
సినిమా హీరోహీరోయిన్లు పలువురు ఓవైపు నటిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు అదే యాడ్స్ వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడుతుంటారు. మొన్నీమధ్యే క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తమన్నా, కాజల్ అగర్వాల్ కి పోలీసులు నోటీసులిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఇలానే నోటీసులు అందుకున్నారట.
ఏం జరిగింది?
బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్.. ఓ పాన్ మసాలా యాడ్ లో నటించారు. చాన్నాళ్ల నుంచి టీవీల్లో దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, ఇది ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని జైపూర్ కి చెందిన లాయర్ యోగేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)
ఈ యాడ్ లో 'పలుకు పలుకులో కేసరి' అనే ట్యాగ్ లైన్ ఉపయోగించారని, కానీ సంస్థ చెప్పినట్లు ఈ ఉత్పత్తిలో అసలు కేసరి (కుంకుమ పువ్వు) కలిపి లేదని న్యాయవాది ఆరోపించారు. దీంతో మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ముగ్గురు హీరోలతో పాటు గుట్కా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
ఒకవేళ కోర్టుకు ఎవరూ హాజరు కాకపోయినా విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కోర్ట్ ఆదేశించింది.€మరి ఏం జరుగుతుందో చూడాలి? తెలుగులోనూ మహేశ్ బాబు ఇలా ఓ పాన్ మసాలా యాడ్ లో నటించాడు.
(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment