ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ, ఓ టీనేజర్‌తో ఒప్పందం కోసం ముందడుగు మాత్రం వేయలేకపోయాడు. 37 లక్షల రూపాయల(50వేల డాలర్లు)కు వెనకడుగు వేసి.. ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఇది ఇంతటితోనే అయిపోలేదు. మస్క్‌ని ఏకంగా పిచ్చోడు అంటున్నాడు ఆ కుర్రాడు. అది ఎందుకో అ కుర్రాడి మాటల్లోనే చూద్దాం..
19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలన్జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన స్కూల్ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని.. ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్‌షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడట.
కానీ, మస్క్, స్వీన్ ప్రతిపాదనలో దేనికీ ఓకే చెప్పలేదు. సరికదా.. ఆ కుర్రాడి అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ‘ఎలన్ మస్క్ జెట్ బోట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు.. అనే వివరాలన్నింటిని బయటపెడుతుంది. భద్రతా కోణంలో దాని వల్ల అతనికి జరిగే నష్టం ఎక్కువ. లీగల్-ఇల్లీగల్ అనే అంశాలను పక్కనపెడితే.. సాధారణంగా కొన్ని కంపెనీలు ఫ్లైట్ ట్రాకింగ్ ద్వారానే మిలియన్ల ఆదాయం సంపాదిస్తుంటాయి. అందుకు తగ్గట్లే మిలియనీర్లు, బిలియనీర్లు కూడా ముట్టజెప్పుతుంటారు. కానీ, నేను ఏదో కొద్ది మొత్తంలోనే ఆశించా. మా ఇద్దరి మధ్య ట్విటర్ సంభాషణల తర్వాత మస్క్ తిరిగి వస్తాడేమో అనుకున్నా. కానీ, అది జరగలేదు.
పైగా ఈ డీల్ వార్తలు బయటకు రాగానే ఆదివారం రాత్రి.. మస్క్ మొత్తం స్వీనీకి చెందిన అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ఇది చాలా వింతగా ఉంది. నిజంగానే మస్క్ ఒక పిచ్చోడు. ఆయన బుర్రలో నిజంగా గుజ్జు ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక మీదట ఆయన జెట్‌ను ట్రేస్ చేసేది లేదు. ఇక ఆపేస్తున్నా.. అంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు ఆ టీనేజర్. అంతేకాదు భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం వచ్చినా.. చచ్చినా చేయనంటూ తేల్చేశాడు కూడా. మరి ఈ కుర్రాడి అసహనంపై ఎలన్ మస్క్ స్పందిస్తాడా? అన్నది చూడాలి.
ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను జాక్ స్వీన్ రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్‌గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్‌కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment