Betting App Case
-
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
బెట్టింగ్ యాప్స్ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్ యాప్స్ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్ వరకు చాలామంది ప్రమోట్ చేస్తున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగారుఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్ ప్రమోట్ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.రూ.3 కోట్ల ఆఫర్ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ట్రేడింగ్, బెట్టింగ్.. ఇలా చాలావాటిని ప్రమోట్ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్ -
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్‌పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు. అలాగే, సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక, సిట్.. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశారు. #SayNoToBettingApps pic.twitter.com/jPRzks6PqV— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2025 ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉబిలోకి.. జాగ్రత్త!!ఐపీఎల్ మ్యాచ్ ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా. టెలిగ్రాం ఛానెల్ లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్ కు బానిసలను చేస్తున్న వైనం.ఐపీఎల్ ను ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఇలాంటి మాయగళ్ల మాటలు విని మీ జేబులు గుల్ల చేసుకోకండి. pic.twitter.com/XfO1BObmgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 30, 2025 -
బెట్టింగ్ యాప్‌లపై సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అధిపతిగా ఐజీ ఎం.రమేష్ పేరు ఖరారైంది. ఈ మేరకు డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదివారం ఉత్తర్వులు (ఆర్సీ నం.191/ఎల్ అండ్ ఓ–ఐ/2025) జారీ చేశారు. తొలుత ఈ బా«ధ్యతల్ని డీఐజీగా ఉన్న అభిషేక్ మహంతికి అప్పగించాలని భావించారు. అయితే ఆయన తెలంగాణకు కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ కొనసాగుతుండటంతో డీజీపీ కార్యాలయంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీగా ఉన్న రమేష్‌ను ఎంపిక చేశారు. విదేశీ లింకులతో పాటు ఇతర కీలకాంశాలతో ముడిపడిన బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు అభిషేక్ మహంతికి వ్యతిరేకంగా క్యాట్ ఉత్తర్వులు వస్తే ఆ ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతుందని డీజీపీ కార్యాలయం భావించింది. ఈ నేపథ్యంలోనే మరో సమర్థుడైన అధికారిగా పేరున్న రమేష్‌ను ఖరారు చేసింది. సిట్‌లో ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ కె.వెంకటలక్ష్మీ, సైబరాబాద్‌లో పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎస్.చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. దీంతో పాటు ఆర్థిక నిపుణులు, న్యాయాధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు తదితరులను సీఐడీ అదనపు డీజీ అనుమతితో నియమించుకునే అవకాశం ఉంది. దర్యాప్తే కాదు..సిఫారసులూ చేయాలి ఈ సిట్ కేవలం కేసుల్ని దర్యాప్తు చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ తీరుతెన్నులు, వ్యవహారాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ, సమాచార ప్రసార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితరాల బాధ్యతలను గుర్తించాల్సి ఉంది.ఈ యాప్స్ ఆర్థిక లావాదేవీలు, వాటి మార్గాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి అనేక అంశాలు, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిట్ 90 రోజుల్లో డీజీపీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ కార్యాలయం కేంద్రంగానే పని చేయనుంది. -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
బెట్టింగ్ బెండు తీస్తున్న పోలీసులు
-
Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు (Vishnupriya) భారీ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖులపై కేసులుబెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
బెట్టింగ్ వలలో నిజామాబాద్ యువకుడు..!
-
సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?
సాక్షి, హైదరాబాద్: కేవలం ప్రమోటర్లు, ఇన్ఫ్లూ్యయెన్సర్ల దగ్గరే ఆగకుండా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VS Sajjanar) సైతం కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.సిట్ ఏర్పాటుపై బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఓ కీలక సమావేశం నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌లతోపాటు సజ్జనార్ సైతం పాల్గొన్నారు.కీలక కేసులు పర్యవేక్షించిన అనుభవం సజ్జనార్ సీఐడీ ఎస్పీగా ఉన్నప్పుడు మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై పోరు ప్రకటించారు. వివిధ సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం రావడానికీ కారణమయ్యారు. → సైబరాబాద్ సీపీగా పనిచేసిన రోజుల్లోనూ అనేక బెట్టింగ్ యాప్స్‌పై కేసులు నమోదు చేయించడంతోపాటు వాటి దర్యాప్తుల్ని పర్యవేక్షించారు. → ఇటీవల ఆయన సోషల్‌మీడియా వేదికగా చేపట్టిన ‘హ్యష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ #SayNoToBettingApps క్యాంపెయినింగ్ వైరల్‌గా మారింది. దీని కారణంగానే ఆయా యాప్స్, సెలబ్రెటీలు, ఇన్‌ఫ్యూయెన్సర్లపై ఫిర్యాదులు, కేసుల నమోదు తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. → అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసే సిట్‌లో సజ్జనార్‌కు స్థానం కల్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. నేరుగా సిట్‌లోకి తీసుకోవడమా? ప్రస్తుతం ఆయనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలో సూచనలు, సలహాలతో సిట్ ఏర్పాటు, దర్యాప్తు చేయించడమా? అనేది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా యాదగిరి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షునిగా టి.శేఖర్, అధ్యక్షునిగా తిరందాస్ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా దీటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా నవీన్‌కుమార్, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వానికి సంఘీభావంగా నిలుస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో తమవంతు కృషి చేస్తామని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని సభ్యులంతా తీర్మానించారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ ఇంటికే: సీఎస్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ ఈనెల 31లోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలగించాల్సిన వారి జాబితాను ఆయా ప్రభుత్వ శాఖలకు పంపించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) ఈనెల 25న అన్ని శాఖలకు లేఖ రాశారు. రిటైర్డ్ అయ్యాక పునర్నియామకం లేదా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన వారందరిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.ఎవరైనా రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలు ఇంకా అవసరమని భావిస్తే ఎందుకు అవసరమో వివరిస్తూ మళ్లీ తాజాగా నియామకానికి అనుమతులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదుపు చర్యలు భాగంగా రిటైర్డ్ అధికారులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల మేరకు పురపాలక శాఖలోని పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న దాదాపు 177 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: 2030.. కండక్టర్ ఉద్యోగానికి ఏఐ!జీహెచ్ఎంసీలో 50 మందిపై వేటు ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్డీఓ, ఈఈ, సూపరింటెండెంట్ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు.కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి
ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడింది. అవగాహన లేక చేశా..వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్ అంటూ నాకు నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు.రూ.10 లక్షల ఆఫర్ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్ చేస్తోంది.చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్ -
Betting App Case: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ నివాసంలో సీబీఐ సోదాలు
-
బెట్టింగ్ యాప్ వ్యవహారం.. మాజీ సీఎం ఇళ్లలో సీబీఐ సోదాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై.. భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక, ఇప్పటికే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆయనపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో భూపేష్ బాఘేల్ నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రాయ్‌పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయను అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.మరోవైపు.. సీబీఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా..‘ఇప్పుడు సీబీఐ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటైన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి భూపేష్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయమే సీబీఐ రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం.अब CBI आई है.आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.(कार्यालय-भूपेश बघेल)— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది. #WATCH | Raipur: CBI raids underway at the residence of former Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel. pic.twitter.com/McOgzts1qk— ANI (@ANI) March 26, 2025 -
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విష్ణుప్రియ
-
విచారణపై శ్యామల ఫస్ట్ రియాక్షన్
-
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు ఊరట?
హైదరాబాద్, సాక్షి: ఇటు సినీ రంగ ప్రముఖులను, అటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను హడలెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఇవాళ(మార్చి 24, సోమవారం) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటిదాకా 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లందరికీ ఊరట కలిగించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ఓనర్లను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా 19 మందిపై కేసులు నమోదు చేశారు. కొత్త సెక్షన్లు చేర్చి మరీ వీళ్లందరినీ కేసుల్లో నిందితులుగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కోర్టులో మెమో సైతం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖులను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులకు ఇప్పటికే చాలామంది నోటీసులు పంపించారు. కొందరిని విచారించగా.. మరికొందరిని విచారించాల్సి ఉంది. ఈ క్రమంలో యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం.. ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ప్రమేయం లేకుండా వాటిని ప్రమోట్ చేశామని, పర్యవసనాలకు ఊహించలేదని వివరణలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లావాదేవీలపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఫోకస్ చేసినట్లు సమాచారం.బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తా. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను::పంజాగుట్ట పీఎస్‌లో విచారణ అనంతరం శ్యామల -
యువత అత్యాశకు పోయి చిక్కుల్లో పడొద్దు: పొన్నం
-
యువకుడి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్
మంథని/యైంటింక్లయిన్‌కాలనీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు(Online Betting App) అనేకమందిని బలితీసుకుంటున్నాయి. ఈ వ్యసనానికి అలవాటుపడ్డ యువ కులు అప్పులపాలై, ఆఖరు కు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేన సాయితేజ (26) ఈనెల 18న రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. సాయితేజ గోదావరిఖనిలో చదువుకున్నాడు. అక్కడే ఓ యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సాయితేజ గోదావరిఖనిలోనే ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడడంతో సాయితేజ దారితప్పినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి సాయితేజ బెట్టింగ్‌లకు అలవాటు పడటంతో రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. మళ్లీ అటువైపు వెళ్లనని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మా రు. కానీ, బెట్టింగ్ వ్యసనం బారినపడ్డ సాయితేజ, మళ్లీ అదేతోవలో వెళ్లడంతో మరోసారి అప్పుల పాలయ్యాడని, ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది. అతను ఈ సారి రూ.4లక్షలకు పైగా అప్పు చేసినట్లు సమాచారం. -
ముందు దర్యాప్తు.. ఆపై విచారణ!
