మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! | This Facial Enhancement Device Is A Real Beauty Tool | Sakshi
Sakshi News home page

మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం!

Published Sun, Sep 29 2024 5:50 AM | Last Updated on Sun, Sep 29 2024 5:50 AM

This Facial Enhancement Device Is A Real Beauty Tool

ముఖ వర్చస్సును మెరుగుపరచే ఈ పరికరం అందానికి అసలైన సాధనం అంటున్నారు వినియోగదారులు. ఇది కళ్లచుట్టూ ఉండే వాపును, నల్లటి వలయాలను ఇట్టే తగ్గిస్తుంది. వయసుతో వచ్చే చర్మసమస్యలను వేగంగా రూపుమాపుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సౌందర్యాన్ని కోరుకునే మహిళలకు ఇది మంత్రదండం లాంటిది.

అర్గనామిక్‌ డిజైన్‌ ను కలిగి ఉన్న ఈ మెషిన్‌  చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. ట్రీట్‌మెంట్‌కి అనువుగా ఉంటుంది. సుతిమెత్తని శరీరభాగాల్లో సులభంగా మూవ్‌ అవుతుంది. కళ్ల పక్కన ఇరుకైన ప్రదేశాల్లో అటు ఇటు కదిలించి మసాజ్‌ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులోని క్రియోథర్మల్‌ టెక్నాలజీ వల్ల దీనిలో కూలింగ్‌తో పాటు హీటింగ్‌ మోడ్‌ కూడా ఉంటుంది. కోల్డ్‌ ట్రీట్‌మెంట్‌ మోడ్‌ చర్మాన్ని 50నిఊ వరకు చల్లబరుస్తుంది, ఇది రంధ్రాలను బిగించి, ముఖాన్ని కాంతిమంతం చేస్తుంది

ఇక హీట్‌ మోడ్‌ 108నిఊ వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న క్యాప్‌ను తొలగించి, దీని హెడ్‌ను చర్మానికి ఆనించి, మెషిన్‌ ఆన్‌ చేసుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్‌ కలర్‌ హీట్‌ మోడ్‌ను, బ్లూ కలర్‌ కూల్‌ మోడ్‌ను సూచిస్తుంది. ముందే చార్జింగ్‌ పెట్టుకుని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో పలు రివ్యూస్‌ చూసి తీసుకోవడం మంచిది.

ఇవి చదవండి: పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్‌మెంట్‌ వాడాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement