నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్‌లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంట
ప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్‌కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్‌లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్‌లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచి కూర్చోవడం చేయాలి.
మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్‌లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్‌ను కలవాలి.
హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..
హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.
న్యూయార్క్‌లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్‌నెస్ çసమిట్‌లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.
ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
Comments
Please login to add a commentAdd a comment