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరం కాకపోవడం, మరికొన్ని అంశాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని ఆలోచనకు వచ్చారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మంది నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2017 నుంచే నిషేధం అమలు.. తెలంగాణలో కొన్నేళ్లుగా పేకాటపై నిషేధం ఉంది. దీనితో పేకాట క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కానీ చాలా మంది ఆన్లైన్ రమ్మీ, పేకాటకు అల వాటు పడ్డారు. దీనికోసం తొలినాళ్లలో ప్రత్యేక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చా యి. వాటి సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేసి, రాష్ట్ర పరిధిలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పైనా నిషేధం విధించింది. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ సైట్లు/యాప్‌లు ఓపెన్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఆన్లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారినవారు నకిలీ జీపీఎస్, లొకేషన్ యాప్స్, వీపీఎన్ల సాయంతో ఆయా సైట్లు, యాప్స్‌ను వినియోగిస్తున్నారు. పలువురు నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని ఆ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, యాప్స్‌కు ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే వారిపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నాటి ప్రకటనలే అని చెబుతూ.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై కేసులు నమోదవడంతో చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఆ ప్రకటనలన్నీ గేమింగ్ చట్ట సవరణకు ముందే 2016–17 సమయంలో చేసినవని, తర్వాత ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నామని కొందరు చెప్తున్నారు. మరికొందరు తెలుగు రాష్ట్రాల బయట మాత్రమే ఆ ప్రమోషనల్ వీడియోలను వినియోగించుకోవడానికి అంగీకరించామని అంటున్నారు. దీంతో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో బెట్టింగ్ కంపెనీలకు జరిగిన ఒప్పందాలను సేకరించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఎవరు? ఎప్పుడు? ఏఏ యాప్స్‌తో ఒప్పందాలు చేసు కున్నారు? ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేసేలా నిబంధనలు ఉ న్నాయి? తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్లకు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు మధ్య కొందరు ఈవెంట్ మేనేజర్లు దళారులుగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలు సైతం ఆరా తీసి, నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. న్యాయ నిపుణుల సల హాలు తీసుకున్న తర్వాతే నిందితులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. -
‘టార్గెట్ సజ్జనార్’ క్యాంపెయినింగ్!
పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ నిర్వాహకులు– ఇన్ఫ్లూయన్సర్ల మధ్య భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసుస్టేషన్లో 11 మందిపై, మియాపూర్ ఠాణాలో 25 మందిపై నమోదైన కేసులపై లోతుగా ఆరా తీస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత కేసు నమోదు చేసి, నిందితులను నోటీసులు జారీ చేసి విచారించనుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’తోనే ఈ కథ మొదలైంది. దీంతో ప్రస్తుతం బెట్టింగ్ మాఫియా ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం మొదలెట్టింది.ఈ బెట్టింగ్ మాఫియా దందా మొత్తం వ్యవస్థీకృతంగా సాగుతోంది. వీళ్లు అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో దాదాపు 50 శాతం తమ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసిన లింకు ద్వారా అయితే ఏఏ పంటర్ తమ యాప్‌ను యాక్సెస్ చేశారనేది నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా తమకు వచ్చిన మొత్తంలో 50 శాతం ఇన్‌ఫ్లూయన్సర్‌కు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల్లో అత్యధికంగా నగదు రూపంలో హవాలా ద్వారా జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో విదేశీ కోణాన్నీ అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ యాప్స్‌కు ఉన్న విదేశీ లింకుల పైనా దర్యాప్తు చేయనుంది. ఆ కేసులన్నీ తిరగదోడేందుకు నిర్ణయం.. బెట్టింగ్ ఉచ్చులో చిక్కి రాష్ట్రంలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులన్నీ ఆయా జిల్లాలు, కమిషనరేట్లలో ఆత్మహత్యలుగానే నమోదయ్యాయి. అయితే.. వారి మృతికి బెట్టింగ్ యాప్స్ కారణమని ఆధారాలు సేకరిస్తే... వారే ఆత్మహత్యకు పురిగొల్పినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను సమీక్షించి, ఆధారాలు ఉన్న వాటిలో బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటినీ నిందితులుగా చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిందితులుగా చేరితే సాంకేతికంగా దాని నిర్వాహకుడు ఆ జాబితాలో చేరతాడు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయన్సర్ల వివరాలు తెలిస్తే వారినీ ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చనున్నారు.ఇన్ఫ్లూయన్సర్లను మళ్లీ ప్రయోగిస్తున్న మాఫియా.. బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను గుర్తించిన వీసీ సజ్జనార్ ఇటీవల తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో యుద్ధం ప్రకటించారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై సూర్యాపేట అధికారులు బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేయగా.. అతడు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు పంజగుట్టలో కేసు నమోదు కావడంతో పాటు బెట్టింగ్ యాప్స్ దందాపై పోలీసుల దృష్టిపడింది. దీంతో బెట్టింగ్ మాఫియా సజ్జనార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీనికోసం కొన్ని వీడియోలు చేయడానికి కొందరు ఇన్‌ఫ్లూయన్సర్లతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరికి చెల్లింపులు కూడా జరిగినట్లు భావిస్తున్నారు. మెట్రో రైళ్లపై బెట్టింగ్ ప్రకటనల తొలగింపు కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టటైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం రాత్రి మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ వాణిజ ప్రకటనలను పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
‘ఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలి’
ఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించారని పలువురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు నమోదు అయ్యిందన్నారు. పలువురు యాంకర్లతో పాటు సోషల్ మీడియా Influencerలపై రెడ్‌విత్, బీఎన్ఎస్ 3, 3(A), 4..ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంశానికి సంబంధించి భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, కర్ణాటకలలో ఒక చట్టం చేయడం జరిగిందన్నారు. పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని గత ఏపీ ప్రభుత్వం కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రిని కోరారన్నారు. ఈ మేరకు 2020లో అప్పటి సీఎం జగన్.. లేఖ రాశారన్నారు. దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా అన్నీ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని, అప్పుడే భారత్‌లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమన్నారు . ఇప్పుడు తెలంగాణలో ఫైల్ చేసిన కేసులో సెలెబ్రిటీలు Influencerలపై ప్రస్తుతం పెట్టిన కేసులో బలం లేదన్నారు. వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని , భారత దేశంలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలు అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడంతో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. "సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ ప్రజలకు నష్టం కలిగే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, 'మా' అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన చర్యలకు తీసుకోవాలని, యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి హెచ్చరించారు. -
బాలకృష్ణ షో వల్లే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా: బాధితుడి ఆవేదన
బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్మెంట్ ఇచ్చారు. యాప్‌లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.అయితే ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్‌ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్‌కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్‌లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్‌లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు. -
సారీ చెప్పిన అనన్య నాగళ్ల.. మరి ఇదేంటని ప్రభుత్వానికి సూటి ప్రశ్న!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిలో యూట్యూబర్ల నుంచి సినిమా స్టార్ల వరకు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి ఈ యాప్స్ గురించి కనీస అవగాహన లేదు. నిమిషానికి లక్షలు ఇస్తున్నారనగానే ముందూవెనకా ఆలోచించకుండా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడేమో కేసు (Betting App Case)లో ఇరుక్కుని బాధపడుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) కూడా ఉంది.అనన్య క్షమాపణలుఅవగాహన లేకపోవడం వల్లే సదరు యాప్స్‌ను ప్రమోట్ చేశామని అంగీకరించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. నేను తెలిసి ప్రమోషన్స్ చేయలేదు. అందరు సెలబ్రిటీలు చేస్తున్నారు.. కాబట్టి అందులో తప్పేం లేదనుకున్నాను. కానీ ఇకమీదట జాగ్రత్తగా ఉంటాను. బాధ్యతగా మసులుకుంటాను అని పోస్ట్ పెట్టింది.మరి ఇదేంటి? మాకెలా తెలుస్తుంది?అదే సమయంలో మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ ఆస్తులపై బెట్టింగ్ యాప్స్‌ను ఇలా యథేచ్చగా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు అది చట్టరీత్యా నేరమని మాకెలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ఆమె తెలియక చేశానని చెప్పాక నిందించడం సరి కాదని భావిస్తున్నారు. మల్లేశంతో కెరీర్ మొదలుమరికొందరేమో.. లక్షల మంది అభిమానులున్నప్పుడు ఏ చిన్న పోస్ట్ పెట్టాలన్నా దాని దుష్ప్రభావాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి అని సూచిస్తున్నారు. మల్లేశం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి వంటి పలు సినిమాలు చేసింది. గతేడాది.. తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలతో మెప్పించింది.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
లోన్ యాప్ నిర్వాహకులకు డీజీ షికా గోయల్ హెచ్చరికలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ హెచ్చరికలు జారీ చేశారు.తెలుగు రాష్టాలను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్ వాసి ఫిర్యాదు మేరకు సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంపై శిఖా గోయల్ స్పందించారు. 2022 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 797 బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులు నమోదు చేశాం. చట్ట ప్రకారం కఠినంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై చర్యలు తీసుకుంటాం.దేశంలోని 133 బెట్టింగ్ యాప్ కంపెనీలను గుర్తించాం. అందులో కొన్నిటికి బెట్టింగ్ యాప్ నిర్వహణను ఆపాలని ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే లోన్ యాప్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లో మోసం.. ప్రాణం తీసుకున్న యువకుడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్స్‌లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టాడు. మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ విషాదాలు
-
బాలకృష్ణ షో చూసి.. 83 లక్షలు పోగొట్టుకున్నాను
-
బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వారికి చుక్కలే..
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, ఒక్కొక్కటిగా బెట్టింగ్‌లకు సంబంధించిన విషాదాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాదిలో తెలంగాణలో బెట్టింగ్‌కు 25 మందికిపైగా బలయ్యారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనే ఎనిమిది మందికిపైగా ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. 2022 నుంచి ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆత్మహత్యలు పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిన వారి కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. అలాగే, బెట్టింగ్ యాప్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.యాప్స్ ప్రమోషన్స్‌తో.. భారీగా లబ్ధి పొందిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏయే మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో.. వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.మరోవైపు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్ ద్వారా 80 లక్షలు పోగొట్టుకున్న నెల్లూరుకు చెందిన రాంబాబు అనే బాధితుడు తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేయడంతో నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఆవేదన చెప్పుకున్నాడు. ఈ సందర్బంగా బాధితుడు రాంబాబు మాట్లాడుతూ.. ‘హీరోల ప్రమోషన్ చూసే నష్టపోయాను. నేను బెట్టింగ్ యాప్ లో పాల్గొని తప్పు చేశాను. నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు శిక్ష వేయాల్సిందే. అప్పుల వాళ్లు ఊళ్లోకి రానివ్వట్లేదు. ఫోన్ నెంబర్ మార్చుకొని పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవ తీసుకోవడంతో బెట్టింగ్ యాప్‌ల బాగోతం బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అమాయకులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ పార్టీలు బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తామని మేనిఫెస్టోలో పెట్టే రోజులు వస్తాయి’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు విచారించగా.. రీతూచౌదరి విచారణ ఐదున్నర గంటలకుపైగా కొనసాగింది. తొలుత ఇద్దరినీ వేర్వేరుగా.. అనంతరం కలిపి ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడు యాప్‌లకు ప్రచారం చేశానని విష్ణుప్రియ అంగీకరించినట్లు తెలిసింది. -
స్టార్స్ కాదు.. చీటింగ్ స్టార్స్
-
బెట్టింగ్ యాప్స్.. సడన్‌గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ
‘‘సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే నేపథ్యంలో ‘శారీ’ రూపొందింది. నేనీ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ‘శారీ’లో సందేశం ఉంటుందని చెప్పను గానీ, ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. సత్య యాదు, ఆరాధ్యా దేవి ప్రధాన పాత్రల్లో గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శారీ’. Cబెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై కేసులు పెట్టడంపై స్పందిస్తూ.. తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అన్నారు. ‘‘ఆరాధ్య, సత్య బాగా నటించడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది’’ అని గిరి కృష్ణకమల్ చెప్పారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది’’ అని సత్య యాదు తెలిపారు.చదవండి: పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్ -
కాలమే సమాధానమిస్తుంది.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, పలువురు ఇన్ఫ్లూయెన్సర్స్ పై పోలీస్ కేసుల హడావుడి నడుస్తోంది. నిన్నటికి నిన్న యాంకర్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం హాజరయ్యారు. ఇద్దరినీ కొన్ని గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ కి వచ్చినప్పుడు ముఖం మొత్తం కప్పేసేలా స్కార్ఫ్ కట్టుకుని వచ్చిన వీళ్లిద్దరూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మీడియాతో మాట్లాడలేదు. కానీ విచారణ అంతా ముగిసి ఇంటికెళ్లిన తర్వాత మాత్రం విష్ణుప్రియ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అందులో ఏమందంటే?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)'కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటివరకు ఓర్పుతో ఉండటమే' అని విష్ణుప్రియ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే ఈ కేసులో ఏదో ఒకటి తేలేంత వరకు స్పందించనని క్లారిటీ ఇచ్చినట్లయింది.విష్ణుప్రియ విచారణ విషయానికొస్తే.. ఈమె లాయర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. దాదాపు 10 గంటల పాటు విచారించారు. మూడింటికి మాత్రమే ప్రమోషన్ చేశానని ఈమె చెప్పగా.. తమ దగ్గర 15 వీడియోలు ఉన్నాయని పోలీసులు ఈమెతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈమె బ్యాంక్ లావాదేవీలని కూడా పరిశీలించి, నిధులపై పోలీసులు ఆరా తీశారని అంటున్నారు. ఈనెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారట.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటిపై కేసు నమోదు
-
బెట్టింగ్ యాప్స్ కేసు.. చిరు ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారాయన.సినీ నటులను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు. సినీ నటులు ఇప్పటికే చేతినిండా సంపాదించుకుంటున్నారు. సినిమా అవకాశాలు రాకపోతే.. ఓటీటీ సహా ఎన్నో అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు సినిమావాళ్లకు ఈ పాడు సంపాదన దేనికి? గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు అని మండిపడ్డారాయన. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవికి తాను రాసిన ఓ లేఖ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు ఆయనకు నేనొక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు. -
Betting Apps Case: ఇన్ఫ్లూయన్సర్లు.. జర జాగ్రత్త..!
క్లాసులూ, స్నేహితులతో ఊసులు తప్ప వేరే విషయాలు తెలియని ఓ కళాశాల విద్యార్థి ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతాడు.. గడప దాటడం ఎరుగని ఓ గృహిణి కిచెన్‌లో గరిటె తిప్పుతూ లక్షల సంఖ్యలో ఫాలోయర్లను కూడగట్టుకుంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన అవ్వ మొదలు పట్నం ముఖం చూడని తాత వరకూ.. ఎందరో స్టార్లు.. పుట్టుకొచ్చేస్తున్న కాలమిది. కారెవరూ సెలబ్రిటీ స్టేటస్‌కు అనర్హం అన్నట్లు.. నేమ్.., ఫేమ్‌తో పాటు ఇన్కమ్ అంతా ఓకే. కానీ వీరి పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయా వ్యాపారులే సోషల్ స్టార్స్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు నాలుగు నెలల క్రితం ఔటర్ రింగ్‌రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లి మనీ హంట్ నిర్వహించిన బాలానగర్ నివాసి యాంకర్ చందు అలియాస్ భాను చందర్, అదే విధంగా నోట్లను కూకట్‌పల్లిలో నడిరోడ్డు మీద విసిరేసిన కూరపాటి వంశీ అనే ఇన్ఫ్లూయన్సర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నగర ఇన్ఫ్లూయన్సర్లలో లోపించిన చట్టపరమైన అవగాహనకు ఈ తరహా ఉదంతాలెన్నో అద్దం పడతాయి. ఇదొక్కటే కాదు గతంలో ఓ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి నగరవ్యాప్తంగా 18వేల మందిని ముంచేసిన ఉదంతంలో ఆ కంపెనీని ప్రమోట్ చేసిన పాపం కూడా సోషల్ మీడియా స్టార్లకే చుట్టుకుంది. అడపాదడపా జరుగుతున్న ఇలాంటివి ఒకెత్తయితే తాజాగా గేమింగ్ యాప్స్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం సిటీ ఇన్‌ఫ్లూయన్సర్స్ కమ్యూనిటీని అప్రమత్తం చేస్తున్నాయి. స్టార్లందు సూపర్స్టార్లు వేరయా.. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్ బుక్, బ్లాగ్స్, వ్లాగ్స్.. వగైరాల ద్వారా వేలు, లక్షల సంఖ్యలో ఫాలోయర్లను పొందుతున్నవారినే ఇన్‌ఫ్లూయన్సర్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారు నగరంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో 10 వేల నుంచి లక్ష మంది ఫాలోయర్ల లోపు ఉన్నవారిని మైక్రోఇన్ఫ్లూయన్సర్లుగా అలాగే లక్ష నుంచి 5లక్షల లోపు ఉన్నవారిని మిడ్–టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు, 5లక్షల నుంచి 10లక్షల మంది ఉన్నవారిని మ్యాక్రో ఇన్ఫ్లూయన్సర్లు, 10లక్షలు ఆ పైన ఉంటే టాప్ క్రియేటర్స్‌గా పేర్కొంటారు. వీళ్లు మాత్రమే కాకుండా ప్రతి పోస్టుకూ లక్షల సంఖ్యలో స్పందన అందుకునే వారిని సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయన్సర్లుగా పిలుస్తారు. సాధారణంగా సినిమా తారలు, క్రికెటర్లు.. ఈ విభాగంలోకి వస్తారు. అనుసరణ.. అనుకరణే ఆదాయంఈ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం వారిని అనుసరించే ఫాలోయర్ల సంఖ్యను బట్టఆధారపడి ఉంటుంది. మైక్రో కిందకి వచ్చేవారికి పోస్టుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకూ, అలాగే లిమిడ్ టైర్ విభాగంలో ఉన్నవారికి రూ.50వేల నుంచి రూ.2లక్షలు, మ్యాక్రో స్టార్స్‌కి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ, టాప్ క్రియేటర్స్‌కు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకూ క్లయింట్స్ చెల్లిస్తున్నారు. ఇక సెలబ్రిటీ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం కొన్ని సార్లు రూ. కోట్లలో కూడా ఉంటుంది. సాధారణంగా ఫాలోయర్ల సంఖ్యను బట్టే పేమెంట్ ఉంటుంది. అయితే లైక్స్, కామెంట్స్, షేర్స్ కూడా కొన్ని సార్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, టెక్నాలజీ.. రంగాలకు సంబంధించిన ప్రమోషన్లకు అధిక మొత్తాలు లభిస్తాయి. నగరంలో వేగంగాఇన్ఫ్లూయన్సర్ల సంఖ్యను పెంచుకోవడంలో నగరం దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో పేరొందిన ఇన్‌స్టా ఇన్ఫ్లూయన్సర్లు 761 మంది వరకూ ఉన్నట్లు మోదాష్ అనే ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. నగరం ఇటీవల ఫ్యాషన్, ఫుడ్, ఫిట్నెస్, టెక్నాలజీ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్స్ లోకల్ స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి నగరానికి చెందిన ఇన్ఫ్లూయన్సర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. వీరిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవాలంటే.. వారి ఇన్‌స్టా ఖాతాల్లోకి వెళ్లడం, తమ బ్రాండ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఎన్ని రోజులు, ఎలాంటి ప్రచారం కావాలి? తదితర వివరాలు మెసేజ్ చేస్తే.. సరిపోతుంది. ఆన్లైన్, చాట్స్ ద్వారానే కుదిరిపోయే డీల్స్ కోకొల్లలు. అందువల్లే చట్ట వ్యతిరేక, చట్ట పరిధిలో లేని గేమింగ్ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ.. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇదీ చదవండి:సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త ఇన్ఫ్లూయన్లర్లు, జర జాగ్రత్త..ఈ నేపథ్యంలో ఎడా పెడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇన్ఫ్లూయన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై.. తాము ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి మరోసారి సమీక్షించుకోవాలని అడ్వర్టయిజింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాణిజ్య సంబంధిత ప్రచారాలకు సంబంధించి చట్ట పరమైన నియమ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ కోవిదులు సూచిస్తున్నారు. -
బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?
బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌లను ప్రమోట్ చేసిన వారు భారీగా సంపాధించారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుస్తుంది. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసి డబ్బలు దండుకున్న వారిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, వారు ఒక్కో యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను ఎంతమొత్తంలో డబ్బు తీసుకుంటారో అధారాలతో సహా బయటకొస్తున్నాయి.బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్ చేసినట్లు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు రూ. 30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్‌కు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఆయన చెప్పాడు. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్‌ను(శ్రావణి ) కూడా వారు సంప్రదించారట. ఆమెకు రూ. 70 లక్షలు ఇస్తామని బెట్టింగ్ యాప్స్ వాళ్లు ఆఫర్ చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్లో పంచుకుంది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అధికమొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారు కనీసం రూ. 50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం. వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెన్ని వీడియోలు చేశారు.. ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. -
బడా హీరోలు, సెలబ్రిటీలకు బిగుస్తున్న ఉచ్చు
-
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొందిఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్‌లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్లో ప్రస్తావించారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్‌తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులకు వివరణ ఇచ్చారు. -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్ వివరణ
-
Betting Apps: ఒక్కో వీడియోకు రూ. 90వేలు తీసుకున్నట్లు విష్ణుప్రియ వెల్లడి
-
బెట్టింగ్ యాప్స్ కేసు.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్!
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది.విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. -
బెట్టింగ్ యాప్ కేసు.. భారీగా డబ్బులు వచ్చాయన్న విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్‌నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీ అలర్ట్.. వారికి కఠిన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్
ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రమోట్ చేసినవారిపై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఈ జాబితాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, నటీనటులు ఉన్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖావాణి కూతురు సుప్రీత (Supritha), టేస్టీ తేజ, రీతూ చౌదరి వంటివారు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని లెంపకాయలు వేసుకున్నారు. ఇకపై దాని జోలికి వెళ్లమని.. ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను నమ్మొద్దని వీడియోలు రిలీజ్ చేశారు.అడిగారు.. చేశాం.. అంతే!ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం గురించి ప్రశ్నించిన యాంకర్‌తో నటి సురేఖావాణి (Surekha Vani) దురుసుగా మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయమని ఎవరు అప్రోచ్ అయ్యారు? అని యాంకర్ అడిగింది. అందుకు సురేఖ.. మేము బెట్టింగ్ యాప్స్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదమ్మా.. వాళ్ల పోస్టులను రీపోస్ట్ చేయమంటే చేశామంతే! అని బదులిచ్చింది.తెలీక చేశాం.. సారీ చెప్పాంబెట్టింగ్ యాప్స్ గురించి తెలియనప్పుడు అలా పోస్టులు చేసి మళ్లీ ఇప్పుడెందుకు సారీ చెప్తున్నారు? అని యాంకర్ ప్రశ్నించింది. తెలియకుండా చేశాం కాబట్టే సారీ చెప్పాం.. అయినా తెలియకుండా ఎందుకు చేశారు? అంటున్నారు.. తెలీదు కాబట్టే చేశాం కదా.. మళ్లీ ఇదేం ప్రశ్న? అని సీరియస్ అయింది. పోస్టులో ఏముందో తెలుసుకోకుండా రీపోస్ట్ చేయొద్దు కదా? అని యాంకర్ అంటుంటే అందుకే కదా సారీ చెప్పింది అని సురేఖ విసుక్కుంది. మాకింకా తెల్లారలేదు.. విసుక్కున్న సురేఖఅంటే తెలియకుండానే ఆ యాప్స్ ప్రమోట్ చేశారంటారు.. అని యాంకర్ అడుగుతుంటే.. మీకు తెల్లారిందేమో.. కానీ మాకింకా తెల్లారలేదమ్మా.. నేను తర్వాత మాట్లాడతా.. అని ఫోన్ కట్ చేసింది. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో బుల్లితెర స్టార్స్‌తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, నిధి అగర్వాల్ వంటి టాలీవుడ్ స్టార్స్ సైతం ఉన్నారు.చదవండి: బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు! -
బెట్టింగ్ యాప్ ల ప్రమోటర్లపై ఉక్కుపాదం
-
బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.