చైనాలో దుమ్మురేపుతున్న టాయిలెట్‌ హీరో | Akshay Kumars Toilet Ek Prem Katha Stays Strong At China Box Office | Sakshi
Sakshi News home page

చైనాలో దుమ్మురేపుతున్న టాయిలెట్‌ హీరో

Published Mon, Jun 11 2018 5:01 PM | Last Updated on Tue, Aug 28 2018 5:30 PM

Akshay Kumars Toilet Ek Prem Katha Stays Strong At China Box Office - Sakshi

చిత్ర పోస్టర్‌

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, భూమి పడ్నేకర్‌ జంటగా నటించిన సోషల్‌ డ్రామా మూవీ ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’  చైనాలో హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంటోంది. గత సంవత్సరం ఆగస్టు 11న భారత్‌లో ఈ మూవీ విడుదల అయిన సంగతి తెల్సిందే. అయితే ‘ టాయిలెట్‌ హీరో’ పేరుతో శుక్రవారం (జూన్‌ 8న) చైనాలో ఈ మూవీని విడుదల చేశారు. సుమారు 4,300 స్క్రీన్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చైనా ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

ఇండియాలో విడుదల చేసిన థియేటర్ల కంటే కూడా చైనాలో 5 శాతం ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయటం గమనార్హం. సినిమా విడుదలైన శుక్రవారం 2.35 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా.. శనివారం 3.35, ఆదివారం 3.16 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదటి మూడు రోజుల్లో భారత కరెన్సీలో రూ.61.04 కోట్లను వసూలు చేసినట్లు ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

అక్షయ్‌ కుమార్‌ నటించిన మూవీ చైనాలో విడుదల కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంట్లో టాయిలెట్‌ లేకపోతే మహిళలు ఎంత ఇబ్బందులు గురవుతారో తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయలను ఇండియాలో వసూలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement