వ్యాయామాన్ని అందించే గ్రామీణ క్రీడలు కనుమరుగు
కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆడే ఆటలపైనే చిన్నారుల ఆసక్తి
శారీరక శ్రమకు దూరం
చిన్నారులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేది వేసవి సెలవుల్లోనే. అంతకుముందు ఉదయం లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే దాకా పుస్తకాలే లోకంగా గడిపే విద్యార్థులకు వ్యాయూమం చేసే అవకాశం లభించదు. ఇక వేసవి సెలవుల్లోనూ వారు ఆడే ఆటలు తగినంత శారీరక వ్యాయూమాన్ని అందించడం లేదు. ఫలితంగా స్థూలకాయం సమస్య బాలల్లో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండేది. కబడ్డీ, చిర్రగోనె, తొక్కుడు బిళ్ల, గోలీల ఆట వంటివి వేసవి క్రీడలుగా ఉండేవి. వాటి వల్ల విద్యార్థులకు తగినంత శారీరక, మానసిక వ్యాయూమం లభించేది. వేసవి సెలవుల్లో ఆడే ఆటల ట్రెండ్ మారడంతో, చిన్నారులపై పడుతున్న ప్రభావాన్ని తెలిపే కథనమిది. - సాక్షి, హన్మకొండ
వీడియో గేమ్స్ లోకంగా..
చిన్నారులకు అవసరమైనంత ఆహ్లాదాన్ని అందించేవి వీడియోగేమ్స్. ఒకప్పుడు వీటిని ఆడేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. స్మార్ట్‌ఫోన్ అరుుతే చాలు 3డీ స్థారుు కలిగిన వీడియో గేమ్స్‌ను సైతం డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తల్లిదండ్రులు తమ ఫోన్లలోనూ చక్కటి గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఆడుకోండంటూ పిల్లల చేతికిస్తున్నారు. వారు గంటల తరబడి గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. ఫలితంగా బాలల్లో సోమరితనం పెరిగే అవకాశాలు ఉంటారుు. గేమ్స్ ఆడుతున్న తమ పిల్లలకు కూర్చున్న చోటికే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇటువంటి గేమ్స్ కారణంగా చిన్నతనంలోనే ఊబకాయం,కంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది.
టీవీలతో..
గతంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు క్రికెట్ ఆడటం కానీ, క బడ్డీ, చిర్రగోనె తదితర ఆటలు ఆడేవారు. ఫలితంగా తగినంత శారీరక శ్రమ ఉండటంతో ఆరోగ్యానికి మేలు జరిగేది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లోకి టీవీలు,కంప్యూటర్లు ప్రవేశించారుు. టీవీల్లో కార్టూన్, స్పోర్ట్స్ చానెల్స్ చూస్తూ పిల్లలు వాటినే లోకంగా భావిస్తున్నారు. సమ యం ఎంత అవుతోందనేది కూడా పట్టించుకోకుండా కళ్లన్నీ టీవీలకే అప్పగించి కూర్చుంటున్నారు. ఇక కనీసం ఆదివారం కూడా టీవీని వది లే ప్రసక్తి ఉండటం లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా పిల్లలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నెన్నో ప్రస్తారమవుతారుు కాబట్టి.
కంటి జబ్బులు వచ్చే అవకాశం
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. రోజు లో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల క ళ్లపై అధిక భారం పడుతోంది. దానితో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నా రు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బం దులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటూ వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో చూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి,ఉద్యోగ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది.
ఈతకు వెళ్లే వారిపై తప్పక దృష్టిసారించాలి
బయటకు వెళ్లి ఆడుకుంటామనే పిల్లలు తమ స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఈత పేరుతో చెరువులు, కుంటలకు వెళ్తుంటారు. గడిచిన రెండేళ్లుగా ప్రతీ వేసవిలో ఈత సరదాతో పదుల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడిక తీస్తున్నారు. వేసవిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు ఓ క న్నేసి ఉంచడం మంచింది. ఇప్పటికే పోలీసు శాఖ తరఫున పలు చోట్ల చెరువుల్లో ఈత కొట్టరాదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
పట్టించుకోకుంటే.. చదువులోనూ వెనుకడుగే
గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకుపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. అధిక మోతాదులో అడ్రినలిన్ విడుదల కావడం అంత మంచిది కాదు. దీనికితోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే రానురాను తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాల కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఫలితంగా రానురాను చదువులో వెనకబడి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కంటే ఎక్కువ సేపు వీడియోగేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును కూడా మాన్పిస్తే మంచిది.