‘ఫైట్‌ ఎగైనెస్ట్‌ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే.. | PM Urges Citizens to Continue Fight Against Obesity To Change Fit India | Sakshi
Sakshi News home page

‘ఫైట్‌ ఎగైనెస్ట్‌ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..

Published Sun, Mar 23 2025 7:29 AM | Last Updated on Sun, Mar 23 2025 7:52 AM

PM Urges Citizens to Continue Fight Against Obesity To Change Fit India

మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్‌ ఎగైనెస్ట్‌ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.

అధిక బరువు స్థూలకాయం
శరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 

18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. 

జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. 

ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. 

ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య  ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్‌’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. 

మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అమిత్‌ గర్గ్‌ చెబుతున్నారు.

అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:

  • శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం

  • అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు 

  • దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడం

  • మితిమీరిన ఒత్తిడ

  • ఇతరేతర ఆరోగ్య సమస్యలు

  • జన్యు కారణాలు

  • కొన్ని ఔషధాల దుష్ప్రభావం

చికిత్స పద్ధతులు

  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

  •  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం

  • ఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడం

  • అధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడం

  • స్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడం

స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. 

స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. 

దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య  ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్‌’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 

స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అమిత్‌ గర్గ్‌ చెబుతున్నారు.

మన దేశంలో స్థూలకాయం తీవ్రత
మన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్‌–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; 

చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.

పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరం
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్‌ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్‌ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. 

దీనివల్ల టైప్‌–2 డయాబెటిస్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్‌ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.

ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. 

సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. 

పిల్లల్లో స్థూలకాయం లక్షణాలు
కొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. 

బీఎంఐ  పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.

ఇవీ లక్షణాలు

  • ఒక పట్టాన తగ్గని తలనొప్పి

  • అధిక రక్తపోటు

  • విపరీతమైన దాహం

  • తరచు మూత్రవిసర్జన చేయడం

  • ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు

  •  నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడం

  • వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం

పిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్‌–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్‌ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

(చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)

స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలు
పిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్‌–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. 

స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.
డాక్టర్‌ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడు

స్థూలకాయంపై పోరాటం
దేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్‌ ఎగైనెస్ట్‌ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్‌: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. 

ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఇన్‌ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు  నందన్‌ నీలేకని, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్, ఒలింపిక్స్‌ విజేత, షూటర్‌ మను భాకర్, వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ సాయిఖోమ్‌ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్‌లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. 

‘ఫైట్‌ ఎగైనెస్ట్‌ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

(చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement