
బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌లను ప్రమోట్ చేసిన వారు భారీగా సంపాధించారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుస్తుంది. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసి డబ్బలు దండుకున్న వారిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, వారు ఒక్కో యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను ఎంతమొత్తంలో డబ్బు తీసుకుంటారో అధారాలతో సహా బయటకొస్తున్నాయి.
బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్ చేసినట్లు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు రూ. 30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్‌కు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఆయన చెప్పాడు. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్‌ను(శ్రావణి ) కూడా వారు సంప్రదించారట. ఆమెకు రూ. 70 లక్షలు ఇస్తామని బెట్టింగ్ యాప్స్ వాళ్లు ఆఫర్ చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్‌లో పంచుకుంది.
ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అధికమొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారు కనీసం రూ. 50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం. వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెన్ని వీడియోలు చేశారు.. ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.
ఎవరెవరు ఏ యాప్స్‌లో..
ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్‌అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment