పియర్స్ బ్రోస్నన్. మీరు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులైతే ఈయనను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఒకవేళ కాకపోయినా, పాన్ బహర్ అన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ఒక చిన్న మౌత్‌ఫ్రెష్‌నర్ డబ్బాను చేతిలో పట్టుకొని, ఏదొక పేపర్లో, ఏదొక రోజు కనిపించే ఉంటాడు. పాపం ఆయన అది నిజంగానే ‘కేవలం’ మౌత్‌ఫ్రెష్‌నర్ అనుకొని ప్రమోట్ చేశాడు. అయితే పాన్ బహర్ బిజినెస్ అంతా గుట్కాలని ఆయనకు తెలీదు. పాన్ బహర్‌ను చూడగానే ప్రపంచానికి పాన్, గుట్కాలు తప్ప ఇంకేం గుర్తుకురాదని కూడా ఆయనకు తెలీదు.
మొత్తానికి చక్కగా ఇరుక్కున్నాడు. చివరకు అశోక్ అండ్ కో కంపెనీ తనను మోసం చేసిందని విన్నవించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో పొగాకు సంబంధిత పదార్థాలు ఏవీ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. బ్రోస్నన్ ఇలా పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయన మన ప్రభుత్వానికి తన బాధను తన లాయర్ల ద్వారా తెలియపర్చుకోవాల్సి వచ్చింది. కేవలం మౌత్ ఫ్రెష్‌నర్ అన్న పేరుతోనే ప్రమోట్ చేశానని, తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బ్రోస్నన్. నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించి బాండ్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించుకున్న బ్రోస్నన్ పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినప్పుడు ఆయనపై ఇండియన్ సినిమా అభిమానులంతా రకరకాలుగా జోక్స్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment