adds
-
బంగారు ఇల్లు!.. ధర తెలిస్తే గుండె జల్లు (ఫోటోలు)
-
ప్రైవేట్ జెట్, రూ.100 కోట్ల లగ్జరీ బంగ్లా, యాడ్స్‌తో కోట్లు, ఎవరీ ‘తార’
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్‌గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్‌గా పాపులర్ అయిన నయనతార ఒకరు. పార్ట్ టైమ్ మోడల్‌గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్‌తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్‌తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్. కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆ ఆదాయం మొత్తం ఇచ్చేస్తా: ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్-హమాస్ వార్ నేపథ్యంలో టెస్లా అధినేత ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. X Corp will be donating all revenue from advertising & subscriptions associated with the war in Gaza to hospitals in Israel and the Red Cross/Crescent in Gaza — Elon Musk (@elonmusk) November 21, 2023 ఈ మేరకు మస్క్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గాజాను పాలించే హమాస్ మధ్య భీకర పోరుకు నాలుగు రోజుల తాత్కాలిక విరామం ప్రకటన తరువాత మస్క్ సాయం ప్రకటన వచ్చింది. గత నెలలో, ఎలాన్ మస్క్ గాజాలోని గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు కనెక్టివిటీని అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్దానికి నిన్నటికి(నవంబరు 21) 46 రోజులు గడిచింది. ఈ దాడుల్లో 13వేలమందికి పైగా మరణించారు. OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation. The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG — Israel Defense Forces (@IDF) November 19, 2023 చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక -
మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎప్పుడు ఏమి చేసినా సంచలనమే.. దీని వల్ల అప్పుడప్పుడు కొన్ని విపరీతాలు కూడా జరుగుతాయి. ఇటీవల ఆయన చేసిన ఒక తప్పిదం మీద అమెరికా విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. దీంతో అమెరికా కంపెనీలైన యాపిల్, డిస్నీ వంటివి ఎక్స్‌లో యాడ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. యుద్ధ సమయంలో ఎక్స్‌లో వచ్చిన ఒక పోస్టుకు మస్క్ స్పందించిన విధానం అమెరికన్లకు నచ్చలేదు, ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. దీంతో దిగ్గజ కంపెనీలు ఎక్స్‌లో యాడ్స్ నిలిపివేయడానికి సిద్ధమయ్యాయి. కేవలం యాపిల్, డిస్నీ మాత్రమే కాకుండా.. ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్‌కాస్ట్ మొదలైన కంపెనీలు తమ యాడ్స్ నిలిపివేయాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. అమెరికన్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం మస్క్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న కంపెనీ మరింత కిందికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నారు. ఇదంతా మస్క్ చేసిన ఓ తప్పిదం వల్లే అని పలువులు నెటిజన్లు చెబుతున్నారు. -
ఈసీ వద్ద పొలిటికల్ యాడ్స్ పంచాయితీ
-
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్‌లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్‌కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్‌కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్‌లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్‌పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్‌లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్‌ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్‌ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
గూగుల్‌కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నికరంగా 17.20 లక్షల మంది సభ్యులు చేరారు. చేరిన మొత్తం ఈ సభ్యుల్లో కొత్త సభ్యుల సంఖ్య 8.47 లక్షలు. ఈ మేరకు విడుదలైన పేరోల్ డేటా ప్రకారం.. 8.47 లక్షల మంది కొత్త సభ్యుల్లో 54.15 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో మెజారిటీ సభ్యులకు సంఘటిత రంగంలో స్థానం లభించిందన్నమాట. మొత్తం 17.20 లక్షల మందిని తీసుకుంటే, 2023 మార్చితో పోల్చితే (13.40 లక్షల మంది) వీరి సంఖ్య పెరిగింది. ఇక ఏప్రిల్‌లో రీజాయినర్స్ ఎన్రోల్ అయిన నికర మహిళా సభ్యుల సంఖ్య ఏప్రిల్‌లో 3.48 లక్షలుకాగా, మార్చిలో వీరి సంఖ్య 2.57 లక్షలు. కొత్త సభ్యులను మాత్రమే తీసుకుంటే 8.47 లక్షల మందిలో 2.25 లక్షల మంది మహిళలు. ఏప్రిల్‌లో చేరిన నికర సభ్యుల్లో మెజారిటీ (59.20 శాతం మంది) వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకు చెందినవారు ఉన్నారు. తయారీ, ఐటీ సంబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్ ఇంజనీరింగ్, వాణిజ్య సంబంధ సంస్థలు, దుస్తులు, నిర్మాణం, ఎగుమతుల సేవా రంగాలు ఉన్నాయి. 7 కోట్లకుపైగా సభ్యత్వం.. ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 17.88 లక్షల మంది ఏప్రిల్ నెలలో చేరిక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 17.88 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈఎస్ఐ అనే సామాజిక భద్రతా బీమా పథకాన్ని ఈఎస్ఐసీ నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ కింద 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈఎస్ఐసీ కింద కొత్తగా 30,249 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. (ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు) ఏప్రిల్‌లో కొత్తగా 17.88 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 8.37 లక్షల మంది సభ్యులు 25 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. నికరంగా 3.53 లక్షల మంది మహిళా సభ్యులున్నట్టు తెలిపింది. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్ కేటగిరీ నుంచి 63 మంది సభ్యులుగా చేరారు. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
వివక్ష లేదు.. ‘నవరత్నాల పథకాలు’ యాడ్స్‌పై మంత్రి వేణు క్లారిటీ
సాక్షి, అమరావతి: నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. ‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం’’ అని మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్ -
వాటిపై మస్క్ క్షమాపణ: లేవు లేవంటూనే మళ్లీ ఉద్యోగాల కోత!
