Bhumi Pednekar
-
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
Christmas 2024: సెలబ్రిటీలు, క్రిస్మస్ ట్రీ , ఇంటి ముస్తాబు
-
దివాళీ బాష్‌లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఎంత లావుగా ఉండేదో అందరకీ తెలిసిందే. ఆమె తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా కోసం 32 కిలోలు పెరిగి ట్రోలింగ్కి గురయ్యింది. ఆ మూవీలో ఆమె అధిక బరువుతో ఉండే భార్య పాత్రను పోషించింది. అయితే ఆమె సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బరువు తగ్గే ఫిట్నెస్ ప్రయాణంపై దృష్టిసారించింది. అయితే అనేహ్యంగా జస్ట్ 4 నెలల్లోనే మంచిగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు అందుకు తనకు ఉపకరించిన డైట్ ప్లాన్లు, ఫిట్నెస్ చిట్కాలను కూడా చెప్పుకొచ్చింది. అవేంటంటే..భూమి ఫడ్నేకర్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే క్రమాన్ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయలేదట. నచ్చినవన్నీ మితంగా తీసుకుంటూ ఉండేది. ప్రధానంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా గుడ్లు, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్గిరా వంటి ఫుడ్స్ తీసుకునేది. ఉదయ స్కిమ్డ్ పాల తోపాటు ముసేలి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మధ్యాహ్న భోజనంలో పప్పుతో కూడిన ఆహారం తప్పక తీసుకున్నట్లు పేర్కొంది. ఇక సాయంత్రం స్నాక్స్, కప్పు గ్రీన్ టీ తోపాటు పండ్లు ఉండాల్సిందే. అలాగే బాదం, వాల్నట్లను తినేందుకు ఇష్టపడేది. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ చేయడానికి ఇష్టపడేది. అయితే భోజనంలో కాల్చిన చేపలు, చికెన్, పనీర్, టోపు, ఉడికించిన కూరగాయలను తీసుకున్నట్లు వివరించింది భూమి. వర్కౌట్లు..భూమి హై ఇంటెన్సిటీ కసరత్తుల జోలికి పోలేదు. కానీ పరిగెత్తడం, ఫంక్షనల్ శిక్షణ, స్విమ్మింగ్, డ్యాన్స్, ఏరోబిక్స్, వంటి వ్యాయామాలు చేసింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఫిట్‌గా ఉండేలా కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్, స్ట్రెచింగ్లను వంటివి చేస్తూనే ఉంది. అయితే షుగర్‌కి మాత్రం దూరంగానే ఉంది. తొందరగా బరువు తగ్గేలా అన్ని రకాల స్వీట్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది భూమి. అలాగే రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించింది. ఇక ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగేది. ఈ విధమైన డైట్ ప్లాన్ల తోపాటు మంచి ఆహారపు అలవాట్లతో అభిమానులే గుర్తుపట్లలేనంత స్లిమ్‌గా అందంగా మారిపోయింది భూమి. (చదవండి: ముత్యాలతో చేసిన చీరలో షానాయ కపూర్..! ఏకంగా 'లక్ష'..!) -
ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు కదా.. హీరోయిన్ సిస్టర్స్‌పై ట్రోలింగ్
అందంగా కనిపించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. కొందరేమో డైట్, వర్కవుట్స్‌తో అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో పెద్దగా కష్టపడకుండా సర్జరీలు చేయించుకుంటారు. కానీ ముఖంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే పసిగట్టేస్తారు. కొన్నిసార్లయితే నిజమైన అందాన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ అని హేళన చేస్తారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ తన సోదరి సమీక్ష పడ్నేకర్‌తో కలిసి ఓ వీడియో చేసింది. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్లాస్టిక్ సర్జరీ.. ఇందులో ఇద్దరూ దాదాపు ఒకేలా ఉన్నారు. ఇద్దరిలో భూమి ఎవరో గుర్తుపట్టలేకుండా ఉండటంతో చాలామంది ఈ సిస్టర్స్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరికీ ఒకే వ్యక్తి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇలాగే ఉంటుంది అని ఓ వ్యక్తి సెటైర్ వేశాడు. దీనికి భూమి స్పందిస్తూ.. సర్జరీయే ఎందుకనుకోవాలి? ఇద్దరి పేరెంట్స్ ఒక్కరే అయుండటం వల్లే ఇలా ఉన్నామనుకోవచ్చుగా అని బదులిచ్చింది. మరొకరు ప్లాస్టిక్ జీవితం అని కామెంట్ చేయగా.. ఇక్కడ ఏం ప్లాస్టిక్ కనిపించింది? అని సమీక్ష ప్రశ్నించింది. భూమి ఫ్యాన్స్ మాత్రం మీరిద్దరూ ట్విన్స్‌లా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. బంగారు నాణాలు భూమి చివరగా.. భక్షక్ మూవీలో నటించింది. తన నటన నచ్చడంతో ఆమె తల్లి సుమిత్ర భూమికి బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చింది. 'నేను నటిగా ఎదిగిన ప్రతిసారి తను నాకు గోల్డ్ కాయిన్ ఇస్తుంటుంది. భక్షక్ చూశాక ఇంకో కాయిన్ ఇచ్చింది. నా సోదరి సమీక్ష అయితే ఏడ్వడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు అమ్మ నాకు ఏడు బంగారు నాణాలు ఇచ్చింది. ఇంతకంటే పెద్ద అవార్డు ఏముంటుంది?' అని హీరోయిన్ ఉప్పొంగిపోయింది. View this post on Instagram A post shared by Samiksha Pednekar (@samikshapednekar) చదవండి: ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్.. హీరోయిన్ రెస్పాన్స్ చూశారా? -
కేతిక శర్మ, ప్రగ్యా జైస్వాల్ ఔట్ ఫిట్ ఫోటోలు వైరల్
► మేము మళ్లీ అక్కడికి వెళ్తున్నాం అంటూ పోజులు ఇచ్చిన కేతిక షర్మ ► పెళ్లిలో ఔట్ ఫిట్ పిక్స్‌తో భూమి ఫడ్నుకర్ ► ఆర్టికల్ 360 విజయంలో ప్రియమణి ► వైట్ శారీలో మౌనీరాయ్ ► యాదాద్రిలో శ్రీముఖి ► కలర్‌ఫుల్ శారీలో పూజా హెగ్డే View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
14 ఏళ్ల వయసు.. ఆరోజు జరిగింది ఇప్పటికీ మర్చిపోలేను: హీరోయిన్
అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. కానీ ఎక్కడ? పట్టపగలు కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఆడవారిపై వేధింపులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సాధారణ మహిళలే కాదు, సెలబ్రిటీలు సైతం ఎప్పుడో ఒకసారి వేధింపులకు గురవుతున్నారు. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ.. ఆమె మాట్లాడుతూ... 'ముంబైలోని బాంద్రాలో జరిగిన సంఘటన నన్నింకా వెంటాడుతోంది. అప్పుడు టీనేజ్.. దాదాపు 14 ఏళ్లు ఉంటాయనుకుంటా.. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో అసభ్యంగా తాకుతున్నారు. అక్కడ చాలామంది జనం ఉండటంతో ఎవరలా చేస్తున్నారో అర్థం కాలేదు. నన్ను గిల్లుతున్నారు, పదేపదే అభ్యంతరకరంగా తాకడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు పిచ్చి పట్టినట్లయింది. అప్పుడు దీని గురించి కనీసం పేరెంట్స్‌కు కూడా చెప్పలేదు. అప్పుడు బిగుసుకుపోతాం ఎందుకంటే అప్పటికే నేను అయోమయంలో ఉండిపోయాను. కానీ ఇప్పటికీ ఆరోజును మర్చిపోలేను. నా శరీరం, మెదడు ఆ సంఘటనను పదేపదే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ ఘటన జరిగినప్పుడు మన బుర్ర పని చేయదు, భయంతో, అసౌకర్యంతో బిగుసుకుపోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ దమ్ లగాగే హైషా(2015) చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. త్వరలో భక్షక్ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి భక్షక్ స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'. పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దారుణాలను బయటికి తీసే జర్నలిస్ట్ జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి కనిపించనుంది. కాగా.. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
Bhumi Pednekar: అదిరే ఔట్ఫిట్లో భూమి పెడ్నేకర్..చూశారంటే కళ్లు తిప్పుకోలేరు! (ఫోటోలు)
-
మత్తెక్కించేలా పోజిచ్చిన ఆ బ్యూటీ.. కేక పుట్టించేలా తాప్సీ
బీచ్ ఒడ్డున క్యూట్‌గా హాట్ బ్యూటీ హంస నందిని స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న హీరోయిన్ తాప్సీ మెడపై చెయ్యి పెట్టి మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న సంయుక్త మేనన్ కొబ్బరితోటలో వయ్యారంగా పోజులిస్తున్న పూజాహెగ్డే వర్కౌట్ బిజీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నాభి అందాలతో రెచ్చిపోతున్న భూమీ పెడ్నేకర్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
సొంతంగా మేకప్ చేసుకుంటున్న హీరోయిన్
-
హీరోయిన్ల ముఖం అంతలా వెలిగిపోవడానికి కారణం ఇదేనా?
