Tracking
-
వీడని మలబార్ పునుగు పిల్లి పొడుపు కథ!
బిల్డింగ్ చుట్టూ ఉన్న ఏనుగుల కందకంలో ఫారెస్ట్ గార్డ్ రాత్రి భోజనంలో మిగిలిపోగా పారేసిన కోడి ఎముకలను పటపటా నవులుతున్నాయి ఆ రెండు పెద్ద పునుగు పిల్లులు. అవి చిన్న భారత పునుగు పిల్లుల కంటే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. మా శక్తివంతమైన లైట్లను మెరుగైన దృష్టికోణంతో చూడటానికి అవి మధ్య మధ్యలో వాటి వెనక కాళ్లపై నుంచుంటున్నాయి. మా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది: మలబార్ పునుగు పిల్లి, ఎవరికీ అంతుచిక్కని పాలిచ్చే భారతీయ జంతువు. అవి పారిపోతాయేమోనన్న భయానికి మేము కెమెరా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. దానికి బదులుగా మేము చీకట్లోనే దాని లక్షణాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాము.దెగ్గర దెగ్గర ఆరు దశాబ్దాల క్రితం హై వేవీ మౌంటెన్స్ తెయ్యాకు ఎస్టేట్‌లోని తెయ్యాకు రైతు అయిన ఆంగస్ హటన్ మలబార్ పునుగు పిల్లి చాలా విరివిగా కనిపించే జంతువని వ్రాసి పెట్టారు., కానీ ఆయన చిన్న భారతీయ పునుగు పిల్లిని చూసి అలా పొరపాటు పడ్డారేమో అనేది ఒక ప్రఘాడ అనుమానం. 1939 కల్లా మలబార్ పునుగు పిల్లి అరుదై, అంతరించిపోవడానికి దెగ్గరగా ఉందేమోనని జంతు శాస్త్రవేత్తలు భయపడ్డారు. మేము ఎంతో ఉత్సాహంగా, రెండు మలబార్ పునుగువ పిల్లులని చూశామని సందర్శకుల పుస్తకంలో రాశాము.మలబార్ పునుగు పిల్లిని లోగోగా పెట్టుకున్న సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ సంస్థలో అజిత్ కుమార్ గారు మేము మలబార్ పునుగు పిల్లిని చూశామని విశ్వసించలేదు. చిన్న భారతీయ పునుగు పిల్లి ఎంతో విసతృతంగా రకరకాల నివాసాలలో, ఎత్తులలో, ఆక్షాంసాలలో, చాలా విభిన్న లక్షణాలు, శరీర ఆకృతి, పరిమాణాలు కలిగి ఉంటుందని ఆయన సూచించారు.ఒక జీవశాస్త్రవేత్త, మేము చూసిన పునుగు పిల్లికి సింహం వంటి జూలు ఉందా అని అడిగారు. కానీ మేము అది గమనించలేదు. మెడ పొడవునా మూడు చారలూ? అటువంటిదేదో చూశామని మేము అనుకున్నాం. దాని తోక చుట్టూ కట్లు గమనించామా అని ఇంకొకరు అడిగారు. ఏమో, అప్పుడు చాలా చీకటిగా ఉంది. వాటి తోక చివర నల్లగా ఉందా? దృరదృష్టవశాత్తు ఈ లక్షణాల కోసం చూడాలని మాకు తెలియలేదు.పాలిచ్చే చిన్న జంతువుల మీద నిపుణులైన నందిని రాజమణి మారియు దివ్య ముదప్పా, ఇంగ్లాండ్‌లో మారియు ఇండియాలో ఉన్న రకరకాల మ్యూసియంలలో భద్రపరచిన మలబార్ పునుగు పిల్లులకి సంబంధించిన ఆరు చార్మాలూ ఇంకా మూడు కాపలాలు పరీక్షించారు. అంతే కాక 1800లు మొదలుకుని పునుగు పిల్లుల మీద రాయబడ్డ ప్రతీదీ చదివేసారు.నివేదిక ప్రకారం మలబార్ పునుగు పిల్లి పడమర కానుముల లోతట్టు తీరప్రాంత అడవులలోని కర్వార్, ఉత్తర కర్ణాటక నుంచి కేరళలోని త్రివేండ్రమ్ వరకూ కనిపిస్తాయి. కొద్ది సార్లు అవి తిరుణలవెలి లోపల బిలిగిరి రంగస్వామి కోవెల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనూ, హై వేవీ కొండలంలోనూ కనిపించాయి. కానీ అవి ఎక్కువగా కోజికోడ్ చుట్టుపక్కలే కనిపించాయి. ఆసియాలో మరి ఏ పునుగు పిల్లి ఇంత పరిమిత పరిధిలో ఉండదు.పేరుగాంచిన మలబార్ పునుగు పిల్లి యొక్క మస్క్ కోసం దాన్ని వేటడడం వల్ల అవి అరుదైపోయి ఉండడానికి అవకాశం ఉండవచ్చని నందిని, దివ్య ఒప్పుకున్నారు. కానీ, వేరే పునుగు పిల్లులు చక్కగా అభివృద్ధి చెందుతుంటే, ఈ జంతువు వాటి నివాసమైన అడవులను పొలాలుగా మారిస్తే తట్టుకోలేనంత సున్నితమైనవా?మ్యూసియం నమూనాలా మూలం సరిగా తెలియనందువల్ల, ఇంకా పాలిచ్చే జంతువుల నిపుణుల మధ్య బేధభిప్రాయాలవల్ల, మలబార్ పునుగు పిల్లి రూపం పట్లా, లక్షణాల పట్లా నిజమైన స్పష్టత లేదు. ఇది చాలదన్నట్టు దక్షిణ ఆసియాలోని పెద్ద-చుక్కల పునుగు పిల్లులు మారియు మలబార్ పునుగు పిల్లులు దెగ్గర దెగ్గర ఒకే పోలికలతో ఉంటాయి. ఈ విషయం ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయం సూచిస్తుంది: మలబార్ పునుగు పిల్లులు ఎన్నడూ ఉనికిలోనే లేవు!మందుల తయారిలో, సుగంధ ద్రవ్యాలా తయారిలో, ఇంకా పూజలలో ఉపయోగించే పునుగు పిల్లుల మస్క్ గ్రంధిలోని సివిటోన్ కోసం వేల ఏళ్లుగా ఇథియోపియా, దక్షిణ ఆసియా ఇంకా భారతదేశం మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ రోజుకి కూడా మస్క్ తియ్యటంకోసం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చిన్న పునుగు పిల్లులను ఫార్మ్ లో పెంచుతారు. ఈ మధ్యకాలంలో అతి ఎక్కువగా మలబార్ పునుగు పిల్లి కనిపించిన స్థలమైన కోజికోడ్ పూర్వ కాలం నుంచీ పునుగు పిల్లుల వ్యాపార కేంద్రం. దక్షిణ ఆసియా నుంచి తెచ్చిన పెద్ద-చుక్కల పునుగు పిల్లులు చెర నుంచి తప్పించుకు పారిపోవడంతో అప్పుడప్పుడు అడవిలో పునుగు పిల్లులు కనిపించడానికి అవకాశం ఇచ్చివుంటుందా అని నందిని, దివ్య ఆలోచించారు. ఇదేమంత అసంభవం కాదు, ఎందుకంటే చిన్న భారత పునుగు పిల్లులు తప్పించుకుని మాడగాస్కర్, ఫిలిప్పీన్స్ మారియు ఇతర దక్షిణ ఆసియా దీవులలో వాటినవి స్థాపించుకున్నాయి. అందువల్ల మలబార్ పునుగు పిల్లి, పెద్ద- చుక్కల పునుగు పిల్లి కంటే పెద్ద ప్రత్యేకత కలిగిందేమి కాకపోవచ్చు అనడానికి ఎంతో అవకాశం ఉండీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో జన్యు పరీక్ష ఇంకొక ముందంజ వేస్తుంది. అసల మలబార్ పునుగు పిల్లులు నిజమైనవేనా? కానీ పురాతన నమూనాల నుంచి తీసిన డిఎన్ఏ మరీ సిధిలం అయిపొయింది. అందువల్ల మలబార్ పునుగు పిల్లిని గురించిన పొడుపు కథ ఇంకా వీడలేదు.Author: జానకి లెనిన్Translator: రోహిణి చింతా -
ఐటీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
స్మార్ట్ కే‘రింగ్’! మంత్రదండంలాంటి ఉంగరం
ఇప్పటికే మార్కెట్లోకి కొన్ని రకాల స్మార్ట్రింగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ‘కుమీ టెక్నాలజీస్’ మిగిలిన స్మార్ట్రింగులను మించిన ఫీచర్లతో ‘కుమి రింగ్ హెచ్1’ పేరుతో మంత్రదండంలా పనిచేసే స్మార్ట్రింగును అందుబాటులోకి తెచ్చింది.దీని తయారీకి మన్నికైన మైక్రోక్రిస్టలిన్ జిర్కోనియమ్ నానో సిరామిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించడం విశేషం. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్రింగు బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, రక్తపోటు వంటి వివరాలను ఇది ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని మార్పుల వివరాలను కూడా ఇది తెలియజేస్తుంది. ఇందులో ‘ఎస్ఓఎస్’ బటన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ‘ఎస్ఓఎస్’ బటన్‌ను నొక్కితే, వెంటనే ముఖ్యమైన కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తుంది. దీని ధర 199.99 డాలర్లు (రూ.16,788) మాత్రమే! -
ప్రతి విద్యార్థికీ ‘పెన్’
సాక్షి, అమరావతి: కాకినాడ నగురంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలకృష్ణ కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. బాలుడు ఇక్కడ టీసీ తీసుకోలేదు. అయితే, ఆ విద్యార్థి అక్కడ బడిలో చేరినట్టు ఎక్కడా వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితి విద్యాశాఖకు సవాలే. బడి ఈడు పిల్లలు ఎంతమంది బడిలో ఉంటున్నారు, ఎంతమంది బడికి వెళ్లడంలేదో తెలుసుకునేందుకు ఇంటింటికీ సర్వే చేయడం తప్ప ఇప్పటివరకు మరో మార్గం లేదు. ‘పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)’తో దీనికి పరిష్కారం లభిస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం–2020 (ఎన్ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పెన్ను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇదే తరహా విధానం అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది.’పెన్’ అంటే..ప్రి ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్య మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలోని ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)’లో నమో దు చేస్తారు. ఒకటో తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికీ డిజీ లాకర్‌ను ఓపెన్ చేసి, అన్ని సర్టిఫికెట్లను అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ వస్తుంది. ఈ నంబరు ఆధార్ నంబరులాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలు నుంచి మరొక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలుకు బదిలీ అయినప్పు డు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీ లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అవసరం లేకుండా చేరొచ్చు. ఈ పెన్ నంబరు ఇవ్వగానే ఆన్లైన్లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికె ట్లు అందులో వస్తాయి. దీనిద్వారా విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సులభంగా ట్రాన్స్ఫర్ అవ్వొచ్చు. చదువు పూ ర్తయిన అనంతరం వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్ నంబర్ నమోదు చేసేవారు. అయితే, ఈ వివరాలు ఆ జిల్లా, రాష్ట్రం వరకే తెలిసేవి. ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరోచోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టం. అయితే పెన్ ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్ నంబర్‌కు కూడా అప్డేట్ చేస్తారు. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చు.పత్రాలు లేకుండానే బదిలీరాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్ స్థాయి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 86 లక్షల మందికి, ఈ విద్యా సంవత్సరం ప్రి ప్రయిమరీలో చేరే విద్యార్థులకు కూడా ‘పెన్’ కేటాయిస్తారు. దీని ద్వారా జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే 2024–25 విద్యా సంవత్సరంలో ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే విద్యార్థులు, ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలలో చేరే విద్యార్థికి టీసీ, స్టడీ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం.. ఇలా అనేక సర్టిఫికెట్లను సమర్పించాలి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల అవసరం లేకుండా విద్యార్థి ‘పెన్’ నంబర్‌తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్క క్లిక్‌తో విద్యార్థిని బదిలీ చేయొచ్చు.పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్వచ్చే నెలలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ సులభతరం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5, 7 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను పై తరగతులు ఉన్న పాఠశాలలకు ట్యాగింగ్ చేస్తారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థికి అవసరమైన స్కూళ్లను ఆన్లైన్లో చూపిస్తే తల్లిదండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి విద్యార్థులందరినీ మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటాను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు సమర్పించా ల్సిన అవసరం ఉండదు. ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇదే విధానం అనుసరిస్తారు. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల్లో ఇదే తరహా విధానం అనుసరిస్తారు. గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, నివాస «సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు. ‘పెన్’పై అవగాహన ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ‘పెన్’ నంబర్ కేటాయించాలని పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా, మండల విద్యా శాఖాధికారులు, పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో పర్మినెంట్ నంబర్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, సర్టిఫికెట్ల పేరిట తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. -
గూగుల్‌కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్
ఇప్పటికి వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నిఘా పెట్టిన పలు ఐటీ సంస్థలు, పని పట్ల అలసత్వం ప్రదిర్శిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా రిపోర్టు ఒకటి సంచలనంగా మారింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారంఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్, వెబ్‌క్యామ్‌ల ద్వారా కూడా వీరికి పర్యవేక్షిస్తున్నారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) పలు దిగ్గజ కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రం ఆఫీసు విధానానికి జైకొడుతున్నాయి. ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం ఉద్యోగులు,నిపుణులు మాత్రం ఇంటినుంచే పని చేస్తున్నారు. ఇలాంటి వారిపైనే సంస్థలు ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా వారిపై నిఘా పెడుతున్నట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. (మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర) ఎంప్లాయీస్ మానిటరింగ్ టూల్స్‌తో నిఘా సాఫ్ట్వేర్ కీస్ట్రోక్‌లు, మౌస్ కదలికలతో సహా వివిధ రకాల కదలికలను కూడా ఈ సాఫ్ట్వేరు కనిపెడుతుందట. దీని ద్వారా రిమోట్ కార్మికులపై కన్ను వేసి ఉంచుతున్న కంపెనీలు, తేడా వేస్తే మాత్రం తీసివేయడానికి వెనుకాడటం లేదు. ఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్ ద్వారా వారిని ట్రాక్ చేస్తున్న కంపెనీలు పని వేళల్లో వారు కంప్యూటర్లకు దూరంగా ఉన్నట్టు వెల్లడైతే మాత్రం ఆయా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. (OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ) ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి దొరికిపోయింది. ఆమె ల్యాప్‌టాప్‌లో కీస్ట్రోక్ యాక్టివిటీ తక్కువగా ఉందని గుర్తించింది. మూడు నెలల పాటు తన ల్యాప్‌టాప్‌పై సరైన యాక్టివిటీ చేపట్టలేదని గుర్తించిన కంపెనీ ఆమెను కన్సల్టెంట్ ఉద్యోగంనుంచి తొలగించింది. గంటకు 500 కీస్ట్రోక్‌లు అవసరమని, అయితే ఆమె సగటు 100 కంటే తక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. మౌస్-మూవింగ్ టెక్నాలజీ మరోవైపు మౌస్-మూవింగ్ టెక్నాలజీతో వర్క్ ఫ్రం హోం విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న కిలాడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్టు మైఖేల్ పాట్రన్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందుకోసం టైమ్ డాక్టర్ అనే రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను అందించే సాఫ్ట్‌వేర్‌ను వాడినట్టు తెలిపారు. ఇది ఉద్యోగులను స్క్రీన్ రికార్డ్ చేసి, లాగ్లను తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల గోప్యతపై ఆందోళన చాలా కంపెనీలు ఇలాంటి నిఘానే పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు, కొన్ని కంపెనీలు మౌస్ క్లిక్‌లను ట్రాక్ చేస్తాయి లేదా కార్మికులు తమ కంప్యూటర్ల వద్ద ఉన్నారని నిర్ధారించుకోవడానికి వెబ్‌క్యామ్ ఫోటోలను ఉపయోగిస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవలి నివేదిక ప్రకారం 10 అతిపెద్ద అమెరికా ప్రైవేట్ కంపెనీలలో ఎనిమిది తమ ఉద్యోగుల ఉత్పాదకతను ట్రాక్ చేస్తున్నాయి. ఈ ధోరణి ఉద్యోగి గోప్యత , నిఘా గురించి ఆందోళనలను పెంచుతోంది. కొంతమంది విమర్శకులు ఈ పద్ధతులు హాని కరమని, కార్మికులలో ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుందని వాదించారు. అయితే దీనికి విరుద్ధంగా, ఇతరులు ఉద్యోగుల పర్యవేక్షణ నిర్వాహకులకు విలువైన సాధనంగా ఉంటుందని వాదించారు. -
మీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు ’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ►అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. ►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ►ఇప్పటికే మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు అప్డేట్ చేసుకో వడం తప్పనిసరి. -
పార్సిల్ ట్రాకింగ్ పేరిట కొత్త మోసాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో వస్తువులను కొనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే మనకు వచ్చే ఆ పార్సిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ చేయడం పరిపాటి. ఇదే అదనుగా ఆన్లైన్లో వస్తువులను కొనేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేసేందుకు మా వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. అంటూ నకిలీ యాడ్స్‌ను ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాకింగ్ కోసం అంటూ ఆన్లైన్లో కొన్ని ఫేక్ కాల్ సెంటర్ నంబర్లను పెడుతున్నారు. వాటిని నమ్మి ఎవరైనా ఆ నంబర్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నకిలీ మాల్వేర్ లింకులతో కూడిన ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌లు పెడుతున్నారు. వినియోగదారులు ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే మన ఫోన్లోని పూర్తి సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లడంతోపాటు మన ఫోన్లను వారి నియంత్రణలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాకింగ్ పేరిట ఇచ్చే యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దని, ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే ఫోన్ నంబర్లు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. -
108 అంబులెన్స్‌ను ట్రాక్ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 108 అంబులెన్సుల ట్రాకింగ్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో 108 అంబులెన్స్‌ను కాలర్ (సాయం కోసం ఫోన్ చేసిన వారు) ట్రాక్ చేసే విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో ట్రాకింగ్‌సదుపాయాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండె, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోశ ఇబ్బందులు, గర్భిణులకు పురిటి నొప్పులు రావడం వంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు వెంటనే 108 అంబులెన్స్ గుర్తొస్తుంది. 108కు ఫోన్ చేస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి సకాలంలో ఆస్పత్రులకు చేరుస్తుంది. ఆపద సమయంలో ఫోన్ చేసిన వారికి 108 అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో, ఇంకా ఎంత సమయం పడుతుందోనని ఆందోళన ఉంటుంది. ప్రస్తుత విధానంలో 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వారి ఫోన్ నంబర్ లేదా బాధితుల ఫోన్ నంబర్‌కు వారికి కేటాయించిన వాహనం నంబరు, సిబ్బంది ఫోన్ నంబర్ ఎస్ఎంఎస్ పంపుతున్నారు. ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేసి బాధితులు/సహాయకులు అంబులెన్స్ ఎంత వరకూ వచ్చిందో తెలుసుకుంటున్నారు. నూతన విధానంలో బాధితులకు పంపే ఎస్ఎంఎస్లో లింక్‌ను పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అంబులెన్స్ ఎక్కడ ఉంది, ఎంత సమయంలో వస్తుందో తెలుసుకోవచ్చు. తద్వారా బాధితులకు అంబులెన్సు వస్తోందన్న భరోసా లభిస్తుంది. 748 అంబులెన్స్‌ల ద్వారా సేవలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘108 అంబులెన్స్’లు 748 ఉన్నాయి. ఇవి రోజుకు సగటున 3,096 ఎమర్జెన్సీ కేసులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు 7,52,302 ఎమర్జన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. త్వరలోనే అందుబాటులోకి కాలర్లు అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో ట్రాక్ చేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేశాం. ట్రయల్ రన్ విజయవంతం అయింది. త్వరలోనే ట్రాకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో తెలుసుకోవడంతో బాధితులు, వారి సహాయకులకు భరోసా లభిస్తుంది. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం..!
బీజింగ్: కరోనా విషయంలో చైనా ప్రభుత్వం చేతులెత్తేసింది. రోజుకు ఎన్ని కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయో ట్రాక్ చేయడం అసాధ్యమని ఆ దేశ ఆరోగ్య శాఖ తేల్చిచెప్పింది. దీంతో గత నెలలో అత్యధిక కేసులు నమోదైన చైనాలో ఇప్పుడు ఎంతమంది వైరస్ బారినపడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కరోనా కఠిన ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. క్వారంటైన్, కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టుల విషయంలో నిబంధనలను సడలించింది. ఫలితంగా కరోనా కేసులను ట్రాక్ చేయడం అసాధ్యమైంది. సడలించిన నిబంధనలతో వైరస్ సోకి లక్షణాలు లేనివారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు కూడా చేయించుకోవడం లేదు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కరోనా కేసులను ఇక ట్రాక్ చేయలేమని చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం ప్రకటించింది. చైనాలో కరోనా వ్యాప్తి మొదలై మూడు సంవత్సరాలు కావస్తున్నా.. వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయడంలో ఆ దేశం విఫలమవుతోంది. టీకాలు పంపిణీ చేసినప్పటికీ అవి అంతంత మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. పైగా ఇంకా కొన్ని లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త కేసులు విపరీతంగా పెరగడం డ్రాగన్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్ ఇచ్చిన 20 ఏళ్ల కుర్రాడు.. మరి బేరం కుదిరిందా!
బిలియనీర్ ఎలన్ మస్క్‌కు 20ఏళ్ల కుర్రాడు బంపరాఫర్ ఇచ్చాడు. ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయకుండా ఉండాలంటే తాను విధించిన షరతుకు మస్క్ లోబడి ఉండాలని స్పష్టం చేశాడు. అమెరికా ఒర్లాండోలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ విద్యార్ధి 20 ఏళ్ల జాక్ స్వీన్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు టామ్ క్రూజ్, బిల్ గేట్స్, కర్దాషియాన్ వంశానికి చెందిన సభ్యులు, కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలాన్ జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన కాలేజీ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని..ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడు. తాజాగా ఆ కుర్రాడే ఎలాన్ మస్క్‌కు మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, మస్క్ బోట్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే గతంలో నేను (జాక్ స్వీన్) అడిగినట్లు 55వేల డాలర్లు ఇవ్వాలి. లేదంటే మస్క్ తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు నన్ను అనుమతి ఇవ్వాలి. నాతో పాటు మస్క్ కూడా ప్రయాణించాలి. అదే జరిగితే ట్రాక్ చేయడం ఆపేస్తానంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. జాక్ స్వీన్ ఆఫర్‌కు ఎలాన్ మస్క్ అంగీకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. చదవండి: భారీగా పెరిగిన ఇన్స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి! -
ప్రమాదకర వస్తు రవాణాకు ట్రాకింగ్ ఉండాల్సిందే
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన సరుకులను, ముడిపదార్థాలను రవాణా చేసే వాహనాలు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది తప్పనిసరిగా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ పర్మిట్ (అనుమతులు) పరిధిలోకి రాని వాహనాలు ప్రమాదకర వాయువులు, వస్తువులను రవాణా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 2022 సెప్టెంబర్ 1 తర్వాత కేటగిరీ ఎన్2, ఎన్3 వాహనాలకు తయారీ దశలోనే పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. -
బార్లో బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు
వాషింగ్టన్: యువతీయువకులు ప్రేమలో పడడం షరా మామూలే. అయితే ఇటీవల ట్రెండ్ చూస్తే అదే ప్రేమలో ఎవరో ఒకరు మోసపోవడం కూడా షరా మామూలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ జాబితాలోని కొందరు మాత్రం ఆ బాధని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమలో మోసం చేసిన వాళ్లు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ ఏదో ఓ రూపంలో వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ యువతి ప్రియుడు చేసిన మోసానికి ఏకంగా అతడిని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. అమెరికాలో ఉంటున్న ఆండ్రీ స్మిత్, గేలిన్ మోరిస్ ఇద్దరు ప్రేమికులు. అయితే ఇటీవల కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ ప్రవర్తనలో మార్పుని గమనించింది గేలన్. ఆండ్రీ తనను చీటింగ్ చేస్తున్నట్లు ఆమె అనుమానించింది. ఇంకేం క్లారిటీ కోసం ఆపిల్ ఫోన్లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతను ఓ బార్లో ఉన్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లింది. బార్లో తన బాయ్‌ఫ్రెండ్ మరో అమ్మాయితో ఉండడం చూసి కోపంతో ఊగిపోయింది. ఖాళీ వైన్ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు. కాగా, బార్ బయట స్మిత్‌పై మోరిస్ దాడి చేసింది. అంతటితో ఆగకుండా చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన స్మిత్‌ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే అతను చనిపోయాడు. దీనికి కారకురాలైన ప్రియురాలు మోరిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పబ్జీ దారుణం.. గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని -
Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?
ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ, ఓ టీనేజర్‌తో ఒప్పందం కోసం ముందడుగు మాత్రం వేయలేకపోయాడు. 37 లక్షల రూపాయల(50వేల డాలర్లు)కు వెనకడుగు వేసి.. ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఇది ఇంతటితోనే అయిపోలేదు. మస్క్‌ని ఏకంగా పిచ్చోడు అంటున్నాడు ఆ కుర్రాడు. అది ఎందుకో అ కుర్రాడి మాటల్లోనే చూద్దాం.. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలన్జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన స్కూల్ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని.. ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడట. కానీ, మస్క్, స్వీన్ ప్రతిపాదనలో దేనికీ ఓకే చెప్పలేదు. సరికదా.. ఆ కుర్రాడి అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ‘ఎలన్ మస్క్ జెట్ బోట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు.. అనే వివరాలన్నింటిని బయటపెడుతుంది. భద్రతా కోణంలో దాని వల్ల అతనికి జరిగే నష్టం ఎక్కువ. లీగల్-ఇల్లీగల్ అనే అంశాలను పక్కనపెడితే.. సాధారణంగా కొన్ని కంపెనీలు ఫ్లైట్ ట్రాకింగ్ ద్వారానే మిలియన్ల ఆదాయం సంపాదిస్తుంటాయి. అందుకు తగ్గట్లే మిలియనీర్లు, బిలియనీర్లు కూడా ముట్టజెప్పుతుంటారు. కానీ, నేను ఏదో కొద్ది మొత్తంలోనే ఆశించా. మా ఇద్దరి మధ్య ట్విటర్ సంభాషణల తర్వాత మస్క్ తిరిగి వస్తాడేమో అనుకున్నా. కానీ, అది జరగలేదు. పైగా ఈ డీల్ వార్తలు బయటకు రాగానే ఆదివారం రాత్రి.. మస్క్ మొత్తం స్వీనీకి చెందిన అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ఇది చాలా వింతగా ఉంది. నిజంగానే మస్క్ ఒక పిచ్చోడు. ఆయన బుర్రలో నిజంగా గుజ్జు ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక మీదట ఆయన జెట్‌ను ట్రేస్ చేసేది లేదు. ఇక ఆపేస్తున్నా.. అంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు ఆ టీనేజర్. అంతేకాదు భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం వచ్చినా.. చచ్చినా చేయనంటూ తేల్చేశాడు కూడా. మరి ఈ కుర్రాడి అసహనంపై ఎలన్ మస్క్ స్పందిస్తాడా? అన్నది చూడాలి. ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను జాక్ స్వీన్ రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్‌గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్‌కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. -
ఈ ఫీచర్‌తో మీ ఫోన్లో డేటా ఎవరి చేతుల్లోకి వెళుతుందో తెలుసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్.. కొందరికి అవసరం.. మరికొందరి వ్యసనం. ఆ వ్యసనాన్ని క్యాష్ చేసుకునేందుకు యాప్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని యాప్స్ యూజర్ల అవసరాల్ని తీర్చేలా ఉన్నా..మరికొన్ని మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా యూజర్ల ఫోన్లలో చొరబడుతున్నాయి. ఫ్రీగిఫ్ట్‌లు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో యూజర్ల ఆశలకు గాలం వేస్తున్నాయి. దీంతో టెక్నాలజీపై అవగాహన లేని యూజర్లు యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. వ్యక్తిగత వివరాల్ని అందిస్తున్నారు. ఆ వివరాల్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..అలాంటి డేంజర్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సూపర్ ఫీచర్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ ఫీచర్ బీటా వెర్షన్లో ఉండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 96శాతం యాక్యురేట్ రిజల్ట్ సెర్చ్ ఇంజిన్ "డక్ డక్ గో" త్వరలో ఫీచర్‌ను విడుదల చేయనుంది. ' యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఆండ్రాయిడ్' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్లో మీకు తెలియకుండా ఏమైనా యాప్స్, సోషల్ మీడియా నెట్ వర్క్‌లు ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర్ సెర్చ్ ఇంజిన్ సంస్థలు ఏం చేస్తున్నాయో ఇట్టే కనిపెట్టేస్తుంది. మీ ఫోన్లో ఆ యాప్స్‌ను వినియోగించకపోయినా నిరంతరం ట్రాక్ చేస్తుంది. ఇటీవల డక్ డక్ గో' కొన్ని యాప్స్‌ను ట్రాకింగ్ చేసింది. ట్రాకింగ్‌లో థర్డ్ యాప్స్ నిర్వాహకులు 87 శాతం డేటాను గూగుల్‌కి , 68శాతం డేటా ఫేస్‌బుక్‌కు పంపించినట్లు గుర్తించింది. యాపిల్ సైతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ యాప్స్ మన డేటా కలెక్ట్ చేస్తున్నాయా? లేదా అనే విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు ఎలాంటి యాప్స్ అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు సంబంధించిన గాడ్జెట్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేయొచ్చా' అనే అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఒప్పుకుంటేనే థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేస్తాయి. అయితే యాపిల్ ఫీచర్‌పై యూజర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్స్ వద్దు' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. చదవండి: పాపం జుకర్ బెర్గ్: వేల కోట్ల నష్టం..పేరు మార్చినా..! జాతకం మారలేదు..! -
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙ -
కరోనా వస్తే.. కనిపెట్టేస్తుంది
ఢిల్లీ : చూడ్డానికి స్టీరియో బాక్సుల్లో ఉండే స్పీకర్లాగా కనిపిస్తోంది కదూ.. నిజానికిదో సెన్సర్.. దీనికో స్పెషాలిటీ ఉంది.. ఇది కరోనా వాసన పసిగట్టేస్తుందట. వీటిని కాలిఫోర్నియాకు చెందిన కొనికుతో కలిసి ఏరోనాటిక్ దిగ్గజం ఎయిర్‌బస్ రూపొందిస్తోంది. వీటిని ‘వాసన పసిగట్టే కెమెరాలు’గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ సెన్సర్లను విమానాల్లో ప్రమాదకర రసాయనాలు లేదా బాంబులు పెడితే.. వాటిని పసిగట్టడం కోసం తయారుచేశారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బాంబులకన్నా.. కరోనా బాంబు ప్రమాదకరంగా మారింది కదా.. దీంతో వీటిని కరోనా వైరస్‌ను కనిపెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో బయలాజికల్ సెల్స్ తో చేసిన మైక్రోప్రాసెసర్లు ఉంటాయి.. వాటి ద్వారా సెన్సర్లు గాల్లో ఉండే రసాయనాలను, సూక్ష్మజీవులను పసిగడతాయి. వెంటనే అలారంను మోగిస్తాయి.. ఇదంతా చేయడానికి ఇవి తీసుకునే సమయం జస్ట్ 10 సెకన్లే అట. మానవ శరీరం విడుదల చేసే కణాల్లో కరోనా వైరస్ కొన్ని మార్పులు చేస్తుంది.. ఆ మార్పును ఇది పసిగడుతుందట. గతంలో ఇలాంటి టెక్నాలజీని కేన్సర్‌ను కనిపెట్టే విషయంలో వాడారు. ఇప్పటికే ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఎయిర్‌బస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివర్లో ఎయిర్‌పోర్టు స్క్రీనింగ్ దగ్గర వీటిని వాడతామని.. అనంతరం విమానాల్లో ప్రవేశపెడతామని చెప్పాయి. (ధారవిలో ఆగని వైరస్ కేసులు) -
గూగుల్ ప్లే యాప్స్‌పై సంచలన రిపోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఫేస్బుక్ డేటా లీక్ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా తాజాగా ఓ సంచలన రిపోర్టు యూజర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గూగుల్ పిల్లలను గోప్యతా చట్టాలను ఉల్లఘింస్తోందనే ఆరోపణలుమరోసారి చెలరేగాయి. గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తగత వివరాలను అక్రమంగా ట్రాక్ అవుతోంది. ముఖ్యంగా బాలల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోంది. అమెరికా ఫెడరల్ చట్టంలోని పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టం ( చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు నిర్వహించిన ఒక ఇండిపెండెంట్ సర్వే ఈ షాకింగ్ అంశాలను వెల్లడించింది. ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (ఐసిఎస్ఐ) నివేదించిన సమాచారం ప్రకారం, పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని మొత్తం 5,855 ఆండ్రాయిడ్ యాప్స్‌ను పరిశీలించింది. వీటిలో సగానికి (3,337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్ అమెరికా గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా తస్కరిస్తున్నాయని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సుమారు 256 యాప్స్ 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్ డేటాను కూడా సేకరించిందట. ఇంత కీలకమైన వ్యక్తిగత వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్టు పేర్కొంది. వీటిలో పేర్లు, ఇమెయిల్, చిరునామాలు, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు అందుబాటులో లేరని తెలిపింది. గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫాం యూ ట్యూబ్ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ కోపా నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్ ఎడ్వకసీ గ్రూప్స్ ఆరోపణల నేపథ్యంలో ఈ అధ్యయనం చేసింది. -
ఫేస్బుక్ లాగౌట్ కాకుండానే..
మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి అలాగే ఉంచి.. ఇతర వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తారా? ఫేస్‌బుక్‌ను లాగౌట్ చేయకుండానే పోర్న్ వెబ్సైట్లను చూస్తున్నారా? అయితే మీ గుట్టు మొత్తం ఫేస్బుక్ చిక్కే అవకాశముంది. సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్బుక్ మీరు ఆన్లైన్లో ఏం చేస్తున్నారనే ప్రతిదానిని ట్రాక్ చేస్తుంది. గూగుల్ తరహాలోనే మీ బ్రౌజర్లో ఓపెన్ అయ్యే ప్రతి వెబ్సైట్ గురించి సమాచారాన్ని ఫేస్బుక్ సేకరిస్తుంది. అదేవిధంగా మీరు పెద్దల వెబ్సైట్లలోకి తొంగిచూసినా, పోర్న్ వెబ్సైట్లను గాలించినా ఆ సమాచారాన్ని ఫేస్బుక్ సేకరిస్తుంది. అంతేకాకుండా ఆయా వెబ్సైట్లలో ఫేస్బుక్ ప్లగిన్స్ కూడా ఉంటాయి. వీటి ద్వారా మీ సమాచారం గుట్టు మొత్తం అటు-ఇటు మారే అవకాశం ఉంటుంది. చెప్పి మరీ చేస్తోంది.. ఫేస్బుక్ మీ ఆన్లైన్ వ్యవహారాలన్నింటిపైనా ఓ కన్నేసి పెట్టడం నిజానికి రహస్యమైన విషయం కాదు. ఫేస్బుక్ ఈ విషయాన్ని బాహాటంగా చెప్పి మరీ చేస్తున్నది. మీ అభిరుచికి తగిన వాణిజ్య ప్రకటనలను ఇచ్చేందుకు మీ బ్రౌజింగ్ సమాచారం సమస్తాన్ని తాను సేకరిస్తున్నట్టు ఫేస్బుక్ డాటా పాలసీ స్పష్టంగా వెల్లడిస్తోంది. గూగుల్ కూడా ఇదే తరహాలో యూజర్లకు అనుగుణమైన వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు వారు బ్రౌజ్ చేస్తున్న సమస్త వెబ్సైట్ల సమాచారాన్ని సేకరిస్తున్నది. అయితే మీరు పోర్న్ వెబ్సైట్లు చూసినంత మాత్రాన మీకు అన్ని పోర్న్ వాణిజ్య ప్రకటనలనే ఫేస్బుక్ మీకు పంపించే అవకాశం లేదు. కానీ మీరు ఏయే వెబ్‌సైట్‌ను ఎంతసేపు చూస్తున్నారు? వేటిమీద ఎంత ఆసక్తి పెడుతున్నారా? అన్నది నిఘా వేసి పెడుతోంది. మీరు రహస్యంగా జరిపే ఇలాంటి కార్యకలాపాలు ఫేస్బుక్ కంటికి చిక్కకుండా ఉండాలంటే దానిని లాగౌట్ చేసి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇండియా పోస్ట్ యాప్ షురూ
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ యాప్‌ను టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్‌లో ట్రాకింగ్, తపాలా శాఖ కార్యాలయ వివరాలు తెలుసుకోవడం, పోస్టేజ్ క్యాల్కులేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖను దేశ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని చెప్పారు. చివరకు మావోయిస్టులు కూడా ఎక్కడ ప్రజల మద్దతు కోల్పోతామేమోనని తపాలా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ-కామర్స్ రంగంలో ఇండియా పోస్ట్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఇండియా పోస్ట్ సేవలను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చారు. ఇండియా పోస్ట్ దాదాపు 1.55 లక్షల తపాలా కార్యాలయాలను కలిగి ఉంది. వీటిలో 1.39 లక్షల కార్యాలయాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. -
మంగళయాన్ Part 3
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ25