అంటూ సాధుసంతులు, మీడియా సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేలా వ్యవహరించాలని సూచించారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. (చదవండి: అయోధ్య తీర్పు.. వారిదే ఘనత) -
పతంజలి పేరు వాడొద్దని నోటీసులు
టీ.నగర్: పతంజలి పేరును ఉపయోగించరాదని చెన్నైలోని యోగా విద్యా, పరిశోధనా సంస్థకు బాబా రాందేవ్ సోమవారం నోటీసులు పంపారు. బాబా రాందేవ్, ఆయన స్నేహితుడు బాలకృష్ణ ఆచార్య ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద కేంద్రాన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా పతంజలి బ్రాండ్ నేమ్‌తో బిస్కెట్ తదితర వస్తువులను తయారుచేసి మార్కెటింగ్ చేస్తున్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆడియో సంస్థ ఒకటి పతంజలి యోగా సూత్రాలను విడుదల చేసింది. ఈ సంస్థ బాలాజీ విద్యాపీఠం అనే వర్సిటీ నడుపుతోంది. యోగా విద్యా, పరిశోధనా సంస్థకు బాబా రాందేవ్, బాలకృష్ణ ఆచార్య తరఫున నోటీసు పంపారు. పతంజలి పేరును తాము నమోదు చేశామని, దీన్ని ఉల్లంఘించడం 1999 పేటెంట్ చట్టం ప్రకారం నేరమని నోటీసులో పేర్కొన్నారు. -
మోదీతో ప్రియాంక అందుకే తలపడలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక రాజకీయ జీవితం ఆరంభంలోనే ముగిసిపోతుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపలేదని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. కాపలాదారు దొంగ కాదని, ఆయన స్వచ్ఛతకు మారుపేరని ప్రధాని మోదీని రాందేవ్ వెనుకేసుకొచ్చారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆర్టికల్ 370 రద్దు హామీని ఆయన సమర్ధించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తుదివిడత పోలింగ్‌లో వారణాసి నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, భారీగా పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు వెంటరాగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. -
సాధ్వికి రాందేవ్ మద్దతు
డెహ్రడూన్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను యోగా గురువు రాందేవ్ వెనకేసుకొచ్చారు. అనుమానం పేరుతో ఆమెను తొమ్మిదేళ్ల పాటు జైలులో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. హరిద్వార్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సాధ్వి ప్రజ్ఞా 9 ఏళ్ల పాటు కఠిన కారాగార జీవితం అనుభవించారు. జైల్లో అనుభవించిన బాధల కారణంగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరానికి పాల్పడ్డారన్న అనుమానంతో జైలులో ఆమె పట్ల అవమానవీయంగా ప్రవర్తించడం సమంజసం కాద’ని అన్నారు. ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా రాందేవ్ పైవిధంగా జవాబిచ్చారు. తాను శపించినందునే హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని భోపాల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా దేశం ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని రాందేవ్ పేర్కొన్నారు. ఈ సవాళ్లు అన్నింటినీ అధిగమించి 2040 నాటికి మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం మాత్రమే సమస్యలు కాదని.. ‘రాముడు, జాతీయవాదం’ కూడా ప్రధానాంశాలేనని స్పష్టం చేశారు. -
మోదీ ప్రధాని కావడానికి కారణం అదే
రాయ్‌పూర్: యోగా చేసిన వారిని రాజయోగం వరిస్తుందని, అందుకే జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ దేశ ప్రధానులయ్యారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాయపూర్‌లో పతంజలి గ్రూప్‌కు చెందిన ఓ స్టోర్ ప్రారంభోత్సవంలో రాందేవ్ మాట్లాడారు. ఒత్తిడిని దూరంచేసే అతి ప్రాచీన విధానమైన యోగాను మన రాజకీయనేతలంతా అభ్యసించాలని రాందేవ్ కోరారు. నిరంతరం యోగా చేయడంతోనే రాజయోగం సిద్ధించి నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులయ్యారని, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం యోగా బాగా చేస్తారని రాందేవ్ అన్నారు. టీ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి, సాధువైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి యోగాతో వచ్చిన రాజయోగమే కారణమని రాందేవ్ వ్యాఖ్యానించారు. రాజకీయ రణరంగంలో గెలవాలంటే పోరాటపటిమనందించే యోగా తప్పనిసరి అని అన్నారు. బుద్ధి చెప్పాలంటే యుద్ధం చేయాల్సిందే.. పుల్వామా ఉగ్రదాడి వంటి చర్యలతో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు యుద్ధం ద్వారానే భారత్ బుద్ధిచెప్పాలని రాందేవ్ అన్నారు. యుద్ధంలో ఓడిస్తే మరో 50 ఏళ్ల దాకా పాక్ భారత్‌వైపు కన్నెత్తికూడా చూడదన్నారు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతమైన బలోచిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలని ఉద్యమిస్తున్న అక్కడి వేర్పాటువాదులకు భారత్ అన్నిరకాల సాయం అందించాలని రాందేవ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ద్వేషించే పాకిస్తానీయులకు భారత్ పూర్తిసాయం అందించి పాకిస్తాన్ పూర్తిగా నాశనమయ్యేలా చేయాలని రాందేవ్ అన్నారు. ‘ రాముడు ముస్లింలకు సైతం పూర్వీకుడే. అందుకే రామాలయ నిర్మాణానికి ముస్లింలు కూడా ముందుకు రావాలి’ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
