విడుదలకు ముందే సినిమా లీక్‌ | Toilet: Ek premkatha movie leaked | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే సినిమా లీక్‌

Published Sat, Jul 22 2017 10:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

విడుదలకు ముందే సినిమా లీక్‌

విడుదలకు ముందే సినిమా లీక్‌

న్యూఢిల్లీ: స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న సినిమా ముందే ఆన్‌లైన్‌ లీకవడం కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛభారత్‌ను ప్రమోట్ చేస్తూ తెరకెక్కిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది.
 
ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా ధ్రువీకరించారు. అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్లు హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పారు.

ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే సమస్యలపై దర్శకుడు నారాయణ్‌ సింగ్‌ ఈ సినిమా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విడుదల కన్నా ముందుగానే సినిమా లీకవడం దర్శకుడు, నిర్మాతలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement