వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
Published Fri, Oct 21 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
న్యూఢిల్లీ : వరుస జేమ్స్ బాండ్ సిరీస్లతో అలరించిన వరల్డ్ సూపర్ స్టార్, హాలీవుడ్ యాక్టర్ పియర్స్ బ్రాస్నస్, పాన్ బహార్ పాన్ మసాలా యాడ్పై తన ఫోటో ఉండటంపై షాక్కు గురయ్యారు. మోసపూరితంగా, అనధికారికంగా తన ఇమేజ్ను పాన్ బహార్ వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తాను అసలు అంగీకరించనని బ్రాస్నన్ ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్స్ తయారుచేసే పాన్ బహారాతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మెరిసే పళ్లు, తాజా శ్వాస వంటి ట్యాగ్లైన్ను ప్రమోట్ చేయడానికే కాంట్రాక్టులో అంగీకరించినట్టు పేర్కొన్నారు. కానీ తన కాంట్రాక్టుకు విరుద్ధంగా అనధికారికంగా తన ఫోటోను అన్నీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వాడుతుందని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్య మెరుగుదలకై తోడ్పడేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు స్ఫష్టంచేశారు. ఈ సందర్భంగా తన మొదటి భార్య, కూతురు, పలువురు స్నేహితులు క్యాన్సర్తో చనిపోయిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ను సపోర్టు చేయడానికే తాను కట్టుబడిఉన్నట్టు వెల్లడించారు. తనకు తెలియకుండానే జరిగిపోయిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్ను తాను ఎండోర్స్ చేసుకున్నట్టు మీడియా అవుట్లెట్స్ను కూడా నమ్మిస్తూ పాన్ బహారా మోసం చేస్తుందన్నారు. ఒకప్పుడు వరల్డ్ సూపర్ స్టార్.. భారతీయ వీధి చివరి దుకాణాల్లో వేలాడే పాన్ మసాలా ప్యాకెట్లో దర్శనమివ్వడంపై పలువురు జోక్స్ వేసిన సంగతి తెలిసిందే. చేతిలో పాన్ మసాలా డబ్బాతో ఆయన ఈ ఫోటోలో కనిపిస్తారు..
Advertisement
Advertisement