
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి?
– రాధ, శ్రీకాకుళం
ప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్–డి సప్లమెంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.
వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్‌సీజీ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది.
విటమిన్–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్–డి సప్లమెంట్స్ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్‌సీజీ టాబ్లెట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్–ఎ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్ ప్రాడెక్ట్స్‌లో హై విటమిన్–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్‌చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment