ప్రస్తుతం ఇండియన్ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాయి. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ సక్సెస్ తరువాత చైనా మార్కెట్‌పై కన్నేసింది బాలీవుడ్. సినిమాలో కంటెంట్ ఉంటే చైనాలో కూడా రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నాయి మన సినిమాలు. సీక్రెట్ సూపర్‌స్టార్, ఖానభజరంగీ భాయిజాన్, ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్‌మెయిల్’ అక్కడ కూడా సక్సెస్ సాధించాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్‌ప్రేమ్ కథా’ కూడా చైనా రిలీజ్‌కు సిద్ధమైంది.
గతేడాది విడుదలైన ఈ మూవీ భారత్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేయనున్నారు. టాయిలెట్ హీరో అనే టైటిల్‌తో జూన్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మరి ఈ సినిమా అక్కడ కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్‌కు జోడీగా భూమి ఫెడ్నేకర్ నటించిన సంగతి తెలిసిందే.
IT’S CONFIRMED... #ToiletEkPremKatha to release in China on 8 June 2018... Titled #ToiletHero for the local audiences... Here’s the OFFICIAL POSTER for China... #TEPK pic.twitter.com/VlQFufXN3Q
— taran adarsh (@taran_adarsh) June 1, 2018
Comments
Please login to add a commentAdd a comment