
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్‌పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు.
వివరాల ప్రకారం.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు. అలాగే, సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక, సిట్.. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశారు.
#SayNoToBettingApps pic.twitter.com/jPRzks6PqV
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2025
ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉబిలోకి.. జాగ్రత్త!!
ఐపీఎల్ మ్యాచ్ ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా.
టెలిగ్రాం ఛానెల్ లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్ కు బానిసలను చేస్తున్న వైనం.
ఐపీఎల్ ను ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఇలాంటి మాయగళ్ల మాటలు విని మీ జేబులు గుల్ల చేసుకోకండి. pic.twitter.com/XfO1BObmgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 30, 2025