అయోధ్యపై రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతికి గర్వకారణమని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. రాముడు కేవలం హిందువులకే కాకుండా ముస్లింలకూ పూర్వీకుడని చెప్పుకొచ్చారు. ఖేడా జిల్లా నదియాద్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామ మందిర అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. రామ మందిరాన్ని అయోధ్యలోనే నిర్మించాలన్నది తన అభిమతమని, రామ మందిరం అయోధ్యలో కాకుండా మక్కా, మదీనా లేదా వాటికన్ నగరంలో నిర్మించలేరని వ్యాఖ్యానించారు. రాముడి జన్మస్ధలం అయోధ్య అనేది వాస్తవమని, రాముడు మనందరికీ పూర్వీకుడని పేర్కొన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పాలక బీజేపీతో లబ్ధి పొందిన ఇలాంటి బాబాలు ఎన్నికల సమయంలో బీజేపీ, మోదీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ముందుకొస్తున్నారని ఆరోపించింది. -
సన్యాసులకు రాందేవ్ బాబా సూటిప్రశ్న
ప్రయాగరాజ్ : కుంభమేళా వేదికగా పొగతాగడం మానుకోవాలని యోగా గురు రాందేవ్ బాబా సాధుసంతులను కోరారు. ‘మనం ఎన్నడూ పొగతాగని రాముడు, కృష్ణుడు వంటి దేవతలను ఆరాధిస్తాం..మరి మనం వాటికి ఎందుకు దూరంగా ఉండకూడ’దని సన్యాసులను ప్రశ్నించారు. స్మోకింగ్‌ను విడిచిపెడతామని మన మంతా ప్రతినబూనాలని పిలుపుఇచ్చారు. ‘సమున్నత లక్ష్యం కోసం మనం తల్లితండ్రులను, ఇంటిని విడిచిపెడతాం..అలాంటిది మనం పొగతాగడాన్ని ఎందుకు మానుకోలే’మని అన్నారు. ఇక పలువురు సన్యాసుల నుంచి ఆయన పొగగొట్టాలను సేకరించి, పొగతాగడం మానివేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తాను నిర్మించి మ్యూజియంలో ఈ పొగగొట్టాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చారు. తాను యువతను పొగాకు, స్మోకింగ్‌ను వదిలివేసేలా చేశానని, మహాత్ములచే ఆ పని ఎందుకు చేయించలేనన్నారు. కాగా 55 రోజుల పాటు సాగే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కుంభమేళాలో పలు దేశాల నుంచి 13 కోట్ల మంది పాల్గొని పవిత్ర గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు చెబుతున్నారు. -
‘అయోధ్య కేసు త్వరగా తేల్చండి’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సత్వరమే పూనుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ కోరారు. మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు లేదా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్ధానం ఇప్పటికిప్పుడు ఎలాంటి తీర్పు ఇచ్చే పరిస్ధితి లేనందున ప్రభుత్వమే చొరవ తీసుకుని మరింత కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు జస్టిస్ ఏఎ బోబ్డే అందుబాటులో లేనందున అయోధ్య కేసును ఈనెల 29న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టడం లేదని సమాచారం. కాగా మందిర నిర్మాణంపై ప్రజల్లో ఓపిక నశిస్తోందని, ఈ అంశాన్ని సుప్రీం కోర్టు పరిష్కరించలేకుంటే తాము 24 గంటల్లో దీనికి పరిష్కారం చూపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును తేల్చడంలో జరుగుతున్న విపరీత జాప్యంతో ప్రజల్లో ఓపిక, విశ్వాసం సన్నగిల్లుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారి ఓటింగ్ హక్కును వెనక్కితీసుకోవాలని ఆథ్యాత్మిక గురువు బాబా రాందేవ్ కోరారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని సూచించారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారిని ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల్లో ప్రవేశం కల్పించరాదని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదని రాందేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అలీఘర్‌లో దుస్తుల షోరూం పతంజలి పరిధాన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులైనా, ముస్లింలైనా జనాభా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. బాబా రాందేవ్ గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న వివాహితుల ఓటు హక్కు రద్దు చేయాలని, తనలాంటి బ్రహ్మచారులకు ప్రత్యేక హోదా ఇచ్చి గుర్తింపు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. -
తదుపరి ప్రధాని ఎవరంటే..
మధురై : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యోగ గురు రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలక బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా సమర్ధించిన రాందేవ్ బాబా స్వరం మారింది. తదుపరి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమని, దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవ ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురైన నేపథ్యంలో రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన రాందేవ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ వ్యక్తికీ, పార్టీకి మద్దతు ప్రకటించడం, వ్యతిరేకించడం చేయనని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై తాను దృష్టిసారించడంలేదన్నారు. తమకు ఎలాంటి రాజకీయ, మతపరమైన అజెండా లేదని, అయితే తాము యోగ, వేద పద్ధతుల ద్వారా ఆథ్యాత్మిక దేశం, ఆథ్యాత్మిక ప్రపంచాన్ని కోరుతామన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా క్రియాశీలకంగా పనిచేసిన రాందేవ్ బాబాను బీజేపీ పాలిత హర్యానాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి అనంతరం కేబినెట్ హోదా కల్పించారు. -
ఇక పతంజలి జీన్స్..
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద తాజాగా బ్రాండెడ్ దుస్తుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ’పరిధాన్’ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,000 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాబా రాందేవ్ ఈ సందర్భంగా సోమవారమిక్కడ చెప్పారు. పరిధాన్ కింద లివ్‌ఫిట్, ఆస్థా, సంస్కార్ అనే మూడు బ్రాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఏడాది 500– 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే 100 స్టోర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోనున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిని వచ్చే ఏడాది నాటికి ఆన్లైన్లో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం‘ అని రాందేవ్ వివరించారు. 2020 నాటికి మొత్తం 500 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని, వీటిలో చాలామటుకు ఫ్రాంచైజీ విధానంలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంస్కార్ బ్రాండ్ పూర్తిగా పురుషుల దుస్తుల శ్రేణి కాగా, ఆస్థా బ్రాండ్ కింద మహిళల దుస్తులు, లివ్‌ఫిట్ బ్రాండ్ పేరిట స్పోర్ట్స్‌వేర్.. యోగా దుస్తులు మొదలైనవి విక్రయించనున్నట్లు రాందేవ్ చెప్పారు. ఎంఎన్‌సీలతో పోటీ.. తమ బ్రాండ్ల సాయంతో అడిడాస్, ప్యూమా వంటి బహుళజాతి సంస్థలతో పోటీపడనున్నట్లు రాందేవ్ చెప్పారు. పరిధాన్ దుస్తుల శ్రేణి ధరలు 30– 40 శాతం చౌకగా ఉంటాయని, సామాన్య ప్రజానీకానికి ఉద్దేశించినవని ఆయన వివరించారు. స్థల లభ్యత, డిమాండ్ తదితర అంశాల ప్రాతిపదికన మూడు బ్రాండ్లు ఒకే దగ్గర విక్రయించే స్టాండలోన్ స్టోర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని పతంజలి అపారెల్ వ్యాపార విభాగం హెడ్ కేఎం సింగ్ తెలిపారు. సాధారణంగా టెక్స్టైల్ రంగంలో బ్రాండెడ్ సెగ్మెంట్ వాటా 10 శాతం మాత్రమేనని, మిగతా 90 శాతం అసంఘటిత విభాగానికి చెందినవే ఉంటున్నాయని రాందేవ్ చెప్పారు. వీటిలో చెప్పుకోతగ్గ భారతీయ బ్రాండ్స్ పెద్దగా లేవన్నారు. ‘సామాన్య ప్రజానీకం దేశీ బ్రాండ్ దుస్తులను గర్వంగా వేసుకునేలా చేయడం మా లక్ష్యం‘ అని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ జ్యుయలరీ కూడా.. పరిధాన్ బ్రాండ్ కింద ఆర్టిఫిషియల్ జ్యుయలరీ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన దుస్తులు కూడా ఉంటాయని రాందేవ్ చెప్పారు. పతంజలి జీన్స్ శ్రేణి రూ. 500 నుంచి మొదలవుతుందని, షర్ట్ల ధర రూ. 500–1,700 శ్రేణిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 మంది పైచిలుకు విక్రేతల నుంచి దుస్తులను సోర్సింగ్ చేస్తున్నామని, చిన్న.. మధ్య తరహా సంస్థలను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే హెర్బల్ ఆయుర్వేద, సహజసిద్ధమైన ఉత్పత్తులు, కాస్మెటిక్స్, వ్యక్తిగత సౌందర్య సాధనాలు, పశు దాణా.. బయోఫెర్టిలైజర్లు, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ వాటర్ తదితర రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న పతంజలికి ఇది తొమ్మిదో వెంచర్ కానుంది. ఇటీవలి కాలంలో గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిన పతంజలి.. గత ఆర్థిక సంవత్సరం మాత్రం జీఎస్టీ తదితర అంశాల నేపథ్యంలో స్వల్ప వృద్ధితో రూ.12,000 కోట్ల టర్నోవర్‌కు పరిమితమైంది. 2016–17లో సంస్థ టర్నోవర్ రూ.10,561 కోట్లు. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 111 శాతం అధికం. -
35 రూపాయలకే పెట్రోల్!
న్యూఢిల్లీ : ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డులను బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి పెరగడమే తప్ప, తగ్గడం కనిపించడం లేదు. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చి, పన్నుల్లో ఉపశమనం కల్పిస్తే, లీటరు పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానని అన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అంతేకాకుండా 28 శాతం శ్లాబ్‌ను తీసేయాలని బాబా రాందేవ్ సూచించారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడంపై రాందేవ్ బాబా పలు ప్రశ్నలను లేవనెత్తారు. పన్నులను వాహనదారుల నుంచి కాకుండా.. ధనవంతలను నుంచి వసూలు చేయాలన్నారు. ఇంధనాలపై పెరుగుతున్న ధరలు, మోదీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ అంశాలు, మోదీ ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కల్పించడానికి నిరాకరించడం ఇవన్నీ ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై మొత్తంగా రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. అది కాక, రాష్ట్రాలు వ్యాట్‌లను విధిస్తున్నాయి. ఇంధన ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో నానాటికీ అసహనం పెరిగిపోతోందని రాందేవ్ పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చాలా విధానాలు బాగున్నాయని, కానీ కొన్నింటిన్నీ సవరించాల్సి ఉందని చెప్పారు. వీటిలో అతిపెద్ద సమస్య ధరల పెరుగుదలేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాందేవ్ అన్నారు. రాఫెల్ డీల్‌పై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాందేవ్.. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నానని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీ తరుఫున ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. -
ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు
న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సమర్థ భారత్.. స్వస్థ భారత్ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్ ఉత్పత్తులు, డ్రింకింగ్ వాటర్, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్ తన ట్విటర్లో ప్రకటించారు. అంతేకాక 2020 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1000 కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకోస్తున్నట్లు బాబా రామ్‌దేవ్ తెలిపారు. దీని ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు. हर बूँद में शुद्धता ! Quench your thirst with Patanjali Divya Jal ! pic.twitter.com/SJDQI8o81S — Swami Ramdev (@yogrishiramdev) September 13, 2018 అంతేకాక తన స్టోర్ల ద్వారా నిత్యం 10లక్షల లీటర్ల పాల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్‌దేవ్ తెలిపారు. పాలతో పాటు, పన్నీర్, పెరుగు లాంటి ఇతర పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నట్లు ప్రకటించారు. పాడి పరిశ్రమ రైతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర సంస్థలు విక్రయించే పాలకన్నా 2 రూపాయలు తక్కువకే పాలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ‘దివ్య జల్’ పేరుతో తీసుకోస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ 250 ఎమ్ఎల్, 500 ఎమ్ఎల్, 1 లీటరు, 2 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్ల ప్యాక్ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హరిద్వార్ ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తున్న పతంజలి దేశవ్యాప్తంగా 56వేల రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. -
ప్రధానిగా బాబా రామ్‌దేవ్?
