బెట్టింగ్‌ యాప్స్‌ కేసు.. స్పందించిన విజయ్‌ దేవరకొండ టీమ్‌! | Vijay Devarakonda PR Team Responds On Betting App Case | Sakshi
Sakshi News home page

Betting App Case: విజయ్‌ దేవరకొండపై కేసు.. పీఆర్‌ టీమ్‌ క్లారిటీ!

Published Thu, Mar 20 2025 3:48 PM | Last Updated on Thu, Mar 20 2025 4:05 PM

Vijay Devarakonda PR Team Responds On Betting App Case

బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్‌ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్‌ టీమ్‌ స్పందించింది. బెట్టింగ్‌ యాప్స్‌ (Betting App Case)కి విజయ్‌ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్‌ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్‌ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్‌ టీమ్‌ తెలియజేసింది.

విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. 

విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్‌ టీమ్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement