
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం కేసరి-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని జలియన్‌వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేసరి-2 మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జయా బచ్చన్ తన సినిమా టైటిల్‌పై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' లాంటి టైటిల్ ఉంటే ఎవరైనా సినిమా చూస్తారా? అంటూ గతంలో జయా బచ్చన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి పేరుతో ఉన్న సినిమాలను తాను అస్సలు చూడనని తెలిపింది.
దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ..' ఆ సినిమా టైటిల్ చూసి ఇప్పుడు ఆమె అలా చెప్పి ఉంటే అది తప్పకుండా అంగీకరించాల్సిందే. ఆ విషయం గురించి నాకు కూడా తెలియదు. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంలో నేనేమైనా తప్పు చేసి ఉంటే.. జయా బచ్చన్ చెప్పింది కరెక్ట్. అయితే టైటిల్ చూసి ఎవరైనా అలా విమర్శలు చేస్తారని తాను అనుకోవడం లేదు." అని అన్నారు. కాగా.. అక్షయ్ కుమార్ నటిస్తోన్న 'కేసరి 2' సి శంకరన్ నాయర్ కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం జలియన్‌వాలాబాగ్ ఊచకోత. నాయర్ నేతృత్వంలోని పోరాటం అంశాలతో తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.