సాక్షి, న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్ భవిష్యత్తులో భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చునని ఓ అంతర్జాతీయ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. అంతే కాదు రామ్‌దేవ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చుతూ.. ట్రంప్‌లా అతను కూడా దేశానికి నాయకత్వం వహిస్తారని పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు ఉన్న ఆదరణ, వ్యాపారం, మార్కెటింగ్ వంటి అంశాల్లో రామ్‌దేవ్ కూడా అదే స్థాయిలో ఉన్నారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తీసుకురావడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నారని, పతాంజలి ఉత్పత్తులతో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నట్లు పేర్కొంది. ట్రంప్ కూడా వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. ప్రస్తుతం అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయ్యారని, రామ్‌దేవ్ కూడా భవిషత్తులో భారత ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. నరేంద్ర మోదీ తరువాత దేశంలో అంతటి ఆదరణ గల వ్యక్తిగా బాబాను కొనియాడింది. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అతనికి యోగా, పతాంజలి పరంగా మంచి గుర్తింపు ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 'ది బిలియనీర్ యోగి బిహైడ్ మోడీ రైజ్'.. మోడీ ఎదుగుదల వెనుక బిలియనీర్ యోగి, పేరుతో కథనం ఇచ్చింది. రామ్‌దేవ్ బాబా భారత్‌తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారని తెలిపింది. -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌దేవ్ విగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ విగ్రహం త్వరలో మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు కానుంది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రామ్‌దేవ్ నుంచి నిపుణులైన కళాకారులు 200 కు పైగా నిర్దిష్ట కొలతలు తీసుకోవడంతోపాటు పలు ఫొటోలను తీసుకున్నారు. ‘వృక్షాసన’ యోగా భంగిమలో రామ్‌దేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహానికి తన కాషాయ వస్త్రం, ఓ జత చెప్పులను రామ్‌దేవ్ అందజేయనున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న ఇతర ప్రముఖుల విగ్రహాలతోపాటు రామ్‌దేవ్ ప్రతిమను ఉంచనున్నారు. వీక్షకులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారు కూడా వృక్షాసన భంగిమలో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్ విగ్రహాన్ని లండన్‌లో కూడా ప్రదర్శనకు ఉంచనున్నారని పతంజలి సంస్థ అధికార ప్రతినిధి ఎస్కే తిజరవాలా తెలిపారు. -
సచిన్, షారూఖే కాదు.. ఇక రాందేవ్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: యోగా విన్యాసాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మరో విశేషాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచే లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రాందేవ్ బాబా మైనపు బొమ్మ త్వరలో కొలువు దీరనుంది. తద్వారా ప్రముఖ సెలబ్రిటీలు, లెజెండ్స్ సరసన ఈ యోగా గురూ కూడా చేరనున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి యోగా గురువుగా కూడా అవతరించనున్నారు. ఈ విషయాన్ని రాందేవ్ బాబా ట్విటర్లో షేర్ చేశారు. ట్రీ పోజ్(వ్రికాసన) యోగ ఆసనంలో ఆయన మైనపు బొమ్మ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. దాదాపు 20మంది నిపుణులు ఇప్పటికే ఈ పనిలో బిజీగా ఉన్నారు. కళ్లు, చెవులు, తల, ఆయన రంగు తదితర వివరాలను సేకరిస్తున్నారు. యోగా, ఆయుర్వేదం రెండూ ప్రపంచానికి లభించిన అతిపెద్ద బహుమతులని ఆయన పేర్కొన్నారు. భారతీయ యోగా, ఆధ్యాత్మికతకు ఇలాంటి గుర్తింపు దొరకడం గర్వకారణమని, తన మైనపు బొమ్మను మ్యూజియంలో పెట్టడం ద్వారా యోగా శాస్త్ర కీర్తి మరింత విశ్వవ్యాప్తవుతుందని చెప్పారు. అలాగే యోగా జీవనశైలిని అనుసరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇది మరింత ప్రోత్సహిస్తుందన్నారు. తన ప్రతిమను పెట్టాలన్న ప్రతిపాదన రెండు నెలల క్రితమే వచ్చిందని, బాగా ఆలోచించి అంగీకారం తెలిపానని రాందేవ్ తెలిపారు. కాగా తన ఆయుర్వేద ఉత్పత్తులతో పతంజలి సంస్థ నెస్లే, కోల్గేట్ ప్రోక్టర్ అండ్ గాంబుల్, హిందూస్తాన్ యూనీలీవర్ వంటి విదేశీ రిటైల్ కంపెనీలను ఇప్పటికే భారీగా దెబ్బ కొట్టింది. 2017 నాటికి పతంజలి వార్షిక టర్నోవర్ 10,000 కోట్ల మార్కును దాటేసింది. దీంతో పతంజలి సీఈవో బాలకృష్ణ భారీ సంపదతో ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో చేరారు. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ వెర్షన్ ‘పరిధాన్’ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. You will see @yogrishiramdev in #Vrikshasan (Tree pose yog) in @MadameTussauds in whose studio today, a dedicated team of 20 experts took impressions, measurements & matching of eyes, ears, skull & posture by colour, size and recorded details for making wax statue @ANI @AP pic.twitter.com/ok8VOsZz2G — tijarawala sk (@tijarawala) June 25, 2018 -
ఫొటో షేర్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలతో కొందరు అకతాయిలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని దాద్రికి చెందిన రహిషుద్దీన్గా గుర్తించారు. రహిషుద్దీన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రహిషుద్దీన్ బాబా రాందేవ్ ప్రతిష్టను దిగజార్చేలా.. ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ స్పందిస్తూ.. మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను అవమానపరచడానికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిందితుడు మాత్రం స్నేహితుడు పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని చెబుతున్నాడు. -
వాట్సాప్ ప్రత్యర్థి మరో రెండు నెలల్లో వచ్చేస్తోంది
న్యూఢిల్లీ : వాట్సాప్ గట్టి పోటీగా.. స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ... పతంజలి తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్ కింభో. ఆ యాప్ మార్కెట్లో ఆవిష్కరణ అయిన 24 గంటల్లోనే తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. దీంతో ఒక్కసారిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ ఈ యాప్‌ను తొలగించేశారు. కింభో యాప్ చాలా ప్రమాదకరమంటూ ఫ్రెంచ్ నిపుణులుచెప్పేసరికి పతంజలి సైతం తమ యాప్‌లో ఉన్న సమస్యలన్నింటిన్నీ తొలగించాక రీ-లాంచ్ చేస్తామని ప్రకటన చేసింది. తాజాగా ఆ యాప్‌కు మరిన్ని టెస్ట్‌లు చేస్తోంది. ఈ యాప్‌ను బయటికి విడుదల చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని యోగా గురు బాబా రాందేవ్ ప్రకటించారు. ‘టెస్టింగ్ దశలోనే ఈ యాప్ భారీ ఎత్తున్న ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. ఇది కేవలం పైలెట్ దశ మాత్రమే. ప్రస్తుతం ప్రిపరేషన్స్లు జరుగుతున్నాయి. ఈ యాప్ సెట్ కావడానికి మరో రెండు నెలల పట్టే అవకాశముంటుంది. పెద్ద ఎత్తున్న యూజర్ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో ప్రస్తుతం మేము పరిశీలిస్తున్నాం’ అని శుక్రవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘స్వదేశీ మెసేజింగ్ యాప్’ను భవిష్యత్తులో అధికారికంగా లాంచ్ చేస్తామని చెప్పారు. మార్కెట్లో ఉన్న ప్రస్తుత మెసేజింగ్ యాప్స్‌కు గట్టి పోటీగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ యాప్‌ను తయారుచేసినట్టు మే నెలలో కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. సిమ్ కార్డును విడుదల చేసిన అనంతరం, ‘ ఇప్పుడు భారత్ మాట్లాడుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. కానీ ఆ యాప్‌లో ప్రైవసీ సమస్యలున్నాయనే కారణంతో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించారు. -
సర్వం ‘యోగా’మయం...
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ నాల్గో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సుమారు 55 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనిషిని ప్రశాంతంగా ఉంచే సాధనం యోగా. మనిషి శరీరం, మెదడు, ఆత్మలను ఒకదానితో ఒకటి సమన్వయ పరిచి మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్య ఔషదం యోగా. డెహ్రాడూన్ నుంచి డబ్లిన్, షాంగై నుంచి చికాగో, జకర్తా నుంచి జోహాన్సబర్గ్ వరకూ ప్రాంతంతో సంబంధం లేకుండా యోగా విస్తరిస్తుంది. ఈ రోజు ప్రపంచాన్నంతా ఏకం చేసే శక్తి యోగాకు ఉంది’ అన్నారు. దేశమంతటా... దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సామాన్యుడి నుంచి సైనికుడు వరకూ...గుమస్తా నుంచి ముఖ్యమంత్రి వరకూ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేసారు. మహారాష్ట్ర... మహారాష్ట్ర గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు నేతృత్వంలో రాజ్ భవన్లో యోగా దినోత్సావాన్ని నిర్వహించారు. ముంబై మెరినా బీచ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. రాజస్థాన్‌లో... రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుంధర రాజేతో పాటు యోగా గురువు బాబా రాందేవ్, ఆచార్య బాలక్రిష్ణ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో.... ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. రాయబార కార్యలయ సిబ్బంది యోగా దినోత్సవ సందర్భంగా ఆసనాలు వేసారు. నీటిలో యోగా... అరుణాచల్ ప్రదేశ్ ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసు సైనికులు కాస్తా విభిన్నంగా నీటిలో యోగా చేసారు. లోహిత్‌పూర్ ‘దిగారు’ నదిలో సైనికులు యోగాసానలు వేసారు. మంచు ఎడారిలో... లడఖ్ ఇండో - టిబెటన్ బార్డర్ పోలీసు అధికారులు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న మంచు ఎడారిలో సూర్య నమస్కారాలు చేసారు. -
బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు
న్యూఢిల్లీ : ఉద్యోగం కోసం వెతుకుతున్నారా....? అయితే ఈ అవకాశం అందిపుచ్చుకోడంట. ఎఫ్ఎంసీజీ రంగంలో వేగవంతంగా దూసుకెళ్తోన్న బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని పతంజలి ఆయుర్వేద సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తమ పతంజలి వ్యాపారాల్లో పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఈ సంస్థ బుధవారం ఈ ప్రకటన చేసింది. ప్రతి జిల్లాలో పతంజలి ఉత్పత్తులను నిర్వహించే బాధ్యతల కోసం సేల్స్‌మెన్ పోస్టులను ప్రకటించింది. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మంది వరకు సేల్స్‌మెన్‌ను నియమించుకోవాలని గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఫుడ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఆశా పూజ ఐటమ్స్ వంటి పతంజలి బ్రాండుల్లో కూడా ఈ ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేస్తోంది. పతంజలి ఉద్యోగాలకు అర్హత : కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత, బీఏ/ఎంఏ/ఎంబీఏ. ఎఫ్ఎంసీజీ రంగంలో ఒకటి లేదా రెండేళ్ల అనుభవమున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత. ఎంపిక, శిక్షణ క్యాంప్‌ను 2018 జూన్ 23 నుంచి 27 తేదీల్లో నిర్వహిస్తారు. 2018 జూన్ 22 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ తప్పనిసరి) పతంజలి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సేల్స్‌మెన్‌కు వేతనాలు చెల్లిస్తారు. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 సేల్స్‌మెన్ కావాలి. హోమ్ డెలివరీ, రెడీ స్టాక్ సేల్స్‌కు 50 నుంచి 100 మంది యువత కావాలి. వేతనం నగరం, కేటగిరీ, అర్హత బట్టి రూ.8000 నుంచి రూ.15000 మధ్యలో ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి తమ అధికారిక కో-ఆర్డినేటర్‌ను లేదా ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా సంపద్రించాలని సూచించింది. ఈ ఉద్యోగానికి ఏ ఏజెంట్‌కు నగదు చెల్లించవద్దని తెలిపింది. -
అలాంటోడ్ని నడిరోడ్డులో ఉరితీయాలి
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాతి మహారాజ్ ఉదంతంపై యోగా గురు బాబా రాందేవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటోడ్ని నడిరోడ్డుపై ఉరి తీయాలని ఆయన మీడియా ముందు రాందేవ్ వ్యాఖ్యాలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్‌ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ‘దాతి వ్యవహారం’పై స్పందించాల్సిందిగా ఆయన్ని కోరింది. ‘కాషాయం ధరించినంత మాత్రాన సాధువులు అయిపోరు. సాధువుల గౌరవానికి, ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఎవరు వ్యవహరించినా సరే వాళ్లు జైలుకు పోవాల్సిందే. భక్తి, ధ్యానం ముసుగులో ఓ మహిళపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాడేం బాబా?.. అలాంటోడిని నడిరోడ్డులోకి లాక్కోచ్చి ప్రజలే ఉరి తీయాలి’ అని రాందేవ్ తీవ్రంగా స్పందించారు. ‘పవిత్రతను పాటించటం సాధువుల బాధ్యత. బాబా ముసుగులో నీచపు పనులకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందే. సాధువులు కూడా శిష్యులకు హితబోధచేయాలి. నా వరకు నా శిష్యుల్లో ఇప్పటిదాకా అలాంటి వాళ్లెవరూ లేరు. అందుకు నేను గర్విస్తున్నా’అని రాందేవ్ తెలిపారు. ఇదిలా ఉంటే తప్పించుకుని తిరుగుతున్న దాతి మహారాజ్‌కు ఢిల్లీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. లైంగిక ఆరోపణలు.. దేశ రాజధాని శివారులో శ్రీ శనిధామ్ ట్రస్ట్ పేరిట దాతి మహారాజ్ ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. తాజాగా అత్యాచారం కేసు నమోదు అయ్యింది. రెండేళ్ల క్రితం దాతి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మాజీ శిష్యురాలు(25).. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దాతి కోసం రాజస్థాన్, ఢిల్లీలోని ఆశ్రమాల్లో గాలింపు చేపట్టారు. అయితే దాతి మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పైగా ఓ వీడియో సందేశంలో ‘బాధితురాలు తన కూతురులాంటిదని, భక్తులంతా సహనంగా ఉండాలంటూ’ పిలుపునిచ్చాడు. అయితే దాతిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవటంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
ఫుడ్ పార్క్: రాందేవ్ బాబాకు సీఎం యోగి ఫోన్...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రూ.6వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ పెట్టాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు పతాంజలి సంస్థ ప్రకటించిన నేపథ్యంలో యూపీ సీఎం రంగంలోకి దిగారు. ఫుడ్ పార్క్ రాష్ట్రం నుంచి తరలించవద్దని పతాంజలి సంస్థ సహ వ్యవస్థాపకులైన రాందేవ్ బాబాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పతంజలి ఆయుర్వేద్ ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ, రాందేవ్ బాబాలతో మాట్లాడారు. పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని యోగి వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇవ్వడంతో రాందేవ్ కూడా పుడ్ పార్క్‌ను యూపీలోనే ఏర్పాటు చేయడానికి అంగీకరించారని యూపీ పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా పేర్కొన్నారు. యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో పతంజలి మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని భావించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇందుకు సహకరించడంలేదని పతంజలి ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం ఆరోపించారు. ‘పుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చాలని నిర్ణయించాం’ అని బాలకృష్ణ వెల్లడించారు. ఆచార్య బాల క్రిష్ణ ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడంతో యోగి వెంటనే రాందేవ్ బాబాతో మాట్లాడారు. -
యోగిపై విసుగెత్తిన బాబా రాందేవ్ ఏం చేశారంటే..
లక్నో : యోగా గురు బాబా రాందేవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విసుగెత్తిపోయారు. యోగి ఎన్నిరోజులకు కూడా తమ ప్రతిష్టాత్మకమైన ఫుడ్ పార్క్‌కు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై విసుగుచెందిన బాబా రాందేవ్, చివరికి తన ఫుడ్ పార్క్‌నే ఉత్తరప్రదేశ్ నుంచి తరలించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా ఎక్స్‌ప్రెవేతో పాటు మెగాఫుడ్‌పార్క్‌ను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ఫుడ్ పార్క్ స్కీమ్ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను కంపెనీ పొందలేకపోతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ చెప్పారు. పేపర్ వర్క్ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని పేర్కొన్నారు. ‘ ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. క్లియరెన్స్ కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాం’ అని ఆచార్య బాలక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయంలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్షల మంది వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటయ్యే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు కావాల్సిన మిషనరీని కంపెనీ ఇప్పటికే ఆర్డర్ చేసిందని, ఈ ప్రాజెక్ట్‌తో లక్షల కొద్దీ ఉద్యోగవకాశాలు సృష్టిస్తామని చెప్పారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఢిల్లీకి దగ్గరిలో గౌతమ్ బుద్ నగర్లో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ కోసం ఈ ఏడాది జనవరిలోనే తొలి ఆమోదం వచ్చేసింది. కానీ దీనికి కావాల్సిన భూమి, బ్యాంకు రుణానికి సంబంధించిన పేపర్లను కంపెనీ సమర్పించాల్సి ఉంది. తమ షరతులను చేరుకోవడానికి పతంజలికి ఒక నెల పొడిగింపు ఇచ్చామని, ఒకవేళ పతంజలి తమ షరతులను అందుకోలేకపోతే, రద్దు చేయడమే తప్ప.. తమ దగ్గర మరే ఇతర అవకాశం లేదని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అధినేత జేపీ మీనా అన్నారు. ఈ నెల ఆఖరి వరకు కంపెనీకి సమయం ఉందన్నారు. -
బాబా రాందేవ్‌తో అమిత్ షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం యోగా గురు బాబా రాందేవ్‌తో భేటీ అయ్యారు. మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా రాందేవ్‌కు వివరించారు. పార్టీని విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే క్రమంలో భాగంగా యోగా గురుతో అమిత్ షా సమావేశమయ్యారు. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా తాను రాందేవ్‌ను కలిశానని, మోదీ సర్కార్ సాధించిన విజయాలను వివరించానని భేటీ అనంతరం షా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీకి చెందిన 4000 మంది కార్యకర్తలు వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన లక్ష మందిని కలుస్తారని మే 26న ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బీజేపీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఇప్పటివరకూ 50 మందితో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 29న మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, సుభాష్ కశ్యప్‌లను కలిశారు. అనంతరం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో సమావేశమయ్యారు. పేదలు మెరుగైన జీవనం సాగించేలా, ప్రజల జీవన ప్రమణాలు పెంచేలా నాలుగేళ్ల హయాంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయా నేతలకు వివరిస్తామని అమిత్ షా చెప్పుకొచ్చారు. -
వాట్సాప్‌కు షాకిస్తూ...
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు పతంజలి సంస్థ షాకిచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొత్త యాప్‌ను రూపకల్పన చేసింది. కింభో పేరిట యాప్ రూపకల్పన చేసి ఆవిష్కరించింది. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసింది. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం విశేషం. -
కర్ణాటక ఫలితాలపై బాబా రాందేవ్..
సాక్షి, లక్నో : కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా యోగా గురు బాబా రాందేవ్ అభివర్ణించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీనే 2019లో కేంద్రంలో అధికారం చేపడుతుందన్నారు. కర్ణాటకలో బీజేపీనే అధికారం చేపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంపై గతంలో తాను చేసిన ఆరోపణలు ఇప్పుడు వాస్తవమేనని తేలుతున్నాయని చెప్పారు. ఆయన చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయన్నారు. గంగా ప్రక్షాళన కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గంగానదీ ప్రక్షాళనకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, ఏఎంయూలో మహ్మద్ జిన్నా చిత్ర పటానికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ దేశ విభజనకు కారకుడైన వ్యక్తి దేశానికి ఏమాత్రం ఆదర్శప్రాయం కాదని వ్యాఖ్యానించారు. -
‘సుశీల్ రియోలో ఆడి ఉంటే స్వర్ణమే’
సాక్షి, న్యూఢిల్లీ : 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సుశీల్‌ని అడ్డుకొని ఉండకపోతే భారత్‌కు తప్పక బంగారు పతకం సాధించిపెట్టేవాడని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ‘కామన్వెల్త్ గేమ్స్-2018’లో 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌ను, 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం గెలుపొందిన సుమిత్ మాలిక్‌ను బాబా రాందేవ్ మంగళవారం అభినందించారు. ‘మీరిద్దరూ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ను నిలబెట్టారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సుశీల్ గనుక రియో ఒలిపింక్స్‌లో పాల్గొని ఉంటే స్వర్ణం సాధించి ఉండేవాడు’ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో బెర్త్ కోసం ముంబయ్‌కు చెందిన నార్సింగ్ యాదవ్‌కు, తనకు ట్రయల్ పోటీ నిర్వహించాలన్న సుశీల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2015 లాస్ వెగాస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో సుశీల్ పాల్గొనక పోవడంతో నార్సింగ్ యాదవ్ రియోకి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. -
యోగాతో ఒత్తిడి దూరం
జిల్లాకేంద్రంలో నిర్వహించిన యోగా శిబిరానికి రెండోరోజూ విశేష స్పందన లభించింది. బుధవారం మహిళలు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. నిత్యం గంటపాటు యోగా చేయడం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చని బాబా రాందేవ్ అన్నారు. నిజామాబాద్ సిటీ(నిజామాబాద్‌అర్బన్): ఇంటిపనులతో బిజీగా గడిపే మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలుంటాయని, వీటిని అధిగమించాలంటే ప్రతిరోజు గంటపాటు యోగా చేయాలని బాబారాందేవ్ అన్నారు. యోగా శిబిరం రెండోరోజైన బుధవారం కొనసాగింది. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్దఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు. రాందేవ్ బాబా చెప్పిన ఆసనాలను నేర్చుకున్నారు. ఈ సందర్భంగా రాందేవ్‌బాబా మాట్లాడుతూ.. యోగాసనాలు నియమానుసారంగా ఆచరిస్తే జీవితంలో ఎటువంటి రోగాలు దరి చేరవన్నారు. అనంతరం స్నేహ సొసైటీ విద్యార్థులు, వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అలరించాయి. దీంతో విద్యార్థులతోపాటు విన్యాసాలు నేర్పిన గురువులను బాబా రాందేవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఓం కారేశ్వర పీఠాధిపతి శ్రీ ప్రతాప దక్షిణమూర్తి(జహీరాబాద్ కోహిర్ పీఠం), స్వామి బ్రహ్మానంద సరస్వతి గురుకులం కామారెడ్డి హాజరయ్యారు. సీపీ కార్తికేయ సతీమణి, మేయర్ సుజాత, జడ్పీ వైస్ చైర్పర్సన్ సుమన, కార్పొరేటర్లు హాజరయ్యారు. -
ఢిల్లీలో ధర్నా చేయండి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటుకు రైతులతో కలసి ఢిల్లీలో ధర్నా చేయాలని యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. మంగళవారం ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుం దని చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఇదివరకే ఎంపీ కవిత ప్రధాన మంత్రికి , కేంద్ర మంత్రులను కలసి వినతులు సమర్పించారని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తనవంతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ యోగా ప్రస్తుత జీవనశైలికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బాబా రాందేవ్ 3 రోజుల పాటు జిల్లాలో ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. -
నాలో శ్వాస ఉన్నంతవరకు యోగా చేస్తా..