సాక్షి, ముంబై: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కోతలు లేవు...లేవంటూనే మరోసారి ఉద్యోగాలపై వేటు వేశాడు. సేల్స్ ఇంజనీరింగ్ విభాగాలలో పలువురు ఉద్యోగులను తొలగించాడు. వీరిలో ఒకరు నేరుగా మస్క్‌కి రిపోర్ట్ చేస్తున్న ఉద్యోగి కావడం గమనార్హం. ది వెర్జ్ నివేదిక ప్రకారం సేల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులను కంపెనీ గత వారం తొలగించింది. ఉద్యోగుల తొలగింపునకు కారణాలు తెలియరాలేదు.అయితే ట్విటర్ యాడ్స్, బిజినెస్ విధానాన్ని మెరుగుపర్చాలని ఉద్యోగులను కోరారని, అందుకు వారికి వారం రోజులు గడువు ఇచ్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 'ట్విటర్ 2.0'లో యాడ్స్ మానిటైజేషన్ మేనేజర్ మార్సిన్ కడ్లుజ్కాతన ఉద్యోగం పోయిన విషయాన్ని ట్విటర్లో పంచుకున్నారు. “థ్యాంక్యూ ట్వీప్స్. ట్విటర్లో 7 సంవత్సరాల సర్వీసుకు ముగింపు! అని ట్వీట్ చేశారు. ట్విటర్లో యాడ్స్ ఇంప్రూవ్మెంట్ వారం రోజుల్లో సాధ్యంకాదని, కనీసం రెండు మూడు నెలలు పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Thank you tweeps 🙏 End of 7 years at Twitter!@elonmusk 🙏 for learnings and energy in last 3 months to improve Twitter & Ads! I believe Twitter can really improve ads in 2-3 months (no necessarily in a week though) 📈💵 Wish I could be actually fired not just deactivated 🤷🏼♂️ pic.twitter.com/ygfrIfwZXY — Marcin (@marcinkadluczka) February 19, 2023 Thank you tweeps 🙏 End of 7 years at Twitter!@elonmusk 🙏 for learnings and energy in last 3 months to improve Twitter & Ads! I believe Twitter can really improve ads in 2-3 months (no necessarily in a week though) 📈💵 Wish I could be actually fired not just deactivated 🤷🏼♂️ pic.twitter.com/ygfrIfwZXY — Marcin (@marcinkadluczka) February 19, 2023 ఎలాన్ మస్క్ క్షమాపణ ట్విటర్ యూజర్లను ఇబ్బంది పెడుతున్న సంబంధం లేని బాధించే ప్రకటనలపై ఇటీవల మస్క్ క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, గూగుల్ సెర్చ్ మాదిరిగా ట్వీట్లలోని కీలకపదాలు, టాపిక్స్ ఆధారంగా యాడ్స్ వస్తున్నాయంటూ వివరణ ఇచ్చారు. Oh some more dots are being connected- interesting to learn and find confirmation of those information. I bet the team can deliver something great in that timeframe as those are great BE engineers 👩🏼💻🧑💻 !!! 🤗🙏 https://t.co/DJWPDWfj7V — Marcin (@marcinkadluczka) February 22, 2023 కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసి టెస్లా సీఈవో మస్క్ వేలాదిమందిని తొలగించారు. ముఖ్యంగా మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లను ఇంటికి పంపారు. అలాగే 2022, నవంబరు తర్వాత కంపెనీలో ఎలాంటి తొలగింపులు ఉండవని హామీ ఇచ్చారు. అయితే, అప్పటి నుంచి మరో రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగించగా, ఇది మూడోసారి. అలాగే ఇండియాలో ముంబై, ఢిల్లీ ట్విటర్ ఆఫీసులును కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. -
జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన రెండు ప్రకటనలను ఆగస్టు 26న విడుదల చేసింది. దీంతో ఈ యాడ్స్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగింది. జొమాటో డెలివరీ కార్మికుల పట్ల ఇంత అన్యాయమా అంటూ నెటిజన్లు జొమాటోపై విరుచుకుపడ్డారు. దీంతో జొమాటో స్పందించింది. ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అంటూ ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టింది. తమ తాజా ప్రకటనలను దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకున్నారం టూ జొమాటో ఒక ప్రకటన విడులల చేసింది. తమ ఉద్యోగులను హీరోలుగా నిలబెట్టడంతోపాటు, డెలివరీ భాగస్వాములతో గౌరవంగా మాట్లాడటం, డెలివరీ ఉద్యోగి గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రతి కస్టర్ తమకొక స్టార్ అని పునరుద్ఘాటించడమే ముఖ్య ఉద్దేశమని అని కంపెనీ తెలిపింది. బాలీవుడ్ స్టార్లు హృతికి రోషన్, కత్రినా కైఫ్‌తో యాడ్స్ వివాదానికి సంబంధించిన ప్రకటనలను పరిశీలిస్తే..