ప్రయాణాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు? అయితే కొందరు బస్సు ఎక్కాలంటే.. వాంతులు అవుతాయేమోనని భయపడతారు. మలుపులు, లోయలు ఉన్న రహదారుల్లో అయితే మరీ భయం. బస్సు ఎక్కుతూనే నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని, కిటికీ పక్కన కూర్చుంటారు. ప్రయాణాల్లో ఇలాంటి వాంతులు రాకుండా మందులే లేవా ? ఈ సమస్య కు చక్కటి ఆయుర్వేద చిట్కా ఉంది. ఇలా దూర ప్రయాణాలు చేసే వాళ్లు ఒక అల్లం ముక్కను పట్టుకెళ్లాలి.
బస్సు ఎక్కుతూనే అల్లం ముక్కను బుగ్గన పెట్టుకోవాలి. అల్లం రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావనను తగ్గిస్తుంది. అల్లంలోని ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, జింక్, కాపర్ వంటివన్నీ శరీరానికి అందుతాయి. ఒకరకంగా ఇది మందులాగా పనిచేస్తుంది. మరోవైపు అల్లం వల్ల చక్కటి ఆకలి కలుగుతుంది. గొంతులో నస తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నా తగ్గుతాయి. కఫ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా ఒకసారి అలవాటు చేసుకుని చూడండి. వాంతులకు కళ్ళెం వేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment