కేంద్రం నుంచి అవినీతికర ప్రభుత్వాన్ని సాగనంపాలన్న తన సంకల్పం నెరవేరిందని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఆ ప్రతిజ్ఞ నెరవేరడంతో ఆయన సోమవారం తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి హరిద్వార్ పయనమయ్యారు. అంతకుముందు బాబా రాందేవ్ రాజ్‌ఘాట్, షహీద్ భగత్‌సింగ్ పార్కును సందర్శించారు. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, బిజెపి ఎంపీ సత్యపాల్ సింగ్ తదితరులతో కలిసి రాజ్‌ఘాట్‌లో కాసేపు ధ్యానం చేశారు. అనంతరం ఆయన రోడ్‌షో నిర్వహిస్తూ హరిద్వార్‌కు పయనమయ్యారు. హరిద్వార్ చేరుకున్న బాబా రాందేవ్కు హరిద్వార్లో ఘన స్వాగతం లభించింది.