రోగాల నుంచి విముక్తికి యోగానుఅలవర్చుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను తొమ్మిదేళ్ల వయసప్పుడే యోగా నేర్చుకున్నానని తెలిపారు. 2050 సంవత్సరం కల్లా దేశంలో ఎవరూ రోగాలతో బాధపడకూడదన్నారు. పతాంజలి వస్తువుల విక్రయం ద్వారా వచ్చే లాభాల నుంచి ఆరోగ్యం, చదువు కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దళితులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని అన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరుగనున్న ఉచిత యోగా ధ్యాన శివిరంలో పాల్గొనవలసిందిగా ఎంపీ కవితను బాబా రాందేవ్ ఆహ్వానించారు. కవిత నగరానికి వచ్చిన బాబా రాందేవ్‌ను కలిశారు. అనంతరం రాందేవ్ మంత్రి హరీష్‌రావుకు ఫోన్‌చేసి యోగా శివిరంలో పాల్గొనాలని కోరారు. నిజామాబాద్ సిటీ(నిజామాబాద్‌అర్బన్): రోగాలతో బాధపడేవారికి యోగా ఒక అద్భుతమైన అవకాశమని, రోగాల నుంచి విముక్తికి యోగాను అలవర్చుకోవాలని బాబా రాందేవ్ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 9ఏళ్ల వయస్సు నుంచే యోగా నేర్చుకున్నానని, తనలో శ్వాస ఉన్నంత వరకు యోగా చేస్తానని అన్నారు. జూలై 21 యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిచోట మూడు రోజుల శివిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. జూలై 21 యోగా డే ప్రపంచం మొత్తం యోగా దినంగా పాటించటం గర్వించదగిన విషయమన్నారు. పతాంజలి వస్తువుల విక్రయించటం ద్వారా వచ్చే లాభాలను ఆరోగ్యం, చదువు కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఇందు లో తనతో పాటు పతాంజలి బాలకృష్ణ ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో యోగా వైద్యుడు జయదీప్ ఆర్యా, భారత్ స్వభిమాన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, యువ భారత్ అధ్యక్షుడు సచిన్, యోగా శిక్షకులు కృపాకర్, మంజుశ్రీ, శివకుమార్, శివుడు పాల్గొన్నారు. దళితులపై దాడులనుఖండించాల్సిందే.. సమాజంలో దళితులు ఒక భాగమని వారిపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని బాబా రాందేవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 10 నుంచి 12 వరకు నిర్వహించే ఉచిత యోగా శిక్షణ, యోగా చికిత్స శివిరం సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన బాబా రాందేవ్ ఆర్యసమాజంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా దేశంలో దళితులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితులో అన్యాయం జరుగరాదన్నారు. దీనిని సాకుగా కొందరు నేతలు, ఇతరులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దన్నారు. దళిత సమాజం సమన్వయం పాటించాలని ఆయన కోరారు. లక్ష మంది విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలో యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. -
త్వరలో మార్కెట్లోకి పతంజలి దుస్తులు
పనాజి: యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద్ .. త్వరలో దుస్తుల తయారీ విభాగంలో కూడా ప్రవేశించనుంది. వచ్చే ఏడాది వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) నిర్వహిస్తున్న ’గోవా ఫెస్ట్ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబా రాందేవ్ వెల్లడించారు. ‘మార్కెట్లోకి మీ కంపెనీ జీన్స్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. అందుకే వచ్చే ఏడాదిలో దుస్తులు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. పిల్లలు, పురుషులు, మహిళలు .. అందరికీ సంబంధించిన గార్మెంట్స్ ప్రవేశపెడతాం‘ అని ఆయన వివరించారు. అలాగే.. స్పోర్ట్స్, యోగాకు ఉపయోగపడే గార్మెంట్స్ కూడా ప్రవేశపెడతామని బాబా రాందేవ్ తెలిపారు. స్వదేశీ దుస్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన గతేడాదే తెలిపారు. పతంజలి ఆయుర్వేద్ ప్రతీ ఏడాది ఆర్థికంగా మరింత మెరుగైన పనితీరు సాధిస్తున్నట్లు, త్వరలోనే టర్నోవర్‌పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగగలదని బాబా రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకోకపోవడం వల్ల గణనీయంగా ఆదా అవుతోందని ఆయన చెప్పారు. సాధారణంగా ప్రజానీకంతో తమకు ఉన్న సంబంధాలే .. బ్రాండ్ ఎదుగుదలకు ఉపయోగపడుతోందన్నారు. అయితే, పలు ప్రకటనల నుంచి ఇప్పటికే తాను తప్పుకున్నానని, రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాందేవ్ వివరించారు. ఇతర దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తున్నామన్నారు. ఆర్థికంగా బలహీన దేశాల్లో వచ్చే లాభాలను మళ్లీ అక్కడే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు రాందేవ్ చెప్పారు. -
కేరళ సీఎంకు బాబా రాందేవ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్తకర్తలు, నేతలపై కేరళ సీఎం చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎంతో మందిని తాను దగ్గరి చూశానని, వారిలో ఉగ్రవాదులు ఎవరూ లేరని రాందేవ్ బాబా పేర్కొన్నారు. ఆరెస్సెస్ నాయకులు, కార్తకర్తలు ఎంతో మంది తనకు తెలుసునని, కానీ వారిలో ఏ ఒక్కరూ ఉగ్రవాదులు గానీ, నక్సలైట్స్ వర్గాలకు చెందిన వాళ్లు లేరని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. దేశానికి చెందిన ఓ జాతీయ గ్రూపు లాంటిది ఆరెస్సెస్ అని చెప్పారు. దేశానికి హాని కలిగించే పనులు వారు చేయరంటూ పినరయి విజయన్ వ్యాఖ్యలను యోగా గురువు తిప్పికొట్టారు. అసలు వివాదం ఏంటంటే.. 'పీఎఫ్ఐ, ఆరెస్సెస్ గ్రూపులు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని దేవాలయాల్లోనూ కర్రలతో దాడి చేయడంపై యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆరెస్సెస్ చర్యలను నిషేధించాలంటూ' కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బుధవారం వ్యాఖ్యానించడం దూమారం రేపిన విషయం తెలిసిందే. -
నీరవ్ నిర్వాకంపై స్పందించిన బాబా రాందేవ్
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ ఘరానా జ్యూవెలర్ నీరవ్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. నీరవ్ తాను చేసిన పాపాలకు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీలు తమ సిగ్గుమాలిన చర్యలతో దేశాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సి రూ 15,000 కోట్లు పైగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పీఎన్బీ ఫిర్యాదు చేసింది. మరోవైపు నీరవ్ మోదీ ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, మెహుల్ చోక్సీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011లో మొదలైన ఈ కుంభకోణాన్ని ఈ ఏడాది జనవరి మూడవ వారంలో గుర్తించారు. నీరవ్ మోసాన్ని గుర్తించిన పీఎన్బీ అధికారులు ఈ ఏడాది జనవరి 31న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈడీ సైతం ఈ కేసుపై దర్యాప్తునకు రంగంలోకి దిగింది.