హృతిక్ రోషన్ నటించిన జోమాటో యాడ్‌లో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు జొమాటోబాయ్ కస్టమర్( హృతిక్) డోర్‌బెల్ బెల్ మోగిస్తాడు. హృతిక్ రోషన్‌ను చేసిన అతను ఆశ్చర్యపోతాడు. ఇంతలో బాలీవుడ్ స్టార్ అతడిని సెల్ఫీ కోసం వేచి ఉండమంటాడు. దీనికి డెలివరీ బాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కానీ ఇంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది. తరువాతి డెలివరీ చేయాల్సిన మరో ఆర్డర్‌కు సంబంధించి కాల్ అది. దీంతో రోషన్‌తో సెల్ఫీ ఛాన్స్ వదులుకొని, మరో ఆర్డర్ డెలివరీకి బయలుదేరతాడు సంతోషంగా. "హృతిక్ రోషన్ హో, యా ఆప్, అప్నేలియే హర్ కస్టమర్ హై స్టార్ (హృతిక్ రోషన్ అయినా,మీరైనా, ప్రతీ కస్టమర్ జోమాటోకి స్టార్) అంటూ యాడ్ ముగుస్తుంది.(Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి) కత్రినా కైఫ్ నటించిన యాడ్‌లో కూడా ఇలాంటి సందేశమే ఉంటుంది. బర్త్‌డే కేక్ డెలివరీ ఇచ్చిన బాయ్‌ని కేక్ తిందువు ఉండమని అభ్యర్థిస్తుంది కత్రినా. ఇంతలో మరొక ఫుడ్ ఆర్డర్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడే జొమాటోకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల పట్ల ఇంత అన్యాయమా, ఇలాంటి ఆనందాలనువారికి దూరం చేస్తారా అంటూ నెటిజన్లు మండి పడ్డారు. డెలివరీ బాయ్‌లకు నిమిషం వ్యవధి కూడా ఇవ్వరా అంటూమరికొంతమంది విమర్శించారు. అంతేకాదు వారికి సరియైన వేతనాలు చెల్లించడం కంటే కంపెనీ సెలబ్రిటీలతో ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జొమాటో స్పందించింది. చాలామంది తమ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించారని, అయితే కొంతమందికి మాత్రమే నచ్చలేదని తెలిపింది. ఇవి ఆరు నెలల క్రితం తయారు చేసినవని వివరించింది. అలాగే తమ డెలివరీ పార్టనర్ల చెల్లింపులపై త్వరలోనే ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురిస్తామని తెలిపింది. తమ డెలివరీ పార్టనర్ నెట్ ప్రమోటర్ స్కోర్ 10నుంచి 28 శాతానికి పెరిగిందని ఇది ఇంకా పెరుగుతూనే ఉందని జొమాటో పేర్కొంది. (taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు) The other side of the story... pic.twitter.com/hNRj6TpK1X — zomato (@zomato) August 30, 2021 -
Pirated Sites: బందిపొట్లే... కానీ సంపాదనలో బడాబాబులే
సినిమా ఒక మాస్ కమ్యూనికేషన్..! ఒక విషయాన్ని వివరించడంలో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసే మాధ్యమం సినిమా. ఎంతో మందికి అన్నం పెడుతూ..ప్రేక్షకులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించడంలో సినిమా పాత్ర ఎనలేనిది. రకరకాల సినిమాలు నవరసాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడు ముందుంటాయి. ఎంటరైన్మెంట్ రంగంలో సినిమాకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. పెరుగుతున్న సాంకేతికతో సినిమా కూడా కొంతపుంతలను తొక్కుతుంది. సాంకేతికతో భారీ చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందిస్తూనే ప్రేక్షకులచే ఔరా..! అనిపిస్తున్నాయి ఇప్పటి సినిమాలు. సాంకేతికతో సినిమాలు తీసే విధానం పూర్తిగా మారగా..అదే సాంకేతికత సినిమాల కొంప ముంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కోటున్న పెద్ద సవాలు పైరెసీ భూతం. పైరసీ చేయడంతో ఆయా సినిమాలో కోసం పనిచేసిన వారి కష్టం బూడిదపాలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇతర చిత్ర పరిశ్రమలు పైరసీ భూతాన్ని ఎదుర్కొంటున్నాయి. పైరసీ భూతం సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. సినిమాలను పైరసీ చేసే పైరేటెడ్ సైట్ల ఆదాయం ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. సినిమాలు, ఇతర టీవీ షోలను పైరసీ చేయడం ద్వారా ఆయా పైరేటెడ్ సైట్లు ప్రతి సంవత్సరం సుమారు 1.3 బిలియన్ డాలర్లు (రూ. 9,660 కోట్లు.). ఇది కేవలం పైరేటెడ్ సైట్లకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే. పైరేటెడ్ సైట్లకు పోర్న్, ఇతర కంపెనీలు ఆదాయాన్నిచ్చే సంస్థలుగా నిలుస్తున్నాయి. కాగా యాడ్స్ కేవలం వాటి నుంచే వస్తున్నాయంటే పొరపడినట్లే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి సంపాదించిన ఈ-కామర్స్ సైట్లు కూడా పైరేటెడ్ సైట్లకు ఆదాయమార్గాలుగా ఉన్నాయి. పైరేటెడ్ సైట్లకు ప్రధాన కంపెనీ బ్రాండ్లు సుమారు నాలుగు శాతం మేర యాడ్ రెవెన్యూను అందిస్తున్నాయి. ఇవే ప్రధాన కంపెనీ బ్రాండ్స్ పైరేట్డ్ యాప్‌లకు 24 శాతం మేర ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల్లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సైట్లు కూడా ఉన్నాయి. పైరసీ ద్వారా సినిమాలను చూసే వారికి కూడా కచ్చితంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 84 వేల పైరేటెడ్ సైట్లు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. పైరేటెడ్ సైట్లను నియంత్రిచడంలో ప్రధాన కంపెనీలు కీలక పాత్ర వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆయా పైరేటెడ్ సైట్ల ఐపీలకు యాడ్స్‌ను కల్పించకుండా ఉంటే సైట్లకు రెవెన్యూ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. -
మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రకటనల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్టెల్ యాడ్స్‌ను ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న భారతీయ ప్రకటనల పరిశ్రమలో పట్టు సాధించడానికి ఎయిర్టెల్ చేస్తున్న ప్రయత్నమని కంపెనీ తెలిపింది. కంపెనీ డేటా సైన్స్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. కాన్సెంట్ బేస్డ్, ప్రైవసీ సేఫ్ క్యాంపెయిన్ అందించేందుకు బ్రాండ్లకు అనుమతిస్తుంది. ఇది కేవలం తమ కస్టమర్లకు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ల ప్రకటనలను మాత్రమే అందిస్తుందని, అవాంచిత స్పామ్‌లను కాదని భారతీ ఎయిర్టెల్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ తెలిపారు. తాము క్వాంటిటీ కోసం కాక క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రకటనల వ్యాల్యూమ్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల ప్రాధాన్యత, బ్రాండ్ల మధ్య సంబంధాలను ఏర్పరుచుకోవాలని కంపెనీ చూస్తుందని.. అంతేగానీ అర్థవంతం కానీ ప్రకటనలతో కస్టమర్లను కోల్పోదని లేదా వినియోగదారుల ప్రొఫైల్స్‌ను కోల్పోమని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం మొబైల్, డీటీహెచ్, హోమ్స్ వంటి వివిధ వ్యాపారాలకు సంబంధించి 320 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. రిటైల్ స్టోర్లలో డిజిటల్ యాడ్స్.. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రిటైల్, స్టోర్లున్నాయి. డిజిటల్ అవగాహన లేని వినియోగదారుల కోసం ఆయా ప్రాంతాలలో హెల్త్ కవరేజ్, వీడియో సబ్స్క్రిప్షన్ వంటి ప్రకటనలు ఏమైనా చేయగలమా? లేదా? అనే టెస్టింగ్స్ జరుగుతున్నాయని.. త్వరలోనే రిటైల్, స్టోర్లలో ఈ ప్రకటనల యూనిట్లు కనిపించే అవకాశముందని నాయర్ తెలిపారు. పెప్సికో, జొమాటో, క్రెడ్, టాటా ఏఐజీ, అపోలో, లెన్స్‌కార్ట్, కార్స్24, గేమ్స్క్రాఫ్ట్, హార్లీడేవిడ్సన్ వంటి సుమారు వంద బ్రాండ్ల ప్రచారాలు బీటా దశలో కొనసాగుతున్నాయి. చదవండి: (తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్ కేంద్రాలు) -
యూట్యూబ్ చానల్ ప్రతినిధుల నిర్వాకం
సాక్షి, భవానీపురం(విజయవాడ): ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది. సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్ సెంటర్లోని సుధాకర్ మెడికల్ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము వన్ టీవీ న్యూస్ ప్రతినిధులమని, యాడ్ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్ షాపని, యాడ్ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్ ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరంకూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు. తమకు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వన్ టీవీ ప్రతినిధి ఐడీ కార్డు, కారు ∙ఇదే యూట్యూబ్ చానల్‌కు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్ చానల్ రిపోర్టర్నని ఐడీ కార్డ్ చూపించాడు. కారు నంబర్ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని వినికిడి. -
ట్రంప్ ప్రకటనల్ని తొలిగించిన ఫేస్బుక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రకటనల్ని ఫేస్బుక్ తొలిగించింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్వేశపూరిత సింబల్‌ను ఉపయోగించారన్న కారణంతో పోస్టులను తొలిగిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయ ఖైదీలను గుర్తించేందుకు వాడే నిషేధిత సింబల్స్‌ని ప్రకటనల్లో ఉపయోగించారన్న కారణంతో పోస్టులను తొలిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ('ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధం' ) రాజకీయ ఖైదీలను గుర్తించడానికి నాజీలు రివర్స్ ట్రై యాంగిల్ సింబల్‌ను వాడతారు. దీన్నే ట్రంప్ ప్రకటనల్లో సైతం ఉపయోగించారు. విద్వేశాన్ని రెచ్చగొట్టేలా ఇలాంటి ప్రకటనలు కంపెనీ పాలసీకి విరుద్ధం అని పేర్కొన్న ఫేస్బుక్.. దానికి సంబంధించిన పోస్టులు, ప్రకటనల్ని తొలిగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణల్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఇది నాజీ చిహ్నం కాదు ఫాసిస్ట్ వ్యతిరేక సమూహం యాంటిఫా ఉపయోగించిన చిహ్నం అని పేర్కొన్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా యాంటిఫా వర్గం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శలు చేపట్టడం గమనార్హం. (కరోనాతో విశ్వవ్యాప్తమవుతున్న భారతీయ సంస్కృతి ) -
నిమిషానికి 5 వేల ప్రకటనలు తొలగించాం
సాక్షి, న్యూఢిల్లీ: 2019లో మొత్తం 270 కోట్ల (2.7 బిలియన్లు) తప్పుడు ప్రకటనలను నిషేధించామని సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. తమ నిబంధనలు ఉల్లంఘించిన తప్పుడు ప్రకటనలను (నిమిషానికి 5,000 పై చిలుకు) తొలగించడం లేదా బ్లాక్ చేసినట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అలాగే దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ 1.2 మిలియన్లకు పైగా ఖాతాలను రద్దు చేసింది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన 21 మిలియన్ వెబ్ పేజీల నుండి ప్రకటనలను తొలగించినట్టు వెల్లడించింది. ఇటీవల వెల్లడించిన 'గూగుల్: బాడ్ యాడ్స్ రిపోర్ట్' లో ఈ వివరాలను గూగుల్ పొందుపర్చింది. యూజర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఫేస్ మాస్క్‌లు, నివారణ మందులు వంటి వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. అలాగే అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019 లో 35 మిలియన్లకు పైగా ఫిషింగ్ ప్రకటనలను తొలగించాం. 19 మిలియన్ల ట్రిక్-టు-క్లిక్ ప్రకటనలు తొలగించాం. ఈ బెడద సుమారు 50 శాతం తగ్గిందని పేర్కొంది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటినుంచి ఈ వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారం, ప్రకటనలతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించే ప్రకటనలు, ప్రకటనకర్తలపై ఓ కన్నేసి ఉంచినట్లు వివరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ టీమ్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తోందని గూగుల్ పేర్కొంది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించే ప్రకటనకర్తల ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్పెన్సర్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు. ‘కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు గూగుల్‌ను ప్రజలు విశ్వసిస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. కరోనా సమయంలో కూడా దాన్ని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. -
కోవిడ్-19 : ఫేస్బుక్ కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కోవిడ్-19 (కరోనావైరస్)పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ స్పందించింది. కరోనా వైరస్‌కు సంబంధించిన తప్పుడు ప్రకటనలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటిపై కొరడా ఝళింపించేందుకు సిద్ధమైంది. తప్పుడు సమాచారాన్నిస్తున్న ప్రకటనలపై నిషేధించినట్టుగా ప్రకటించింది. అలాగే తప్పుడు యాడ్స్ డిస్ ప్లే చేసే ఫేస్బుక్, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం, ప్రకటనలు ఈ వైరస్‌పై చేస్తున్న పోరాటంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఉదాహరణకు వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఫేస్ మాస్క్‌లు 100 శాతం ఉపయోగడతాయి లాంటి సందేహాస్పదమైన ప్రకటనలను అనుమతించమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్లాట్‌ఫాంపై ఇలాంటి ప్రకటనలను తొలగించే ప్రక్రియను జనవరి 31 నుంచే ప్రారంభించామని, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌పై కనిపించే ప్రతి తప్పుడు సమాచారాన్ని సోషల్ ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా గుర్తిస్తున్నామన్నారు. కరోనా వైరస్ సంబంధిత యాడ్స్ పై ఇటీవల తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం ప్రజలను తప్పుదారి పట్టించే అన్ని ప్రకటనలను నిరోధిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగివున్న ఫేస్బుక్ తాజా నిర్ణయాన్ని వెల్లడించింది. చదవండి: కరోనా: భారత్‌కు తిరిగొచ్చిన జ్యోతి ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త -
ఇకపై ఆ తలనొప్పి వాట్సప్‌లోనూ..!
