private jet
-
నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్
ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు చైర్మన్ ముఖేష్ అంబానీ. మరోవైపు ఆయన భార్య నీతా అంబానీ ((Nita Ambani) కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్థాపకురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు ఐఓసీ సభ్యురాలిగా ఉన్నారు నీతా అంబానీ. బిలియనీర్ అంబానీ తన భార్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఒకటి ఇపుడు నెట్టింట సందడిగా మారింది. అదేంటో చూద్దామా. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా రాణిస్తున్న తన భార్య ప్రయాణ ఇబ్బంది లేకుండా ముఖేష్ అంబానీ ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చాట. 2007లో నీతా అంబానీ పుట్టినరోజున అంబానీ ఈ అందమైన గిప్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రయాణాల కోసం కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319ను ప్రైవేట్ జెట్ బహుమతిగా ఇచ్చి నీతాను సర్ప్రైజ్ చేశారట. సహా అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్లతో అదిరిపోయే దీని విలువ రూ.230 కోట్లు. అత్యంత అందమైన ఈ ప్రైవేట్ జెట్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదు.కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319 ప్రత్యేకతలుచూడ్డానికి విలాసవంతంగా, అందంగా ఉండే ప్రైవేట్ జెట్‌లోని సౌకర్యాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందీ ప్రైవేట్ జెజ్లో. ఒకేసారి 10-12 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అసాధారణ బహుమతి అన్ని సౌకర్యాలతో కూడిన సజావుగా, విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జెట్ విమానంలో హై-డెఫినిషన్ స్క్రీన్లు, సరౌండ్ సౌండ్, పెద్ద మీడియా లైబ్రరీ ఉన్నాయి. ప్రీమియం ఫిట్టింగ్‌లు, మార్బుల్ యాక్సెంట్లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాత్రూమ్లు ఉన్నాయి. ఈ జెట్ విమానంలో ఎర్గోనామిక్ సీటింగ్ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్, విశాలమైన లాంజ్ ఏరియాదీని సొంతం.ప్రైవేట్ జెట్‌లో ధీరేంద్ర శాస్త్రిఅనంత్ అంబానీ వివాహ సమయంలో ఈ ప్రైవేట్ జెట్ విశేషమైన దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో అనంత్ తన ప్రయాణానికి ప్రైవేట్ జెట్‌ను అందించి, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.అయితే బిజీగా షెడ్యూల్ కారణంగా తొలిత సంకోచించిన శాస్త్రి అంబానీ ఆహ్వానాన్ని అందుకుని పెళ్లి తంతులుపాల్గొన్నారు. అంతేకాదు అంబాన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దులైపోయారు కూడా. కాగా అంబానీకి దీంతోపాటు బోయింగ్ 737 మాక్స్ 9 కూడా ఉంది. అధునాతన సాంకేతికత, LEAP-18 ఇంజిన్లతో కూడిన ఈ విమానం భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటి. -
విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?
హీరో సూర్య పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ మన స్టార్ హీరోల రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ)సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న సూర్య.. ఆస్తులు కూడా బాగానే కూడబెతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా సూర్య.. దాదాపు రూ.120 కోట్లు ఖరీదు చేసే దస్సాన్ ఫాల్కన్ 2000 మోడల్ ప్రైవేట్ జెట్ కొన్నాడని న్యూస్ వైరల్ అవుతోంది.సూర్య అనుకుంటే దీన్ని కొనేస్తాడేమో గానీ ఈ వార్తల్లో నిజం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. సరే ఇదలా వదిలేస్తే 'కంగువ' సినిమా.. అక్టోబరు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?) -
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
బీజేపీ Vs సిద్ధరామయ్య: మరి మోదీ సంగతేంటీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఓ విలాసవంతమైన ప్రైవేటు జెట్‌లో ప్రయాణించడం విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ నేతలు సైతం ప్రధాని మోదీ, బీజేపీకి కౌంటరిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హస్తిన నుంచి బెంగళూరుకు విలాసవంతమైన చార్టర్డ్ విమానంలో వచ్చారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సిద్ధరామయ్యతో కలిసి విమాన ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు. Bengaluru: Responding to a question on the video of himself and Karnataka minister B Z Zameer Ahmed Khan travelling on a chartered flight, Karnataka CM Siddaramaiah says, "Ask BJP people in what Prime Minister Narendra Modi travels in." pic.twitter.com/3TvdXsSUZC — ANI (@ANI) December 22, 2023 ఇక, సీఎం సిద్ధరామయ్య ప్రైవేటు జెట్‌లో విహరిస్తున్నారంటూ ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం మొత్తం తీవ్ర కరవుతో అల్లాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి.. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. మరోవైపు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. పైగా.. కేంద్రం నుంచి కరవు సహాయక నిధుల అభ్యర్థన కోసం విలాసవంతమైన విమానంలో ప్రయాణించడం గమనార్హం. మన దురవస్థను అపహాస్యం చేయడమే ఇది. పన్ను చెల్లింపుదారుల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాంగ్రెస్ మంత్రులకు చాలా సులభం కర్ణాటక నేతలు తీవ్ర విమర్శలు చేశారు. On the one hand, Congress is pretending to crowdfund and didn’t even serve samosas in I.N.D.I Alliance meeting, on the other, Zameer Ahmed Khan, Cabinet Minister for Housing, Waqf and Minority Affairs in Karnataka Govt, is flaunting his pictures with CM Siddaramaiah in a private… pic.twitter.com/SkrLB5OdjI — Amit Malviya (@amitmalviya) December 22, 2023 కాగా, బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ గట్టిగా తిప్పి కొట్టింది. బీజేపీ నేతల ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రయాణిస్తారు? ఏ విమానంలో రాకపోకలు సాగిస్తారు? ఈ విషయం బీజేపీ నేతలను అడగండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎప్పుడూ అసంబద్ధ వాదనలు చేస్తుంటారు. ఆపరేషన్ కమల్ ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది. ఆపరేషన్ కమల్ కోసం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబై చుట్టు తిప్పడానికి విమానం ఎవరు ఇచ్చారని, వారాల తరబడి విలాసవంతమైన హోటళ్లలో బస చేసి సరదాగా గడిపిన ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కూలీ పనులు చేసి ఆపరేషన్ కమల కోసం ఖర్చు చేశారా? అని నిలదీశారు. దీంతో, బీజేపీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చదవండి: భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్ -
HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కుప్పకూలిన బిజినెస్ జెట్: ఆరుగురు సజీవ దహనం
అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియా పొలాల్లో ఓ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారుల వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలియింది. లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ముర్రిటాలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. సెస్నా సీ550 బిజినెస్ జెట్ మంటల్లో చిక్కుకున్నట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో బిగైల్ టెల్లెజ్-వర్గాస్(33) రైస్ లెండర్స్(25) మాన్యువల్ వర్గాస్-రెగాలాడో(32) లిండ్సే గ్లీచే(31) అల్మా రజిక్ (51) , ఇబ్రహెం రజిక్(46) సజీవ దహనమైపోయారు. పైలట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ విధానాన్ని ప్రయత్నించిన తర్వాత విమానం రన్‌వేకు 500 అడుగుల దూరంలో కూలిపోయిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇదే ప్రాంతంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరగడం ఆందోళన రేపింది. -
సోలో ఫ్లైట్ జర్నీ.. రూ.13 వేలకే ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణం!
ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు. (Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!) న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్‌కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాల్‌కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది. (ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి) ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్‌ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) -
ఈ విమానం ఎగరదు.. కానీ ధర మాత్రం కోట్లు పలుకుతోంది, ఎందుకో తెలుసా!
పాప్ ప్రపంచానికి రారాజుగా వెలుగొందిన ఎల్విస్ ప్రెస్లీకి సొంత జెట్ విమానం ఉండేది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ విమానమే! ఈ ‘జెట్‌స్టార్’ విమానాన్ని ఎల్విస్ 1962లో 6.85 లక్షల పౌండ్లకు (రూ.6.97 కోట్లు) కొనుగోలు చేశాడు. ఎగిరేస్థితిలో లేని ఈ విమానం ముప్పయ్యేళ్లకు పైగా న్యూమెక్సికోలోని రోజ్‌వెల్ ఎయిర్‌క్రాఫ్ట్ బోన్యార్డ్లో పడి ఉంది. ఎరుపు రంగులో ఉన్న ఈ విమానం లోపలి భాగంలోనూ ఎరుపురంగే కనిపిస్తుంది. ఎరుపు తివాచీ, ఎరుపురంగు వెల్వెట్ కుషన్లు ఉన్న ఆరు ప్రత్యేకమైన సీట్లు, బంగారు అంచులతో తీర్చిదిద్దిన ఇంటీరియర్ డిజైన్ ఈ విమానం ప్రత్యేకతలు. అంతేకాదు, ఇందులో కేసెట్ప్లేయర్, టెలివిజన్, వీసీఆర్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి వసతులూ ఉన్నాయి. పదిహేనేళ్లు వాడిన తర్వాత ఎల్విస్ దీనిని 1977లో ఒక సౌదీ అరేబియన్ కంపెనీకి అమ్మేశాడు. తర్వాత ఇది చేతులుమారి దాదాపు ముప్పయ్యేళ్ల కిందట రోజ్‌వెల్ ఎయిర్‌క్రాఫ్ట్ బోన్యార్డ్కు చేరుకుంది. ఎగిరేస్థితిలో లేకపోవడంతో దీని ఇంజన్, కాక్‌పిట్ వంటి భాగాలను తొలగించారు. వచ్చే జనవరిలో దీనిని వేలం వేయనున్నారు. ఎల్విస్ వాడిన విమానం కావడం వల్ల దీనికి భారీ ధరే పలకవచ్చని అనుకుంటున్నారు. -
మరో ప్రైవేట్ జెట్ సొంతం చేసుకోనున్న మస్క్, ఖరీదెంతో తెలుసా?
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత టెస్లా సీఈవో, ఎలాన్ మస్క్ పలు సంచలనాలతో పూటకో రీతిగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ విమానాన్ని ఆర్డర్ చేశారన్న వార్త హల్చల్ చేస్తోంది. సరికొత్త టాప్-ఆఫ్-లైన్ ప్రైవేట్ జెట్, గల్ఫ్‌స్ట్రీమ్ జీ700ని ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. 2023 ప్రారంభంలో ఇది మస్క్ చేతికి అందనుందని అంచనా. దీని ధర 78 మిలియన్ డాలర్లు (646 కోట్ల రూపాయలకు పైనే) పలు నివేదికలు వెల్లడించాయి . ఇదీ చదవండి: ElonMusk మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర! ఆస్టోనియాలోని ఒక నివేదిక ప్రకారం ప్రపంచం బిలియనీర్ మస్క్ ‘జీ700’ సూపర్ జెట్‌ను కొనుగోలు చేశారు. గల్ఫ్స్ట్రీమ్కు చెందిన సరికొత్త ఫ్లాగ్షిప్ విమానం 57 అడుగుల కంటే ఎక్కువ క్యాబిన్ పొడవుతో గరిష్టంగా 7,500 నాటికల్ మైళ్ల పరిధిని కలిగి ఉంది. ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండానే విమానం ఆస్టిన్ నుంచి హాంకాంగ్‌కు దూసుకుపోగలదు. అమెరికన్ఎయిర్క్రాఫ్ట్ తయారీదారు గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం, జీ700 అనేది ఇండస్ట్రీలోనే అతిపెద్ద, విశాలమైన క్యాబిన్‌తో అత్యంత ఆధునిక ఆవిష్కరణ. అలాగే సరికొత్త, హై-థ్రస్ట్ రోల్స్ రాయిస్ ఇంజిన్లు, విశిష్టమైన సిమెట్రీ ఫ్లైట్ డెక్‌ను ప్రత్యేక ఆకర్షణలు. సొంత వై ఫై, 28" x 21" 20 ఓవల్ విండోస్, రెండు లావెటరీలు ఇందులో ఉన్నాయి. (ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!) కాగా, ప్రైవేట్ జెట్లు అంటే మోజుప మస్క్ ఇప్పటికే నాలుగు జెట్లు సొంతం చేసుకోగా వాటిలో మూడు గల్ఫ్‌స్ట్రీమ్ తయారు చేసినవే. మస్క్ కొనుగోలు చేసిన తొలి జెట్ డస్సాల్ట్ 900B. అలాగే 2019, అక్టోబరులో మస్క్, G650ER అనే మరో జెట్‌ను కొనుగోలు చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా సొంత విమానం ఉండడం వల్లే తాను ఎక్కువ సమయం పనిచేయగలుతున్నా అని మస్క్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. (ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు) -
రూ. 260 కోట్లతో ప్రైవేట్ జెట్ కొన్న స్టార్ హీరో?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఓ ప్రైవేట్ జెట్ సొంతం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీని కోసం అతడు అక్షరాలా 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఓ జాతీయ మీడియా కథనం అల్లేసింది. ఇది కాస్తా అక్షయ్ కంట పడటంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. 'లయ్యర్ లయ్యర్.. ప్యాంట్స్ ఆన్ ఫైర్.. మీ చిన్నతనంలో మీరి పద్యం నేర్చుకునే ఉంటారు. కొంతమంది జనాలకు బుద్ధి ఎదగలేదు అనిపిస్తోంది. నా గురించి నోటికొచ్చిన అబద్ధాలు రాసేస్తున్నారు. అయినా అలాంటి వారిని గురించి పట్టించుకోవడమే అనవసరం. కాకపోతే మీకోసం ప్యాంట్స్ ఆన్ ఫైర్ పద్యం అంకితం చేస్తున్నా' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన అక్షయ్ ఫ్యాన్స్.. 'చాలా రోజుల తర్వాత మీరు ఫైర్ అవడాన్ని చూస్తున్నాం', 'అక్కి సర్ ఈరోజు రౌడీ మూడ్‌లో ఉన్నాడు', 'ఇలాంటి వారిని ఊరికే వదిలేయకుండా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అతడు నటించిన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్ థియేటర్లో రిలీజ్ కాగా కట్పుట్లి ఓటీటీలో విడుదలైంది. అలాగే అతడు ప్రధాన పాత్రలో నటించిన రామసేతు దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నూస్రత్ భరూచ, సత్యదేవ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Liar, Liar…pants on fire! Heard this in childhood? Well, some people have clearly not grown up, and I’m just not in a mood to let them get away with it. Write baseless lies about me, and I’ll call it out. Here, a Pants on Fire (POF) gem for you. 👇#POFbyAK pic.twitter.com/TMIEhdV3f6 — Akshay Kumar (@akshaykumar) October 16, 2022 -
ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్ ఇచ్చిన 20 ఏళ్ల కుర్రాడు.. మరి బేరం కుదిరిందా!
బిలియనీర్ ఎలన్ మస్క్‌కు 20ఏళ్ల కుర్రాడు బంపరాఫర్ ఇచ్చాడు. ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయకుండా ఉండాలంటే తాను విధించిన షరతుకు మస్క్ లోబడి ఉండాలని స్పష్టం చేశాడు. అమెరికా ఒర్లాండోలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ విద్యార్ధి 20 ఏళ్ల జాక్ స్వీన్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు టామ్ క్రూజ్, బిల్ గేట్స్, కర్దాషియాన్ వంశానికి చెందిన సభ్యులు, కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలాన్ జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన కాలేజీ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని..ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడు. తాజాగా ఆ కుర్రాడే ఎలాన్ మస్క్‌కు మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, మస్క్ బోట్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే గతంలో నేను (జాక్ స్వీన్) అడిగినట్లు 55వేల డాలర్లు ఇవ్వాలి. లేదంటే మస్క్ తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు నన్ను అనుమతి ఇవ్వాలి. నాతో పాటు మస్క్ కూడా ప్రయాణించాలి. అదే జరిగితే ట్రాక్ చేయడం ఆపేస్తానంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. జాక్ స్వీన్ ఆఫర్‌కు ఎలాన్ మస్క్ అంగీకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. చదవండి: భారీగా పెరిగిన ఇన్స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి! -
Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?
ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ, ఓ టీనేజర్‌తో ఒప్పందం కోసం ముందడుగు మాత్రం వేయలేకపోయాడు. 37 లక్షల రూపాయల(50వేల డాలర్లు)కు వెనకడుగు వేసి.. ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఇది ఇంతటితోనే అయిపోలేదు. మస్క్‌ని ఏకంగా పిచ్చోడు అంటున్నాడు ఆ కుర్రాడు. అది ఎందుకో అ కుర్రాడి మాటల్లోనే చూద్దాం.. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలన్జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన స్కూల్ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని.. ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడట. కానీ, మస్క్, స్వీన్ ప్రతిపాదనలో దేనికీ ఓకే చెప్పలేదు. సరికదా.. ఆ కుర్రాడి అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ‘ఎలన్ మస్క్ జెట్ బోట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు.. అనే వివరాలన్నింటిని బయటపెడుతుంది. భద్రతా కోణంలో దాని వల్ల అతనికి జరిగే నష్టం ఎక్కువ. లీగల్-ఇల్లీగల్ అనే అంశాలను పక్కనపెడితే.. సాధారణంగా కొన్ని కంపెనీలు ఫ్లైట్ ట్రాకింగ్ ద్వారానే మిలియన్ల ఆదాయం సంపాదిస్తుంటాయి. అందుకు తగ్గట్లే మిలియనీర్లు, బిలియనీర్లు కూడా ముట్టజెప్పుతుంటారు. కానీ, నేను ఏదో కొద్ది మొత్తంలోనే ఆశించా. మా ఇద్దరి మధ్య ట్విటర్ సంభాషణల తర్వాత మస్క్ తిరిగి వస్తాడేమో అనుకున్నా. కానీ, అది జరగలేదు. పైగా ఈ డీల్ వార్తలు బయటకు రాగానే ఆదివారం రాత్రి.. మస్క్ మొత్తం స్వీనీకి చెందిన అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ఇది చాలా వింతగా ఉంది. నిజంగానే మస్క్ ఒక పిచ్చోడు. ఆయన బుర్రలో నిజంగా గుజ్జు ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక మీదట ఆయన జెట్‌ను ట్రేస్ చేసేది లేదు. ఇక ఆపేస్తున్నా.. అంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు ఆ టీనేజర్. అంతేకాదు భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం వచ్చినా.. చచ్చినా చేయనంటూ తేల్చేశాడు కూడా. మరి ఈ కుర్రాడి అసహనంపై ఎలన్ మస్క్ స్పందిస్తాడా? అన్నది చూడాలి. ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను జాక్ స్వీన్ రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్‌గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్‌కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. -
అపర కుబేరుడు.. రూ. 37 లక్షలు ఓ లెక్కా?!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నెంబర్ వన్. అలాంటి వ్యక్తికి 37 లక్షలు ఒక లెక్కా? అనే సందేహం చాలామందికే కలుగుతోంది ఇప్పుడు. ఓ కాలేజీ స్టూడెంట్‌తో ఒప్పందం కోసం ప్రయత్నించిన ఎలన్ మస్క్.. తీరా ఆ కుర్రాడు ఎక్కువ డిమాండ్ చేసేసరికి మౌనంగా ఉండిపోయాడట. ఇంతకీ ఏమా కథ తెలుసుకోవాలని ఉందా? వ్యక్తిగత భద్రత దృష్ట్యా తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయడం ఆపాలంటూ ఓ టీనేజర్‌తో ఎలన్ మస్క్ ఒప్పందం కోసం ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కింది. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ‘ఎలన్ మస్క్స్ జెట్’ పేరుతో నిర్వహించే ట్విటర్ అకౌంట్‌కు స్వయంగా ఎలన్ మస్క్ సందేశాలు పంపాడు. కిందటి ఏడాది ఈ ట్విటర్ ఎక్స్ఛేంజ్ జరిగినట్లు తెలుస్తోంది.తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయడం ఆపేస్తే 5 వేల డాలర్లను ఇస్తానని (మన కరెన్సీలో 3 లక్షల 75 వేల రూపాయలకు పైనే) ఎలన్ మస్క్, స్వీన్కు ఆఫర్ చేశాడట. అయితే అది తక్కువని, బదులులుగా 50 వేల డాలర్లు ఇవ్వమని(37 లక్షల 55 వేలు) స్వీన్ మస్క్‌తో అన్నాడట. తద్వారా తన స్కూల్ ఫీజులతో పాటు టెస్లా కారు కొనాలన్న (టెస్లా మోడల్ 3) కూడా నెరవేరుతుందని స్వీనే ఎలన్ మస్క్‌కి బదులిచ్చాడట. కానీ, అది పెద్ద మొత్తం అని చెబుతూ ఎలన్ మస్క్ ఆ బేరాన్ని అక్కడితోనే ఆపేసి.. మళ్లీ మెసేజ్ చేయలేదట. ట్విటర్లో ఈ ఎలన్ మస్క్‌తో జరిగిన సంభాషణను ఓ ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ ద్వారా బయటపెట్టాడు స్వీన్. దీంతో భద్రత కన్నా డబ్బులు ముఖ్యమా? అని ఎలన్ మస్క్‌కు తిట్టిపోస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు ‘ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను ఆ కుర్రాడు రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్‌గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్‌కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉన్నారు. మస్క్ తనతో బేరానికి రావడం సంతోషంగా, కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉందని, భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం ఆశిస్తున్నట్లు చెప్తున్నాడు 19 ఏళ్ల స్వీనే. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
సెకండ్ వేవ్‌తో విమానయానానికి కష్టాలు
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 80-85 శాతానికే పరిమితం కానుంది. గతంలో ఇది 130-135 శాతం పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గతేడాది మే 25 తర్వాత విమాన సర్వీసులను పరిమిత స్థాయిలో పునరుద్ధరించాక.. దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గతేడాది స్థాయిలో 64 శాతానికి చేరింది. కానీ మార్చి ఆఖరు, ఏప్రిల్ నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, వైరస్ కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలతో మళ్లీ విమాన ప్రయాణాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలవారీగా చూసినప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా 0.7 శాతం మేర క్షీణించింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.4 శాతం పెరిగింది. నెలవారీగా ఏప్రిల్‌లో 28 శాతం డౌన్.. ఇక్రా నివేదిక ప్రకారం 2021 మార్చిలో సగటున రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.49 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో ఇది 28 శాతం క్షీణించి 1.79 లక్షలకు తగ్గిపోయింది. ఇక మే 1 - మే 16 మధ్య కాలంలో మరింతగా 56 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలు చేయాలంటే భయాలు నెలకొనడంతో పాటు గడిచిన రెండు నెలలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం కూడా ఇందుకు కారణమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రేటింగ్స్) శుభం జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగవచ్చని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 80-85 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా డిసెంబర్ నాటికి సింహభాగం జనాభాకు (18 ఏళ్లు పైబడినవారు) టీకాలు వేసే ప్రక్రియ పూర్తయితే .. థర్డ్ వేవ్ ప్రభావం కొంత తగ్గే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. 2023 నాటికి కోవిడ్ పూర్వ స్థాయికి.. తాజా పరిస్థితులను బట్టి చూస్తే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి గానీ దేశీయంగా విమానయానం కోవిడ్–19 పూర్వ స్థాయికి కోలుకోలేదని ఇక్రా తెలిపింది. అదే విదేశాలకు విమాన ప్రయాణాల విభాగానికైతే 2024 ఆర్థిక సంవత్సరం దాకా పట్టేస్తుందని వివరించింది. ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గుదల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నిర్వహణ ఆదాయాలు 12 శాతం క్షీణించి రూ. 12,800 కోట్లకు, నిర్వహణ లాభాలు 40 శాతం క్షీణించి రూ. 2,560 కోట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. వందే భారత్ మిషన్ (వీబీఎం) కింద భారత్‌తో ద్వైపాక్షిక విమాన రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్న పలు దేశాలు (అమెరికా, బ్రిటన్ మొదలైనవి).. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా తాత్కాలికంగా భారత్ నుంచి ఫ్లయిట్స్‌ను రద్దు చేశాయని తెలిపింది. భారీ స్థాయిలో వేక్సినేషన్, లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత, బిజినెస్ ట్రావెల్, పర్యాటక సంబంధ ప్రయాణాలు మొదలైనవి పుంజుకోవడంపైనే సమీప భవిష్యత్తులో ఏవియేషన్ రంగం కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఇక్రా వివరించింది. ప్రైవేట్ విమానాలకు భలే గిరాకీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీ సంపన్నులు తమ విమాన ప్రయాణాలకు.. కమర్షియల్ ఎయిర్‌లైన్స్ కన్నా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్ ఆపరేటర్లు నడిపే ఫ్లయిట్ సరీ్వసులు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం .. జనరల్ ఏవియేషన్ ఫ్లయిట్ సేవలు గతేడాది మార్చిలో 37.7 శాతం క్షీణించగా .. తాజాగా మార్చిలో ఏకంగా 71.8 శాతం వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు, కమర్షియల్ విమానయాన సంస్థలు తిరిగి కోవిడ్-19 పూర్వ స్థాయికి తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రికవరీ మొదలైనట్లు కనిపించినా.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది విదేశాలకు, దేశీయంగా ఇతర ప్రాంతాలకు తొలిసారిగా ప్రయాణిస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 25 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయాణించాల్సిన వారు కూడా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకుంటున్నట్లు వివరించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్.. ప్రైవేట్ విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఫ్లైట్స్ కోసం ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జనరల్ ఏవియేషన్ టెర్మినల్(జీఏటీ)ని ప్రారంభించారు. గణాంకాల ప్రకారం .. ఈ టెర్మినల్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తొలినాళ్లలో రోజుకు 96 మంది దాకా ఉండగా.. మార్చి నాటికి సుమారు 25 శాతం వృద్ధి చెంది 120కి పైగా పెరిగింది. దేశీయంగా తొలి జీఏటీ అయిన ఈ టెర్మినల్‌ను బర్డ్ గ్రూప్, ఎగ్జిక్యూజెట్ ఏవియేషన్ గ్రూప్ కలిసి దాదాపు రూ.150 కోట్లతో నిర్మించాయి. గంటకు 50 మంది ప్రయాణికులు, రోజుకు 150 జెట్స్ నిర్వహణ సామర్థ్యంతో దీన్ని రూపొందించాయి. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
ప్రైవేట్ జెట్స్‌కు ‘కరోనా’ రెక్కలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్ విమానాలకు డిమాండ్ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్ జెట్లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ జెట్ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల పోర్టల్ .. మేక్మైట్రిప్ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్మైట్రిప్ సీవోవో (ఫ్లయిట్స్ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. సురక్షితం, సౌకర్యవంతం.. భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనికా టేక్రివాల్ తెలిపారు. అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్మైట్రిప్ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్ఎన్ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక 2016 నుంచి ఎయిర్ చార్టర్ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్ (ఇండ్‌జెట్స్ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు. ఖరీదైన వ్యవహారమే... ప్రైవేట్ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్ సీఈవో అనూప్ సెహాన్ తెలిపారు. దీనికి జీఎస్టీ, ఎయిర్పోర్ట్ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్–వే ట్రిప్ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది. -
ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లే..
ఢిల్లీ : కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ఎవరూ ఎక్కడికి కదల్లేని పరిస్థితిగా మారింది. దాదాపు రెండు నెలల నుంచి ఎటువంటి సాధారణ ప్రయాణాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. కొందరు తమ ఇంట్లో వాళ్లను మిస్ అవుతున్నామనే భావన వ్యక్తం చేసేవారు. అయితే వీరిలో కొందరు మాత్రం కుటుంబసభ్యులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో వారి పెంపుడు జంతువులకు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ వల్ల కొందరు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉన్నారు. తమ ఆప్తులుగా భావించే పెట్స్ వద్దకు ఎలాగైనా చేరుకోవాలన్న తపనతో ఉన్నారు.(ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు) కేవలం ఇలాంటి వాళ్ల కోసం ఓ ప్రైవేట్ జెట్ సంస్థ.. ప్రత్యేకంగా ఒక విమానాన్ని నడుపుతున్నది. అక్రిషన్ ఏవియేషన్ అనే ప్రైవేటు విమాన సంస్థ ఈ విమానాన్ని నడుపుతున్నది. ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. ఒక్కొక్కొ సీటులో ఒక్కొక్క పెంపుడు జంతువుకు కేటాయించారు. ఆ విమానం కిరాయి ఖరీదు మొత్తం 9 లక్షల 60 వేలు కాగా, ఒక్కో సీటు ధర రూ. లక్షా 60వేలుగా ఉంది. ఇప్పటికే విమానంలోని నాలుగు సీట్లు బుక్ అవ్వగా... ఇంకా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్ నెలలోనే ఈ ప్లేన్‌ను నడపనున్నారు. కాగా సీట్లు బుక్ చేసుకున్న వాటిలో రెండు షిహూ తుజస్, ఓ గోల్డెన్ రిట్రీవర్ శునకాలు ఉన్నాయి. మరో లేడీ ఫిజంట్ పక్షి కోసం కూడా ఒక సీటు బుక్కైంది. త్వరలోనే మిగతా రెండు సీట్లను కూడా బుక్ చేయాలని సంస్థ భావించింది. ఢిల్లీ నుంచి ముంబై వరకు కేవలం పెంపుడు జంతువుల కోసమే ఈ విమానాన్ని నడుపుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్ తెలిపారు.ఆమె మాట్లాడుతూ..' కొంతమంది వారి పెంపుడు జంతువులను తమతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు. మిగతావారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండేవారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో అన్ని రకాల పెంపుడు జంతువులు(పక్షులు, పెట్ డాగ్స్) వంటివి వారి యజమానుల వద్దకు క్షేమంగా పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అక్రిషన్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా.' అంటూ పేర్కొన్నారు.(ఏపీలో మరో 50 పాజిటివ్ కేసులు) -
ఇమ్రాన్! నా విమానాన్ని తిరిగిచ్చేయ్
ఇస్లామాబాద్ : ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి న్యూయార్క్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు. అయితే తాజాగా అసలు కారణం విమాన సాంకేతికలోపం కాదని తేలింది. కాగా ఈ వ్యవహారంపై సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ పత్రిక ప్రైడే టైమ్స్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లడానికి ముందు ఇమ్రాన్ రెండు రోజులు సౌదీ అరేబియాలో పర్యటించారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన ఇమ్రాన్‌ను కమర్షియల్ విమానంలో పంపడం ఇష్టం లేక యువరాజు సల్మాన్ తన ప్రైవేట్ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం ప్రైవేట్ జెట్‌లోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. సమవేశాలు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ప్లైట్‌లో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్‌కు చెందిన ప్రైడేటైమ్స్ పత్రిక మాత్రం ఈ వాదనతో పూర్తిగా విభేదించింది.పాక్ ప్రధాని ఇమ్రాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదని పేర్కొంది. పైగా తన అనుమతి లేకుండా ఇరాన్‌తో చర్చలు జరపడంపై సౌదీ యువరాజు గుర్రుగా ఉన్నట్లు ఫ్రైడే టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఇమ్రాన్‌పై అసంతృస్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. -
అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం
లక్నో : ఓ ప్రైవేట్ శిక్షణ విమానం మంగళవారం ఉదయం అలీగఢ్‌లోని ధనిపూర్‌లో ల్యాండవుతుండగా రన్‌వేపైనే కూలిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. విమానంలో ఉన్న ఆరుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ప్రైవేట్ విమానం వీటీ-ఏవీవీ జెట్ అలీగఢ్‌లో ఉందని, విమానం ల్యాండవుతున్న సమయంలో విమానం వీల్స్‌కు కరెంట్ తీగలు తగలడంతో కుప్పకూలిందని తెలిసింది. కూలిన విమానానికి మంటలు అంటుకునే లోపే ఆరుగురు ప్రయాణీకులు అందులోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
అద్దెకు విమానాలు..ఓలా,ఊబర్ మాదిరే బుకింగ్ !
-
ప్రైవేటు విమానాన్ని కొన్న హీరో!
‘ఉడ్తా పంజాబ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన దిల్జిత్ దోసాన్జ్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం అతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ‘ఫిల్హౌరి’ సినిమాలోనూ దిల్జిత్ అలరించాడు. ఇక అసలు విషయానొకొస్తే దిల్జిత్ తాజాగా ఓ ప్రైవేటు జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘ ప్రైవేటు జెట్‌తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ అతను ట్వీట్ చేశాడు. దిల్జిత్ త్వరలోనే తన టీమ్‌తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్) నిర్వహించబోతున్నాడు. త్వరలో వాంకోవర్, ఎడ్మంటన్, విన్నిపెగ్, టోరంటోలో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అతను పెట్టిన కొత్త విమానం ఫొటోలు, వీడియోలు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. New Beginning Starts With Private Jet -
పెరట్లో పార్క్ చేసుకోవచ్చు..
అవును.. ఈ ప్రైవేట్ జెట్‌ను పెరట్లోనే పార్క్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ జెట్ పేరు లిలియం. గంటకు 250 మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ జెట్ టేకాఫ్, ల్యాండింగ్ నిట్టనిలువుగా చేయడం వల్ల దీనికి 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉన్న స్థలం సరిపోతుందట. అంటే.. ఎయిర్‌పోర్టులతో పనిలేదు. కాసింత విశాలంగా ఉన్న పెరట్లోనే పార్క్ చేసుకోవచ్చు. దీన్ని జర్మనీకి చెందిన డేనియల్ వెగాండ్, పాట్రిక్ నాథెన్, సెబాస్టియన్ బార్న్, మథియాస్ అనే నలుగురు ఇంజనీర్లు డిజైన్ చేశారు. రోజువారీ జీవితంలో ఉపయోగించుకునే ప్రైవేటు జెట్‌ను తయారుచేయడంలో భాగంగా దీన్ని రూపొందించినట్లు డేనియల్ తెలిపారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఇందులో ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడినట్లు చెప్పారు. బ్యాటరీలతో సాయంతో నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం రూపొందించిన డిజైన్.. రాత్రి వేళల్లో ప్రయాణించేందుకు వీలుపడదు. సాయంత్రం సమయానికి తిరిగొచ్చేయాలన్నమాట. అంతేకాదు.. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణం పెట్టుకోకపోవడమే బెటరని చెబుతున్నారు. మిగిలిన ప్రైవేటు జెట్లతో పోలిస్తే.. ఇది పర్యావరణ అనుకూలమని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. 2018లో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. లిలియం.. ప్రయాణికుల సామర్థ్యం: 2 స్టీరింగ్: సులభం.. (అంతా కంప్యూటర్ కంట్రోల్డ్ సిస్టమ్) అత్యధిక టేకాఫ్ సామర్థ్యం: 600 కిలోలు.. వేగం: గంటకు 180 మైళ్లు అత్యధిక వేగం: 250 మైళ్లు పవర్: 435 హెచ్‌పీ ప్రయాణం: ఏకధాటిగా 300 మైళ్లు