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భూమి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్,పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో బీటౌన్‌లో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించిన పలు విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతున్న ఐ మేకప్ హ్యాక్‌ను ట్రై చేసింది. స్మోకీ స్మడ్జ్ క్యాట్ ఐలైనర్‌ను సులభంగా ఎలా వేసుకోవాలో చూపించింది. అంతేకాకుండా ఈ హ్యాక్ తనకు బాగా నచ్చిందని, తన రెగ్యులర్ మేకప్‌లో దీన్ని తప్పకుండా వాడతానంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) ఇక మరో వీడియోలో కేవలం ఐదు నిమిషాల్లో మేకప్ ఎలా వేసుకోవాలో చూపించి ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్స్ తమ బ్యూటీ సీక్రెట్స్‌ను, మేకప్ రొటీన్‌ను ఎక్కువగా షేర్ చేసుకోరు. కానీ ఈ బ్యూటీ మాత్రం తాను మేకప్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతుందో కూడా రివీల్ చేసింది. మరి మీకు నచ్చితే ఓసారి ట్రై చేసేయండి. -
ఆస్పత్రిలో చేరిన హీరోయిన్.. ఎనిమిది రోజులుగా!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇటీవలే ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానులను అలరించింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత అర్జున్ కపూర్ సరసన నటించింది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భూమి ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం అంతా బాగుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాకుండా దోమల నివారణ తప్పనిసరి అని కోరింది. అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి ఒక కారణమని భూమి ఫెడ్నేకర్ పేర్కొంది. భూమి ఇన్‌స్టాలో రాస్తూ.. “ఒక దోమ వల్ల నేను 8 రోజులు నరకం అనుభవించా. దాదాపు వారం రోజుల తర్వాత ఉదయాన్నే నిద్ర లేచా. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దోమలను చంపే వాటిని వినియోగించడం తప్పనిసరి. అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. అధిక కాలుష్యంతో మన రోగనిరోధక శక్తిలో చాలా వరకు తగ్గుతోంది. నాకు తెలిసిన చాలా మందికి కూడా డెంగ్యూ వచ్చింది. నన్ను బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు' అని పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు!
ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్‌గా చూపించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. -
'నేను హీరోయిన్ అంటే నమ్మలేదు, అంత సీన్ లేదన్నట్లు చూశారు'
స్టార్డమ్.. ఎవరికీ అంత ఈజీగా దక్కదు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చినవారికే స్టార్డమ్ దక్కుతుంది, ఎక్కువకాలం అది కొనసాగుతుంది. బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ కూడా ఎన్నో అవమానాలు దాటుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 2015లో వచ్చిన దమ్ లగా కే హైషా సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఈ మూవీలో భూమి లావుగా ఉన్న అమ్మాయి పాత్రలో నటించింది. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుందీ హీరోయిన్. నువ్వు హీరోయినా? అని ఓ లుక్కిచ్చారు ఓ ఇంటర్వ్యూలో భూమి పడ్నేకర్ మాట్లాడుతూ.. 'దమ్ లగా కే హైషా' సినిమా షూటింగ్ కోసం హీరో ఆయుష్మాన్‌తో కలిసి విమానంలో ప్రయాణించాను. అప్పుడు అక్కడున్న జనాలు.. అర్రె ఆయుష్మాన్.. షూటింగ్ కోసం వెళ్తున్నావా? ఇంతకీ హీరోయిన్ ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు నేను అతడి పక్కనే ఉన్నాను. తను నేనే హీరోయిన్ అన్నట్లుగా నావైపు చూశాడు. దీంతో అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. ఈమె హీరోయినా? అన్నారు. అప్పుడే నాలో ఇంకా కసి పెరిగింది. ఈ సినిమాతో నేనేంటో నిరూపించాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. విభిన్న కాన్సెప్టులతో అలరిస్తున్న బ్యూటీ డిఫెంట్ కాన్సెప్టులతో పాటు మహిళా ప్రాధాన్యమున్న కథాంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది భూమి. ఈ క్రమంలోనే టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, భీద్, అఫ్వా వంటి సినిమాలు చేసి గుర్తింపు పొందింది. ఇటీవలే థాంక్యూ ఫర్ కమింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ద లేడీ కిల్లర్ మూవీ ఉంది. చదవండి: ఓటీటీలో నయనతార సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. అప్పటినుంచే స్ట్రీమింగ్ -
Bhumi Pednekar: కాటుక కన్నులతో కైపెక్కిస్తున్న భూమి పెడ్నేకర్ (ఫోటోలు)
-
నిషా కళ్లతో రితిక.. కేతిక అందాల విందు!
హీరోయిన్ రితికా సింగ్ నిషా పోజులు బొడ్డు చూపిస్తూ రెచ్చగొడుతున్న భూమి బ్లాక్ ఔట్ ఫిట్‌లో రెచ్చిపోయేలా తాప్సీ రెడ్ కలర్ పొట్టి డ్రస్‌లో ప్రగ్యా పరువాల విందు కేతిక శర్మ ఎద అందాల ప్రదర్శన 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ సోయగాలు నవ్వుతో మెరుపులు మాయ చేస్తున్న దివ్యభారతి మెగా డాటర్ నిహారిక క్యూట్ ర్యాండమ్ స్టిల్స్ పింక్ చీరలో ఆలియా భట్ హోయగాలు నీలగిరి కొండల్లో నందితా శ్వేతా పోజులు కేజీఎఫ్ నటి జోష్ ఆర్చీ సూపర్ డ్యాన్స్ చీరలో హీరోయిన్ హనీరోజ్ వయ్యారాలు నోరు తడారిపోయేలా నోరా ఫతేహా పోజులు View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఆరెంజ్ డ్రెస్‌లో కృతి శెట్టి పోజులు.. దివి హాట్ లుక్స్!
►ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నశోభిత ►ఆరెంజ్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న కృతి శెట్టి ►అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన భూమి ఫడ్నేకర్ ►హీరోయిన్ దివి హాట్ ఫోజులు View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ బ్యూటీ సీక్రెట్ ఇదేనట
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. కెరీర్ ఆరంభం నుంచి రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మెసేజ్‌లతో కూడిన కథాంశాల్ని ఎంచుకుంటోంది. టాయ్ లెట్ ఏక్ ప్రేమకథ, శుభ్ మంగల్ సావ్ ధాన్ ,లస్ట్ స్టోరీస్, బాలా, పతి పత్నీ ఔర్ వో వంటి సినిమలు భూమికి మంచికి పేరు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే భూమి ఫడ్నేకర్ తరచూ గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. రీసెంట్గా తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది. ► రోజూ రాత్రి పడుకునే ముందు మొహానికి విటమిన్ – ఇ అండ్ అర్గాన్ ఆయిల్ రాస్తాను. వీలైనప్పుడల్లా తేనెలో కాసింత పసుపు, కొన్ని పాలు కలిపి ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుంటాను. మా అమ్మ చెప్పిన బ్యూటీ మంత్రం.. బాదం నూనె. అందుకే తరచుగా బాదం నూనెతో మొహానికి, చేతులకు మసాజ్ చేసుకుంటా అంటూ తన బ్యూటీ టిప్స్‌ను షేర్ చేసింది. -
Bhumi Pednekar: అదర్ సైడ్ ఇన్వెస్టార్
‘నీకు తెలియని వ్యాపారంలో పొరపాటున కూడా పెట్టుబడి పెట్టవద్దు’ ‘పెట్టుబడికి సంబంధించిన రెండు రూల్స్ ఏమిటంటే... ఒకటి నష్టం రాకుండా చూసుకోవడం. రెండోది మొదటి రూల్‌ను మరచిపోకపోవడం’ అని పెద్దాయన వారెన్ బఫెట్(ప్రసిద్ధ ఇన్వెస్టర్, అపర కుబేరుడు) చెప్పిన మాటలను ఇష్టపడే బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్‌గా కూడా ‘రాణి’స్తోంది... తాజాగా క్రోమ్ ఆసియా హాస్పిటాలిటీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది భూమి పెడ్నేకర్. ‘మంచి బ్రాండ్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అంటుంది భూమి. క్రోమ్ ఆసియా గ్రూప్ ‘కయా’ పేరుతో గోవాలో బోటిక్ హోటల్‌ను ప్రారంభించింది. భోజనప్రియురాలైన భూమికి ప్రయాణాలు అంటే ఇష్టం. అందుకే ఆ రంగాలకు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ‘పెట్టుబడి పెట్టే ముందు లాభాల కంటే ముందు ఆ కంపెనీకి ఉన్న విశ్వసనీయత గురించి ఆలోచిస్తాను’ అంటుంది భూమి. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’లో ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తీసుకుంది. కమర్షియల్‌గా సక్సెస్ అయిన కామెడీ డ్రామా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’తో తన కెరీర్ ఊపందుకుంది. ఫోర్బ్స్ ఇండియా–2018 ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించింది. మూడు సంవత్సరాల క్రితం ‘క్లైమెట్ వారియర్’ క్యాంపెయిన్ మొదలుపెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తోంది. ముంబైలో జన్మించిన భూమికి మొదటి నుంచి కళలు, పర్యావరణం, వ్యాపారం అంటే ఆసక్తి. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించి నిర్మాణాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్(వెప్) సమావేశంలో మహిళా వ్యాపారవేత్తల గురించి చేసిన ప్రసంగం భూమి పెడ్నేకర్ ఆలోచనలకు అద్దం పడుతుంది. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. -
గోవాలో భూమి ఫడ్నేకర్.. రిషికేశ్‌లో యషికా ఆనంద్ ఫోజులు
►కలర్‌ఫుల్ దుస్తుల్లో ప్రణీత ఫోజులు ►రకుల్ ప్రీత్ సింగ్ స్మైలీ పిక్స్ ►గోవాలో బిజినెస్ స్టార్ట్ చేసిన భూమి ఫడ్నేకర్ ►రిషికేశ్‌లో యషికా ఆనంద్ గ్లామర్ లుక్స్ ►జిమ్‌లో కూతురితో మెగా డాటర్ శ్రీజ కసరత్తులు View this post on Instagram A post shared by Bhumi 🌏 (@bhumipednekar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్..నెటిజన్స్ ఫైర్
సినిమా నటులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏదైనా మంచి చేస్తే భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే కూడా అదే స్థాయిలో ట్రోల్స్ చేస్తారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్‌కి వెళ్తే నడక నుంచి మాట వరకు ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ చిన్న తప్పు చేసినా నెటిజన్స్ ఆడేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్ తన అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకొని వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భూమి ఫెడ్నేకర్ తాజాగా ఓ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా స్టేజ్ ఎక్కారు. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్‌పై రావాలని పిలిచారు. దీంతో ఆమె చెప్పులు విప్పి అక్కడికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోయింది. దీంతో పక్కకు వచ్చి అసిస్టెంట్‌కి సైగ చేయగా..అతను వచ్చి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్ పైకి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది భూమి ఫెడ్నేకర్. . మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. -
అదిరేటి లుక్స్‌లో అదుర్స్ అనిపించిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
SSMB 28: మహేశ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని అలరించిన హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారని టాక్. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం భూమి ఫెడ్నేకర్ని సంప్రదించారట. ఇది కానిస్టేబుల్ పాత్ర అని, సెకండాఫ్‌లో ఈ పాత్ర వస్తుందని వినికిడి. మరి.. ఈ చిత్రంలో ఈ పాత్ర ఉందా? ఉంటే.. భూమి ఫెడ్నేకర్నే చేస్తారా? లేక వేరే తార సీన్లోకి వస్తారా? వెయిట్ అండ్ సీ.. -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విక్కీ కౌశల్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్‌కుమార్‌రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
హీరోయిన్లనే అడుగుతారు, కానీ హీరోల జోలికి పోరు
బాలీవుడ్ నటి, పర్యావరణ ప్రేమికురాలు భూమి పడ్నేకర్ ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివక్షపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ఆడ, మగ అని తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసిందని, కానీ వీటికి తోడు ఆడవారికి మరిన్ని సమస్యలు తప్పలేవని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో నిర్మాతలు ఆడవాళ్ల పారితోషికం కట్ చేసి ఇచ్చేవారని, కానీ మగవారికి మాత్రం అలాంటి కోతలేమీ లేకుండా ఎప్పటిలాగే రెమ్యునరేషన్ అందజేసేవారని తెలిపింది. 'కోవిడ్ పరిస్థితిని అర్థం చేసుకొని పారితోషికం తగ్గించుకోమని ఏ నిర్మాత కూడా హీరో దగ్గరకు వెళ్లి అడిగిన దాఖలాలు లేవు. కానీ అదే ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి మహిళల దగ్గరకు వచ్చి మాత్రం రెమ్యునరేషన్లో కొంత కోత పెట్టాల్సిందేనని చెప్తుంటారు. హీరోల జోలికి వెళ్లరు కానీ హీరోయిన్లనే బలి చేస్తారు. చాలా హాస్యాస్పదంగా ఉంది' అని విమర్శించింది భూమి. ఇదిలా ఉంటే ఆమె నటించిన 'బదాయి దో' సినిమా గతవారం రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర సుమారు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. -
రాజ్‌కుమార్ రావు కొత్త చిత్రం 'బదాయి దో' విడుదల ఎప్పుడంటే..?
నవంబర్ 15న వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు తన కొత్త సినిమాతో అభిమానులను అలరించనున్నారు. రాజ్ కుమార్ రావు, భూమి పెడ్నేకర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం 'బదాయి దో'. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో సందడి చేయనుంది. 'బదాయి దో' జాతీయ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం బదాయి హోకి సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ భూమి పడ్నేకర్ వెల్లడించారు. 'బదాయి దో ఇప్పుడు ఫిబ్రవరి 2022లో థియేటర్లలో విడుదల కానుంది. పెద్ద స్క్రీన్‌పై ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాం. సినిమాలో కులుద్దాం' రాసుకొచ్చారు. బధాయి దో సెట్స్ నుంచి ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేశారు. తాము సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) ఈ చిత్రంలో మహిళా ఠాణాలో ఉన్న ఏకైక పురుష పోలీసు అధికారి శార్దూల్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించారు. మరోవైపు భూమి పడ్నేకర్ ఒక పీటీ టీచర్ సమీ పాత్రలో కనువిందు చేయనున్నారు. బదాయి దోలోని కథ, పాత్రలు 2018లో వచ్చిన బదాయి హో సినిమాకు విభిన్నంగా ఉండనున్నాయట. ఈ చిత్రానికి బదాయి హోకి సహ రచయితలుగా పని చేసిన సుమన్ అధికారి, అక్షత్ గిల్డియాల్ కథను అందించారు. View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) -
ఆ విషయంలో బాలీవుడ్ ఇంకా వెనకబడే ఉంది
‘సినిమా అనేది ఎంతో శక్తి వంతమైన మాధ్యమం. ప్రజా జీవనాన్ని ప్రతిబింబించేలా అది ఉండాలి’ అన్నారు బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్. మంచి సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి పర్యావరణ ప్రేమికురాలు కూడా.ఇటీవల ఓ ఇంటర్వూలో బాలీవుడ్ సినిమా కథలపై భూమి స్పందించింది. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయడంలో హిందీ పరిశ్రమ వెనక బడి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల గురించి భూమి మాట్లాడుతూ..‘హిందీ సినిమాలో ప్రజల స్థిరమైన జీవన విధానాన్ని చూపించడానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. దేశంలో బాలీవుడ్ చిత్రాలని ఎక్కువ మంది చూస్తారు. అందుకే సామాజిక స్పృహతో సినిమాలు తీయాలి. అయితే ఆ విషయంపై ఇండస్ట్రీ దృష్టి పెట్టట్లేదని’ని అభిప్రాయపడింది. సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత శక్తివంతమైన మాధ్యమం సినిమాలు, అందుకే వాణిజ్య పంథాలో ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చే కథల్ని ఎంచుకోవాలని ఈ బ్యూటీ తెలిపింది. కాగా ‘పతి ఔర్ పత్ని’, ‘రక్షా బంధన్’ మూవీస్‌తో గుర్తింపు పొందిన భూమి ప్రస్తుతం ‘తఖ్త్’, ‘బధాయ్ దో’ సినిమాల్లో నటిస్తోంది. -
మా చిన్నమ్మ ఐసీయూలో ఉంది.. వెంటిలేటర్ బెడ్ కావాలి :నటి
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా లక్షలు వెచ్చించినా పలు ప్రాంతాల్లో వెంటిలేటర్లు, బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్‌కు సైతం ఇలాంటి పరిస్థతే ఎదురైంది. వెంటిలేటర్ కావాలని, ఎవరికైనా వివరాలు తెలిస్తే అందజేయాలని సోషల్ మీడియాలో విన్నవించుకుంది. 'ఇది చాలా కష్టతరమైన సమయం. డిల్లీలోని ఎన్సీఆర్ ఆసుపత్రిలో మా చిన్నమ్మ ఐసీయూ ఉంది. తక్షణమే ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలి. దయచేసి మీలో ఎవరికైనా వెంటిలేటర్ బెడ్ సమాచారం తెలిస్తే ఆ వివరాలు నాకు పంపండి' అని సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. కాగా భూమి ఫడ్నేకర్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఆమెకు సహాయం అందడంతో ఆ పోస్టును డిలీట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఒక సెలబ్రిటీ అయ్యిండి భూమి ఫడ్నేకర్ లాంటి వాళ్లే వెంటిలేట్ దొరకడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలె భూమి ఫడ్నేకర్ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ సినిమాలో నటిస్తుంది. She has gotten the help 🙏 Deleting tweet thank you https://t.co/NyTk8bnuKZ — bhumi pednekar (@bhumipednekar) May 3, 2021 View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) చదవండి : దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్ పడుకోనే యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? -
కరోనా గుప్పిట్లో సెలబ్రిటీలు.. బాలీవుడ్లో టెన్షన్!
