pan masala ad
-
పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగిన అమితాబ్
ముంబై: పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. బ్రాండ్ ప్రమోషన్‌కు కంపెనీ ఇచి్చన పైకాన్ని వెనక్కు ఇచి్చనట్లు తెలిపారు. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభిమానులు తమ స్టార్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బచ్చన్ వెనక్కు తగ్గారు. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో ఆఫీస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ పేరిట ఒక పోస్టు కనిపించింది. గతవారం బచ్చన్ ఈ ప్రకటన నుంచి తప్పుకున్నారని, ప్రచారానికి ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల అంగీకరించినట్లు పోస్టులో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్లకు ప్రకటనకర్తగా వ్యవహరించవద్దని ఇటీవల ఎన్ఓటీఈ అనే పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌కు విజ్ఞప్తి చేసింది. -
మోసానికి గురైన జేమ్స్ బాండ్ నటుడు
న్యూఢిల్లీ : పాన్ బహార్ ప్రకటనలో మెరిసిన, హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు పీర్స్ బ్రోస్నన్ ఆ కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. పాన్ మసాలా బ్రాండు తనను మోసం చేసిందని ఆరోపించాడు. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టి పాన్ మసాల బ్రాండు ఈ మోసానికి పాల్పడిందన్నాడు. ఢిల్లీ స్టేట్ టుబాకో కంట్రోల్ సెల్‌కు రాసిన లేఖలో.. ‘కంపెనీ నన్ను మోసం చేసింది. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని వెల్లడించలేదు. అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను బహిర్గతం చేయలేదు’ అని పేర్కొన్నట్టు అదనపు డైరెక్టర్(హెల్త్) ఎస్కే అరోరా చెప్పారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం బ్రోస్నన్కు షోకాజు నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈ లీగల్ నోటీసుకు స్పందించిన బ్రోస్నన్, కంపెనీతో తనకున్న ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని, డిపార్ట్మెంట్కు అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రోస్నన్ తెలిపారు. భవిష్యత్తులో హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రోస్నన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు అరోరా పేర్కొన్నారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాకు అధికారులు ఆదేశించారు. సామాజిక బాధ్యతను సెలబ్రిటీలు తప్పక తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత వారిని సెలబ్రిటీలను దేవుడిలా భావించి, గుడ్డిగా అనుకరించకూడదని సూచించారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద టుబాకో ఉత్పత్తుల అన్ని ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. -
వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
న్యూఢిల్లీ : వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లతో అలరించిన వరల్డ్ సూపర్ స్టార్, హాలీవుడ్ యాక్టర్ పియర్స్ బ్రాస్నస్, పాన్ బహార్ పాన్ మసాలా యాడ్‌పై తన ఫోటో ఉండటంపై షాక్‌కు గురయ్యారు. మోసపూరితంగా, అనధికారికంగా తన ఇమేజ్ను పాన్ బహార్ వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తాను అసలు అంగీకరించనని బ్రాస్నన్ ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్స్ తయారుచేసే పాన్ బహారాతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మెరిసే పళ్లు, తాజా శ్వాస వంటి ట్యాగ్‌లైన్‌ను ప్రమోట్ చేయడానికే కాంట్రాక్టులో అంగీకరించినట్టు పేర్కొన్నారు. కానీ తన కాంట్రాక్టుకు విరుద్ధంగా అనధికారికంగా తన ఫోటోను అన్నీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య మెరుగుదలకై తోడ్పడేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు స్ఫష్టంచేశారు. ఈ సందర్భంగా తన మొదటి భార్య, కూతురు, పలువురు స్నేహితులు క్యాన్సర్‌తో చనిపోయిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌ను సపోర్టు చేయడానికే తాను కట్టుబడిఉన్నట్టు వెల్లడించారు. తనకు తెలియకుండానే జరిగిపోయిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్‌ను తాను ఎండోర్స్ చేసుకున్నట్టు మీడియా అవుట్‌లెట్స్‌ను కూడా నమ్మిస్తూ పాన్ బహారా మోసం చేస్తుందన్నారు. ఒకప్పుడు వరల్డ్ సూపర్ స్టార్.. భారతీయ వీధి చివరి దుకాణాల్లో వేలాడే పాన్ మసాలా ప్యాకెట్లో దర్శనమివ్వడంపై పలువురు జోక్స్ వేసిన సంగతి తెలిసిందే. చేతిలో పాన్ మసాలా డబ్బాతో ఆయన ఈ ఫోటోలో కనిపిస్తారు..