వాంతులను అరికట్టే స్మార్ట్‌వాచ్‌ను.. ఎప్పుడైనా వాడారా! | Have You Ever Used A Smartwatch That Prevents Vomiting | Sakshi
Sakshi News home page

వాంతులను అరికట్టే స్మార్ట్‌వాచ్‌ను.. ఎప్పుడైనా వాడారా!

Published Sun, Aug 25 2024 10:20 AM | Last Updated on Sun, Aug 25 2024 10:20 AM

Have You Ever Used A Smartwatch That Prevents Vomiting

ఇప్పటి వరకు చాలా స్మార్ట్‌వాచ్‌లు వాడుకలోకి వచ్చాయి. వీటిలో కొన్ని గుండెలయ, రక్తపోటు, శ్వాసతీరు, నిద్రలో ఇబ్బందులు వంటివి ఎప్పటికప్పుడు కనిపెడుతూ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తాయి. తాజాగా అమెరికన్‌ కంపెనీ ‘ఎమిటెర్మ్‌’ వాంతులను అరికట్టే యాంటీనాసీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొందరికి బస్సులు, కార్లు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు వికారం మొదలై వాంతులవుతాయి. ఓడల మీద సుదూర ప్రయాణాలు చేసే వారికి, విమానాల్లో ప్రయాణించే వారిలో కొందరికి కూడా ఈ సమస్య ఉంటుంది.

మరీ సున్నితమైన వారికి గాలిలో తేడా వచ్చినా, సరిపడని వాసనలు సోకినా వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలా మొదలయ్యే వికారం, వాంతుల నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. ఇకపై మందులతో పని లేకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌ ధరిస్తే చాలు, ఎలాంటి పరిసరాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వికారం, వాంతులు దరిచేరవని తయారీదారులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ‘ఎక్స్‌ప్లోర్‌’, ‘ఫ్యాషన్‌’ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతోంది. ‘ఎక్స్‌ప్లోర్‌’ మోడల్‌ ధర 139.99 డాలర్లు (రూ.11,752), ఫ్యాషన్‌ మోడల్‌ ధర 86.99 డాలర్లు (రూ.7,302) మాత్రమే!

ఈ ప్యాచ్‌ను అతికించుకుంటే చాలు..
ఇది బయో వేరబుల్‌ ప్యాచ్‌. దీనిని జబ్బ మీద అతికించుకుంటే చాలు, ఒంట్లోని చక్కెర స్థాయి ఎంత ఉందో ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌కు తెలియజేస్తుంది. దీనిని జబ్బకు తగిలించుకుంటే, ఒంట్లోని చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి వేలికి సూది గుచ్చుకుని, నెత్తుటి చుక్కలు బయటకు తీయాల్సిన పనే ఉండదు. బ్రిటిష్‌ కంపెనీ ‘అబాట్‌’ ఈ బయో వేరబుల్‌ ప్యాచ్‌ను ‘లింగో టీఎం’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. డయాబెటిస్‌తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా చక్కెర స్థాయిలోని హెచ్చుతగ్గులు ఎప్పడికప్పుడు తెలుస్తుండటం వల్ల ఆహార విహారాల్లోను, వైద్యులను సంప్రదించి మందుల మోతాదుల్లోను మార్పులు చేసుకోవడం తేలికవుతుంది. ఇందులోని సెన్సర్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. దీని ధర 89 పౌండ్లు (రూ.9,538) మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement