obesity problem
-
World Anti-Obesity Day: ఊబకాయం తగ్గేదెలా?
'ప్రస్తుత సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఆరోగ్య సమస్యల్లో ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. మారుతున్న జీవన విధానంలో ఆహార అలవాట్లు మారుతుండటం ఊబకాయం (ఒబెసిటీ) వ్యాధికి కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణం. పెద్దలతో పాటు చిన్నారులు ఊబకాయం బారినపడడం ఆందోళన కల్గిస్తుంది. ఈనెల 4న ప్రపంచ ఊబకాయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న కథనం'. సమస్య ఇలా.. పెద్దవారితో సహా, చిన్నపిల్లలు 20 శాతం ఈ ఊబకాయం వ్యాధి బారినపడుతున్నారు. నెయ్యి, డాల్డా, నూనె అధిక మోతాదులో కలిసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినటంతో రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఊబకాయ బాధితుల్లో 40 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు వీరిని పట్టిపీడిస్తున్నాయి. పక్షవాతం, నరాల సమస్యలు వంటివి దారితీస్తున్నాయి. గత పదేళ్లలో ఆహార అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల చిన్నారుల్లో ఊబకాయ సమస్య తీవ్రంగా ఉంది. ముందు జాగ్రత్తలు.. సమతుల్యమైన ఆహారపు అలవాట్లు రోజు తీసుకోవాలి. వ్యాయమాన్ని కొనసాగిస్తే బరువు పెరగకుండా కాపాడుకోగలుగుతాం. ఒబెసిటీకి గురయ్యాక చేసే వర్కవుట్ల కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ బి.రవికుమార్, ఎండీ, జనరల్ మెడిసిన్, నిర్మల్ వ్యాయమాలు చేయాలి.. చాలామంది ఒబెసిటీకి గురవుతుంటారు. మొదటి నుంచే బరువు పెరుగకుండా సమతుల్యత పాటిస్తే ఊబకాయాన్ని కచ్చితంగా నివారించవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, రోజు వ్యాయమాలు చేయాలి. – ఎండపల్లి అశోక్ కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు, నిర్మల్ జాగ్రత్తలు ఇవే.. ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఉపవాసం చేయాలి. 20 ఏళ్లు దాటినవారు ప్రతీరోజు 2,500 కేలరీలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్న ఈ కేలరీలు దాటకుండా చూసుకోవాలి. మిగిలిన రెండు రోజుల్లో కేవలం పావు వంతు అంటే 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి. కార్పొహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలతోపాటు అన్నానికి బదులు రాగి, జొన్న, చేపలు, చికెన్ తీసుకోవాలి. కాఫీ టీ తీసుకోవచ్చు. తరచూ నీటిని తాగుతూ ఉండాలి. ఇవి చదవండి: మగపిల్లల పెంపకం! -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పట్టణ/నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జనాభాలోని పలు వర్గాల నుంచి సమాచారం సేకరించి జరిపిన ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియంట్స్’లో ప్రచురితమయ్యాయి. వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయుల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8317 మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన వారు. మధుమేహం, రక్తపోటు సమస్యలూ... నగర ప్రాంతాల్లో దాదాపు 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతూండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. పల్లెల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య తెలంగాణ నగర ప్రాంతాల్లో మాదిరిగానే 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు.. అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఆరు శాతం మాత్రమే. ఇరు ప్రాంతాల్లోనూ సమానంగా ఉన్న ఇంకో సమస్య మధుమేహం. హైదరాబాద్, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో 5 శాతం చొప్పున మధుమేహులు ఉన్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో పాల్గొన్న 40 - 59 మధ్య వయస్కుల్లో అధికులు క్లరికల్ ఉద్యోగాల్లో లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉన్న వృత్తుల్లో ఉన్నవారే. ఈ రకమైన వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇతరులతో పాలిస్తే ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. ‘‘అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చు. చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సమరసింహా రెడ్డి తెలిపారు. ‘‘నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయం. పైగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉన్న సూచనలు కనిపించాయి.’’ అని చెప్పారు. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత మాట్లాడుతూ...‘‘విచిత్రమైన విషయం ఏమిటంటే.. పెద్దవాళ్లలో ఊబకాయం, అధిక బరువు సమస్యలుంటే... చిన్నవాళ్లలో పోషకాహార లేమి కనిపించడం. అది కూడా జాతీయ స్థాయి సగటుకు దగ్గరగా ఉండటం విశేషం." అని చెప్పారు. -
ఆకాశ పండు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!
స్కై ఫ్రూట్ మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కనిపరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ (ఆకాశపండు) గొప్పతనం గురించి ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆధునిక వైద్య శాస్త్రంలో, స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది కానప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలలో, అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. స్కైఫ్రూట్ ఎలా ఉపయోగించాలి? మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే, దాన్ని పగలగొట్టి దాని గింజను బయటకు తీయండి. వెచ్చని నీటితో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు. రుచి పరంగా, ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే, పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే, సగం గింజను తినండి. ఇది టాబ్లెట్‌గానూ లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది. “ఉదయం, పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు. గరిష్ట ప్రయోజనాల కోసం, స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలను తాగకుండా ఉండండి. స్కైఫ్రూట్ ప్రయోజనాలు.. “స్కై ఫ్రూట్" అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వాటిలో కొన్ని: చర్మ అలెర్జీకి చికిత్సలా పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఋతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలించుకోవడానికి సహాయపడుతుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్జీమర్స్‌కు చికిత్స చేస్తుంది నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఆకలిని పెంచుతుంది మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది మలేరియాకు చికిత్స చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కణితులతో పోరాడడంలో సహాయపడుతుంది ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది హృదయనాళ వ్యవస్థను మెరుగుపరిచి, రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆర్టెరియోస్క్లెరోసిస్ ఫలకాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్లు.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అదనంగా, స్కై ఫ్రూట్ విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సహజ ప్రోటీన్లు, ఎంజైమ్‌లు తోపాటు వివిధ ముఖ్యమైన పోషకాల విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. స్కైఫ్రూట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు.. స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి. ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం, చీకటి మూత్రం వంటి కాలేయ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే..అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, కామెర్లు వచ్చినా, స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడేముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు వాడి మంచి ప్రయోజనాలను పొందండి. (చదవండి: చూపు లేదు కానీ క్యాన్సర్‌ని గుర్తిస్తారు) -
ఒబెసిటీ క్లినిక్‌ల నిర్వాకం.. కరెంట్ షాక్స్‌తో వాంతులు, కడుపునొప్పి
నగరానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో... కార్ఖానాలోని సదరు క్లినిక్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నగరంలో జేబులు ఖాళీ చేయడంతోపాటు రోగాల పాలు చేస్తున్న వెయిట్ లాస్ క్లినిక్స్ నయామోసాలకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే. సాక్షి, హైదరాబాద్: నగరం ఇప్పుడు ఒబె‘సిటీ’ క్యాపిటల్‌గా మారింది. అధిక బరువుతో బాధపడేవారితో పాటు ఆ బాధను సొమ్ము చేసుకోవాలనుకునే చికిత్సా కేంద్రాలూ పుట్టగొడుగుల్లా పెరిగాయి. కానీ వీటిలో పలు వెయిట్ లాస్ సెంటర్లకు సరైన చికిత్సా విధానం లేదు. సరైన వైద్య నిపుణులు లేరు. దీంతో తోచిన వైద్యం చేస్తున్నారు. రూ.వేలకు వేలు ముందే కట్టించేసుకుంటూ నెలల తరబడి ట్రీట్మెంట్స్ సాగదీస్తున్నారు. వెరసి ఎటువంటి ఫలితం లేకపోగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోనీ పోతే పోయింది డబ్బే కదా అనుకోవడానికి లేదు.. చాలామంది డబ్బుతో పాటు అనారోగ్యాల పాలవుతున్నారు. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 15 కిలోల బరువు తగ్గడానికి 30 ఏళ్ల క్లయింట్ మహేశ్వరి కార్ఖానాలోని కలర్స్ క్లినిక్‌ని ఆశ్రయించింది. దీంతో ఆమెకు గత ఏప్రిల్ 15 నుంచి చికిత్స ప్రక్రియ మొదలైంది, ఆ తర్వాత ఆమెకు క్లినిక్ సిబ్బంది కరెంట్ షాక్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మందులు కూడా ఇచ్చారు. వీటి కారణంగా ఆమెకు తీవ్రంగా వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీని గురించి క్లినిక్ సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే శనివారం ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు క్లినిక్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే? శరీరం కాలిపోయింది... అధిక బరువు తగ్గించే చికిత్స కోసం నగరవాసి గాయత్రి రాణా గచ్చిబౌలిలోని రిచ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్‌కు రూ.3 లక్షలు చెల్లించారు. మూడు నెలల చికిత్స వల్ల కనీసం 1% ప్రయోజనం పొందలేదు. పైగా 30డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ‘మెషినరీ‘ ఉపయోగించడటం వలన చికిత్స సమయంలో తనకు కాలిన గాయాలు సహా ఒంటిపై ఇతరత్రా అనేక గాయాల య్యాయని ఈ విషయాన్ని క్లినిక్‌లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని, సరైన వైద్యం అందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు పై విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల ఫోరం నష్టాన్ని నిర్ధారించి, ఆమె చెల్లించిన రూ.3 లక్షలను 6% వడ్డీతో వాపసు చేయాలని ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,000 చెల్లించాలని క్లినిక్‌ని ఆదేశించింది. వెన్నునొప్పి, చర్మ సమస్యలు.. నగరానికే చెందిన కె.హాసిని యాదవ్ చికిత్స కోసం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ను సంప్రదించారు. తుంటి భాగంలో కొన్ని అంగుళాల కొవ్వు తగ్గించే చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో కనీసం 10–15 కిలోల బరువు తగ్గుతుందని ఆమెను క్లినిక్ నిర్వాహకులు నమ్మించారు. దాంతో ఆమె చికిత్స రుసుముగా రూ.లక్ష చెల్లించారు. నాలుగు నెలలు గడిచినా అంగుళం, బరువు తగ్గలేదని పైగా తనకు కొత్తగా వెన్నునొప్పితో పాటు చర్మ సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. తన తొమ్మిది నెలల చికిత్స సమయంలో, ఫిజియోథెరపిస్ట్‌ని కనీసం ఆరు సార్లు మార్చారని, నేర్చుకోవడానికి ప్రయోగాలు చేయడానికి తనను ఒక మోడల్‌గా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా నష్టపరిహారం ఇవ్వాలని క్లినిక్‌ను ఆదేశించింది. చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జాగ్రత్తలు తీసుకోవాలి ►బరువు తగ్గించుకునే చికిత్సలు అందించే కేంద్రాల్లో ఉన్న నిపుణుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యలు రావని నిర్ధారించుకున్నాక, అది కూడా వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే చికిత్స గురించి ఆలోచించాలి. ►వీలైనంత వరకూ మందులు, కఠినమైన వ్యాయామాలు, మసాజ్‌ల ద్వారా కాకుండా నిదానంగా ప్రారంభించి తగినంత సమయం తీసుకుని బరువు తగ్గే విధానాన్ని ఎంచుకోవాలి. ►ప్రకటనలు, ఆర్భాటాలు చూసి కాకుండా గత చరిత్ర, వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుని క్లినిక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సంప్రదించిన రెండో నిమిషం నుంచే డబ్బులు కట్టమని ఒత్తిడి చేసే క్లినిక్స్‌ను దూరంగా పెట్టడమే మంచిది. -
మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితో పాటు అనారోగ్య కారక జీవనశైలికీ మన నగరం కేంద్రంగా మారుతోంది. ఇక్కడి మహిళల్లో ఒబెసిటీకి కూడా చిరునామాగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఒబెసిటీకి నగరం రాజధానిగా నిలిచింది. దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు పురుషుల కంటే స్త్రీలలో అధిక బరువు/ఊబకాయం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పురుషుల (22.9%) కంటే మహిళలు (24%) ముందున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే ఆధారంగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ నిర్వహించిన అధ్యయనం ఈ అంశాలను తేటతెల్లం చేసింది. పెరుగుదలలో మనం తక్కువే.. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అధ్యయనం ప్రకారం మహిళల్లో అధిక బరువు/ఊబకాయం డేటాను పోల్చినప్పుడు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఒబెసిటీ సంఖ్యలు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, పురుషులిరువురి విషయంలోనూ ఉత్తర భారతం కంటే దక్షిణ భారతమే ముందంజలో ఉంది. పెరుగుదల ప్రకారం చూస్తే.. జాతీయ స్థాయిలో, ఊబకాయం 3.3% పెరగగా, దక్షిణాది రాష్ట్రాల్లో అంతకు మించి వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో 9.5%తో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, వరుసగా 6.9%, 5.7%లతో కర్ణాటక, కేరళ దానిని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 2%తో అత్యల్పంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రంలో సిటీ టాప్... దేశవ్యాప్తంగా 120 జిల్లాలు, మన రాష్ట్రంలో 31 జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. మహిళల్లో ఊబకాయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన జిల్లాలో 51% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. అదే సమయంలో 14%తో అతి తక్కువ ఊబకాయులున్న కుమరంభీం ఆసిఫాబాద్ ఈ జాబితాలో అట్టడుగున ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంత మహిళల కంటే పట్టణ మహిళలే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారని, సంపన్న, నిరుపేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతి వర్గాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇందులోంచి గర్భిణులు, బాలింతలను మినహాయించారు. అందుబాటులోకి కొత్త పరిష్కారాలు ఓ వైపు ఒబెసిటీ బాధితులు పెరుగుతున్న కొద్దీ మరోవైపు కొత్త పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. డైట్, వర్కవుట్స్ వంటి సహజమైన పద్ధతులను అనుసరించి బరువు తగ్గే విధానాలతో పాటు సర్జరీలు, మందులు, ఇంజెక్షన్లు వగైరా రోజుకోటి నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ‘ఒబెసిటీ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారాలు వీలైనంత సులువుగా ఇతరత్రా ఇబ్బందులు కలగించనివిగా ఉండాలని ఆధునిక మహిళలు కోరుకుంటున్నారు’ అని చెప్పారు వెయిట్‌లాస్‌కి ఉపకరించే క్యాప్సూల్ తరహా గ్యా్రస్టిక్ బెలూన్ని తాజాగా నగరంలో విడుదల చేసిన అల్యూరిన్ సంస్థ వ్యవస్థాపకులు డా.శంతను గౌర్. -
ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !
An eight-month-old baby from Punjab: మనం ఇంతవరకు ఎన్నో రకాల వింత జననాలు గురించి విన్నాం. పైగా అలాంటి పిల్లలకి వైద్యులు ఎంతో కొంత చికిత్స అందించి కాపాడే ప్రయత్నాలు కూడా చేసిన ఘటనలు చూశాం. కానీ పంజాబ్‌కి చెందిన చిన్నారి అధిక బరువు సమస్యతో బాధపడుతుంది. అయితే ఇది ఈ రోజుల్లో సర్వసాధారణమే కదా ఇదేమీ అంత పెద్ద సమస్య కాదనుకోకండి. ఎందుకంటే ఆమెకు చికిత్స అందించడం కూడా కష్టమే. అందుకు ఆమె శరీరం తీరే కారణమట. పంజాబ్‌కు చెందిన చాహత్ కుమార్ అనే ఎనిమిది నెలల పాప నాలుగేళ్ల పాప ఉండేంత బరువు(17 కేజీలు) ఉంటందట. పైగా ఆ చిన్నారి తల్లి పుట్టిన నాలుగు నెలల నుంచి అసాధారణంగా బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో ఆమె తల్లిదండ్రలు సూరజ్ కుమార్, రీనా చాలా ఆందోళన చెందారు. అంతేకాదు డాక్టర్లు సైతం ఆ చిట్టితల్లి బరువుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పాప తల్లి మొదటి ప్రసవంలో కొడుకుని కోల్పోయింది. దీంతో ఆమె ప్రస్తుతం తాను ఈ కుమార్తెను కూడా కోల్పోతానేమో అనే భయంతో గడుపుతోంది. అయితే ఆ పాపకు విపరీతమైన ఆకలి కారణంగా పెద్ద పిల్లలు తినే విధంగానే అన్ని తింటుందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. పైగా ఆమెను ఎత్తుకోవడం కూడా కష్టమని చెబుతున్నారు. ఆ పాప అసాధారణ బరువుతో ఊబకాయంతో బాధపడటమే కాక ఆమె శరీరంతో కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమె శరీరం అత్యంత దళసరిగా ఉంటుంది. ఈ మేరకు వైద్యుడు వాసుదేవ్ శర్మ ఆమె శరీరం అత్యంత దృఢమైనదని, రక్తపరీక్షలు నిర్వహించడం అసాధ్యం అని చెబుతున్నారు. ఆయన ఎన్నోసార్లు పరీక్షలు నిర్వహించిన విఫలమైనట్లు చెప్పారు. పాపం తల్లితండ్రులు మాత్రం తమ పాప సాధారణ స్టితికి రావాలని, అందరి పిల్లల్లా ఆడుకుంటూ హాయిగా జీవించాలని ఆశిస్తున్నారు. అయితే ఈ ఘటన రెండేళ్ల కిందట జరిగినప్పటికి ఇప్పటి ఈ విషయం ఆసక్తికరంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. నాలుగవ జాతీయ కుటుంబ సర్వేతో పోలిస్తే అయిదవ సర్వేలో మహిళల్లో ఈ సమస్య పెరిగింది. నాలుగవ సర్వేలో 33.2 శాతం మహిళల్లోనే ఉండగా ఆ తర్వాతి సర్వేకు వచ్చేసరికి ఇది 36.3 శాతానికి పెరిగింది. అయితే.. అదే సమయంలో పురుషుల్లో మాత్రం ఈ తీవ్రత 33.5 శాతం నుంచి 31.3 శాతానికి తగ్గింది. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. పట్టణాల్లోనే ఊబకాయులు ఎక్కువ నిజానికి వయస్సు, ఎత్తు ఆధారంగా ప్రతీ మనిషి ఎంత బరువు ఉండాలన్నది నిర్దేశిస్తారు. ఇలా నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా గుర్తిస్తారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పురుషుల్లోనే ఎక్కువ ఊబకాయం ఉన్నట్లు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ మహిళల్లో 32.6 శాతం ఊబకాయ సమస్య ఉంది. అదే పురషుల విషయానికొస్తే.. పట్టణాల్లో 37.7 శాతం, పల్లెల్లో 28.0 శాతంగా ఉంది. ఒక్క కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల గతం కన్నా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగినట్లు సర్వే పేర్కొంది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! అవగాహన లేకపోవడమే.. వ్యాయామంపై చాలామంది మహిళలకు అవగాహన తక్కువ. దీంతో పాటు బిడ్డలను కన్నాక వారిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల లోపాలు వంటివి సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మార్పువచ్చి బరువు పెరుగుతుంటారు. దీన్ని అధిగమించాలంటే శారీరక వ్యాయామం చేయాల్సిందే. కొత్త తరం అమ్మాయిలు, మహిళలు వ్యాయామంపై అవగాహనతో ఉంటున్నారు. – డా. విద్యాసాగర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర యువత, చిన్నారులు బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. బిర్యానీతోపాటు, నాన్‌వెజ్ వంటకాలను తరచూ లాగించేస్తున్నారు. ఆహారంలో నూనె, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో చిన్న వయసులోనూ ఊబకాయులుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సు, వృద్ధులు సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారానికి మళ్లుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాళ్లు వెలుస్తున్నాయి. నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం విజయవాడ గాయత్రి నగర్లో ఏర్పాటైన ఆర్గానిక్ స్టోర్ ఒబెసిటీతో ప్రమాదం ఇటీవల 26 ఏళ్ల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చేరాడు. ఊబకాయం వల్ల మెటబాలిజం దెబ్బతిని, నియంత్రణ లేని మధుమేహం, అధికరక్తపోటు కారణంగా అతను బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నప్పటి నుంచి అధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా చాలా మంది ఊబకాయంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులో ఒబెసిటీ ఉన్న వారిలో మధ్య వయస్సు వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, డైస్టిపీడెమియా వంటి వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఒబెసిటీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొల్రస్టాల్ గడ్డలు ఏర్పడి బ్రెయిన్‌స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కూడా రావచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. ఇలా చేస్తే మేలు విద్యార్థులకు పాఠాలతోపాటు యోగా, ధ్యానంపై రోజూ గంట శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ మధ్య వయసు, వృద్ధుల ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారు పాత తరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాల స్టాళ్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా భుజిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్: అతివల్లో ‘అతి బరువు’
సాక్షి, అమరావతి: ఇంటి బరువు బాధ్యతల్ని ఓర్పుగా నెట్టుకొచ్చే మగువల సహనానికి సరిహద్దులే ఉండవు. అలుపనే మాటే ఎరుగని ఆ మహిళలు ఇప్పుడు ఇట్టే అలసిపోతున్నారు. ఇందుకు కారణం ఇంటి బరువు బాధ్యతలు కానే కాదు. జీవనశైలి సమస్యలు వారిని చుట్టేస్తున్నాయి. ఊబకాయం (ఒబెసిటీ) రూపంలో బాధిస్తున్నాయి. తెలుగు నేలపైనా ఈ సమస్య అధికమవుతోంది. మగవారితో పోలిస్తే మహిళలు ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే ఈ విషయాలను స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రతి వందమంది మహిళల్లో 36.3 మంది అధిక బరువుతో ఉన్నట్టు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో అధిక బరువుతో ఉన్న పురుషుల సంఖ్య 31.1 శాతం కాగా.. 36.3 శాతం మహిళలు ఊబకాయం బారినపడ్డారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. అనేక సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో మరీ ఎక్కువ పల్లెల్లో కంటే పట్టణాల్లో మహిళలు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 44.4 శాతం మంది మహిళలు ఒబెసిటీతో బాధపడుతుండగా.. పల్లెల్లో 32.6 శాతం మంది బాధితులు ఉన్నారు. అదే పురుషులైతే పట్టణాల్లో 37.7 శాతం మంది, పల్లెల్లో 28 శాతం మంది ఒబెసిటీ బారిన పడినట్టు వెల్లడైంది. రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం ఒబెసిటీ సమస్య రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళల విషయానికి వస్తే.. అవగాహన లేకపోవడం, వ్యాయామం చేసేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఊబకాయం బారిన పడుతున్నారు. 40 ఏళ్లకే చాలామంది మహిళలు కీళ్ల నొప్పులకు గురవుతున్నారు. ఒబెసిటీ కారణంగా ఎక్కువ మంది హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి జబ్బులుగా చెప్పుకునే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దగ్గరవుతున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ రక్తప్రసరణ వ్యవస్థలో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన ఇతర అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు, డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఒబెసిటీ కారణమవుతోంది. వ్యాయామమే సరైన మందు మితాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువును తగ్గించుకోవచ్చు. కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థం (ఫైబర్) అంటే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. –డాక్టర్ రాంబాబు, ప్రొఫెసర్, కేజీహెచ్ ఆస్పత్రి, విశాఖ -
అయ్యో ఈ కోతికి ఎంత కష్టమొచ్చింది!
