
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఓ ప్రైవేట్ జెట్ సొంతం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీని కోసం అతడు అక్షరాలా 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఓ జాతీయ మీడియా కథనం అల్లేసింది. ఇది కాస్తా అక్షయ్ కంట పడటంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. 'లయ్యర్ లయ్యర్.. ప్యాంట్స్ ఆన్ ఫైర్.. మీ చిన్నతనంలో మీరి పద్యం నేర్చుకునే ఉంటారు. కొంతమంది జనాలకు బుద్ధి ఎదగలేదు అనిపిస్తోంది. నా గురించి నోటికొచ్చిన అబద్ధాలు రాసేస్తున్నారు. అయినా అలాంటి వారిని గురించి పట్టించుకోవడమే అనవసరం. కాకపోతే మీకోసం ప్యాంట్స్ ఆన్ ఫైర్ పద్యం అంకితం చేస్తున్నా' అని ట్వీట్ చేశాడు.
ఇది చూసిన అక్షయ్ ఫ్యాన్స్.. 'చాలా రోజుల తర్వాత మీరు ఫైర్ అవడాన్ని చూస్తున్నాం', 'అక్కి సర్ ఈరోజు రౌడీ మూడ్‌లో ఉన్నాడు', 'ఇలాంటి వారిని ఊరికే వదిలేయకుండా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అతడు నటించిన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్ థియేటర్‌లో రిలీజ్ కాగా కట్‌పుట్లి ఓటీటీలో విడుదలైంది. అలాగే అతడు ప్రధాన పాత్రలో నటించిన రామసేతు దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నూస్రత్ భరూచ, సత్యదేవ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Liar, Liar…pants on fire! Heard this in childhood? Well, some people have clearly not grown up, and I’m just not in a mood to let them get away with it. Write baseless lies about me, and I’ll call it out. Here, a Pants on Fire (POF) gem for you. 👇#POFbyAK pic.twitter.com/TMIEhdV3f6
— Akshay Kumar (@akshaykumar) October 16, 2022
Comments
Please login to add a commentAdd a comment