'80 శాతం యువత డ్రగ్స్కు బానిసలయ్యారు' | 80% of Punjab’s youths addicted to drugs, Baba Ramdev says | Sakshi
Sakshi News home page

'80 శాతం యువత డ్రగ్స్కు బానిసలయ్యారు'

Published Sat, May 9 2015 1:24 PM | Last Updated on Fri, May 25 2018 2:43 PM

'80 శాతం యువత డ్రగ్స్కు బానిసలయ్యారు' - Sakshi

'80 శాతం యువత డ్రగ్స్కు బానిసలయ్యారు'

పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది యువత డ్రగ్స్కు బానిసలయ్యారని బాబా రాందేవ్ ఆరోపించారు.

చంఢీగడ్: పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది యువత డ్రగ్స్కు బానిసలయ్యారని బాబా రాందేవ్ ఆరోపించారు. శుక్రవారం రాజధాని చంఢీగడ్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల విదేశీ పర్యటన చేశానని.. అందులోభాగంగా అక్కడి పంజాబీ వాసులతో భేటీ అయనట్లు రాందేవ్ వివరించారు. రాష్ట్రంలో 80 శాతం మంది యువత డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. పంజాబ్లో యువతను కాపాడాలని వారు సూచించారన్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణను అరికట్టి... పంజాబ్ను రక్షించాలని వారు ఈ సందర్భంగా తనకు విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. ఈ సమావేశానికి ముందు బాబా రాందేవ్ రాష్ట్రంలో యోగా, ఆయుర్వేదంను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement