ఆ సినిమా ట్రైలర్‌కు మోదీ ప్రశంస | PM Narendra Modi Lauds Akshay Kumar Toilet Ek Prem Katha's Trailer | Sakshi
Sakshi News home page

ఆ సినిమా ట్రైలర్‌కు మోదీ ప్రశంస

Published Wed, Jun 14 2017 8:27 AM | Last Updated on Tue, Aug 28 2018 5:30 PM

ఆ సినిమా ట్రైలర్‌కు మోదీ ప్రశంస - Sakshi

ఆ సినిమా ట్రైలర్‌కు మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: త్వరలో విడుదల కాబోయే అక్షయ్‌ కుమార్‌ చిత్రం ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ ట్రైలర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ఈ చిత్రం ఒక గొప్ప ప్రయత్నమని కొనియాడారు. ఈ చిత్రం ట్రైలర్‌ లింకును అక్షయ్‌కుమార్‌ మోదీతో పంచుకున్నారు.

‘పరిశుభ్రతపై సందేశాన్ని ప్రచారం చేయడానికి ఇది మంచి ప్రయత్నం. స్వచ్ఛ్‌ భారత్‌ సాకారానికి 125 కోట్ల మంది భారతీయులు కలిసి పనిచేయాలి’ అని మోదీ మంగళవారం ట్వీట్‌ చేశారు. గత నెలలో అక్షయ్‌కుమార్‌ మోదీని కలిసినపుడు వారి మధ్య ఈ చిత్రం ప్రస్తావనకు వచ్చింది. ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్‌ ఖేర్, సనాఖాన్‌ తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement