Toilet ek prem katha
-
టాయిలెట్2తో ముందుకు వస్తున్న యాక్షన్ హీరో
ముంబాయి: ‘టాయిలెట్-ఏక్ ప్రేమ్ కథ’ సినిమా ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ టాయిలెట్2 పేరుతో అదే జోనర్లో మరో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టాయిలెట్2 సెట్స్ మీదకు వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్లో శనివారం ట్వీట్ చేశారు. ఒక ప్రొమో వీడియో కూడా షేర్ చేశారు. టాయిలెట్2 కోసం సిద్ధంగా ఉండాలని కోరారు. నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంతో స్పూర్తి పొంది టాయిలెట్-ఏక్ ప్రేమ్ కథ సినిమాను దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ తెరకెక్కించారు. మహిళల ఆత్మగౌరవం, రక్షణ కోసం ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని తెలియజేసేలా దర్శకుడు అద్భుతంగా సినిమా తీశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా భూమి పడ్నేకర్ అద్భుతంగా నటించింది. ప్రస్తుతం టాయిలెట్1 మూవీ చైనాలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రధాన మంత్రి మోదీ మెసేజ్ ఈ చిత్రం ద్వారా ఇప్పుడు విదేశాల్లోకి కూడా వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. టాయిలెట్ హీరో పేరుతో మాండేరియన్ బాషలో చైనాలో ఈ నెల 8న విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సుమారు రూ.18 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. -
చైనాలో దుమ్మురేపుతున్న టాయిలెట్ హీరో
న్యూఢిల్లీ : బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ జంటగా నటించిన సోషల్ డ్రామా మూవీ ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ చైనాలో హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. గత సంవత్సరం ఆగస్టు 11న భారత్‌లో ఈ మూవీ విడుదల అయిన సంగతి తెల్సిందే. అయితే ‘ టాయిలెట్ హీరో’ పేరుతో శుక్రవారం (జూన్ 8న) చైనాలో ఈ మూవీని విడుదల చేశారు. సుమారు 4,300 స్క్రీన్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చైనా ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో విడుదల చేసిన థియేటర్ల కంటే కూడా చైనాలో 5 శాతం ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయటం గమనార్హం. సినిమా విడుదలైన శుక్రవారం 2.35 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. శనివారం 3.35, ఆదివారం 3.16 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదటి మూడు రోజుల్లో భారత కరెన్సీలో రూ.61.04 కోట్లను వసూలు చేసినట్లు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అక్షయ్ కుమార్ నటించిన మూవీ చైనాలో విడుదల కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంట్లో టాయిలెట్ లేకపోతే మహిళలు ఎంత ఇబ్బందులు గురవుతారో తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయలను ఇండియాలో వసూలు చేసింది. -
‘టాయిలెట్ హీరో’గా మారిన అక్షయ్
ప్రస్తుతం ఇండియన్ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాయి. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ సక్సెస్ తరువాత చైనా మార్కెట్‌పై కన్నేసింది బాలీవుడ్. సినిమాలో కంటెంట్ ఉంటే చైనాలో కూడా రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నాయి మన సినిమాలు. సీక్రెట్ సూపర్‌స్టార్, ఖానభజరంగీ భాయిజాన్, ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్మెయిల్’ అక్కడ కూడా సక్సెస్ సాధించాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్‌ప్రేమ్ కథా’ కూడా చైనా రిలీజ్‌కు సిద్ధమైంది. గతేడాది విడుదలైన ఈ మూవీ భారత్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేయనున్నారు. టాయిలెట్ హీరో అనే టైటిల్‌తో జూన్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మరి ఈ సినిమా అక్కడ కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్‌కు జోడీగా భూమి ఫెడ్నేకర్ నటించిన సంగతి తెలిసిందే. IT’S CONFIRMED... #ToiletEkPremKatha to release in China on 8 June 2018... Titled #ToiletHero for the local audiences... Here’s the OFFICIAL POSTER for China... #TEPK pic.twitter.com/VlQFufXN3Q — taran adarsh (@taran_adarsh) June 1, 2018 -
ఆ చిత్రానికి బిల్‌గేట్స్ ఫిదా అయ్యారంట..!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’ . ఈ చిత్రంలో హీరోయిన్గా భూమి పెడ్నేకర్ నటించారు. శ్రీనారాయణ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ డ్రామాను అక్షయ్ నీరజ్ పాండేతో కలిసి నిర్మించిచారు. అయితే ఈ మూవీకి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ చిత్రం ఇండియన్స్‌నే కాదు మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను సైతం అకట్టుకుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ పోస్టు చేశాడు. ‘టాయ్ లెట్’ సినిమా నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అంతేకాక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపి ప్రజలను మేల్కొనేలా చేశారు. భారత దేశంలో ఉన్న పారిశుద్ద్య సవాల గురించి ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలిపారు.’ అని తన ట్విట్లో పేర్కొన్నారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ నేపథ్యంలో భాగంగా భారత్‌లో టాయ్‌లెట్ నిర్మాణం ఒక వార్త అంశంగా మారిపోవటం మనకు తెలుసు. -
మేకప్ తీసి చూపిస్తున్నారు..!
భారతీయ సినిమాల్లో ఫాంటసీలే ఎక్కువగా కనిపిస్తాయి. వంద మందిని ఒంటి చేత్తో ఎదిరించే హీరో. ఎంతటి మగాడినైనా ఫిదా చేసే హీరోయిన్, ప్రపంచాన్ని శాసించినా.. హీరో ముందు చిత్తైపోయే విలన్. ఆరు పాటలు,నాలుగు ఫైట్లు, మరో నాలుగు కామెడీ సీన్లు. చాలా కాలంగా మన సినిమా అంటే ఇదే. కమర్షియల్ విలువల పేరుతో సినిమాను ఈ హద్దుల్లో కట్టి పడేశారు. అప్పుడప్పుడు కొత్త ప్రయత్నాలు జరిగినా.. రొటీన్ సినిమాలతో పోలిస్తే ఆ సంఖ్య నామమాత్రమే. అయితే ఇటీవల కాలంలో పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. మూస ఫార్ములాలను పక్కన పెట్టి దేశంలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా భారతీయ సినిమా మేకప్ తీసేసి రియలిస్టిక్ గా ప్రజెంట్ చేసిన సినిమాలు కూడా అడపాదడపా తారస పడుతూనే ఉన్నాయి. ఓ సామాజిక సమస్యను సినిమా కథగా రూపొందించిన తాజా చిత్రం టాయిలెట్. కేంద్ర ప్రభుత్వ నినాదం స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన ఈ సినిమా దేశంలోని పరిస్థితులను వెండితెర మీద ఆవిష్కరించింది. సామాజికంగా ఎంత అభివృద్ది చెందుతున్నప్పటికీ ఇంకా దేశంలోని సగం జనాభా టాయిలెట్ లను వాడటం లేదన్న నిజాన్ని బయటపెట్టింది ఈ సినిమా. ఓ పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకున్న చదువుకున్న అమ్మాయి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. (సాక్షి స్పెషల్) ఇంట్లో టాయిలెట్ ఏర్పాటు చేయకపోతే విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టిన అమ్మాయి తను అనుకున్నది సాధించిందా లేదా అన్నదే ఈ సినిమా కథ. అయితే ఈ తరహా సినిమాలు చేయటం కాస్త ఇబ్బందికరమైన విషయంలో.. నిజాన్ని అంగీకరించడానికి మన సమాజం సిద్ధంగా ఉండదు. సమస్యను ఎత్తి చూపిస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. వివాదాలు మొదలవుతాయి. కానీ ఆ సమస్యలన్ని దాటి గెలిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ప్రయత్నమే 'రాజ్ నీతి'. హిందీ సినిమాల్లో రాజకీయాల ప్రస్థావన తరుచూ కనిపిస్తుంటుంది. అయితే ఓ చిన్న గ్రామంలోని రాజకీయ కుటుంబం నేపథ్యంలో భారత రాజకీయ వ్యవస్థ ప్రతిభింబించేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రకాష్ ఝా, ప్రస్తుతం వ్యవస్థలోని జాతీయ నాయకులను పోలిన పాత్రలు సృష్టించి వాటి చుట్టూ కథను నడిపించే సాహసం చేశారు. ఈ సినిమా మన రాజకీయ వ్యవస్థ మూలంగా జరుగుతున్న ఆరాచకాలను, దుర్మార్గాలను చూపించింది. సామజిక స్ఫృహ కలిగిన చిత్రాలను తెరకెక్కించటంలో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఎపుడూ ముందే ఉంటాడు. అందుకే తారే జమీన్ పర్, దంగల్ అద్భుత చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. అయితే ఈ తరహాలో ఆమిర్ చేసిన ఓ భారీ సాహసం పీకే. నమ్మకాలకు ఎంతో విలువనిచ్చే మన దేశంలో ఆ నమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమాను రూపొందించాడు ఆమిర్.(సాక్షి స్పెషల్) దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆమిర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పీకే. ఈ సినిమాలో మతపరమైన నమ్మకాలను, ఆచారాలను కాస్తం వ్యంగ్యం చూపించిన చిత్రయూనిట్ దైవ దూతలుగా చెప్పుకునే వారిని ప్రత్యక్షంగానే విమర్శించాడు. కొత్త దర్శకుడు చైతన్య తంహనే తెరకెక్కించిన మరాఠి సినిమా కోర్టు కూడా ఈ జాబితాలోనిదే. మన న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా.. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. (సాక్షి స్పెషల్) ఓ ప్రజాగాయుకుడు తన పాటలతో ఓ వ్యక్తి ఆత్మ హత్యకు కారకుడయ్యాడన్న కారణంతో అతన్ని కోర్డు ముందు హజరు పరుస్తారు. తరువాత కోర్టులో ఇరు పక్షాల వాదోపవాదనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కొత్త దర్శకుడు ఏకంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే సాహసం చేయటం.. ఆ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించటం నిజంగా సంచలనమే. -
హాస్పిటల్స్ లో 'టాయిలెట్' ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గాంధీ జయంతి రోజున ఈ సినిమాను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మల మూత్ర విసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందులో భాగంగానే టాయిలెట్ సినిమాను హాస్పిటల్స్ లో ప్రదర్శించాలని నిర్ణయించారు. అంతేకాదు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
బడ్జెట్ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు
ముంబై: బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఎనిమిది రోజుల్లో వంద కోట్ల క్లబ్లో చేరింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లో రూ.100.05 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దానికి నాలుగింతలు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రెండో వారంలోనూ నిలకడగా వసూళ్లు రాబడుతూ నిర్మాతలు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ. 13.10 కోట్లు, రెండో రోజు 17.10 కోట్లు, మూడో రోజు 21.25 కోట్లు, నాలుగో రోజు రూ. 12 కోట్లు, ఐదో రోజు రూ. 20 కోట్లు, ఆరో రోజు 6.50 కోట్లు, ఏడో రోజు రూ. 6.10 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 4 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల కాలంలో విడుదలైన అగ్రహీరోల సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ చిత్ర విజయం బయ్యర్లకు ఊరటనిచ్చింది. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ సరసన భూమి పడ్నేకర్ నటించింది. -
ఆ సినిమా సీక్వెల్లో తొలి సీన్ ఇదే!
ముంబై : యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోవడంతో అప్పడే రెండో పార్ట్‌పై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. దీనికి రెండో పార్ట్‌లో తొలి సీన్ ఇదే అయ్యి ఉంటుందని బీచ్ పక్కనే బహిర్భూమి వెళ్తున్న ఓ వ్యక్తి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మార్నింగ్ వాక్ వెళ్లినప్పడు తాను తీసిన ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. సినిమా ప్రమోషన్ కోసం మరీ ఇలాంటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలా అంటూ కొందరూ విమర్శిస్తుంటే, కనీసం ఈ సినిమా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ టాయిలెట్లు నిర్మించుకోవాలని ట్వింకిల్ కన్నాకు బాసటగా నిలుస్తూ.. నెటిజన్లు కామెంట్లు చేశారు. అందరికీ టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా..అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు ట్వింకిల్ కన్నా బదులిచ్చారు.. సరిగ్గా అక్కడి నుంచి 7 నుంచి 8 నిమిషాలు నడిస్తే ఓ పబ్లిక్ టాయిలెట్ ఉందని తెలిపారు. ఈ ఏడాది బాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. సూపర్స్టార్లు సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్', షారుఖ్ ఖాన్ 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాలీవుడ్ ఆశలను నిలబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. ఆగస్టు 11న (గత శుక్రవరం) విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 96 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి ఎయిర్‌లిప్ట్, రుస్తుం, హౌస్‌ఫుల్-3, జాలీ ఎల్ఎల్బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్ మరోసారి సూపర్ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్ ఖేర్, సనాఖాన్ తదితరులు నటించారు. -
డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!
