
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారాయన.
సినీ నటులను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు. సినీ నటులు ఇప్పటికే చేతినిండా సంపాదించుకుంటున్నారు. సినిమా అవకాశాలు రాకపోతే.. ఓటీటీ సహా ఎన్నో అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు సినిమావాళ్లకు ఈ పాడు సంపాదన దేనికి?
గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు అని మండిపడ్డారాయన. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవికి తాను రాసిన ఓ లేఖ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు.
గతంలో చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు ఆయనకు నేనొక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment