mouth freshener
-
డ్రై ఐస్ నిజంగా అంత ప్రమాదమా?
గురుగ్రామ్‌లో జరిగిన ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సరదాగా డిన్నర్ చేద్దామని కేఫ్‌కి వెళ్లితే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది ఆ వ్యక్తులకు. డిన్నర్ చివరి టైంలో తీసుకున్న మౌత్ ప్రెషనర్ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. ఏంటా మౌత్ ఫ్రెషనర్ కథ? ఎందువల్ల అలా అయ్యిందంటే.. గురుగ్రామ్‌లో అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. చివరిగా మౌత్ ఫ్రెషనర్‌గా రూపంలోని డ్రై ఐస్‌ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. నీళ్లతో కడుక్కున్న లాభం లేకుండా పోయింది. ఐస్ నోటిలో పెట్టుకున్న ఉపశమనం లేకపోగా ఒకటే బాధ,నొప్పితో విలవిలలాడారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఏం తీసుకున్నారని ఆరా తీయగా..వారు తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్‌ని ప్యాకెట్‌ని చూపించారు. అది డ్రై ఐస్ అని వైద్యులు చెప్పారు. అది తీసుకుంటే మరణానికి దారితీసే యాసిడ్‌గా మారుతుందని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేంటి డ్రై ఐస్? అంత డేంజరా అంటే?.. డ్రై ఐస్ అంటే.. కార్బన్డయాక్సైడ్(CO2) వాయువును శీతలీకరించి ఘనీభవించడం ద్వారా డ్రై ఎస్ ఏర్పడుతుంది. దీన్ని 1900ల ప్రారంభంలో కనుగొన్నారు. 1920లలో దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా వినియోగించటం ప్రారంభించారు. ఆహార, ఔషధ పరిశ్రమల్లో షిప్పింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ డ్రై ఐస్ దాదాపు 78 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో రవాణ సమయంలో పదార్థాలను స్తంభింపజేసి ప్యాకింగ్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే కొన్ని వ్యాక్సిన్లు తరలించే సమయంలో కూల్‌గా ఉంచేందుకు కూడా వినియోగిస్తారు. ధాన్యం ఉత్పత్తుల్లో కీటకాలు రాకుండా ఉండేందుకు వినియోగిస్తారు. అయితే ఈ డ్రై ఐస్ పెద్ద బ్లాక్స్ గానూ లేదా చిన్న గుళికల రూపంలోనూ వినయోగిస్తారు. దీన్ని తప్పుగా వినియోగిస్తే ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదు. గురుగ్రామ్‌లో ఆ వ్యక్తులు కూడా అలా చేయడంతోనే రక్తపు వాంతులు కక్కుకుని విలవిలలాడటానికి కారణమయ్యింది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే.. పొడి మంచుకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల ఫ్రాస్ట్‌బైట్ ద్వారా చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోవడంతో హైపర్క్యాప్నియా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ డ్రై ఐస్‌ను బాగా వెంటిలేషన్ ఉండే వాతావరణంలో మాత్రమే బయట గాలికి బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అలాగే కాక్టెయిల్ వంటి డ్రింక్లక పొగమంచులా కనిపించేందుకు ఈ డ్రై ఐస్‌ను ఉపయోగిస్తారు . అనుకోకుండా పానీయం నుంచి గనుక ఈ గుళికలను తీసుకుంటే ఆ వ్యక్తి అన్నవాహిక , కడుపు తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక్కడ గురుగ్రామ్ కేఫ్‌లోని వ్యక్తులు ఆ డ్రైఐస్ని నేరుగా లోపలికి తీసుకోవడంతోనే వారు కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్నే వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ డ్రై ఐస్‌ని నోటిలో పెట్టుకునే యత్నం చేయకూడదు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ కావడంతో నోటిలోని లాలజలం తేమతో కలిసి రియాక్షన్ చెందడం జరుగుతంది. ఫలితంగా తీవ్రమైన గాయాలు, కణజాల నష్టం వంటివి జరుగుతాయి. అలాగే ఈ పొడిమంచు ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ని పీల్చినా ప్రాణాంతకమే. అందువల్ల పొడిమంచును వినియోగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించటం మంచిది. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
ప్రాణం మీదకు తెచ్చిన మౌత్ ఫ్రెష్నర్.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి..
హర్యానాలోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్న అయిదుగురు వ్యక్తులు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏకంగా నోటీలో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రామ్‌లో మార్చి రెండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్‌లోని సెక్టార్ 90లో లాఫోరెస్టా కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అయిదుగురు రెస్టారెంట్‌లోని మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్నారు. అంతే వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మొదలైంది. నోరు మండటం, నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికే రెస్టారెంట్ ఫ్లోర్‌పై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. నోటిని నీటితో శుభ్రం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. రెస్టారెంట్లో ఉన్నవారు ఒకరు దీనిని వీడియో తీశారు. ఇదులో అందరూ నోటి బాధతో ఏడుస్తూ కనిపించారు. ఓ మహిళ తన నోటిలో ఐస్‌ను పెట్టుకోవడం, తన నోరు మండుతోందని పదే పదే చెబుతుండటం వినిపిస్తుంది. వెంటనే కేఫ్‌లోని వ్యక్తులను పోలీసులకు కాల్ చేయమని కోరారు. Five people started vomiting blood and reported a burning sensation in their mouths after eating mouth freshener after their meal at a cafe in Gurugram. They were hospitalized and two are critical. pic.twitter.com/brMnbWbZQW — Waquar Hasan (@WaqarHasan1231) March 4, 2024 అనంతరం పోలీసులు కేఫ్‌కు చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్‌ను వైద్యుడికి చూపంచగా.. అది డ్రై ఐస్ అని డాక్టర్ చెప్పారు. ఇది మరణానికి దారితీసే యాసిడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. குருகுராமில் உள்ள தனியார் உணவகத்தில் Mouth Freshener சாப்பிட்ட 05 பேருக்கு ரத்த வாந்தி ஏற்பட்டதை தொடர்ந்து ஆபத்தான நிலையில் மருத்துவமனையில் அனுமதி. pic.twitter.com/QB4jzeTW5C — Ramesh (@RHoneykumar) March 4, 2024 -
Cardamom Benefits: ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే..
Elaichi Health Benefits: నోటి దుర్వాసనను నివారించడానికి కొన్ని ఏలకులను నోట్లో వేసుకుని చప్పరించడం అనాదిగా మనకు తెలిసిన చిట్కానే. అయితే ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసనను ఇంకా సమర్థంగా తగ్గించవచ్చు. అలాగే నీళ్లతో నిమ్మరసం చేసి, అందులో కొద్దిగా ఏలకుల చూర్ణం కలిపి తాగితే వాంతులు కూడా తగ్గుతాయి. పాలమీగడలో ఏలకులను కలుపుకుని, ఆ ముద్దను చప్పరిస్తే నోటిపూత, నాలుక పూత తగ్గుతాయి. ఏలకుల చూర్ణాన్ని బట్టలో పెట్టి కొద్దికొద్దిగా వాసన చూస్తుండం వల్ల తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. అయితే ఏలకులలో చాలా ఎక్కువగా ఔషధ గుణాలున్నందు వల్ల దాన్ని ఎప్పుడూ కొద్ది కొద్ది మోతాదులో, చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. చదవండి: (బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి) -
పక్కా పాన్ మసాలా మోసం
పియర్స్ బ్రోస్నన్. మీరు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులైతే ఈయనను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఒకవేళ కాకపోయినా, పాన్ బహర్ అన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ఒక చిన్న మౌత్‌ఫ్రెష్‌నర్ డబ్బాను చేతిలో పట్టుకొని, ఏదొక పేపర్లో, ఏదొక రోజు కనిపించే ఉంటాడు. పాపం ఆయన అది నిజంగానే ‘కేవలం’ మౌత్‌ఫ్రెష్‌నర్ అనుకొని ప్రమోట్ చేశాడు. అయితే పాన్ బహర్ బిజినెస్ అంతా గుట్కాలని ఆయనకు తెలీదు. పాన్ బహర్‌ను చూడగానే ప్రపంచానికి పాన్, గుట్కాలు తప్ప ఇంకేం గుర్తుకురాదని కూడా ఆయనకు తెలీదు. మొత్తానికి చక్కగా ఇరుక్కున్నాడు. చివరకు అశోక్ అండ్ కో కంపెనీ తనను మోసం చేసిందని విన్నవించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో పొగాకు సంబంధిత పదార్థాలు ఏవీ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. బ్రోస్నన్ ఇలా పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయన మన ప్రభుత్వానికి తన బాధను తన లాయర్ల ద్వారా తెలియపర్చుకోవాల్సి వచ్చింది. కేవలం మౌత్ ఫ్రెష్నర్ అన్న పేరుతోనే ప్రమోట్ చేశానని, తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బ్రోస్నన్. నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించి బాండ్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించుకున్న బ్రోస్నన్ పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినప్పుడు ఆయనపై ఇండియన్ సినిమా అభిమానులంతా రకరకాలుగా జోక్స్ చేసుకున్నారు. -
ఛాతీ మంట నుంచి ఉపశమనానికి...
గృహవైద్యం *భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీమంట రాదు. *కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మరిగించి మూతపెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం వడపోసి టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగితే అసిడిటీ తగ్గుతుంది. *ఒక లవంగం ఒక ఏలక్కాయను పొడి చేసి బుగ్గన పెట్టుకుంటే ఛాతీమంట రాదు. ఇది నోటి శుభ్రతకు (మౌత్‌ఫ్రెషనర్) కూడా ఉపకరిస్తుంది. * అర లీటరు నీటిలో ఒక టీ స్పూన్ షాజీర వేసి సన్నటి మంట మీద 15 నిమిషాల సేపు మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండు - మూడు సార్లు ఐదారు రోజులపాటు తాగితే అసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. * అసిడిటీ ఉంటే జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగజిమ్మి ఆహారనాళంలోకి వస్తుంటాయి. దీంతో ఛాతీలో మంట అనిపిస్తుంది. కడుపులో జీర్ణరసాలు వాటి నియమిత సమయానికి విడుదలవుతుంటాయి. కానీ సమయానికి భోజనం చేయకపోతే... ఆమ్లపూరిత రసాల కారణంగా కడుపులో మంట వస్తుంటుంది. అలాగే ఘాటు మసాలాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఆమ్లాలు పైకి ఎగజిమ్మడంతో ఛాతీలో మంట వస్తుంది.