బాలీవుడ్‌కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. సూపర్స్టార్లు సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్', షారుఖ్ ఖాన్ 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాలీవుడ్ ఆశలను నిలబెట్టింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 50 కోట్లు రాబట్టింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. తొలిరోజు రూ. 13.10 కోట్లు రాబట్టిన 'టాయ్‌లెట్' రెండోరోజూ శనివారం మరింత పుంజుకొని ట్రెడ్ అనలిస్టులను ఆశ్చర్యపరిచింది. రెండోరోజు ఈ సినిమా ఏకంగా రూ. 17.10 కోట్లు రాబట్టగా.. మూడో రోజు ఆదివారం రూ. 20.05 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి తొలి వారాంతంలో ఈ సినిమా అంచనాలను మించి రూ. 50.25 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వారాంతం తర్వాత కూడా వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. స్ట్రాంగ్ మౌత్‌టాక్ ఈ సినిమాకు భారీ వరంగా మారింది. శుక్రవారం రూ. 13.10 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా శనివారం 17.10 కోట్లు వసూలు చేసింది. ' అని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ట్విట్టర్లో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో తెరకెక్కిన సినిమాపై కొందరు విమర్శకులు పెదవి విరిచారు. కానీ ప్రేక్షకులు మాత్రం తెరపై అక్షయ్ మార్క్ కామెడీని చూసేందుకు పోటెత్తుతున్నారని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. తనదైన స్టైల్ కామెడీ టైమింగ్‌తో అక్షయ్ ఈ సినిమాను నిలబెట్టాడని అంటున్నారు. అక్షయ్ కామెడీ డైలాగ్ పేల్చిన ప్రతిసారీ థియేటర్ నవ్వులతో దద్దరిల్లుతోందని చెప్తున్నారు. మొత్తానికి ఎయిర్‌లిప్ట్, రుస్తుం, హౌస్‌ఫుల్-3, జాలీ ఎల్ఎల్బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్ మరోసారి సూపర్ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. -
'నా సినిమాకు ఎనిమిదికాదు.. మూడే కట్స్'
ముంబయి: తన చిత్రానికి సెన్సార్ బోర్డు మూడు కట్స్ మాత్రమే చెప్పిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ చెప్పారు. కొన్ని అభ్యంతరకరంగా ఉన్న మూడు మాటలను తొలగించాలని మాత్రమే కేంద్ర సెన్సార్ బోర్డు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆయన నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రానికి సెన్సార్ బోర్డు బుధవారం క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఈ సినిమాలో ఎనిమిది నుంచి తొమ్మిదిచోట్ల మాటలు ఇబ్బంది కరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎనిమిది కత్తెరలు వేయాలని ఆదేశించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఆయన కొన్ని గంటల్లోనే వివరణ ఇస్తూ 'నేను నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ కథ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఎనిమిది కట్లు చెప్పినట్లు వచ్చిన కథనాలు చదివాను. కానీ, ఇదంతా అబద్ధం. ఈ వార్తలు అసలు ఎలా వస్తాయో నాకు అర్ధం కావడం లేదు. నాకు అది చదివాక ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాలో మూడు వెర్బల్ కట్లు మాత్రమే చేయాలని సెన్సార్ బోర్డు తెలిపింది' అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. -
విడుదలకు ముందే సినిమా లీక్
న్యూఢిల్లీ: స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న సినిమా ముందే ఆన్లైన్ లీకవడం కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛభారత్‌ను ప్రమోట్ చేస్తూ తెరకెక్కిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ధ్రువీకరించారు. అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్లు హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే సమస్యలపై దర్శకుడు నారాయణ్ సింగ్ ఈ సినిమా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విడుదల కన్నా ముందుగానే సినిమా లీకవడం దర్శకుడు, నిర్మాతలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. -
ఆ సినిమా ట్రైలర్‌కు మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: త్వరలో విడుదల కాబోయే అక్షయ్ కుమార్ చిత్రం ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ ట్రైలర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ఈ చిత్రం ఒక గొప్ప ప్రయత్నమని కొనియాడారు. ఈ చిత్రం ట్రైలర్ లింకును అక్షయ్‌కుమార్ మోదీతో పంచుకున్నారు. ‘పరిశుభ్రతపై సందేశాన్ని ప్రచారం చేయడానికి ఇది మంచి ప్రయత్నం. స్వచ్ఛ్ భారత్ సాకారానికి 125 కోట్ల మంది భారతీయులు కలిసి పనిచేయాలి’ అని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు. గత నెలలో అక్షయ్‌కుమార్ మోదీని కలిసినపుడు వారి మధ్య ఈ చిత్రం ప్రస్తావనకు వచ్చింది. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్ ఖేర్, సనాఖాన్ తదితరులు నటించారు. -
హీరో చెప్పిన టైటిల్ విని మోదీ నవ్వులు
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోమవారం కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తర్వాతి సినిమా 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' గురించి మోదీకి చెప్పినట్లు తెలిపారు. సినిమా టైటిల్ విన్న మోదీ నవ్వారని చెప్పారు. సినిమా కథను కూడా ఆసక్తిగా విన్నట్లు చెప్పారు. టైటిల్‌పై మోదీ స్పందన తనను ఆనందానికి గురి చేసినట్లు వివరించారు. కాగా, ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల కానుంది. ప్రధానమంత్రి స్వచ్చభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. Met PM @narendramodi and got the opportunity to tell him about my upcoming 'Toilet-Ek Prem Katha.' His smile at just the title made my day! pic.twitter.com/qbvYrlbM2Y — Akshay Kumar (@akshaykumar) May 9, 2017 -
డైరెక్టర్ నాలుకపై కోటి రూపాయల నజరానా!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్టులలో 'టాయిలెట్-ఎక్ ప్రేమ్ కథా' ఒకటి. కొన్ని రోజుల కిందట షూటింగ్ మొదటిరోజు టాయిలెట్లో హీరోయిన్ భూమి పెడ్నేకర్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని అక్షయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేసింది. ఆ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి వివాదంతో ముందుకొచ్చింది. సాధువు బెహరీ దాస్ మహరాజ్ ఈ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండే నాలుక తెచ్చిన వారికి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలు, కొన్ని ఏరియాలలో ఇవి లేని కారణంగా ఏకంగా వివాహాలు రద్దయిన విషయం తెలిసిందే. మధుర పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే నందగావ్ పురుషులకు, బర్సానా గ్రామ మహిళలకు వివాహాలు జరగవు. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ప్రేయసి రాధకి వివాహం కాలేదని, ప్రస్తుతం ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఆ గ్రామాల వారైనందున స్టోరీని మార్చాలని బెహరీ దాస్ మహరాజ్ తో పాటు మరికొందరు సాధువులు హెచ్చరించారు. మూవీ స్టోరీని మార్చితీరాల్సిందేనని మూవీ యూనిట్‌ను డిమాండ్ చేస్తున్నారు. మహామండలేశ్వర్ నవల్ గిరి మహరాజ్ మధురలో మాట్లాడుతూ.. సమాజానికి సందేశాన్నిచ్చే స్టోరీ అయితే ఆ మూవీ పేరును 'టాయిలెట్- ఏ స్వచ్ఛ అభియాన్' అని మార్చుకోవాలని అన్నారు. రాధాకృష్ణుల పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సినిమా తీస్తూ, పెళ్లి లాంటి విషయాలను టచ్ చేశారని మహంత్ హరిబోల్ మహరాజ్ అన్నారు. టైటిల్ కచ్చితంగా మార్చితీరితేనే నందగావ్, బర్సానా, మధుర ప్రాంతాల్లో షూటింగ్ సజావుగా సాగనిస్తామని సాధువులంతా సోమవారం మధురలో జరిగిన ఓ సమావేశంలో నిర్ణయించారు. ఆ మూవీకి డైరెక్టర్ నీరజ్ పాండే కాగా నిర్మాతలుగా విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే వ్యవహరిస్తున్నారు. -
టాయ్లెట్లో హీరో-హీరోయిన్ సెల్ఫీ!
మురికి మరుగుదొడ్డి చూస్తే.. ఎవరైనా ఆ కంపునకు ముక్కు మూసుకుంటారు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ మాత్రం ఏకంగా హీరోయిన్ను వెంటపెట్టుకొని మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగాడు. ఎందుకంటే.. ఆయన మరో క్రేజీ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ భారత్’ పథకం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టాయ్‌లెట్- ఎక్ ప్రేమ్‌కథ’ సినిమాలో అక్షయ్ నటిస్తున్నాడు. సినిమా పేరులోనే టాయ్‌లెట్ ఉంది కాబట్టి.. తొలిరోజు మధురలో షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఇదిగో ఇలా భూమి పడ్నేకర్‌తో కలిసి మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పెట్టాడు. శ్రీ నారాయణ్‌సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ స్వచ్ఛత అంశం చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవల మరుగుదొడ్డి లేని కారణంగా దేశంలో పలుచోట్ల పెళ్లికూతుళ్లు పెళ్లిని నిరాకరించడం, భర్తను వదిలిపెట్టడం వంటి అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారని సమాచారం. ఇప్పటికే అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతని మూడు సినిమాలు సూపర్‌హిట్ అయి వందకోట్ల క్లబ్బులో స్థానం సాధించాయి. అంతేకాకుండా ‘జాలీ ఎల్ఎల్బీ-2’, రజనీకాంత్ ‘రోబో-2’, నీరజ్ పాండే ‘క్రాక్’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో అక్కీ నటిస్తున్నాడు. వరుస విజయాలు వస్తున్నా.. రోటిన్‌కు భిన్నంగా సామాజిక కథాంశంతో అక్కీ ఈసారి ‘టాయ్‌లెట్ ఎక్ ప్రేమ్‌కథ’లో నటిస్తున్నాడు.