థాయ్‌లాండ్: జంక్ ఫుడ్ తింటే మనుషులే కాదు జంతువుల సైతం అనారోగ్య బారిన పడతాయి. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. హాయిగా చెట్ల కొమ్మలపై అటూ ఇటూ దూకుతూ యాక్టివ్‌గా ఉండాల్సిన ఈ కోతి జంక్ ఫుడ్ తిని తిని ఉభకాయంతో బాధపడుతోంది. వివరాలు.. బ్యాంకాక్ చెందిన మనోప్ అనే ఓ షాప్ యాజమానురాలు గాడ్జిల్లా అనే కోతిని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని వయసు 3 సంవత్సరాలు. ఆమె రోజు తనతో పాటే ఈ కోతిని మార్కెట్‌కు తీసుకువచ్చి తన షాపు ఎదురుగా కట్టి ఉంచుతుంది. దీంతో ఆ దారిన వచ్చిపోయే వారంతా దానికి జంక్ ఫుడ్‌ను ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా రోజు బర్గర్, పిజ్జా, బన్లు వంటి పదార్థాలు తినడం వల్ల ఈ 3 ఏళ్ల కోతి 20 కేజీల బరువెక్కింది. అంటే దాని వయసుకు ఉండాల్సిన సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో ఉందని కోతి యజమానురాలు మనోప్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింటా వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ కోతిపై పడింది. అయ్యే ఈ కోతికి ఎంత కష్టం వచ్చిందో అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే గాడ్జిల్లా మొదటి యజమాని దానిని విడిచిపెట్టడంతో ఆమె ఈ కోతినిను పెంచుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనికి మంచి ఆహారం ఇవ్వాలన్నది తన కోరిక అట. కానీ గాడ్జిల్లా అధిక బరువుతో బాధపడుతుండటంతో తిరిగి దాని బరువును అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. గాడ్జిల్లా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు రెస్క్యూ టీం బ్యాంకాక్ రోడ్లపై కనుగోని దీని పాత యజమానికి అప్పగించారట. ఇది చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరగడం వల్ల ఆడవిలో స్వయంగా ఆహారం వెతుక్కొవడం దానికి తెలియదని ఆమె వివరించింది. అయితే ఈ కోతి రోజు ఉదయం పూట వ్యాయమం చేస్తున్నప్పటికి పలు అరోగ్య సమస్యల వల్ల ఉభకాయంతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. గాడ్జీల్లా ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతుందని అందుకే రోజు గాడ్జీల్లాను మార్కెట్‌కు తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గాడ్జీల్లా కేవలం తనకు ఇష్టమైన వారు ఆహారం పెడితేనే తింటుందట. -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
లావుగా ఉన్నా హాయిగా ఉండు
కొలతల్లో ఉన్న రూపమే ప్రకృతికి సమ్మతమైతే అందరూ అలాగే పుట్టేవారు. మన రూపం మన చేతుల్లో ఉండదు. జన్మతః వచ్చిన శరీరాన్ని క్రమశిక్షణలో ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం మన పని. అంతేతప్ప ఒకరు చెప్పిన కొలతల్లో దానిని కుదించాల్సిన పనిలేదు. సన్నగా లేకపోతే సిగ్గు పడాల్సిన అవసరమూ లేదు. ఆ మాటే అంటున్నారు అమేయ, పల్లవి. ‘‘చుట్టాల ఫంక్షన్స్‌కి, ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ పార్టీలకి లేదంటే సినిమా, షాపింగ్.. ఇలా ఎక్కడికి వెళ్లినా దగ్గరివాళ్ల నుంచి అసలు ముక్కూమొహం తెలియని అపరిచితుల దాకా ఎవరికి కనపడితే వాళ్లు సలహాలిస్తుంటారా?’’ అమేయ ప్రశ్న పూర్తవకముందే ‘‘ఓ భేషుగ్గా ఇస్తారు’’ అంటూ ఠక్కున సమాధానం చెప్పింది పల్లవి. ‘‘మంచినీళ్లు బాగా తాగండి, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగండి నెల రోజుల్లో సన్నగా అయిపోతారు. బీరకాయ, సొరకాయ తినండి.. వారంలోగా రివటలా కాకపోతే నన్ను అడగండి.. అంటూ.. అబ్బో ఎన్ని సలహాలో’’ వెటకారమాడింది పల్లవి. ‘‘అంతేనా.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు. చీర కట్టుకో.. ఒళ్లు దాస్తుంది. నిలువు డిజైన్లు వేసుకో.. లావుగా కనపడవు.. అలా జుట్టు విరబోసుకోకు. పోనీ వేసుకో మొహం కోలగా కనిపిస్తుంది.. అంటూ జీతంలేని స్టయిలిస్ట్‌లు పుట్టుకురారూ?’’ అంతకన్నా వ్యంగ్యంగా అమేయ. ఫ్యాట్ డాట్ సో (జ్చ్ట.టౌ?) అనే పోడ్కాస్ట్ (ఆడియో) షో కోసం వాళ్ల సంభాషణ అలా సాగుతోంది. ఫ్యాట్ డాట్ సో ఏంటి అంటే.. ఎవరూ కావాలని లావు కారు. అనారోగ్యం, ప్రసవం, తన మీద తాను శ్రద్ధ పెట్టుకునే స్పృహను కల్పించని కుటుంబ వ్యవస్థ... ఇవన్నీ మహిళల ఊబకాయానికి కారణాలే. చూసేవాళ్లకు ఇవన్నీ అనవసరం కదా. కానీ ఖర్చులేని సలహాలు, సూచనలు ఇస్తూంటారు స్థూలకాయానికి సంబంధించి. మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటారు. దీన్నే థీమ్‌గా తీసుకొని ‘‘అవును లావే. అయితే ఏంటీ? అంటూ అమ్మాయిలు ఆత్మ విశ్వాసంతో ముందడుగువేసేలా ‘‘ఫ్యాట్ డాట్ సో?’ షోను నిర్వహిస్తున్నారు ఆ ఇద్దరూ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బాడీ పాజిటివిటీ జర్నీ’ ని ఓ ఉద్యమంలా ప్రారంభించారు. వీళ్లిద్దరూ లావే. అందుకే ఈ షోలో వాళ్ల మీద వాళ్లే జోక్స్,సెటైర్లు వేసుకుంటూ షోను నడిపిస్తుంటారు. ఆడవాళ్లకు మాత్రమే.. ఫిఫ్టీ డేట్స్ ఇన్ దిల్లీ అమేయ, పల్లవి నాథ్.. ఢిల్లీలో స్థిరపడ్డ హైదరాబాదీయులు. అమేయకు 37 ఏళ్లు. పల్లవి వయసు నలభై. ఓ మీడియా డెవలప్మెంట్ స్టార్టప్ కోసం అమేయ పనిచేస్తోంది. పల్లవి కార్పొరేట్ ఉద్యోగిని. ఇద్దరికీ తెలుసున్న ఓ స్నేహితురాలి ద్వారా ఈ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ స్నేహితురాలు ఢిల్లీలో వారం వారం ‘‘ఆడవాళ్లకు మాత్రమే’’ అనే సమావేశం పెట్టేవారు. అందులో మహిళలకు సంబంధించిన ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రత సమస్యలన్నిటినీ చర్చిస్తారు. టీచర్లు, లెక్చరర్లు, థియేటర్ ఆర్టిస్టులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, లాయర్లు, గృహిణులు కూడా హాజరవుతారు. అలా ఒకసారి ఆ సమావేశంలో పల్లవి.. తను లావుగా ఉండడం మీద మాట్లాడింది. ‘‘నలభై ఏళ్ల ఫాట్.. విడాకులు పొందిన సెల్ఫ్ ఎంప్లాయ్డ్ మహిళను నేను’’ అంటూ పల్లవి తనను తాను పరిచయం చేసుకున్న తీరు, ఆ ఆత్మవిశ్వాసం, వివిధ అంశాల మీద ఆమెకున్న స్పష్టమైన అభిప్రాయాలు అమేయకు నచ్చాయి. సమావేశం అయిపోయాక పల్లవిని పలకరించింది. తన గురించి చెప్పుకుంది. అమేయ బ్లాగు రాసేది. ‘‘50 డేట్స్ ఇన్ డెల్హీ’’గా ఆ బ్లాగ్ చాలా పాపులర్. అందులో తను తన ఢిల్లీ జీవితాన్ని, డేటింగ్ లైఫ్ వంటి వ్యక్తిగత విషయాలను కథనాల రూపంలో రాసేది. ఆ బ్లాగ్‌కు పల్లవి పెద్ద ఫాలోవర్. ఆ అమేయే ఈ అమేయ అని తెలిసి సంతోషపడింది. ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడింది. ఫ్యాట్ డాట్ సో? అమేయ రాత, తన మాట రెండూ కలిస్తే మంచి షో అవుతుందన్న ఆలోచన వచ్చింది పల్లవికే. ఆ విషయాన్ని అమేయతో పంచుకుంది. వెంటనే ఒప్పేసుకుంది అమేయ. ఆలస్యం చేయకుండా మొదలుపెట్టారు. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఇద్దరికీ ఉన్న కామన్ లక్షణాలు. తమ నిజజీవితంలోని బాధలు, సమస్యలు, ఇబ్బందులకు వాటిని జోడించి సంభాషించడం.. రికార్డ్ చేయడం.. వాటిని వినడం. అంతే.. వాళ్ల మీద వాళ్లకు నమ్మకం కలిగింది. వాళ్లు చేసిన మొదటి రెండు షోలను ‘సునో ఇండియా’పాడ్‌కాస్ట్ చానెల్ విని.. ముచ్చటపడింది. స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘ఫ్యాట్ డాట్ సో?’ పది ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ‘‘అవి విని మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎంత షైగా ఉండేదానివి... ఆ అమేయవా? అని తనకు, ఓహ్.. పల్లవీ.. మీ షో సూపర్. ఎంత బాగుంటుందో? మా పిల్లలకూ వినిపిస్తున్నాం. వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత మెరుగవుతున్నాయో తెలుసా? అమేజింగ్ డియర్ ’ అంటూ నాకు కాల్స్ వస్తున్నాయి’ అని అంటుంది పల్లవి. ‘‘నిజమే. ఈ షో హిట్ కావడానికి కారణం.. మేం గొప్పలు చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. చిన్నప్పుడు నేను చాలా సన్నగా.. అందంగా చురుగ్గా ఉండేదాన్ని. అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని అంటూ గొప్పలతో మా సంభాషణ స్టార్ట్ కాదు. మా శరీరం.. దానిపట్ల మాకున్న అంగీకారంతోనే సంభాషణ మొదలువుతుంది.. సాగుతుంది.. ముగుస్తుంది. దీనివల్ల స్థూలకాయులే కాదు.. రంగు తక్కువని బాధపడేవాళ్లు, హేళనకు గురయ్యేవాళ్లు, పొట్టి, పొడుగు అనే భేదంతో ఇబ్బంది పడేవాళ్లు... ఇలా దేన్నయినా లోపంగా ఊహించుకునేవాళ్లు, చూసేవాళ్లు మా మాటల్లో తమను తాము వింటున్నారు. ముందు తమను తాము ప్రేమించుకోవాలి.. గౌరవించుకోవాలి అని గ్రహిస్తున్నారు. బాడీ షేమింగ్ చేసిన వాళ్లకు తగు సమాధానమిస్తున్నారు. ఇమ్పర్ఫెక్షనే పర్ఫెక్షన్ అని అర్థంచేసుకుంటున్నారు కాబట్టే మా షో నచ్చుతోంది’’ అంటుంది అమేయ. ఆడవాళ్ల మీద పెరుగుతున్న హింస, అభద్రత వంటి వాటినీ అంశాలుగా తీసుకొనీ షో చేస్తామని చెప్పారిద్దరూ! నిజమే.. ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కారు.. ఏదీ పర్ఫెక్ట్గా ఉండదు. అలా ఉండకపోవడమే జీవితం. అందుకే ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే మనల్ని మనం స్వీకరించుకోగలుతాం. ఆ విశ్వాసమే ఎదుటి వారికి మన మీద గౌరవాన్ని పెంచుతుంది. ఫ్యాట్ డాట్ సో? చెప్పేదీ అదే! -
‘కొవ్వు కరిగింపు’లో హైదరాబాద్ నగరమే టాప్
తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు. పిజ్జాలు, బర్గర్లు తినడం.. వెరసీ శరీర భాగాలు కొవ్వుతో కొండల్లా మారుతున్నాయి. టీవీలకు అతుక్కుపోయి అదే పనిగా ఏదో ఒక చిరుతిళ్లు లాగించడంతో పీలగా ఉన్నవాళ్లు సైతం పీపాల్లా తయారవుతున్నారు. గ్రేటర్లో ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు, ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయం బారినపడే ప్రమాదం పొంచి ఉంది. బాధితుల్లో 65 శాతం మహిళలు, 35 శాతం పురుషులు ఉండటం గమనార్హం. నేడు ప్రపంచ ఊబకాయ దినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందో తెలియజెప్పే కథనం. సాక్షి, సిటీబ్యూరో: ఒబేక్యూర్ ఫౌండేషన్ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం కారణంగా ఏటా 28లక్షల మంది మృత్యు వాతపడుతున్నారు. దేశంలో 6.5 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో పట్టణాల్లో 16 శాతం మంది ఉండగా, గ్రామాల్లో 5 శాతం ఉన్నారు. జాతీయ పోషకార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే ప్రకారం హైదరాబాద్ నగర చిన్నారుల్లో ఏడు శాతం మాత్రమే ఉన్న అధిక బరువు బాధితులు, 2013లో 15 శాతానికి పెరిగారు. తాజాగా ఈ సంఖ్య 18 నుంచి 23 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది. 30 శాతం మంది పిల్లల లంచ్‌బాక్స్‌ల్లో చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, కేక్‌లు ఉన్నట్లు తేలింది. రోజుకెన్ని కేలరీలు అవసరం? రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2300 నుంచి 2500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారు 1400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్‌ఫుడ్డు కూడా తీసుకుంటే శరీరంలో అదనంగా కేలరీలు పోగుపడతాయి. ఉదాహరణకు రోజుకు 300 కేలరీల చొప్పున ఎక్కువ తీసుకుంటే, ఇలా నెలకు తొమ్మిదివేలు, ఏడాదికి లక్షకుపైగా కేలరీలు శరీరంలో పేరుకున్నట్లే. ఏటా అదనంగా 90 వేల కేలరీలు తీసుకుంటే 5 కేజీల వరకు బరువు పెరుగుతారు. ఇలాగే కొనసాగితే నాలుగైదేళ్లలో 20 కేజీలకుపైగా బరువు పెరుగుతారు. ఊబకాయం ఓ తీవ్రమైన జబ్బు కాకపోయినా.. పరోక్షంగా మధుమేహం, గుండెపోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మíహిßళల్లో సంతానలేమి, రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుంది. ప్రకటనల మాయలో పడొద్దు ’నెల రోజుల్లోనే 10 కిలోల బరువును తగ్గిస్తాం. ఏడాది క్రితం లావుగా ఉన్న వ్యక్తి. ఇప్పుడెంత నాజూగ్గా మారిపోయాడో’ అంటూ గుప్పిస్తున్న ఆకర్షణీయ ప్రకటనలతో అనేకమంది అటువైపు మొగ్గుచూపుతూ అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ’శాస్త్రీయతతో పనిలేదు.. మేం చెప్పిన ఆహార పద్ధతులు పాటించండి చాలు.. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు పారిపోతుందని’ చెప్పే ప్రచారార్భాటాలకు లొంగిపోతున్నారు. ఇటీవల ఈ విష వలయంలో చిక్కి పెద్ద సంఖ్యలో బాధితులు అనారోగ్యం పాలయ్యారు. అశాస్త్రీయ ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల తొలుత బరువు తగ్గినట్లుగా అనిపించినా.. శరీర జీవక్రియలో పెనుమార్పులు సంభవిస్తాయి. కండరాలు క్షీణిస్తాయి. ఎముకలు బలహీనమవుతాయి. కాలేయం పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. అనర్థాలెన్నో.. శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి. జంక్‌ఫుడ్డు, బిర్యానీలు, మద్యం, మాంసాహారం, శీతల పానియాలు, స్వీట్లు ఎక్కువగా తీసుకోవద్దు. అధిక బరువు పరోక్షంగా రక్తపోటుకు, గుండెపోటుకు కారణమవుతుంది. అల్పాహారం మానేస్తే సన్నగా మారతామనేది కూడా అపోహ మాత్రమే. బరువు తగ్గేందుకు రోజులో 3 నుంచి 4 గంటలపాటు వ్యాయామం చేయడమూ అనర్థమే. అతి వ్యాయామం వల్ల కండరాల్లో పొటాషియం కరిగి.. రక్తంలో కలుస్తుంది. మూత్రపిండాలు వడపోయడంలో ఇబ్బందులు ఎదురై.. కొన్నిసార్లు వ్యాయామం చేస్తుండగానే గుండె ఆగిపోయి కుప్పకూలిపోతుంటారు. – డాక్టర్ పీఎస్ లక్ష్మి, బెరియాట్రిక్ సర్జన్, గ్లోబల్ హాస్పిటల్ మితాహారంతో చెక్ చిన్న చిన్న మార్పులతోనే దీర్ఘకాలంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు 500 క్యాలరీలు తగ్గించాలనుకుంటే.. తీసుకునే ఆహారంలో 250 కేలరీలు, వ్యాయామం ద్వారా 250 కేలరీలు తగ్గిస్తే.. నెలకు రెండున్నర కిలోలు తగ్గుతారు. తినే కంచం.. సగం కూరగాయల ముక్కలు, సగం ఇష్టమైన ఆహారంతో నిండి ఉండాలి. తగ్గిన బరువును కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే చాలామంది విఫలమవుతుంటారు. మూణ్నెళ్లలో తగ్గిన బరువును కనీసం 18 నెలలపాటు తిరిగి పెరగకుండా చూసుకోవాలి. – డాక్టర్ సుజాత స్టీఫెన్, పోషకాహార నిపుణురాలు గ్రేటర్.. టాపర్.. దేశంలో ఎక్కడా లేని విధంగా నిష్ణాతులైన వైద్యులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య పరికరాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వైద్య ఖర్చులు కూడా చాలా తక్కువ. కేవలం నగరవాసులే కాదు టాంజానియా, ఇథోపియా, కెన్యా దేశీయులు సైతం గ్రేటర్ వైద్యులనే ఆశ్రయిస్తుండటం విశేషం. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 8000 చికిత్సలు జరిగితే, ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 1200కుపైగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఢిల్లీలో నెలకు 50 సర్జరీలు జరిగితే, ముంబైలో 40 ఆపరేషన్లు చేస్తుండగా, గ్రేటర్లో వందకుపైగా చికిత్సలు జరుగుతుండటం కొసమెరుపు. -
ఒబెసిటీతో కిడ్నీలకు ప్రమాదమే
మారుతున్న జీవన విధానం, ఫ్లోరైడ్ నీరు, రసాయన ఆహార పదార్థాలతో జన్యు సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2 నుంచి 3 లక్షల మంది వరకు వివిధ రకాల కిడ్నీ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. వీరిలో కిడ్నీ వ్యాధి ముదిరిపోయి చివరి దశలో డయాలసిస్ చేయించుకుంటున్న వారు నెలకు 1,500 నుంచి 2 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో అనర్థాలు తప్పడం లేదు. ప్రధానంగా ఊబకాయం(అధిక బరువు)తో మూత్ర పిండాలకు చేటు తప్పదని వైద్యులు అంటున్నారు. శనివారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెల్లూరు(బారకాసు): ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - షుగర్ (డయాబెటీస్) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం. - మూత్రంలో ప్రొటీన్ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది. - ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు. - నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. - వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. - కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. - షుగర (డయాబెటీస్) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. - వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి. - ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి. - అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి. - పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు లక్షణాలు – డాక్టర్ మాధవ్దేశాయి, చీఫ్ నెఫ్రాలజిస్ట్, సింహపురి హాస్పిటల్ ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు. కిడ్ని వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తిస్తే ఎంతో మేలు. లేకుంటే చాలా ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధి ముదిరితే గుండెపోటు లేక, పక్షవాతంతో మరణించే ప్రమాదం ఉంది. జిల్లాలోని 2 నుంచి 3లక్షల మందికి వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అయితే వీరిలో కేవలం 20 వేల మంది మాత్రమే ముందస్తుగా సంబంధిత వైద్యుడిని కలిసి తగిన వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారంతా కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలో మాత్రమే వైద్యుడిని కలవడం జరుగుతోంది. -
సారీ.. నో ఫుడ్
ఫొటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు డిబ్సి(27). బ్రిటన్‌లోని మిడిల్స్‌బ్రో నగరవాసి. బరువు 254 కేజీలు. లావుగా ఉండటంతో మిడిల్స్బ్రాఫ్ నగరంలో ఈయనంటే తెలియని వారు లేరు. ఇప్పుడు ఆయన అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆహారం ఇవ్వడం లేదు. ఇతగాడికి ఆహారం నిషేధిస్తూ ‘సేవ్ డిబ్సి–ఒబెసిటీ ఈజ్ కిల్లింగ్ హిమ్’(డిబ్సిని కాపాడండి– స్థూలకాయం అతడిని చంపుతోంది’ అంటూ స్థానికంగా ఉన్న ప్రతి హోటల్లో బోర్డ్ పెట్టారు. దీంతో ఎవరూ అతడికి ఆహారం అమ్మడం లేదు. డిబ్సికి 18 ఏళ్ల వయసప్పుడు తండ్రి చనిపోవడంతో, కుంగిపోయి తెలియకుండానే ఎక్కువ తినడం అలవాటైంది. ఇంతలోనే అసాధారణంగా బరువు పెరిగిపోయాడు. దీంతో సాధారణ జీవితాన్ని కూడా ప్రశాంతంగా గడపలేకపోతున్నాడు. ఉద్యోగం దొరకడమూ.. కష్టమైంది. తన సైజ్ దుస్తులు దొరకక ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సి వస్తోంది. విమాన ప్రయాణం చేయాలంటే రెండు సీట్లు బుక్ చేసుకోవాల్సిందే. ఇటీవల డిబ్సికి గుండెపోటు రావడంతో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. (డైట్ ఆర్ డై) తిండిపై నియంత్రణ లేకుంటే బతకడం కష్టమని వైద్యులు అతన్ని హెచ్చరించారు. వరంలా వచ్చిన మైక్... మైక్ హింద్.. యూకేలోనే సక్సెస్ఫుల్ పర్సనల్ ట్రైనర్. గతేడాది ఆయన బెస్ట్ పర్సనల్ ట్రైనర్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే, ఆయన ఏడాదికి ఒక్కరికి మాత్రమే శిక్షణనిస్తాడు. అదీ ఉచితంగా! దీంతో ఆయనకు ప్రతి ఏడాది వేలల్లో దరఖాస్తులు వస్తుంటాయి. వైద్యుల హెచ్చరికల తర్వాత ఏం చేయాలో తోచని డిబ్సి.. తన సంగతిని వివరిస్తూ మైక్ హింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇదేదో చాలెంజింగ్లా ఉందని భావించిన మైక్ ఈ ఏడాది డిబ్సినే ఎంచుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ చాన్స్ డిబ్సికి వరమనే అనుకోవాలి. మైక్‌కు సహకరిస్తున్న హోటళ్లు డిబ్సిని జిమ్‌కి తీసుకెళ్తే అతన్ని భరించగల మెషీన్లు అక్కడ కనపడలేదు. ఇక లాభం లేదనుకుని తిండి నుంచి నరుక్కురావాలని నిర్ణయించాడు మైక్. ఇందుకు ముందుగా విపరీతంగా (రోజుకు 11వేల కేలరీలు) తినే డిబ్సికి హోటళ్లు ఆహారం ఇవ్వకూడదని ప్రతి హోటల్ వద్ద బోర్డ్ పెట్టాడు. దీనికి ప్రతి హోటల్ సహకరిస్తుండటం గమనార్హం. అనారోగ్యకరమైన జంక్, ఫాస్ట్ ఫుడ్‌కు బదులు మైకే స్వయంగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు డిబ్సి రోజుకు 3,500 కేలరీలు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇందులో 2 వేల కేలరీల్ని మైక్ రూపొందించిన వ్యాయామాల ద్వారా కరిగిస్తున్నాడు. తాను మైక్‌కు రుణపడి ఉంటానని డిబ్సి ఆనందంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఏడాది తర్వాత డిబ్సి ఎలా తయారవుతాడో వేచి చూద్దాం! -
హెల్త్‌కార్నర్
* రోజూ రెండు మూడు బొప్పాయి పండు ముక్కల్ని తింటే... రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఆ సమయాల్లో కూడా బొప్పాయి సలాడ్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. * గుప్పెడు మెంతులను నీళ్లు పోసుకుంటూ నూరి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వంట చేసేటప్పుడు ఎక్కడైనా కాలితే... ఆ గాయాలపై రాయాలి. అలా చేస్తే... కాలిన చోట బొబ్బలు రాకుండా, త్వరగా తగ్గిపోతాయి. * రోజూ భోజనంలోకి ఒక చిన్నసైజు ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే... శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది తరచూ వేడి చేసేవారికి కూడా ఉపయోగపడుతుంది. * అధిక బరువుతో బాధపడేవారు... రోజూ పరగడుపున 10-12 కరివేప ఆకులను నమలాలి. అలా చేస్తే ఒంట్లోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. * రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి. రోజు విడిచి రోజు పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. * వారానికోసారి ఉలవచారు లేదా ఉలవలను ఉడకబెట్టుకొని తినాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. * విటమిన్- డి లోపంతో బాధపడుతున్న వారు... వారానికి రెండుసార్లైనా తమ కూరల్లో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. -
అమెరికాలో 40 శాతం ఊబకాయులు
న్యూయార్క్: అమెరికాలో ఊబకాయుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మగవాళ్లలో ఊబకాయుల సంఖ్య నిలకడగా కొనసాగుతుండగా, మహిళల్లో రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. 2013–2014 సంవత్సరాల మధ్య పురుషుల్లో ఊబకాయుల సంఖ్య దేశ జనాభాలో 35 శాతం ఉండగా, మహిళల్లో 40 శాతం ఉన్నట్లు జమా పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 2005 నుంచి 2014 మధ్యకాలంలోనే మహిళల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 12 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో గత 25 ఏళ్ల కాలంలో ఊబకాయ సమస్య స్వల్పంగా పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు. రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య తగ్గిందని, ఆరు నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల్లో సమస్య నిలకడగా ఉందని వారు చెప్పారు. మూడు దశాబ్దాలుగా అమెరికాను వేధిస్తున్న ఈ ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనలు, మెడికల్ కేర్ కోసం అమెరికా ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టింది. 2005 నుంచి 2012 మధ్యకాలంలో 21,013 మందిని చేసిన ఇంటర్వ్యూలను అధ్యయనం చేయడం, 2013–14 సంవత్సరాల మధ్య 2,638 మంది మగవాళ్లను, 2,817 మంది మహిళలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ‘నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటటిక్స్, సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’కు చెందిన నిపుణులు ఈ వివరాలను సేకరించారు. -
ఆట మారింది
వ్యాయామాన్ని అందించే గ్రామీణ క్రీడలు కనుమరుగు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆడే ఆటలపైనే చిన్నారుల ఆసక్తి శారీరక శ్రమకు దూరం చిన్నారులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేది వేసవి సెలవుల్లోనే. అంతకుముందు ఉదయం లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే దాకా పుస్తకాలే లోకంగా గడిపే విద్యార్థులకు వ్యాయూమం చేసే అవకాశం లభించదు. ఇక వేసవి సెలవుల్లోనూ వారు ఆడే ఆటలు తగినంత శారీరక వ్యాయూమాన్ని అందించడం లేదు. ఫలితంగా స్థూలకాయం సమస్య బాలల్లో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండేది. కబడ్డీ, చిర్రగోనె, తొక్కుడు బిళ్ల, గోలీల ఆట వంటివి వేసవి క్రీడలుగా ఉండేవి. వాటి వల్ల విద్యార్థులకు తగినంత శారీరక, మానసిక వ్యాయూమం లభించేది. వేసవి సెలవుల్లో ఆడే ఆటల ట్రెండ్ మారడంతో, చిన్నారులపై పడుతున్న ప్రభావాన్ని తెలిపే కథనమిది. - సాక్షి, హన్మకొండ వీడియో గేమ్స్ లోకంగా.. చిన్నారులకు అవసరమైనంత ఆహ్లాదాన్ని అందించేవి వీడియోగేమ్స్. ఒకప్పుడు వీటిని ఆడేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. స్మార్ట్‌ఫోన్ అరుుతే చాలు 3డీ స్థారుు కలిగిన వీడియో గేమ్స్‌ను సైతం డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తల్లిదండ్రులు తమ ఫోన్లలోనూ చక్కటి గేమ్స్‌ను డౌన్లోడ్ చేసి ఆడుకోండంటూ పిల్లల చేతికిస్తున్నారు. వారు గంటల తరబడి గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. ఫలితంగా బాలల్లో సోమరితనం పెరిగే అవకాశాలు ఉంటారుు. గేమ్స్ ఆడుతున్న తమ పిల్లలకు కూర్చున్న చోటికే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇటువంటి గేమ్స్ కారణంగా చిన్నతనంలోనే ఊబకాయం,కంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. టీవీలతో.. గతంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు క్రికెట్ ఆడటం కానీ, క బడ్డీ, చిర్రగోనె తదితర ఆటలు ఆడేవారు. ఫలితంగా తగినంత శారీరక శ్రమ ఉండటంతో ఆరోగ్యానికి మేలు జరిగేది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లోకి టీవీలు,కంప్యూటర్లు ప్రవేశించారుు. టీవీల్లో కార్టూన్, స్పోర్ట్స్ చానెల్స్ చూస్తూ పిల్లలు వాటినే లోకంగా భావిస్తున్నారు. సమ యం ఎంత అవుతోందనేది కూడా పట్టించుకోకుండా కళ్లన్నీ టీవీలకే అప్పగించి కూర్చుంటున్నారు. ఇక కనీసం ఆదివారం కూడా టీవీని వది లే ప్రసక్తి ఉండటం లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా పిల్లలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నెన్నో ప్రస్తారమవుతారుు కాబట్టి. కంటి జబ్బులు వచ్చే అవకాశం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. రోజు లో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల క ళ్లపై అధిక భారం పడుతోంది. దానితో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నా రు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బం దులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటూ వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో చూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి,ఉద్యోగ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. ఈతకు వెళ్లే వారిపై తప్పక దృష్టిసారించాలి బయటకు వెళ్లి ఆడుకుంటామనే పిల్లలు తమ స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఈత పేరుతో చెరువులు, కుంటలకు వెళ్తుంటారు. గడిచిన రెండేళ్లుగా ప్రతీ వేసవిలో ఈత సరదాతో పదుల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడిక తీస్తున్నారు. వేసవిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు ఓ క న్నేసి ఉంచడం మంచింది. ఇప్పటికే పోలీసు శాఖ తరఫున పలు చోట్ల చెరువుల్లో ఈత కొట్టరాదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టించుకోకుంటే.. చదువులోనూ వెనుకడుగే గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకుపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. అధిక మోతాదులో అడ్రినలిన్ విడుదల కావడం అంత మంచిది కాదు. దీనికితోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే రానురాను తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాల కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఫలితంగా రానురాను చదువులో వెనకబడి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కంటే ఎక్కువ సేపు వీడియోగేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును కూడా మాన్పిస్తే మంచిది. -
నిలబడండి!
హూస్టన్: వీలైనప్పుడల్లా రోజుకు ఆరు గంటలు నిలబడితే స్థూలకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా కూర్చోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యాలు తప్పవంటున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ శాస్త్రవేత్త డాక్టర్ కెరెం షువాల్ నేతృత్వంలోని బృందం.. నిలబడే అలవాట్లకు, జీవక్రియలు, స్థూలకాయానికి మధ్య సంబంధం తెలుసుకునేందుకు 7 వేల మంది రోగులను పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), శరీర కొవ్వు శాతం, నడుం కొలత వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిలబడే సమయానికి సూల్థకాయాన్ని మధ్య సంబంధాన్ని లెక్కించారు. దాదాపు ఆరుగంటలు నిలబడే పురుషుల్లో 32 శాతం శరీర కొవ్వు శాతం తగ్గే అవకాశాలున్నాయని వర్సిటీ ఆఫ్ టెక్సాస్, జార్జియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అదే మహిళల్లో అయితే ఆరుగంటలు నిలబడితే 47 శాతం కొవ్వు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు స్థూలకాయులే!
లండన్: పాశ్చాత్య ధనిక దేశాల్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉంటున్నారని ఇంతవరకూ భావిస్తుండగా.. భారత్‌లాంటి మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే సమస్య ఎక్కువ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు స్థూలకాయంతో లేదా అధిక బరువుతో ఉన్నట్లు కూడా లండన్‌కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం స్థూలకాయులు, అధిక బరువుతో ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 146 కోట్ల మంది వరకూ ఉన్నారని తెలిపింది. మధ్యస్థ ఆదాయ దేశాలైన భారత్, చైనా, ఈజిప్టు, పెరూ, థాయిల్యాండ్‌లలో గత 50 ఏళ్లలో ఆహారంలో వచ్చిన మార్పులను కేస్‌స్టడీల ఆధారంగా అధ్యయనం చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 1980 నుంచి 2008 మధ్యలో స్థూలకాయం, అధిక బరువు ఉన్నవారి శాతం 9 నుంచి 11 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.