ముంబై : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడాలు లేకుండా రోజురోజుకీ లక్షకుపైగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో సైతం కరోనా గడగడలాడిస్తోంది. బీటౌన్ సెలబ్రిటీలందరూ వరుసపెట్టి మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఆలియాభట్, అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. ఆవిరి పట్టడం, విటమిన్ సీ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాను. నాతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. దయచేసి కరోనాను నిర్లక్ష్యం చేయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకొండి. మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి’ అని నటి భూమి సూచించారు. కాగా టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్ కుమార్ సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా భూమి కూడా కరోనా బారిన పడటంతో బీటౌన్‌లో కంగారు మొదలైంది. చదవండి: కరోనా పాజిటివ్: ఆస్పత్రిలో చేరిన అక్షయ్ -
ప్రత్యేకం: ఆరేళ్ల తర్వాత అదే ఇంట్లో!
‘‘ఆరేళ్ల క్రితం ఇదే లొకేషన్లో ఒక్క సీన్‌కి పదకొండు టేక్స్ తీసుకున్నాను. నా తొలి సినిమా తాలూకు ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రిషికేష్‌లో నా మొదటి సినిమా చిత్రీకరించిన ఇంట్లో ఆరేళ్ల తర్వాత షూటింగ్ చేయడం ఓ మంచి అనుభూతినిస్తోంది’’ అన్నారు భూమీ ఫెడ్నేకర్. ‘దమ్ లగా కే హైసా’ (2015) చిత్రం ద్వారా భూమి హిందీ తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారామె. 2015 ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే తేదీకి ‘దుమ్ లగా ..’ షూటింగ్ చేసిన రిషికేష్‌లో తన తాజా చిత్రం ‘బదాయీ దో’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భూమి మాట్లాడుతూ – ‘‘యశ్ రాజ్ ఫిలింస్‌లో మొదటి అవకాశం అంటే చిన్న విషయం కాదు. కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరంలేని మంచి సినిమా ద్వారా నన్ను ఈ సంస్థ పరిచయం చేసింది. యశ్ రాజ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఆ సినిమాలో నటించిన నా తొలి హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు శరత్ కటారియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నటిగా మంచి పాత్రలు చేయాలనే తపనతో వచ్చిన నాకు అవకాశం ఇవ్వడంతో పాటు, నటిగా నేను డిఫరెంట్ అని ఈ ప్రపంచానికి చెప్పే అవకాశం ఇచ్చిన ‘దమ్ లగా...’కి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’ అన్నారు. ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ, శుభ్ మంగళ్ సావధాన్, సాండ్ కీ ఆంఖ్, బాలా’ వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసి, నటిగా దూసుకెళుతున్నారు భూమీ ఫెడ్నేకర్. చదవండి: ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు -
నమ్మకాన్ని నెరవేరుస్తా..!
‘‘గతంలో జయా బచ్చన్, షబానా ఆజ్మీ, శ్రీ దేవి, హేమ మాలినీ, రేఖ వంటివారు భిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. గ్లామరస్ పాత్రలు చేసే నటీమణులకే ఆదరణ ఉంటుందని కాకుండా భిన్నమైన పాత్రలు పోషించేవారిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి వీళ్లంతా ఓ ఉదాహరణ’’ అంటున్నారు బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘సీనియర్ తారల్లా అన్ని రకాల పాత్రలు చేసి, సినిమాకు న్యాయం చేయాలనేదే నా కోరిక. 90వ దశకంలోనే రంగీలా, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాల్లో కథానాయికల పాత్రలు పలు వేరియేషన్లను చూపించాయి’’ అన్నారు. (చదవండి: నేనేమీ మారలేదు.. అలాగే ఉన్నా..) అలానే ‘‘కరీనా కపూర్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆమె చమేలీ, ఫెవికాల్ వంటి భిన్న సినిమాల్లో వేర్వేరు పాత్రల్లో తన ప్రతిభ నిరూపించుకుంది. నేను కూడా భిన్నమైన పాత్రలనే చేయాలనుకుంటున్నాను. అలాంటివే ఎంపిక చేసుకుంటున్నాను. ప్రేక్షకులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేరవేర్చడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పారు. దమ్ లగాకే ఐసా, టాయ్‌లెట్–ఏక్ ప్రేమ్ కథ, శుభ్మంగల్ సావ్ధాన్, సోంచరియా, సాంద్ కీ ఆంఖ్, పతీ పత్నీ ఔర్ వో వంటి సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు భూమి. -
అనుష్క అడ్డాలో.. భూమి పడ్నేకర్
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్క 'భాగమతి' ఇప్పుడు హిందీలో రీమెక్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హిందీ రీమెక్‌లో ప్రధాన పాత్ర పోషించిన భూమి పడ్నేకర్ తన ట్విటర్ వేదికగా సినీ ప్రమోషన్‌ను మొదలుపెట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో.. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ముందుగా ఈ సినిమా టైటిల్‌గా 'దుర్గావతి' అని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం పేరును 'దుర్గామతి' గా మార్చారు. 'మాతృకను ' రూపొందించిన డైరెక్టర్ అశోక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత అక్షయ్ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ‘ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అని ఆమె చెప్పే డైలాగ్స్‌కి అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవుతున్న ‘దుర్గామతి’ఇప్పుడు ప్రేక్షకులను ఎంతమేరకు అలరించనుందో వేచిచూడాలి. -
దుర్గావతి కాదు దుర్గామతి
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భాగమతి’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్. అశోక్ జి. దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది. అనుష్క పోషించిన పాత్రలో భూమి ఫెడ్నేకర్ నటించారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశోక్ ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఇది వరకు ‘దుర్గావతి’ అని టైటిల్ పెట్టారు. తాజాగా ‘దుర్గామతి: ది మిత్’గా మార్చారు. అలాగే ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన అక్షయ్ కుమార్. డిసెంబర్ 11న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
ఆడిషన్స్‌కి రణ్‌వీర్‌సింగ్ ఎలా వెళ్లాడో చూడండి
రణ్వీర్ సింగ్..ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో. కానీ ఈ గుర్తింపు అతనికి అంత సులభంగా ఏం దక్కలేదు. ఎన్నో ఆడిషన్స్‌కి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో చిన్నా చితకా పాత్రలే దక్కాయి. కానీ ఏదో ఒకసారి అదృష్టం తలుపుతడుతుంది అంటారు కదా..బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో రణ్వీర్ కెరియర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోనంతగా స్టార్ హీరో స్థాయికి చేరాడు. ఆ సినిమాకి సంబంధించి రణ్వీర్ ఆడిషన్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ఫడ్నేకర్ తాజాగా రణ్వీర్ను మొదట ఆడిషన్స్‌కి తీసుకుంది తానేనని అప్పటి అనుభవాలను పంచుకుంది. (ఆ రోజులు చాలా ప్రత్యేకం: నటి) ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 2010లో నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాండ్ బాజా బరాత్. ఈ సినిమాలో రణ్వీర్ ముఖ్యపాత్రలో నటించి అలరించాడు. ఆడిషన్ సమయంలో వైట్ టీ షర్ట్ వేసుకొని చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా తర్వాత లేడీస్ వర్సెస్ రికీ బహ్ల, గల్లీ బాయ్, సింబా, పద్మావత్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 83 సినిమా విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. View this post on Instagram Ranveer had to go through multiple auditions to land the role of Bittoo Sharma in Band Baaja Baraat. Swipe to see what Bhumi Pednekar, then casting director has to say about his audition!! 😍😍 A post shared by ranveersinghera 🧚✨ (@ranveersinghera) on Jul 7, 2020 at 3:31am PDT -
సుశాంత్ జ్ఞాపకార్థం..నేను కూడా
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకార్థం పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు తలపెట్టిన కార్యక్రమంలో నటి భూమి ఫడ్నేకర్ కూడా చేయూతనంధించింది. తనవంతు సహాయంగా 550 కుటుంబాలకు సహాయం అందిస్తానని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతని జ్ఞాపకార్థం నటుడు అభిషేక్ కపూర్, భార్య ప్రగ్యా కపూర్ ఏక్‌సాత్ ఫౌండేషన్ ద్వారా 3,400 పేద కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వంతు సహాయం చేస్తానని ముందుకొచ్చిన భూమి ఫడ్నేకర్‌కు ఫౌండేషన్ తరపున కృతఙ్ఞతలు తెలిపారు. 'నా ప్రియమైన స్నేహితుడి జ్ఞాపకార్థం ఏక్ సాత్ ఫౌండేషన్ ద్వారా 550 పేద కుటుంబాలకు సహాయం చేస్తాను. కరోనా కష్టకాలంలో పేదవారికి సహాయం చేద్దాం. ప్రేమను పంచుదాం' అంటూ భూమి ఫడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లా? ) View this post on Instagram Getting an opportunity to reach out to 550 more families sets a positive momentum for our drive. We're grateful to find such generous support for our cause from someone whose virtues & values go well beyond the screen. Thank you @bhumipednekar for remembering Sushant in such a beautiful way. A post shared by Ek Saath-The Earth Foundation (@eksaathfoundation) on Jun 28, 2020 at 11:29pm PDT 2019లో అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన సోంచిరియా అనే సినిమాలో సుశాంత్, భూమి ఫడ్నేకర్ కలిసి నటించారు. కాగా జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణానికి బాలీవుడ్ పేరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) కారణమంటూ స్టార్‌కిడ్స్, ప్రముఖ దర్శకనిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్ తండ్రిని కలవడానికి వెళ్తున్నా: నటుడు) -
నేనేమీ మారలేదు.. అలాగే ఉన్నా..
‘‘అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అంతే. నాలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. విజయం నన్ను ఏమాత్రం మార్చలేదు! నేనింకా బలహీనురాలినే అనిపిస్తుంది. ఇప్పటికీ నా కళ్లలో కలలు అలాగే ఉన్నాయి. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎందుకంటే నటిగా మారాలనుకున్నపుడు నాది చాలా చిన్న వయస్సు. ఇప్పుడిప్పుడే జీవితంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద కలలు ఉన్నాయి’’ అంటూ బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ తన కెరీర్ తొలినాటి అనుభవాలు గుర్తు చేసుకున్నారు. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు. కాగా నటన నేర్చుకునేందుకు 15 ఏళ్ల వయస్సులోనే సుభాష్‌ఘాయ్ యాక్టింగ్ స్కూల్లో చేరిన భూమి.. ఫీజు కట్టలేక ఓ ఏడాది తర్వాత ఆ కోర్స్ మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం మనీష్ శర్మ నిర్మించిన ‘దమ్ లగా కే హైస్సా’తో తెరంగేట్రం చేసి నటి కావాలన్న తన కలను సాధించారు. సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక తొలి సినిమాలో బొద్దుగా కనిపించిన భూమి.. ఆ తర్వాత నాజూకుగా మారి శుభ్ మంగళ్ సావధాన్, టాయిలెట్: ఏక్‌ప్రేమ్ కథా, పతీ పత్నీ ఔర్, బాలా సినిమాలతో నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూనే పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. (వ్యవసాయం చేస్తున్నా) ఈ విషయాల గురించి భూమి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘‘అదృష్టవశాత్తూ నాకు అవకాశాలు దక్కాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌తో ఇండస్ట్రీకి పరిచయం కావడం అదృష్టం. పదిహేడేళ్ల వయసులో అసలేం ఏం చేస్తున్నానో తెలియకుండానే తొలి సినిమా పూర్తి చేశాను. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే నేను విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి సెటిల్ అవ్వాలని అనుకున్నాను. కానీ నన్ను విదేశాల్లో చ0దివించే స్థోమత నా తల్లిదండ్రులకు లేదని నాకు తెలుసు. అయితే ఒక్క సినిమాతో నా జీవితం మారిపోయింది. నేను మాత్రం మారలేదు’’అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఆది నుంచి సామాజిక అంశాలకు వాణిజ్య హంగులు జోడించిన సినిమాల్లో నటించడం తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కాగా భూమి ప్రస్తుతం... తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ హిందీ రీమేక్ ‘దుర్గావతి’లో నటిస్తున్నారు. -
వ్యవసాయం చేస్తున్నా
ఖాళీ సమయంలో వంటలు చేయడమో, బొమ్మలు గీయడమో, ఏదైనా నేర్చుకోవడమో.. ఇలా ఏదో ఒకటి చేస్తూ సినిమా స్టార్స్ కాలక్షేపం చేస్తున్నారు. హీరోయిన్ భూమి ఫడ్నేకర్ మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ (నేల అవసరం లేకుండా పండ్లు, కూరగాయల పెంపకం) చేస్తున్నారు. ‘‘మా అమ్మ (సుమిత్ర), నేను ఎప్పట్నుంచో హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆచరణలో పెట్టాం. హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ద్వారా మా గార్డెన్లో కూరగాయలను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫార్మింగ్ గురించి నాకు తెలియని విషయాలను నిపుణులను అడిగి తెలుసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు భూమి ఫడ్నేకర్. ఇక సినిమాల పరంగా అయితే ప్రస్తుతం ‘దుర్గావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ చిత్రానికి ‘దుర్గావతి’ హిందీ రీమేక్. -
నేటి కథలకు విభిన్న భూమిక
తను గ్లామర్ కోసం ఎక్స్పోజ్ చేయదు. కాని సీన్ డిమాండ్ చేస్తే వివస్త్రగా మారడానికి సంకోచించదు. ముఖకవళికలతో చాలా భావాలు పలికించగలదు. కాని చెప్పాల్సిన మాటలు చెప్పాలనుకున్నప్పుడు అనుమతి లేని మాటలు మాట్లాడ్డానికి వెనుకాడదు. మర్యాదస్తులు చాలా మంది ‘ఈ పాత్రనా?’ అనుకునేవి చేసి ‘బాగుందే’ అనిపించేలా చేసిన నటి భూమి పెడ్నేకర్. ‘దమ్ లగాకే హైసా’, ‘టాయిలెట్ ఏక్ ప్రేమకథ’, ‘శుభ్ మంగళ్ సావధాన్’ వంటి ఈ కాలపు కథలకు ఈమే సరైన ‘భూమి’క. బాలీవుడ్లో ఇప్పుడు వస్తున్న కథలను పోల్చినప్పుడు తెలుగులో ఇంకా ‘అంగీకారం ఉన్న’, ‘సేఫ్’ కథలే తయారవుతూ వస్తున్నాయని అనుకోవాలి. బాలీవుడ్లో కమర్షియల్ హీరోలు, బిగ్ స్టార్స్ కూడా మంచి కథలు వస్తే వాటిని ఎగిరి గంతేసి చేస్తున్నారు. స్త్రీల శానిటరీ నాప్కిన్ గురించి అక్షయ్ కుమార్ ‘పాడ్ మేన్’ చేసినట్టు, ఆడపిల్లలను రెజ్లర్స్‌ను చేయడానికి తాపత్రయ పడే వయసు మళ్లిన తండ్రిగా ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ చేసినట్టు, తన వర్గానికి చెందిన పిల్లలను ఐఐటి ఎంట్రన్స్‌లో గెలిపించడానికి కష్టపడే నిమ్నవర్గాల ట్యూటర్‌గా హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ చేసినట్టు మన పెద్ద హీరోలు అలాంటి కథలను చేయరు. ఇక చిన్న సినిమాలలో వస్తున్న కథలైతే అనూహ్యంగా ఉంటున్నాయి. రాజ్‌కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీలాంటి వారు సినీ లాంఛనాలు పాటించని కథలను ఎంచుకుంటున్నారు. మరి ఇలాంటి కథలను సపోర్ట్ చేసే ఫిమేల్ ఆర్టిస్ట్‌లు కావాలి కదా. కొంకణా సేన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే... ఇప్పుడు భూమి పెడ్నేకర్ అందుకు సిద్ధంగా ఉన్నారు. ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ప్రేమించుకుంటారు. పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి పనులు మొదలైపోతాయి. అమ్మాయికి, అబ్బాయికి ఏకాంతం దొరుకుతుంది. ఎలాగూ పెళ్లి కాబోతూ ఉంది. ఇప్పుడు ఏకాంతం దొరికింది. ఇద్దరూ అడ్వంచర్ చేద్దామనుకుంటారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటారు. కాని వదులుకోవాల్సి వస్తుంది. దానికి కారణం అబ్బాయి. అతడు ‘అందుకు’ సిద్ధం కాలేకపోతాడు. ఆమెను సమీపించలేకపోతాడు. చేయవలసింది చేయలేకపోతాడు. సాధారణంగా ఇంకో అమ్మాయి అయితే దీనికి నానా యాగీ చేయాలి. ఊరంతా చెప్పి అబ్బాయిని రిజెక్ట్ చేయాలి. పెళ్లి వద్దు బాబోయ్ అని చెప్పాలి. కాని ఆ పాత్ర చేసిన భూమి పెడ్నేకర్ నిజంగా ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాను ప్రేమించి ఉంటుంది. ఆమెకు సంబంధించినంత వరకు అతడి విషయంలో ప్రేమ ముందు ఉంటుంది. తర్వాతే దైహిక విషయం. ‘ఏం కాదు... అది జెంట్స్ ప్రాబ్లమ్... మెల్లగా పోతుంది... మనం పెళ్లి చేసుకుందాం’ అంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా పూర్తిగా వైముఖ్యంలోకి వెళ్లిపోయి ఉంటాడు. ఇక తన జీవితం సర్వనాశనమైపోయినట్టే భావిస్తాడు. ఆమె నుంచి దూరం దూరం వెళ్లిపోతూ ఉంటాడు. భూమి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతో సహనంతో డీల్ చేస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. శోభనం జరగడం లేదని పెద్దలకు తెలిసినా భర్తను వెనకేసుకొస్తుంది. చివరకు అతడు సరి అయ్యేలా చూసి తన కాపురాన్ని సరి చేసుకుంటుంది. హిందీలో వచ్చిన తొలి ‘ఫ్యామిలీ సెక్స్ కామెడీ’ ఈ సినిమా. కాని అలా అనిపించదు. దానికి కారణం పురుషుల అంగస్తంభన సమస్య పట్ల ఆ టీమ్ అంతటికీ చీప్ భావన లేదు. ఆ సమస్యను వాళ్లు హేళన చేయాలనుకోలేదు. దానిని ఎదుర్కొనే పురుషుల, వారి జీవితంలో భాగమైన స్త్రీలను చూపాలనుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆయుష్మాన్‌తో పాటు భూమి పెడ్నేకర్‌కు కూడా చాలా పేరు వచ్చింది. భూమి పెడ్నేకర్ది ముంబై. వాళ్ల నాన్నది గోవా. అమ్మది హర్యాణ. గోవాలోని ‘పెడ్నే’ అనే పల్లెకు చెందిన వారంతా తమ ఇంటి పేరు ‘పెడ్నేకర్’ అని పెట్టుకుంటారు. అలా భూమి ఇంటి పేరు పెడ్నేకర్ అయ్యింది. భూమి మొదటి నుంచి నటి కావాలనుకుంది. 15 ఏళ్లు రావడంతోటే సుభాష్‌ఘాయ్ యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకోవడానికి చేరింది. అయితే ఫీజు కట్టలేక ఒక సంవత్సరం తర్వాత ఆ కోర్స్ మానేయాల్సి వచ్చింది. 17 ఏళ్లు వచ్చేసరికి సినిమా పరిశ్రమలో పని చేయాలనుకుంది. అయితే ఆమెకు నటిగా పని దొరకలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న షానూ శర్మకు అసిస్టెంగ్‌గా ఉద్యోగం దొరికింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో ‘చక్ దే ఇండియా’, ‘రబ్ నే బనాదీ జోడీ’ వంటి సినిమాలకు పని చేసింది. అవే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న మనీష్ శర్మకు భూమిలో మంచి నటి ఉందని అనిపించింది. ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘శుద్ధి దేశీ రొమాన్స్’ వంటి సూపర్ హిట్స్‌కు దర్శకత్వం వహించిన మనీష్ శర్మ తాను నిర్మాతగా మారి యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి తీయాలనుకున్న ‘దమ్ లగాకే హైస్సా’ సినిమాలో హీరోయిన్గా భూమిని ఎంపిక చేసుకోవడంతో భూమి కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. భాగ్యరాజా తీసిన ‘చిన్న ఇల్లు’, బాలూ మహేంద్ర తీసిన ‘సతీ లీలావతి’లకు హిందీ రూపమే ‘దమ్ లగాకే హైస్సా’. స్థూలకాయస్తురాలైన భార్యను చిన్న చూపు చూసే భర్త కథ ఇది. ఆ భర్తకు ఆమె బుద్ధి చెప్పే కథ. అయితే ఈ రెండు సినిమాల్లోను స్థూలకాయం ఉన్న హీరోయిన్గా మలయాళ నటి కల్పన నటించింది. ఆమె స్వాభావికంగా స్థూలకాయస్తురాలు కాబట్టి పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేకపోయింది. కాని భూమి ఆ పాత్ర కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది. ‘దమ్ లగాకే హైస్సా’ పెద్ద హిట్. రాత్రికి రాత్రి భూమిని స్టార్‌ని చేసిన సినిమా అది. అయితే ఆ వెంటనే అవకాశాలు ఆమెకు రాలేదు. సినిమా కోసం లావుగా అయిపోయిన అమ్మాయిని హీరోయిన్గా ఎలా తీసుకుంటారు? ఆ మొత్తం బరువును కోల్పోడానికి భూమికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆ బరువు కోల్పోయాక ఆమెకు వచ్చిన అవకాశం ‘టాయిలెట్–ఏక్ ప్రేమ్ కథ’. ఆడవాళ్లకు టాయిలెట్స్ లేకపోవడం, వారు ఆ అవసరానికి ఆరుబయలుకు వెళ్లాల్సి రావడం దీనిని నిరసించే కొత్త పెళ్లికూతురిగా భూమి ఈ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ కంటే భూమికే మంచి పేరు తెచ్చిన హిట్ సినిమా ఇది. ఇప్పుడు భూమి ఆగాల్సిన అవసరం రాలేదు. చాలా బోల్డ్‌గా ‘లస్ట్ స్టోరీస్’లో నటించింది. ఇందులో పెళ్లికాని యువకుడితో లైంగిక సంబంధంలో ఉండే పని మనిషి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ నుంచి ‘రైఫిల్ షూటర్స్’గా పేరుపొందిన ముసలమ్మల బయోపిక్‌లో ఒక ముసలమ్మగా ‘సాండ్ కి ఆంఖ్’లో నటించింది. ఇంత చిన్న వయసులో ముసలిపాత్ర పోషించడానికి భూమి చేతులు నులుముకోలేదు. ఆ తర్వాత మళ్లీ ఆయుష్మాన్ ఖురానా బట్టతల సమస్య చిత్రం ‘బాలా’లో, ఒకప్పటి సూపర్ హిట్ ‘పతీ పత్నీ ఔర్ ఓ’ రీమేక్‌లో భూమి తన నట పరంపర కొనసాగించింది. ఈ సినిమాలన్నీ హిట్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. భూమి పెద్ద గొప్ప సౌందర్యవతి కాదు. కాని ఆమె ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు ఆమె ఇచ్చే సౌందర్యం అసామాన్యంగా ఉంటుంది. ఆ పాత్ర ఒక నమ్మదగిన పాత్రగా మనకు పరిచయమున్న పాత్రగా మారడంలో భూమి చూపించే నైపుణ్యం, ప్రతిభ ఆమెను ఈ రంగంలో విజయదాయినిని చేశాయి. భూమి పెడ్నేకర్ సినిమాలు ఏవీ చూడకపోతే ఇప్పుడు చూడటం మొదలుపెట్టండి. ఆమెకు మీరు ఫ్యాన్ అవుతారు. తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తారు. – సాక్షి ఫ్యామిలీ -
దుర్గా మాత ఆశీర్వాదంతో...