న్యూఢిల్లీ: రోజురోజుకూ వాట్సప్ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్ కొనే చాలామంది మొదట ఇన్స్టాల్ చేసే యాప్ వాట్సప్ అంటే అతిశయోక్తి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సప్ సంస్థ కూడా ఈ ఏడాదిలో విడుదల చేసే ముఖ్యమైన ఫీచర్లలో స్టేటస్ యాడ్స్ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయి. ఇప్పటిదాకా కొన్నింటికే పరిమితమైన ఈ యాడ్లు ఇకపై వాట్సప్‌లో కూడా డిస్ప్లే అవుతాయని నెదర్లాండ్‌లో జరిగిన ఫేస్బుక్ మార్కెటింగ్ సమ్మిట్ 2019లో ఆ సంస్థ వెల్లడించింది. కాకపోతే ఈ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై మాత్రం ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. -
స్టార్హీరో ఇంటి ముట్టడికి వ్యాపారులు సిద్ధం
సాక్షి, చెన్నై: నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించేందుకు చిరు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్న విజయ్ సేతుపతి ఇప్పుడు చిరువ్యాపారుల ఆగ్రహానికి గురవుతున్నారు. అందుకు కారణం ఇటీవల ఆయన ఆన్లైన్ వ్యాపారం కోసం ఒక వ్యాపార సంస్థ రూపొందించిన మండి యాప్‌లో నటించడమే. ఆ యాప్‌లో చిరు వ్యాపారులకు నష్టం కలిగేలా కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చనే విధంగా విజయ్‌సేతుపతి నటించారు. దీంతో చిరువ్యాపారులు ఆయన ఆ యాప్‌లో నటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో చిరు వ్యాపార సంఘాలు నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దీనిపై స్పందించిన తమిళనాడు వ్యాపారసంఘల నిర్వాహకులు.. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఏ విషయాన్ని తాము అనుమతించమన్నారు. అన్లైన్ వ్యాపారంతో చిరు వ్యాపారులకు చాలా నష్టం ఏర్పడుతుందన్నారు. ఆన్లైన్ వ్యాపారం పేరుతో బడా సంస్థలు చేస్తున్న వ్యాపారం ప్రజలకు చేటుచేస్తుందన్నారు. ఉదాహరణకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నామని చెప్పే వ్యాపార సంస్థలు ఆ వస్తువులను శీతలీయం పరచి విక్రయిస్తున్నారని చెప్పారు. అలా వంకాయలు, టమాటాలు కూరగాయలు సహజంగా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవన్నారు. అలాంటి వాటిని శీతలీయం పరిచి విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న బడా వ్యాపారులు స్థానిక కోయంబేడు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్న విషయం వెలుగు చూసిందన్నారు. వారిని అడ్డగించి మార్కెట్ వ్యాపారులు ఆందోళన చేసినట్లు తెలిపారు. స్టార్స్ ఆలోచించాలి కాగా ఇలాంటి ప్రజలకు బాధింపు కలిగించే వ్యాపార ప్రకటనల్లో నటించే ముందు నటీనటులు ఆలోచించాలన్నారు. నటుడు విజయ్‌సేతుపతి అంటే నటుడిగా తమకు గౌరవం ఉందని, అయితే ఆయన చిరు వ్యాపారులను బాధించే ఇలాంటి ఆన్లైన్ వ్యాపారానికి ప్రచార ప్రకటనల్లో నటించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ తరహా ఆన్లైన్ వ్యాపారాలను నిషేధించాలని త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. అంతలోతుగా ఆలోచించలేదు ఈ వ్యవహారంపై నటుడు విజయ్‌సేతుపతి వర్గం స్పందిస్తూ చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లే ఏ విషయాన్ని విజయ్‌సేతుపతి చేయరన్నారు. ప్రజల ఆదరణతో ఈ స్థాయికి చేరుకున్న ఆయన ఎవరి వ్యాపారాలకు బాధింపు కలిగించే ఆలోచనలేదన్నారు. ఈ యాప్‌లో నటించే ముందు నటుడు విజయ్‌సేతుపతి పర్యావసనం గురించి అంతలోతుగా ఆలోచించలేదని పేర్కొన్నారు. కాగా ఈ విషయమై సంబంధిత వ్యాపార సంస్థనే త్వరలో వివరణ ఇస్తుందన్నారు. -
ట్విటర్ సంచలన నిర్ణయం
సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధించింది. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. తన వేదికపై రాజకీయ ప్రకటనలను నిషేధిస్తుందని ట్విటర్ చీఫ్ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాజకీయ సందేశాలు ప్రజలకుచేరాలి తప్ప కొనకూడదు" అని డోర్సే ట్వీట్ చేశారు. ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామని, నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం గమనార్హం. We’ve made the decision to stop all political advertising on Twitter globally. We believe political message reach should be earned, not bought. Why? A few reasons…🧵 — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 We’ll share the final policy by 11/15, including a few exceptions (ads in support of voter registration will still be allowed, for instance). We’ll start enforcing our new policy on 11/22 to provide current advertisers a notice period before this change goes into effect. — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 -
ఫ్రీగా అయితే చూసేస్తాం!!
ముంబై: ప్రకటనల బెడద ఉన్నప్పటికీ దేశీయంగా 25 శాతం మంది వినియోగదారులు ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌పై కంటెంట్‌ను ఉచితంగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. పరిమితమైన ప్రకటనలతో ఎంతో కొంత చెల్లించి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే వారు పాతిక శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా వీడియో క్లౌడ్ సర్వీసులు అందించే బ్రైట్‌కోవ్ అనే సంస్థ ‘2019 ఆసియా ఓటీటీ రీసెర్చ్ రిపోర్ట్’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యూగవ్‌తో కలిసి దీన్ని రూపొందించింది. భారత్‌లో 1,000 మంది, మొత్తం ఆసియా దేశాల్లో 9,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రకటనల సమస్య లేకపోతే కాస్త ఎక్కువ ఫీజు కట్టేందుకు కూడా సిద్ధమని 14 శాతం మంది దేశీ వినియోగదారులు వెల్లడించారు. మరో 14 శాతం మంది ఇటు ధరను, అటు యాడ్ ప్యాకేజీలను తమకు నచ్చినట్లుగా మార్చుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ మాధ్యమంగా సినిమాలు, పాటలు, వీడియోలు మొదలైన కంటెంట్‌ను అందించడాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు. బ్రేక్‌కు రెండు యాడ్స్.. ఇక ఒకసారి బ్రేక్ వస్తే రెండు ప్రకటనల దాకా భరించవచ్చని 22 శాతం మంది భారతీయులు పేర్కొనగా, మూడు యాడ్స్ కూడా చూసేందుకు 13 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓటీటీ కంపెనీలు కావాలంటే కొంత యాడ్స్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని ఇటు సబ్స్క్రిప్షన్ ఫీజును సాధ్యమైనంతగా తగ్గించే హైబ్రీడ్ మోడల్‌ను పాటిస్తే బాగుంటుందని 80% మంది అభిప్రాయపడ్డారు. నెలకు 1 డాలరు కన్నా తక్కువ ఫీజు.. దేశీయంగా 37 శాతం మంది సబ్‌స్క్రయిబర్స్ ఓటీటీ కంటెంట్‌కి నెలకు 1 డాలరు కన్నా తక్కువ చెల్లించడంపై మొగ్గు చూపుతుండగా, 27% మంది 1–4 డాలర్ల దాకా, 16% మంది 5–9 డాలర్ల దాకా కట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో 48% మంది ఓటీటీ యూజర్లు సబ్స్క్రిప్షన్ కొనసాగిస్తుండగా, 19% మంది పునరుద్ధరించుకోలేదు. వీరిలో 60% మంది మళ్లీ భవిష్యత్‌లో ఓటీటీ సర్వీసులకు మళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్, మొబైల్‌పై అందుబాటులో ఉండటం, తక్కువ డేటా వినియోగంతో వీడియో స్ట్రీమింగ్ అవడం వంటి మూడు ఫీచర్స్‌ను ఎక్కువమంది కోరుకుంటున్నారు. -
నేనూ.. మోసపోయా..!
