'నా సినిమాకు ఎనిమిదికాదు.. మూడే కట్స్‌' | Toilet: Ek Prem Katha Got 3 Verbal Cuts Not 8: Akshay Kumar | Sakshi
Sakshi News home page

'అసలు ఇలాంటి వార్తలు మీకెలా వస్తాయి'

Published Wed, Aug 9 2017 3:44 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'నా సినిమాకు ఎనిమిదికాదు.. మూడే కట్స్‌' - Sakshi

'నా సినిమాకు ఎనిమిదికాదు.. మూడే కట్స్‌'

ముంబయి: తన చిత్రానికి సెన్సార్‌ బోర్డు మూడు కట్స్‌ మాత్రమే చెప్పిందని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ చెప్పారు. కొన్ని అభ్యంతరకరంగా ఉన్న మూడు మాటలను తొలగించాలని మాత్రమే కేంద్ర సెన్సార్‌ బోర్డు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆయన నటించిన టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ చిత్రానికి సెన్సార్‌ బోర్డు బుధవారం క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే, ఈ సినిమాలో ఎనిమిది నుంచి తొమ్మిదిచోట్ల మాటలు ఇబ్బంది కరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎనిమిది కత్తెరలు వేయాలని ఆదేశించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.

దీనిపై ఆయన కొన్ని గంటల్లోనే వివరణ ఇస్తూ 'నేను నటించిన టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ కథ చిత్రానికి  సెన్సార్‌బోర్డు ఎనిమిది కట్‌లు చెప్పినట్లు వచ్చిన కథనాలు చదివాను. కానీ, ఇదంతా అబద్ధం. ఈ వార్తలు అసలు ఎలా వస్తాయో నాకు అర్ధం కావడం లేదు. నాకు అది చదివాక ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాలో మూడు వెర్బల్‌ కట్లు మాత్రమే చేయాలని సెన్సార్‌ బోర్డు తెలిపింది' అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement