
'షారుక్ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలి'
రాంచీ: యోగా గురు బాబా రాందేవ్.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్పై మండిపడ్డారు. భారత్లో మత అసహనం పెరిగిపోతోందన్న షారుక్ వ్యాఖ్యల్లో అర్థంలేదని అన్నారు. మత అసహనంపై షారుక్ నిజంగా ఆందోళన చెందితే ఆయన తీసుకున్న పద్మశ్రీ అవార్డుతో పాటు నగదు బహుమతిని వెనక్కి ఇచ్చేయాలని రాందేవ్ డిమాండ్ చేశారు. షారుక్ నిరసన తెలపాలని భావిస్తే.. అవార్డును వెనక్కి ఇవ్వడంతో పాటు బహుమతిగా వచ్చిన డబ్బును ప్రధాని సహాయ నిధికి జమ చేయాలని అన్నారు.
రెండు రోజుల క్రితం షారుక్ తన పుట్టిన రోజు సందర్భంగా దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కొందరు రాజకీయ నేతలు షారుక్ అండగా నిలవగా.. కొందరు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.