న్యూఢిల్లీ : నకిలీ ప్రకటనలకు తను కూడా మోసపోయినట్లు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ నకిలీ ప్రకటనలపై లేవనెత్తిన చర్చలో భాగంగా వెంకయ్యనాయుడు తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సులువుగా బరువు తగ్గడానికి వచ్చిన ఓ ప్రకటనను చూసి మోసపోయానన్నారు. వెయ్యి రూపాయల మందులతో బరువు తగ్గొచ్చన్న ప్రకటనకు డబ్బులు చెల్లించి ఆర్డర్ బుక్ చేశానన్నారు. ట్యాబ్లెట్లు అందిన తర్వాత మెయిల్ వచ్చిందని, అందులో మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే మీకు అవసరమైన ఒరిజనల్ ట్యాబ్లెట్లు పంపిస్తామని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయానని గ్రహించి వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే విచారణలో ఈ ప్రకటనలు అమెరికా కేంద్రంగా వచ్చాయని తేలిందన్నారు. ఇలాంటి ప్రకటనలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఎదో ఒకటి చేయాలని ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖను కోరారు. -
ప్రకటనలు, మాటలతో మాయచేసి..
బంజారాహిల్స్ : ప్రకటనలు, మాటలతో మాయచేసి మోసాలకు పాల్పడుతూ రూ. కోట్లు కొట్టేసిన కి‘లేడి’ని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లివాకం నారాయణమేస్త్రీ రెండో వీధికి చెందిన సుజాత అలియాస్ కన్మణి ‘ఎక్స్‌ప్రెస్ కార్ వాష్’ కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2.50 లక్షలు డౌన్‌పేమెంట్ కడితే మీ పేరుతో కారును కొనుగోలు చేసి, అద్దెకు తిప్పుతూ ప్రతినెల రూ.30 వేలు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చింది. దీనిని చూసి ఆకర్శితుడైన ముషీరాబాద్‌కు చెందిన రామారపు శశాంక్‌తో పాటు మరో 23 మంది 2016 సెప్టెంబర్ 7న రూ.2.50 లక్షల చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా కార్లు కొనుగోలు చేయకపోగా ప్రతినెలా ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వక పోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెను విచారించగా నాగోల్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహాలో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఏడాదిలో 160 మందిని మోసం చేసి రూ.5 కోట్లు కాజేసినట్లు తెలిసింది. తమిళనాడులోనూ ఆమెపై ఈ తరహా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తులు సురేష్‌బాబు, శ్రీకాంత్, శేషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదివింది ఎంఏ ఎంఫిల్ ఎక్స్‌ప్రెస్ కార్ వాష్ కంపెనీ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న సుజాత అలియాస్ కన్మణి ఎంఏ ఎంఫిల్ చదివారు. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకుంటారు. చాలా మంది ఆమె మాటలు నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఆమె వైఖరిలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. -
ఆప్టెక్ బిగ్ ర్యాలీ
ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడర్ ఆప్టెక్ ప్రీ స్కూల్ రంగంలో అడుగుపెడుతున్నామన్న ప్రకటన కంపెనీకి మరింత బూష్ట్ ఇచ్చింది. ఈ కొత్త వెంచర్ కోసం అంతర్జాతీయ మోంటానా ప్రీస్కూల్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ట్రేడ్ పండితుడు రాకేష్ ఝున్ ఝన్ వాలా ఇటీవల భారీ వాటా కొనుగోలుతో జోరుగా ఉన్న ఆప్టెక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ పొత్తు వార్తల నేపథ్యంలో మార్కెట్ లో ఆప్ టెక్ షేరు దూసుకు పోయింది. ఈ డీల్ ప్రకారం ఆప్టెక్ రాబోయే రెండు సంవత్సరాలలో భారతదేశం లో 1,000 ప్రీస్కూల్స్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్యుకేషన్ రంగంలో వేగమైన అభివృద్ధి ఉందని ఆప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ కేకర్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రీస్కూల్ విద్య మార్కెట్ రూ16,000 కోట్లుగా ఉందని తెలిపారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఐటీ శిక్షణా దిగ్గజం ఆప్టెక్ షేరు 10 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఆప్టెక్ 10,000 కిపైగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు జీయోజిత్ బీఎన్సీ పరిబాస్ తో కుదిరిన ఒప్పందాన్ని జూలై లో ప్రకటించింది. దీంతోపాటుగా ఎన్ఎస్ఇ డేటా ప్రకారం ఆగస్ట్‌లో ఆప్టెక్ లో ప్రధాన ప్రమోటర్లగా ఉన్న ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం మరింత వాటాను కొనుగోలు చేశారు సంగతి తెలిసిందే. దీంతో ఆప్టెక్ షేర్లు గత మూడు నెలల్లో శాతం 150 శాతం లాభపడిందని నిపుణులు తెలిపారు. కాగా గత జూన్ త్రైమాసికంలో ఆప్టెక్ లిమిటెడ్ రూ 0.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.2.84 కోట్లు. అయితే ఆదాయంలో మాత్రం వృద్ధిని సాధించి రూ 58 కోట్లుగా నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 50 కోట్లుగా ఉంది. -
ఓఎల్ఎక్స్ యూజర్లే టార్గెట్..
రాంగోపాల్‌పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. అదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్‌కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తన సోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదుఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.