టాయిలెట్‌2తో ముందుకు వస్తున్న యాక్షన్‌ హీరో | Akshay Kumar to come out with Toilet2 | Sakshi
Sakshi News home page

టాయిలెట్‌2తో ముందుకు వస్తున్న అక్షయ్‌ కుమార్‌

Published Sat, Jun 30 2018 6:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Akshay Kumar to come out with Toilet2 - Sakshi

టాయిలెట్‌1 చిత్ర పోస్టర్‌

ముంబాయి: ‘టాయిలెట్‌-ఏక్‌ ప్రేమ్‌ కథ’ సినిమా ఘన విజయం సాధించడంతో బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ టాయిలెట్‌2 పేరుతో అదే జోనర్‌లో మరో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టాయిలెట్‌2 సెట్స్‌ మీదకు వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో శనివారం ట్వీట్‌ చేశారు. ఒక ప్రొమో వీడియో కూడా షేర్‌ చేశారు. టాయిలెట్‌2 కోసం సిద్ధంగా ఉండాలని కోరారు. నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంతో స్పూర్తి పొం‍ది టాయిలెట్‌-ఏక్‌ ప్రేమ్‌ కథ సినిమాను దర్శకుడు శ్రీ నారాయణ్‌ సింగ్‌ తెరకెక్కించారు.  మహిళల ఆత్మగౌరవం, రక్షణ కోసం ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని తెలియజేసేలా దర్శకుడు అద్భుతంగా సినిమా తీశారు.

ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌కు జోడీగా భూమి పడ్నేకర్‌ అద్భుతంగా నటించింది. ప్రస్తుతం టాయిలెట్‌1 మూవీ చైనాలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రధాన మంత్రి మోదీ మెసేజ్‌ ఈ చిత్రం ద్వారా ఇప్పుడు విదేశాల్లోకి కూడా వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. టాయిలెట్‌ హీరో పేరుతో మాండేరియన్‌ బాషలో చైనాలో ఈ నెల 8న విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సుమారు రూ.18 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement