Vomiting
-
ప్రాణం తీసిన ఫుడ్‌పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్‌కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్‌కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వాంతులను అరికట్టే స్మార్ట్‌వాచ్‌ను.. ఎప్పుడైనా వాడారా!
ఇప్పటి వరకు చాలా స్మార్ట్‌వాచ్‌లు వాడుకలోకి వచ్చాయి. వీటిలో కొన్ని గుండెలయ, రక్తపోటు, శ్వాసతీరు, నిద్రలో ఇబ్బందులు వంటివి ఎప్పటికప్పుడు కనిపెడుతూ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తాయి. తాజాగా అమెరికన్ కంపెనీ ‘ఎమిటెర్మ్’ వాంతులను అరికట్టే యాంటీనాసీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొందరికి బస్సులు, కార్లు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు వికారం మొదలై వాంతులవుతాయి. ఓడల మీద సుదూర ప్రయాణాలు చేసే వారికి, విమానాల్లో ప్రయాణించే వారిలో కొందరికి కూడా ఈ సమస్య ఉంటుంది.మరీ సున్నితమైన వారికి గాలిలో తేడా వచ్చినా, సరిపడని వాసనలు సోకినా వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలా మొదలయ్యే వికారం, వాంతుల నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. ఇకపై మందులతో పని లేకుండా ఈ స్మార్ట్ వాచ్ ధరిస్తే చాలు, ఎలాంటి పరిసరాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వికారం, వాంతులు దరిచేరవని తయారీదారులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ ‘ఎక్స్ప్లోర్’, ‘ఫ్యాషన్’ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతోంది. ‘ఎక్స్ప్లోర్’ మోడల్ ధర 139.99 డాలర్లు (రూ.11,752), ఫ్యాషన్ మోడల్ ధర 86.99 డాలర్లు (రూ.7,302) మాత్రమే!ఈ ప్యాచ్‌ను అతికించుకుంటే చాలు..ఇది బయో వేరబుల్ ప్యాచ్. దీనిని జబ్బ మీద అతికించుకుంటే చాలు, ఒంట్లోని చక్కెర స్థాయి ఎంత ఉందో ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు తెలియజేస్తుంది. దీనిని జబ్బకు తగిలించుకుంటే, ఒంట్లోని చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి వేలికి సూది గుచ్చుకుని, నెత్తుటి చుక్కలు బయటకు తీయాల్సిన పనే ఉండదు. బ్రిటిష్ కంపెనీ ‘అబాట్’ ఈ బయో వేరబుల్ ప్యాచ్‌ను ‘లింగో టీఎం’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. డయాబెటిస్తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా చక్కెర స్థాయిలోని హెచ్చుతగ్గులు ఎప్పడికప్పుడు తెలుస్తుండటం వల్ల ఆహార విహారాల్లోను, వైద్యులను సంప్రదించి మందుల మోతాదుల్లోను మార్పులు చేసుకోవడం తేలికవుతుంది. ఇందులోని సెన్సర్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. దీని ధర 89 పౌండ్లు (రూ.9,538) మాత్రమే! -
ప్రాణం మీదకు తెచ్చిన మౌత్ ఫ్రెష్నర్.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి..
హర్యానాలోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్న అయిదుగురు వ్యక్తులు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏకంగా నోటీలో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రామ్‌లో మార్చి రెండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్‌లోని సెక్టార్ 90లో లాఫోరెస్టా కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అయిదుగురు రెస్టారెంట్‌లోని మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్నారు. అంతే వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మొదలైంది. నోరు మండటం, నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికే రెస్టారెంట్ ఫ్లోర్‌పై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. నోటిని నీటితో శుభ్రం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. రెస్టారెంట్లో ఉన్నవారు ఒకరు దీనిని వీడియో తీశారు. ఇదులో అందరూ నోటి బాధతో ఏడుస్తూ కనిపించారు. ఓ మహిళ తన నోటిలో ఐస్‌ను పెట్టుకోవడం, తన నోరు మండుతోందని పదే పదే చెబుతుండటం వినిపిస్తుంది. వెంటనే కేఫ్‌లోని వ్యక్తులను పోలీసులకు కాల్ చేయమని కోరారు. Five people started vomiting blood and reported a burning sensation in their mouths after eating mouth freshener after their meal at a cafe in Gurugram. They were hospitalized and two are critical. pic.twitter.com/brMnbWbZQW — Waquar Hasan (@WaqarHasan1231) March 4, 2024 అనంతరం పోలీసులు కేఫ్‌కు చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్‌ను వైద్యుడికి చూపంచగా.. అది డ్రై ఐస్ అని డాక్టర్ చెప్పారు. ఇది మరణానికి దారితీసే యాసిడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. குருகுராமில் உள்ள தனியார் உணவகத்தில் Mouth Freshener சாப்பிட்ட 05 பேருக்கு ரத்த வாந்தி ஏற்பட்டதை தொடர்ந்து ஆபத்தான நிலையில் மருத்துவமனையில் அனுமதி. pic.twitter.com/QB4jzeTW5C — Ramesh (@RHoneykumar) March 4, 2024 -
వ్యాయామం చేసి వచ్చాక.. గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్ మజిద్ హుస్సేన్ అలియాస్ జునేద్ (26) గురువారం రాత్రి జిమ్‌లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్‌కోవిడ్ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్ కార్డియాక్ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఎలా? సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. దెబ్బకొడుతున్న జీవన శైలి గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్‌ఫుడ్ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది. -
ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువగా అవుతున్నాయా..?
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్‌సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఒకరకంగా ఈ హర్మోన్ మహిళ దేహానికి ఓ సందేశం ఇస్తుంది. ‘ఇక గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలసరి వచ్చే ప్రక్రియను ఆపేసి, గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రోజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఇమిడి ఉండే ఎండోమెట్రియమ్–యుటెరైన్ పొరలను మరింత మందంగా చేసి, గర్భాన్ని కాపాడమ’ని చెప్పేదే ఈ హెచ్‌సీజీ హార్మోన్. ఇది కొద్దిమందిలో చాలా తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ విడుదల అవుతుంది. ఆ ప్రభావంతో మహిళల్లో వారి వారి శరీర తత్త్వాన్ని బట్టి కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మహిళలు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువ మోతాదులో ఉండే హెవీ ఫుడ్ కాకుండా... చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయే ఆహారం తీసుకుంటూ ఉండటం మేలు. దవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు, గ్లూకోజునీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. మరీ నీరసంగా ఉంటే సెలైన్ ఎక్కించుకోవడం/గ్లూకోజ్ పెట్టించుకోవడం కూడా అవసరం కావచ్చు. అలాంటప్పుడు తప్పనిసరిగా డాక్టర్/గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. చదవండి: Hiccups: ఎడతెరపిలేని ఎక్కిళ్లా.. ఇలా చేయండి..! -
వరుడికి చేదు అనుభవం.. వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు
వాషింగ్టన్: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన మధుర జ్ఞాపకం. వివాహ వేడుకను జీవితాంతం మరచిపోలేని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని కలలు కంటారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక పెళ్లి అంటే బోలేడు పనులు. ఇంట్లో సాయం చేసేవారు ఎవరు లేకపోతే.. పాపం కాబోయే వధువరులే ఆ పనులన్ని చూసుకోవాలి. ఇలా పనుల ఒత్తిడిలో పడి అలసిపోతే.. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ వార్త చదివితే తెలుస్తుంది. ఈ జంటకు ఎదురైన కష్టాలు చూస్తే.. పాపం వీరంత దురదృష్టవంతులు ఈ భూమ్మీద ఇంక ఎవరు లేరనిపిస్తుది. ఆ వివరాలు.. అమెరికా, మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్లు వివాహం చేసుకుందామని భావించారు. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్ని వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. (చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...) మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది. బయట బాగా వేడిగా ఉండటం వల్లనే హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్ ఆన్ని చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్ దగ్గరకు వెళ్లింది. వాడికి అప్పుడే గుర్తొచ్చిందేమో.. పెళ్లి కుమార్తె అని కూడా చూడకుండా.. హోలీ మీద మల విసర్జన చేశాడు. జరిగిన అన్ని సంఘటనలతో హోలీకి ఒకలాంటి విరక్తి కలిగింది. (చదవండి: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!) త్వరగా పెళ్లి తంతు ముగుంచుకుని.. ఆస్పత్రికి వెళ్లింది హోలీ. ఆమెను పరీక్షించిన వైద్యులు.. లో బీపీ, రక్తహీనతతో బాధపడుతుందని.. అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. ఇక విహానికి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ దంపతులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అంటే అందరికి చాలా మంచి అనుభూతులు ఉంటాయి. మాకు ఎదురైన అనుభవాలు తల్చుకుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది. ఇప్పుడే ఇవే సంఘటనలను మా ముందు తరాలకు చెప్పాలి. కనీసం వారు అయినా జాగ్రత్త పడతారు’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..' -
వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!
ఏదైన వ్యాధి వస్తే తొందరగా తగ్గిపోయేంత వరకు మనస్సు ఒక పట్టాన కుదుటపడదు. అలాంటిది కొన్ని అరుదైన వ్యాధులతో పోరాడతూనే మరోవైపు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ చిన్న అవకాశమైన దొరక్కుండా పోతుందా అనే ఆశతో ఎదురుచేసేవాళ్లను చూస్తే చాలా బాధనిపిస్తుంది కదూ. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతోంది. (చదవండి: టెన్నిస్ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి) అసలు విషయంలోకెళ్లితే....బోల్టన్‌కు చెందిన లీన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటూ అరుదైన పరిస్థితితో జీవితాన్ని గడుపుతోంది. పైగా ఆమె నిరంతర వికారం కడుపు నొప్పి కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఆమె ఈ సమస్య కారణంగా ఏమి తినలేక జీర్ణించకోలేక అత్యంత బాధను అనుభవిస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తొలిసారిగా 2008లో గుర్తించడమే కాక గ్యాస్ట్రోపరేసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెకు గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే ఆ పరికరానికి సంబంధించిన బ్యాటరీ అయిపోవడంతో పరిస్థితి మళ్లీ యథావిధికి వచ్చేసింది. పైగా ఆ బ్యాటరీలు చాలా అరుదుగా లభిస్తాయని, వాటిని మార్చడం కోసం దగ్గర దగ్గరగా సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఆమె ఈ వ్యాధి కారణంగా ఉద్యోగానికి దూరమవ్వడమే కాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె తను ఏవిధంగానైన తన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్ కొత్తబ్యాటరీ కోసం కావల్సిన డబ్బుల నిమిత్తం "గో ఫండ్ మీ" అనే వెబ్‌పేజీ ఓపెన్ చేసి తన శస్త్రచికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో తనకు ఎవరైనా సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఆ వెబ్‌పేజ్‌కి సుమారు రూ. 3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. ఏది ఏమైన ఆమె ఆశావాహదృక్పథానికి అభినందిస్తూ...లీన్నే శస్త్ర చికిత్సకు కావల్సిన డబ్బులు సమకూరి త్వరితగతిన ఆ అరుదైన వ్యాధి నుండి బయటపడాలని ఆశిద్దాం. (చదవండి: అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) -
వాంతికి వచ్చినట్లు ఉందా? వీటిని తిన్నారంటే వెంటనే..
కడుపులో వికారంగా, వాంతికొచ్చేటట్లు ఉంటే అలసటగా అనిపిస్తుంది. ఏపని చేయడానికి శరీరం సహకరించదు. అప్పటికే ఆనారోగ్యంతో ఉంటే ఇక స్థిమితంగా ఉండలేం.. ఈ పరిస్థితి మనలో చాలా మందికీ అనుభవమే! ఐతే వంటింటి చిట్కాలతో ఏ విధంగా దీని నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో మీకోసం.. పుదీనా తాజా పుదీనా ఆకులు నమలడం ద్వారా డోకు లేదా వాంతిని నివారించవచ్చు. పుదీనా ఘాటైన రుచి కడుపులోని వికారాన్ని తొలగించి సేదతీరేలా ప్రేరేపిస్తుందని హెల్త్ కోచ్, నూట్రీషనిస్ట్ శిల్పా ఆరోరా సూచించారు. అల్లం పొట్టలోని చికాకును ఉపశమింపచేయడంలో అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. దంచిన అల్లంను నీళ్లలో కలిపి తాగితే వాంతిని నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు డా. బీఎన్ సిన్హా తెలిపారు. కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లలోని అధిక పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. కప్పు కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతి 15 నిముషాలకొకసారి తాగితే కడుపులో వికారం తొలగిపోతుందని డా. వసంత్ లాద్ రాసిన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడిస్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. లవంగం ఇది మన తాతముత్తాతల కాలం నుంచి చెబుతున్నదే! లవంగం మొగ్గలను నమలడం ద్వారా వాంతిని నివారించవచ్చు. లవంగం రుచి, సువాస వికారాన్ని తొలగిస్తుంది. సోంపు గింజలు భోజనం తర్వాత సోంపు గింజలు నోటిలో వేసుకుంటే నోటిని తాజాగా ఉంచడమేకాకుండా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సోంపు గింజలను నమిలినా లేదా వీటితో తయారుచేసిన టీ తాగినా కడుపులో వికారాన్ని నివారించి, వాంతికి రాకుండా అడ్డుకుంటుంది. యాలకులు యాలకులు కూడా వాంతిని నిరోధించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం యాలకుల విత్తనాలను నమలడం వల్ల వాంతివికారాలను నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తేనెతో కలిపి కూడా యాలకులను తినొచ్చు. నిమ్మరసం ఆమ్లాలను తటస్థీకరించి లేదా స్వభావం కోల్పోయేలా ప్రేరేపించి, బైకార్బొనేట్స్ విడుదలయ్యేలా చేయడంలో నిమ్మరసం బెస్ట్. బైకార్బొనేట్స్ వాంతివికారాలను నివారించే గుణం కలిగి ఉంటాయి. కేవలం వాంతి నుంచి ఉపశమింపచేయడమేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. చదవండి: Kolkata Rasgulla: ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.! -
పిల్లలు ఏం చేసినా వాంతులవుతున్నాయా?
కొంతమంది పిల్లలకు తరచూ వాంతులు అవుతుంటాయి. వాళ్లు కడుపునిండా తిన్నతర్వాత లేదా విపరీతంగా నవ్వినా, ఆడినా, పరుగెత్తినా వాంతులు కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అది ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్’ అనే కండిషన్ వల్ల కావచ్చు. ఈ కండిషన్ ఉన్న పిల్లల్లో లోయర్ ఈసోఫేగస్ కింది భాగంలోని స్ఫింక్టర్ కండరాలు (గట్టిగా పట్టి ఉంచే కండరాలు) కొంచెం వదులుగా ఉంటాయి. దాంతో కడుపులో ఉన్న ద్రవాలు (యాసిడ్ కంటెంట్స్) కడుపు నుంచి ఈసోఫేగస్ వైపునకు నెట్టినట్లుగా పైకి తన్నుకుంటూ వస్తాయి. అలా కడుపులోని ద్రవాలు పైకి తన్నడాన్నే ‘రిఫ్లక్స్’ అంటారు. దాంతో ఇలా వాంతులు అవుతుంటాయి. చాలామంది చిన్నపిల్లల్లో ఈ రిఫ్లక్స్ ఎంతోకొంత కనిపిస్తుంటుంది. ఈ రిఫ్లక్స్ తీవ్రంగా ఉన్నవాళ్లలో పుట్టిన మొదటి 10 రోజుల్లో /ఆరు వారాల్లో బయటపడతాయి. రెండేళ్ల వయస్సు వచ్చేనాటికి ఈ సమస్య చాలామంది పిల్లల్లో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొద్దిమంది పిల్లల్లో మాత్రం ఇది పెద్దయ్యాక కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఈ రిఫ్లక్స్ తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గుతూ ఉండటం, ఆస్తమా, నిమోనియా, ఎదుగుదలలో లోపాలు (గ్రోత్ రిటార్డేషన్), ఈసోఫేగస్‌లో స్ట్రిక్చర్ వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఇవే లక్షణాలతో ‘హయటస్ హెర్నియా’ అనే కండిషన్ మరో సమస్య కూడా కనిపిస్తుంటుంది. పెద్దవాళ్లలోనూ ఉండవచ్చు... కొందరు పెద్దవాళ్లలోనూ ఈ రిఫ్లక్స్ సమస్య ఉంటుంది. మరీ ముఖ్యంగా ఊబకాయం (ఒబేసిటీ) ఉన్నవాళ్లలో ఇది ఎక్కువ. అలాగే కాఫీలు, సిగరెట్లు ఎక్కువగా తాగడం, తరచూ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారిలో ఇది ఎక్కువ. (చదవండి: కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?) భోజన ప్రియులైన కొందరిలో భోజనం ఎక్కువ పరిమాణంలో తీసుకున్న తర్వాత, అందునా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఈ రిఫ్లక్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని సరిపడని మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మరికొంతమంది కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)లో ఈ సమస్య ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యుల్లోనూ ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు బేరియం ఎక్స్‌రే, 24 గంటల పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసి, తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఎక్స్–రేలో ఇది బయటపడే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనిపించే దీని స్వభావంతో ఒక్కోసారి ఇది ఎక్స్–రేలో కనిపించకపోవచ్చు. మేనేజ్మెంట్ / చికిత్స చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. అయితే వాంతులు కావడం ఎక్కువగా ఉంటే ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్ డ్రగ్స్ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం వల్ల చాలా మటుకు ఉపశమనం ఉంటుంది. దీంతోపాటు భోజనం చేసిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కలిగించే) యాక్టివిటీస్ అవాయిడ్ చేయడం వంటివి చేయాలి. అయితే అరుదుగా కొందరిలో ఈ సమస్యను ‘ఫండోప్లెకేషన్’ అనే ఆపరేషన్ ద్వారా సరిచేయాల్సి రావచ్చు. కానీ అది చాలా అరుదు. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్పీడియాట్రీషియన్ -
ప్రయాణాల్లో వాంతులకు అల్లంతో కళ్లెం
ప్రయాణాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు? అయితే కొందరు బస్సు ఎక్కాలంటే.. వాంతులు అవుతాయేమోనని భయపడతారు. మలుపులు, లోయలు ఉన్న రహదారుల్లో అయితే మరీ భయం. బస్సు ఎక్కుతూనే నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని, కిటికీ పక్కన కూర్చుంటారు. ప్రయాణాల్లో ఇలాంటి వాంతులు రాకుండా మందులే లేవా ? ఈ సమస్య కు చక్కటి ఆయుర్వేద చిట్కా ఉంది. ఇలా దూర ప్రయాణాలు చేసే వాళ్లు ఒక అల్లం ముక్కను పట్టుకెళ్లాలి. బస్సు ఎక్కుతూనే అల్లం ముక్కను బుగ్గన పెట్టుకోవాలి. అల్లం రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావనను తగ్గిస్తుంది. అల్లంలోని ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, జింక్, కాపర్ వంటివన్నీ శరీరానికి అందుతాయి. ఒకరకంగా ఇది మందులాగా పనిచేస్తుంది. మరోవైపు అల్లం వల్ల చక్కటి ఆకలి కలుగుతుంది. గొంతులో నస తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నా తగ్గుతాయి. కఫ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా ఒకసారి అలవాటు చేసుకుని చూడండి. వాంతులకు కళ్ళెం వేయొచ్చు. -
టేస్ట్‌బడ్స్ కంటే లాలాజలం ప్రభావమే ఎక్కువ...
ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే మన రుచిమొగ్గల (టేస్ట్‌బడ్స్)తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. రుచి తెలిపేవి రుచిమొగ్గలే అయినప్పటికీ నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. అది ఎలాగంటే... మనం తిన్న పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్‌బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. అందుకే మనం నమలడం మొదలుపెట్టిన కొద్దిసేపటి తర్వాత రుచి ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంటుంది. అన్నట్టు... మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. వామిటింగ్కు దోహదపడే లాలాజలం! వాంతి కావడం (వామిటింగ్) అనే ప్రక్రియకు లాలాజలం దోహదపడుతుంది. అసలు వాంతి ఎలా జరుగుతుందో, దానికి లాలాజలం ఎందుకు దోహదపడుతుందో చూద్దాం. వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు లాలాజలం చాలా ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో పొట్ట భాగంలో అది సరిగా జరగనప్పుడు వాంతి (వామిటింగ్) అనే చర్య ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట. -
ఎయిర్ ఏషియా విమానంలో వాంతులు, ఏడుపులు..
-
ఎయిర్ ఏషియా విమానంలో వాంతులు, ఏడుపులు..
గువాహటి : ఎయిర్ ఏషియా విమానంలో కోల్‌కతా నుంచి బగ్డోగ్రాకు బయల్దేరిన ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాన్ని దాదాపు నాలుగు గంటల పాటు నిలిపివుంచి ఆ తర్వాత దించివేయడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణీకులు ఎయిర్‌లైన్ స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(పశ్చిమ బెంగాల్) దీపాంకర్ రే సైతం ఎయిర్ లైన్ స్టాఫ్ ప్రయాణీకులతో మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. ఉదయం 9 గంటలకు బయల్దేరాల్సిన విమానం తొలుత 30 నిమిషాల పాటు ఆలస్యమైందని తెలిపారు. అనంతరం 2 గంటలకు పైగా విమానంలోనే ఉంచారని వెల్లడించారు. వెయిటింగ్ సమయంలో ఎయిర్‌లైన్ స్టాఫ్ ప్రయాణీకులకు కనీసం నీరు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఆ తర్వాత విమానం కెప్టెన్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణీకులందరినీ దిగిపోమ్మని అన్నారని వివరించారు. బయట విపరీతంగా వర్షం కురుస్తుండటంతో ప్రయాణీకులు ఎవరూ దిగటానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. దీంతో కోపగించుకున్న కెప్టెన్ ప్రయాణీకులు దిగిపోవడానికి ఎయిర్ కండిషనర్ను విపరీతంగా పెంచేశారని చెప్పారు. దీంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారని, కొందరు వాంతులు చేసుకున్నారని, పిల్లలు బిగ్గర ఏడుపు ప్రారంభించారని తెలిపారు. చాలా మంది శ్వాస ఆడక విమానం నుంచి కిందికి దిగిపోయారని దీపాంకర్ వివరించారు. కాగా, విమానం ఆలస్యం కావడంపై ఎయిర్ ఏషియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాలుగున్నర గంటల పాటు ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది. -
మంచం పట్టిన లచ్చాపేట
మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట గ్రామంలో ఉన్నట్టుండి వందలాది మం ది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు, విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇన్చార్జి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఆదివారంనుంచి వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగి ఉం టుందని భావించారు. రోజురోజుకు జ్వరపీడితులు పెరుగుతుండడంతో ఆందో ళన చెందుతున్నారు. మంగళవారానికి యాభై మంది అస్వస్థతకు గురికాగా.. బుధవారానికి వారి సంఖ్య 436కు చేరింది. దీంతో వైద్యాధికారులు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 38 మందిని మాచారెడ్డి పీహెచ్‌సీకి, 16 మందిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, కలెక్టర్ లచ్చాపేటలో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం అర్ధరాత్రి గ్రామాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన, పరిస్థితి తెలుసుకున్నారు. బుధవారం కలెక్టర్ సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ రాధ మ్మ, ఎక్సైజ్ సీఐ ఫణీందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్ శ్యామల గ్రామా న్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గ్రామంలో పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. కల్లు, నీటి నమూనాలను సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల అనంతరం కల్తీకల్లుతోనా, కలుషిత నీటితోనా అన్న విషయం తేలుతుందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. వాంతులు, విరోచనాలు అయ్యాయి నాకు సోమవారం నుంచి వాంతులు, వీరేచనాలు అవుతున్నాయి. జ్వరం వచ్చింది. దీంతో ప్రైవేట్ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాను. మళ్లీ మంగళవారం వాంతులు, వీరేచనాలు ఎక్కువయ్యాయి. గ్రామంలోని వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నాను. – జగన్, బాధితుడు, లచ్చాపేట పరిస్థితి నిలకడగా ఉంది లచ్చాపేటలో వాంతులు, వీరేచనాలు, జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. అందరి పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి స్థానిక వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నాం. కొంతమందిని మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరికొందరిని ఏరియా ఆస్పత్రికి తరలించాం. నీటి శాంపిళ్లు సేకరిస్తున్నాం. దేనివల్ల ఇలా అయ్యిందనేది పరీక్షల తర్వాత తెలుస్తుంది. – చంద్రశేఖర్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో -
అతిసారంతో 41 మందికి అస్వస్థత
దుర్కి (బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఏఎన్ఎం ఇచ్చిన సమాచారంతో బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలిప్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని అత్యవసర వైద్యశిబిరం నిర్వహించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ చావిడి, సబ్సెంటర్లలో పరీక్షించి ప్రత్యేక చికిత్సలు అందించారు. గ్రామంలో డయేరియా వ్యాపిస్తోందని తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య, జిల్లా స్పెషల్ డాక్టర్ రాజేష్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
విష జ్వరంతో మహిళ మృతి
నర్మెట : తీవ్రమైన విషజ్వరంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట మండలం అక్కరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రె గంగవ్వ(50) విషజ్వరంతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదివారం రాత్రి వాంతులు చేసుకుంది. తెల్లవారాక ఆస్పత్రికి తీసుకెళ్దామని కుటుంబసభ్యులు భావించారు. కానీ తెల్లవారేసరికే గంగవ్వ మృతి చెందింది. ఆమెకు వికలాంగుౖyð న భర్త ఎల్లయ్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘మధ్యాహ్నం’ అధ్వానం..!
♦ అధికారుల పర్యవేక్షణలోపమే కారణం ♦ ఆకలితో తింటే ఆస్పత్రుల పాలవుతున్నవైనం మెదక్ : మధ్యాహ్న భోజనం అధికారుల పర్యవేక్షణలోపంతో అధ్వానంగా మారింది. ఫలితంగా భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో మొత్తం 3వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5లక్షల మేర విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మధ్యాహ్న భోజనంపై అధికారులు పర్యవేక్షణ పెట్టకపోవడంతో విద్యార్థులు నిర్వాహకులు వండిందే తినాల్సి వస్తోంది. కాగా గత పది రోజుల క్రితం మెదక్ మండల పరిధిలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 60మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలయ్యారు. అలాగే చిన్నశంకరంపేట మండల దర్పల్లి ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం తిన్న 15మంది చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానమైన భోజనం పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలమీదకు వస్తోంది. ఈ రెండు సంఘటనలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరగడంతో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామంటూ ప్రచారంచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఏమాత్రం పరిశీలించడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆస్పత్రి పాలుకాగా ఆ మరుసటి రోజు అధికారులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ముక్కిపోయి పురుగులతో ఉండలుకట్టిన బియ్యంతో వం టచేసి పిల్లలకు పెట్టడంతో వాంతులు, విరేచనాలైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే చిన్నశంకరంపేట మండలం దర్పల్లి ఉన్నత పాఠశాలలో సైతం నాణ్యతలేని వంటనూనె వాడటం వల్లే విద్యార్థులకు దద్దుర్లు వచ్చినట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు నెలనెలా బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో వంట నిర్వాహకులు నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వండి పెడుతుండటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నెలనెలా వంట నిర్వాహకుల బిల్లులను చెల్లిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు
ఆస్పత్రి పాలవుతున్న పెద్దేముల్ ప్రజలు పట్టించుకోని అధికారులు పెద్దేముల్: మండలంలో వాంతులు విరేచనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరుగురు వ్యక్తులు వాంతులు, విరేచనాలకు గురై బుధవారం ఆస్పత్రి పాలయ్యారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన ఉప్పరి మాణెమ్మ (35), బ్యాగరి పార్వతమ్మ (45), నూర్జహాన్ (20), తలారి నర్సమ్మ (50), నర్కీన్ (20)తో పాటు గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ (28) వాంతులు విరేచనాలతో పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు సుమారు ఏడెనిమిది మంది వరకు ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఠంచనుగా అదే టైమ్‌కు వాంతులు!
