నేడు ‘ప్రపంచ ఊబకాయ వ్యతిరేక దినోత్సవం’
'ప్రస్తుత సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఆరోగ్య సమస్యల్లో ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. మారుతున్న జీవన విధానంలో ఆహార అలవాట్లు మారుతుండటం ఊబకాయం (ఒబెసిటీ) వ్యాధికి కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణం. పెద్దలతో పాటు చిన్నారులు ఊబకాయం బారినపడడం ఆందోళన కల్గిస్తుంది. ఈనెల 4న ప్రపంచ ఊబకాయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న కథనం'.
సమస్య ఇలా..
పెద్దవారితో సహా, చిన్నపిల్లలు 20 శాతం ఈ ఊబకాయం వ్యాధి బారినపడుతున్నారు. నెయ్యి, డాల్డా, నూనె అధిక మోతాదులో కలిసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినటంతో రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఊబకాయ బాధితుల్లో 40 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు వీరిని పట్టిపీడిస్తున్నాయి. పక్షవాతం, నరాల సమస్యలు వంటివి దారితీస్తున్నాయి. గత పదేళ్లలో ఆహార అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల చిన్నారుల్లో ఊబకాయ సమస్య తీవ్రంగా ఉంది.
ముందు జాగ్రత్తలు..
సమతుల్యమైన ఆహారపు అలవాట్లు రోజు తీసుకోవాలి. వ్యాయమాన్ని కొనసాగిస్తే బరువు పెరగకుండా కాపాడుకోగలుగుతాం. ఒబెసిటీకి గురయ్యాక చేసే వర్కవుట్ల కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ బి.రవికుమార్, ఎండీ, జనరల్ మెడిసిన్, నిర్మల్
వ్యాయమాలు చేయాలి..
చాలామంది ఒబెసిటీకి గురవుతుంటారు. మొదటి నుంచే బరువు పెరుగకుండా సమతుల్యత పాటిస్తే ఊబకాయాన్ని కచ్చితంగా నివారించవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, రోజు వ్యాయమాలు చేయాలి. – ఎండపల్లి అశోక్ కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు, నిర్మల్
జాగ్రత్తలు ఇవే..
- ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఉపవాసం చేయాలి.
- 20 ఏళ్లు దాటినవారు ప్రతీరోజు 2,500 కేలరీలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్న ఈ కేలరీలు దాటకుండా చూసుకోవాలి. మిగిలిన రెండు రోజుల్లో కేవలం పావు వంతు అంటే 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి.
- కార్పొహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలతోపాటు అన్నానికి బదులు రాగి, జొన్న, చేపలు, చికెన్ తీసుకోవాలి.
- కాఫీ టీ తీసుకోవచ్చు. తరచూ నీటిని తాగుతూ ఉండాలి.
ఇవి చదవండి: మగపిల్లల పెంపకం!
Comments
Please login to add a commentAdd a comment