హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు | Toilet: Ek Prem Katha – Title of Akshay Kumar's film makes PM Narendra Modi smile! | Sakshi
Sakshi News home page

హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు

Published Tue, May 9 2017 4:15 PM | Last Updated on Tue, Aug 28 2018 5:30 PM

హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు - Sakshi

హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోమవారం కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తర్వాతి సినిమా 'టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ' గురించి మోదీకి చెప్పినట్లు తెలిపారు. సినిమా టైటిల్‌ విన్న మోదీ నవ్వారని చెప్పారు. సినిమా కథను కూడా ఆసక్తిగా విన్నట్లు చెప్పారు.

టైటిల్‌పై మోదీ స్పందన తనను ఆనందానికి గురి చేసినట్లు వివరించారు. కాగా, ఈ సినిమాను జూన్‌ 2వ తేదీన విడుదల కానుంది. ప్రధానమంత్రి స్వచ్చభారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement