religious intolerance
-
కుల సమాజమే కానీ...
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు. అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?) లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
'షారుక్ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలి'
రాంచీ: యోగా గురు బాబా రాందేవ్.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌పై మండిపడ్డారు. భారత్‌లో మత అసహనం పెరిగిపోతోందన్న షారుక్ వ్యాఖ్యల్లో అర్థంలేదని అన్నారు. మత అసహనంపై షారుక్ నిజంగా ఆందోళన చెందితే ఆయన తీసుకున్న పద్మశ్రీ అవార్డుతో పాటు నగదు బహుమతిని వెనక్కి ఇచ్చేయాలని రాందేవ్ డిమాండ్ చేశారు. షారుక్ నిరసన తెలపాలని భావిస్తే.. అవార్డును వెనక్కి ఇవ్వడంతో పాటు బహుమతిగా వచ్చిన డబ్బును ప్రధాని సహాయ నిధికి జమ చేయాలని అన్నారు. రెండు రోజుల క్రితం షారుక్ తన పుట్టిన రోజు సందర్భంగా దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కొందరు రాజకీయ నేతలు షారుక్ అండగా నిలవగా.. కొందరు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. -
మత అసహనం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు
-
ఇది నయనతార హిపోక్రసి కాదా?
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిపోతున్న మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, వాటి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌన వైఖరిని నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చివేస్తున్నానని ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ సగౌరవంగా ప్రకటించడాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె సాహిత్య అకాడమీ అవార్డును నిన్న, మొన్న తీసుకున్నది కాదు. 1986లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. అంతకుముందు సరిగ్గా రెండేళ్ల ముందు, అంటే 1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది సిక్కులను ఊచకోతకోశారు. అందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వానిదే. అందుకు నిరసనగా 1986లోనే తాను సాహిత్య అవార్డును అందుకోవడాన్ని నిరాకరించి ఉండాల్సింది. సెహగల్ అలా చేయలేదు. 1996, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వాంసానికి వ్యతిరేకంగానైనా సెహగల్ తన అవార్డును వెనక్కి ఇవ్వాల్సింది. అలా కూడా చేయలేదు. 2002లో గుజరాత్లో ముస్లింలకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. ఆ పాపం నరేంద్ర మోదీదేనంటూ ప్రపంచవ్యాప్తంగా పత్రికలు కోడై కూశాయి. అప్పుడు కూడా సెహగల్ స్పందించలేదు. ఎందుకు? దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లను ప్రేరేపించడం దేశ రాజకీయాలకు కొత్త కాదు. అందుకు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అతీతం కాదు. మరి ఇంతకాలం సాహిత్య అకాడమి అవార్డు గురించి మాట్లాడని సెహగల్ ఇప్పుడు దాన్ని వెనక్కి ఇస్తానంటూ ప్రకటించడం ఆత్మవంచన (హిపోక్రసి) కాదా? ఇంతకాలం తాను పరిణతి చెందలేదని, ఇప్పుడు పూర్తి పరిణతి చెందడం వల్ల స్పందించానని ఆమె సమాధానం చెప్పుకుంటారా? అలా చెప్పుకుంటే అది ఆమెకే అవమానం. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సెహగల్ గట్టిగా పోరాటం జరిపారు. ‘పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్’ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. ఆ కారణంగానైనా ఆమె 1986లోనే అవార్డును తిరస్కరించి ఉండాల్సింది. మరి, ఎందుకు చేయలేదు?...అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే, అవార్డు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధికారంలో ఉంది, ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు బీజేపి ప్రభుత్వం అధికారంలో ఉందన్న సమాధానమే కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు, సాహితీవేత్తలు పార్టీలబట్టి స్పందన మార్చుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ప్రపంచంలో తాను అన్నింటికన్నా ఆత్మంచననే ద్వేషిస్తానని ఎంగెల్స్ చెబుతారు. ఎందుకంటే, ఆత్మవంచనతో మాట్లాడేవారు సమాజానికి మిత్రులో, శత్రువులో, వారు స్వపక్షమో, వైరిపక్షమో అంచానా వేయలేమన్నది ఆయన అంచనా.