ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్‌లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది.
గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు
దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది.
గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్
ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది.
93 మిలియన్ డాలర్ల చెల్లింపులు
తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్‌లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది.
గూగుల్ దారిలో మెటా
యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్‌బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment