ప్రాణం మీదకు తెచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి.. | 5 Friends Vomit Blood After Eating Mouth Freshener At Gurugram Laforestta Cafe, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి..

Mar 4 2024 8:59 PM | Updated on Mar 5 2024 10:56 AM

5 Friends Vomit Blood After Eating Mouth Freshener At Gurugram Cafe - Sakshi

హర్యానాలోని షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత మౌత్‌ ఫ్రెష్‌నర్‌ తీసుకున్న అయిదుగురు వ్యక్తులు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏకంగా నోటీలో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రామ్‌లో మార్చి రెండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలు.. అంకిత్‌ కుమార్‌ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 90లో లాఫోరెస్టా కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అయిదుగురు రెస్టారెంట్‌లోని మౌత్‌ ఫ్రెష్‌నర్‌ తీసుకున్నారు.  అంతే వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మొదలైంది. నోరు మండటం, నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికే రెస్టారెంట్‌ ఫ్లోర్‌పై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. నోటిని నీటితో శుభ్రం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. 

రెస్టారెంట్‌లో ఉన్నవారు ఒకరు దీనిని వీడియో తీశారు. ఇదులో అందరూ నోటి బాధతో ఏడుస్తూ కనిపించారు. ఓ మహిళ తన నోటిలో ఐస్‌ను పెట్టుకోవడం, తన నోరు మండుతోందని పదే పదే చెబుతుండటం వినిపిస్తుంది. వెంటనే కేఫ్‌లోని వ్యక్తులను పోలీసులకు కాల్‌ చేయమని కోరారు.

 అనంతరం పోలీసులు కేఫ్‌కు చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉ‍న్నట్లు వైద్యులు తెలిపారు. తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్‌ను వైద్యుడికి చూపంచగా.. అది డ్రై ఐస్ అని డాక్టర్‌ చెప్పారు. ఇది మరణానికి దారితీసే యాసిడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement