నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
అతిసారంతో 41 మందికి అస్వస్థత
Aug 9 2016 11:04 PM | Updated on Sep 4 2017 8:34 AM
దుర్కి (బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఏఎన్‌ఎం ఇచ్చిన సమాచారంతో బీర్కూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలిప్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని అత్యవసర వైద్యశిబిరం నిర్వహించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ చావిడి, సబ్‌సెంటర్‌లలో పరీక్షించి ప్రత్యేక చికిత్సలు అందించారు. గ్రామంలో డయేరియా వ్యాపిస్తోందని తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య, జిల్లా స్పెషల్ డాక్టర్ రాజేష్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Advertisement
Advertisement