మెడిక్షనరీ ఈ వాంతులు ఎందుకు అవుతాయో తెలియదు. కారణం ఏమిటో అర్థం కాదు. కాసేపు వాంతులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లేదంటే వికారంగానైనా ఉంటుంది. అలా కొన్ని గంటలు గడిచాక... మళ్లీ అంతా హాయిగా ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా రోజూ అదే టైమ్‌కు వాంతులు అవుతుంటాయి. క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సమయం పాటు అవుతాయి. అంతేకాదు... ఆ వాంతుల తీవ్రత కూడా అంతే సమానంగా ఉంటుంది. ఇలాంటి చిత్రమైన లక్షణం ఉన్న జబ్బు పేరే... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. కొందరు పెద్ద వయసు వారలోనూ కనిపిస్తుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ. ఇదమిత్థంగా చికిత్స లేకపోయినా... అవసరాన్ని బట్టి శరీరంలో లవణాలు లోపిస్తే సెలైన్ పెట్టడం వంటివి చేస్తారు. ఈ జబ్బు ఉన్నవారికి జీవనశైలిలో మార్పులను సూచిస్తారు. వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన ‘యాంటీ-ఎమెటిక్’ డ్రగ్స్‌తో చికిత్స చేస్తారు. -
భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ : మధ్యాహ్నం భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన సదరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి... వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తాగని తాగుబోతు!
‘‘మేని తీరు చూడ ముచ్చటగా ఉండు... పొట్ట విప్పి చూడ ఆల్కహాలుండు?’’అంటూ సరికొత్త పద్యాలు పాడుతున్నారు నిక్ హెస్ గురించి తెలిసిన వాళ్లు. చూడడానికి చక్కగా కనిపించే నిక్హెస్కు. గత కొంత కాలంగా అతిగా ఆల్కహాల్ తీసుకున్నట్టు అనిపించడం, తరచుగా వామిటింగ్, కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. టివీ చూస్తూ ఫ్రెంచ్‌ఫ్రైస్ (బంగాళా దుంపల చిప్స్) తిన్న కాసేపటికే నోరు మద్యం వాసన రావడంతో నిక్ భార్య కరేన్ డా సైతం భర్త తనకు తెలీకుండా ఎక్కడో బాటిల్ పెట్టి అబద్ధాలు చెబుతున్నాడని భావించేది. సన్నిహితులూ నిక్ గజ తాగుబోతనే అనుకున్నారు. ఇలా కాదనుకున్న నిక్ భార్య... భర్తకు తెలీకుండా కొన్ని రోజుల పాటు అతడి దినచర్య మొత్తాన్ని షూట్ చేశాక, తన భర్త తాగని తాగుబోతు అని నిర్ధారించుకుంది. దీంతో వెంటనే నిక్ని మెడికల్ చెకప్స్‌కు తీసుకెళితే... అతని దేహంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని, అతను తీసుకుంటున్న హై కార్బొహైడ్రేట్స్ ఆల్కహాల్‌ను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయని వైద్యులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతానికి దీనికి ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్’ అంటూ పేరు పెట్టారు. ‘‘తిన్నావా ఫుల్లు మీల్... నీ బాడీ కాదా విస్కీ బాటిల్?’’ అని హెచ్చరిస్తూన్న వైద్యులు నిక్ సుష్టుగా భోజనం చేసిన తర్వాత దాదాపు ఏడు పెగ్గుల విస్కీతో సమానమైన ఆల్కహాల్ తయారవుతోందని చెబతున్నారు. ప్రస్తుతం నిక్కి యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇస్తూ, లో కార్బ్-డైట్ సూచిస్తూ... అతని పరిస్థితిని దారిలో పెడుతున్నారు. -
వణుకుతున్న నవాబుపేట
- హడలెత్తిస్తున్న డయేరియా - నాలుగు రోజుల్లో ఇద్దరు మృతి - ఆస్పత్రిలో మరో నలుగురు - మెడికల్ క్యాంపు ఏర్పాటుకు డిమాండ్ మెదక్ మున్సిపాలిటీ : పట్టణంలోని నవాబుపేట వీధి ప్రజలు వాంతులు, విరేచనాలతో వణికిపోతున్నారు. నాలుగు రోజుల్లో ఇదే పరిస్థితులు ఎదుర్కొంటూ ఇద్దరు మృత్యువాత పడగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం నవాబుపేట వీధికి చెందిన బొందుగుల రవి, సునీత దంపతుల కుమార్తె పల్లవి (4) తీవ్ర వాంతులు, విరేచనాలకు గురైంది. దీంతో తల్లిదండ్రులు పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా వారు చేర్చుకోకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఐదు నిమిషాల్లోనే చిన్నారి మృత్యువాత పడింది. ఇదే వీధికి చెందిన గట్టయ్య (50) నాలుగు రోజుల క్రితం తీవ్ర వాంతులు, విరేచనాలకు గురై మృతి చెందాడు. గురువారం మృతి చెందిన పల్లవి అన్నయ్య మహేష్, వీఆర్ఓ మాణయ్యతో పాటు మరో ఇద్దరు మహిళలు సైతం వాంతులు, విరేచనాలకు గురి కాగా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసే నీటిని తాగడం వల్లే రోగాల బారిన పడుతున్నట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వార్డులో మెడికల్ క్యాంపు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి : డీసీహెచ్, డాక్టర్ ఆశీర్వాదం వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడం, సరైన సమయంలో వైద్యం అందక పోవడంతోనే చిన్నారి పల్లవి మృతి చెందిందని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డీసీహెచ్ డాక్టర్ ఆశీర్వాదం తెలిపారు. గురువారం చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చే లోపే పరిస్థితి విషమించిందన్నారు. చిన్నారికి జ్వరం లాంటి లక్షణాలు లేకపోవడం, కేవలం వాంతులు, విరేచనాలు కావడంతో డయేరియాగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాంతులు, విరేచనాలు అవ్వగానే వైద్యులను సంప్రదించాలన్నారు. -
ప్రసాదం తిన్న భక్తులు... పరిస్థితి విషమం
పాట్నా: దేవాలయంలో దేవుని ప్రసాదం తిని 95 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని భద్రపూర్ బ్లాక్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎప్పటిలాగే స్థానిక దేవాలయంలో దేవుడ్ని భక్తులు సందర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవాలయ ప్రతినిధులు ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రసాదం తిన్న భక్తులు వెంటనే కడుపులోనొప్పి అంటూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో దేవాలయం యాజమాన్యం భక్తులను హుటాహుటిన దర్బంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 95 మందిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రపూర్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనారోగ్యం పాలైన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్దులు ఉన్నారని ఉన్నతాధికారి తెలిపారు. -
కుదిపేసిన అతిసార
- గువ్వలదిన్నెలో బాలుడి మృతి - మరో 20 మందికి తీవ్ర అస్వస్థత - గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ ధరూరు: మండలంలోని గువ్వలదిన్నె గ్రామాన్ని అతిసారవ్యాధి కుదిపేసింది. సోమవారం వాంతులు, విరేచనాలతో ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. మరో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు భయాందోళనతో ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామానికి చెందిన వీరన్న, ఆదమ్మల కొడుకు నవీన్(9) గత రెండురోజులుగా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. మొదట ఆర్ఎంపీకి చూపించగా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కర్ణాటకలోని రాయిచూరు ఆస్పత్రికితీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు నవీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురైన ఉసెనప్పగౌడ్, పద్మమ్మ, జ్యోతి, మల్లేష్‌గౌడ్‌తో పాటు మరో నలుగురిని చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యధికారులు గ్రామానికి చేరుకుని వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఆర్డీఓ సందర్శన.. విషయం తెలుసుకున్న గద్వాల ఆర్డీఓ భిక్షానాయక్, ఇన్చార్జి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్సింహనాయుడు, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ బషీర్ తదితరలు గ్రామానికి చేరుకుని సమీక్షించారు. తాగునీటి పైప్‌లైన్‌కు గ్రామానికి చెందిన రైతులు కొందరు డ్రిప్ పైపులను అమర్చి నీటిని అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఆ డ్రిప్‌పైపులు అమర్చిన ప్రాంతాల్లో నిలిచిన నీరు తిరిగి తాగునీటి పైపుల్లోకి వెళ్లడంతో తాగునీరు కలుషితమైనట్లు గుర్తించారు. ఏడాదికాలంగా ట్యాంకును శుభ్రం చేయడం లేదని..కలుషితనీటినే తాగుతున్నామని స్థానికులు వాపోయారు. రోగులకు మెరుగైన వైద్యం - ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డీకే అరుణ వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వలదిన్నె వాసులను ఆమె సోమవారం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అతిసార ప్రబలుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆర్డీఓ భిక్షానాయక్కు సూచించారు. అతిసార మరింతగా విజృంభించకుండా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శంకర్, తిమ్మన్న, భాస్కర్‌యాదవ్ ఉన్నారు.