‘దుర్గావతి’ ప్రయాణం మొదలైంది. భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దుర్గావతి’. తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ (2018) చిత్రానికి ఇది హిందీ రీమేక్. అక్షయ్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. అశోకే ‘దుర్గావతి’ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్ నటిస్తోన్న ఈ చిత్రంలో మహీ గిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ‘‘దుర్గా మాత ఆశీర్వాదంతో ‘దుర్గావతి’ చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాను. టాల్ అండ్ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్ సార్’’ అన్నారు భూమి. ‘దుర్గావతి’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
దుర్గావతి
బాలీవుడ్ ‘దుర్గావతి’గా మారారు కథానాయిక భూమీ ఫడ్నేకర్. అనుష్క టైటిల్ రోల్లో జి. అశోక్ దర్శకత్వంలో ‘భాగమతి’ (2018) చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ కానుంది. తెలుగులో అనుష్క చేసిన పాత్రను హిందీలో భూమీ ఫడ్నేకర్ పోషించనున్నారు. తెలుగు ‘భాగమతి’ చిత్రాన్ని తెరకెక్కించిన జి. అశోకే హిందీ రీమేక్ ‘దుర్గావతి’కి దర్శకుడు కావడం విశేషం. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తారు. ‘‘దుర్గావతి’లో నటించబోతున్నానని చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. శనివారం అధికారికంగా ప్రకటించాం. చాలా సంతోషంగా ఉంది. దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు భూమీ ఫడ్నేకర్. -
మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్
రియాలిటీ షోలతో, రేడియో జాకీగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘విక్కీ డోనర్’ నుంచి తాజాగా విడుదలైన బాలా మూవీ వరకు సమకాలీన సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాగే కథలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరొందాడు. గతేడాది బదాయీ హో, అంధాధున్లతో హిట్లు ఖాతాలో వేసుకున్న ఆయుష్మాన్.. తాజాగా బాలాతో 100 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మూవీ యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో బాలా సినిమాలో అతడికి జోడీగా కనిపించిన భూమీ ఫడ్నేకర్ ఆయుష్మాన్‌తో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో భూమి మాట్లాడుతూ.. ‘ తెరపై మా జంట చూడముచ్చటగా ఉంటుందని ఎంతో మంది కితాబిచ్చారు. మా మధ్య మంచి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అందుకేనేమో మూడు సినిమాల్లో జంటగా కనిపించినా ఇప్పటికీ మాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. తనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం. వీటి ద్వారా ఎంతోమంది ఎదుర్కొనే సమస్యలను వినోదం కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాం’ అని పేర్కొన్నారు. కాగా భూమి ఫడ్నేకర్ తొలి సినిమా దమ్ లగా కే హైసాలో ఆయుష్మాన్ హీరో అన్న సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శుభ్ మంగళ్ సావధాన్(పురుషుల్లో సంతానలేమి ఇతివృత్తంగా), బాలా (బట్టతల కారణంగా యువకుడు పడే ఆవేదన ప్రధానాంశంగా) సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
రూ. 50 కోట్ల క్లబ్లో చేరిన ‘బాలా’
ముంబై: వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. తాజాగా రూ. 50 కోట్ల చేరిపోయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. వరుసగా నాలుగో రోజుకూడా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. #Bala crosses ₹ 50 cr... Remarkable hold on Day 4... Trends better than Ayushmann’s last hit #DreamGirl [Day 4: ₹ 7.43 cr]... Holiday on Day 5 [#GuruNanakJayanti] should only boost biz... Fri 10.15 cr, Sat 15.73 cr, Sun 18.07 cr, Mon 8.26 cr. Total: ₹ 52.21 cr. #India biz. — taran adarsh (@taran_adarsh) November 12, 2019 అదే విధంగా ‘బాలా’ మూవీ సౌదీ అరేబియాలో సెన్సార్ పూర్తి చేసుకుందని.. నవంబర్ 14న ఈ చిత్రం సౌదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా సౌదీలో రిలీజ్ ఆయ్యే అయూష్మాన్ ఖురానా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. #Bala clears Saudi Arabia censor... First movie of Ayushmann Khurrana to release in #SaudiArabia on 14 Nov 2019. pic.twitter.com/S6m2D7Yun5 — taran adarsh (@taran_adarsh) November 11, 2019 -
సారీ..!
అంటోంది భూమి ఫెడ్నేకర్. ఎందుకు? మ్యారిటల్ రేప్ మీద వ్యంగ్యంగా కామెంట్ చేసినందుకు. అఫ్కోర్స్ స్క్రీన్ మీదే అనుకోండి.. అయినా స్త్రీవాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భూమి ఫెడ్నేకర్, కార్తీక్ ఆర్యన్ నటించిన ‘పతీ పత్నీ ఔర్ వోహ్’ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన విషయం ఇది. ఈ ట్రైలర్లో హీరో ఆర్యన్ కార్తీక్ పాత్ర ‘‘భర్త నానా తంటాలు పడి.. కిటుకులు, గిమ్మిక్కులతో కష్టపడి భార్యను ‘ఒప్పిస్తే’ ఆ భర్తను రేపిస్ట్‌గా ముద్రేస్తారు’’ అని అంటాడు. ఈ డైలాగ్ వివాదమైంది. దాంతో భూమి ఫెడ్నేకర్ ‘‘మ్యారిటల్ రేప్ అనే సీరియస్ అంశాన్ని అపహాస్యం చేయాలని, వాళ్లను బాధపెట్టాలనే ఉద్దేశం మాకెంతమాత్రం లేదు. అయినా ఈ డైలాగ్ వల్ల కొంతమంది బాధపడ్డారు. క్షమించండి’’ అంటూ సారీ చెప్పింది. సమాజంలో మ్యారిటల్ రేప్ మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పతీ పత్నీ ఔర్ వోహ్ లోని హీరో పాత్ర చెప్పే డైలాగ్ నిజంగానే.. ఈ అంశం సీరియస్‌నెస్‌ను తగ్గించేదిగానే ఉంది. భార్య మనసు గెలుచుకోవాల్సింది కిటుకులు, పొగడ్తలతో కాదు.. ఇంటి బాధ్యతల్లో, సహజీవన ప్రయాణంలో సమభాగస్వామిగా గౌరవం ఇచ్చి. ఇలా అర్థం వచ్చేలా సీన్స్ ఉంటే సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా! అడుసు తొక్కనేలా? కాలు కడగనేలా? విషయాన్ని అపహాస్యం చేయనేలా? సారీ చెప్పనేల? -
వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన తాజా సినిమా పతీ పత్నీ ఔర్ వో. భూమి పడ్నేకర్, అనన్య పాండే ఇందులో హీరోయిన్లు. 1978లో విడుదలైన పతీ పత్నీ ఔర్ వో సినిమా పేరుతో ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో వైవాహిక బంధం, తన భార్య గురించి చింటూ త్యాగి(కార్తిక్ ఆర్యన్) చెప్పిన డైలాగులు వివాదాస్పదమయ్యాయి. ‘ శృంగారం విషయంలో భార్య అనుమతి అడిగితే బిచ్చగాళ్లుగా.. ఆమెను తిరస్కరిస్తే మోసగాడిగా... ఇష్టం లేకున్నా బలవంతం చేస్తే అత్యాచారం చేసిన వాళ్లుగా ముద్రవేస్తారు’ అంటూ అతడు చెప్పిన డైలాగులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ‘వైవాహిక అత్యాచారం కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన అనుభవిస్తుంటే.. మీకు నవ్వులాటగా ఉందా’ అంటూ మూవీ యూనిట్‌కు చివాట్లు పెడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి క్యారెక్టర్లు చేసేందుకైనా సిద్ధపడతారా అంటూ హీరోయిన్లను సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి ఫడ్నేకర్ మాట్లాడుతూ.... మహిళల సమస్యలను అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ మమ్మల్ని క్షమించండి. మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సినిమాకు పనిచేసిన ఏ ఒక్కరూ కూడా అసలు అలా ఆలోచించరు. సినిమాను కేవలం వినోద సాధనంగా మాత్రమే చూడాలి’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ చింటూ త్యాగి భార్య పాత్రలో నటిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్
-
మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!
‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ స్పైసీ డైలాగులు, క్రేజీ సీన్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. 1978లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘పతీ, పత్నీ ఔర్ వో’ ను అదే పేరుతో దర్శకుడు ముదస్సర్ అజిజ్ తెరకెక్కించారు. అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్ చోప్రా ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. కానీ, పాత సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తెచ్చారు. తండ్రి మాట మేరకు టెన్త్‌లో పాసై.. ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న చింటూ త్యాగి (కార్తీక్) వేదిక (భూమి)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇంతలోనే తపస్య శర్మ (అనన్య) పరిచయం అవుతోంది. ఆమె మాయలో పడిన చింటూ త్యాగి.. ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు.. పెళ్లి తర్వాత ఎఫైర్‌తో వల్ల అతను పడే ఇబ్బందులు ఏమిటన్నది సినిమా కథగా ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. మీ హాబీస్ ఏమిటని కార్తీక్ అడిగితే.. ‘సెక్స్ బహోత్ పసంద్ హై’ అంటూ భూమి బదులివ్వడం.. పెళ్లయిన విషయం ప్రియురాలు అనన్యకు తెలియడంతో తన భార్యకు ఎఫైర్ ఉందని ఆమెతో కార్తీక్ బుకాయించడం.. తన భార్య ఇంటినుంచి పారిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే డైలాగులు ట్రైలర్లో బాగా పేలాయి. పెళ్లయ్యాక ‘అచ్చేదిన్’ కోసం ఎదురుచూస్తున్నానని, భార్యతో శృంగారం బికారీ, హత్యాచారీ, బలత్కారీగా భర్త మారిపోతున్నాడంటూ కార్తీక్ చెప్పిన పంచ్ డైలాగులను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. -
బాలీవుడ్ భాగమతి
గత ఏడాది ‘భాగమతి’గా అనుష్క ప్రేక్షకులను భయపెట్టి, మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధించారు. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాల హిట్ లిస్ట్‌లోకి ‘భాగమతి’ కూడా చేరింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను విక్రమ్ మల్హోత్రా తీసుకున్నారు. ఇందులో అనుష్క పోషించిన పాత్రను భూమి పెడ్నేకర్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోక్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘సాంద్ కీ ఆంఖ్, బాలా’ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘సాంద్ కీ ఆంఖ్’లో 90ఏళ్ల గన్ షూటర్‌గా నటించారామె. -
భార్య... భర్తకు తల్లిగా నటిస్తే ఇలాగే అడిగామా?
‘సారాంశ్‌లో అనుపమ్ ఖేర్ పాత్ర గురించి ఇలాగే ప్రశ్నించామా? నర్గిస్ దత్ ..సునీల్ దత్(వీరిద్దరు భార్యాభర్తలు)కు తల్లిగా నటించినపుడు ఈ విధంగానే స్పందించామా? జాన్ ట్రవోల్టా యూదు వ్యక్తిగా కనిపించినపుడు ఇదే ప్రశ్న అడిగామా? ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో కాలేజీ యువకుడిగా నటిస్తే ఇలాగే ప్రశ్నల వర్షం కురిపించామా? లేదంటే ఈ ప్రేమపూర్వకమైన విమర్శలు మాకు మాత్రమే పరిమితం చేశారా అంటూ బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రతీ విషయాన్ని నెగిటివ్‌గా చూడటంలోనే ఆనందం దొరకుతుందా.. ప్రయోగాత్మక పాత్రలు పోషించే వారిని విమర్శించే నైజం రోజురోజుకు పెరిగిపోతోందా అని ఫైర్ అయ్యారు. ఇంతకీ ఈ ఢిల్లీ భామకు అంతగా కోపం తెప్పించిన విషయం ఏంటంటే...60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి వందల కొద్దీ పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితాల ఆధారంగా ‘సాంద్ కీ ఆంఖ్’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రకాశీ తోమర్‌గా తాప్సీ నటిస్తుండగా.. భూమి ఫడ్నేకర్ చంద్రో తోమర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ క్రమంలో తాప్సీ, భూమి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరికొంత మంది మాత్రం...‘ 60 ఏళ్ల బామ్మలకు బదులు తాప్సీ, భూమి వంటి మూడు పదుల వయస్సున్న ఆర్టిస్టులను ఎంపిక చేసి దర్శకుడు తప్పు చేశాడు. ఒరిజినాలిటీ మిస్సయింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాప్సీపై నిప్పులు చెరిగే క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా నైనా గుప్తా వంటి సీనియర్ నటీమణులు కూడా...‘ నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మా వయసుకు తగ్గ పాత్రలు కూడా మాకు రాకుండా చేస్తే ఎలా. కనీసం ఇలాంటి పాత్రలకైనా మమ్మల్ని తీసుకోండి అంటూ దర్శకులకు సూచించారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు తాప్సీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్ హిరానందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. I hope and can only hope this will answer the question once n for all coz honestly now it’s getting boring for us to repeat ourselves. So all you lovely people here goes my RESPONSE -#SaandKiAankh pic.twitter.com/guldaTWaks — taapsee pannu (@taapsee) September 24, 2019 -
బామ్మగా అదరగొట్టిన తాప్సీ
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన తాప్సీ.. అక్కడ స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ.. ప్రస్తుతం ఓ బయోపిక్‌లో నటిస్తుంది. 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ‘సాంద్ కీ ఆంఖ్’ చిత్రంలో తాప్సీ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అరవైయేళ్ల బామ్మలు.. తుపాకీ పట్టి తమ లక్ష్యాలను గురిపెడుతుంటే అందరూ నోరెళ్లబెట్టడం హైలెట్‌గా నిలిచింది. సీరియస్‌గా సాగే ఈ కథలో.. సరదా సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మలిచిన ఈ చిత్రంలో భూమి ఫెడ్నేకర్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్ హిరానందన్ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Here it is... our labour of love ... But this one is dedicated to all the mothers....#SaandKiAankh https://t.co/UPViMsyTMB — taapsee pannu (@taapsee) September 23, 2019 -
‘నువ్వేం చూపించదలచుకున్నావ్?’
సినీ తారలతో ఫ్యాన్స్‌కు ఉండేది ఆత్మబంధం! పైకి ఏదో అలా సినిమా చూసి వచ్చేసినట్లే ఉంటారు. లోలోపల మాత్రం టెంపుల్స్ కట్టేసుకుంటారు. టెంకాయలు కొట్టేసుకుంటూ ఉంటారు. ఆ అభిమానం ఇప్పుడు కొత్త ‘ట్రోల్స్’ తొక్కుతోంది. ఎవరైనా తమ ‘దేవత’ను ఒక మాటంటే ఒప్పుకోనట్లే.. మాట అనిపించుకునేలా ఆ దేవత ఉన్నా.. అంగీకరించడం లేదు! ఈ ధోరణికి మనం లైక్ కొట్టాలా? రాంగ్ కొట్టాలా? ♦సందర్భ శుద్ధి గల ఒక బుద్ధి లేని ప్రశ్న. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నా.. రిలేషన్లో ఉన్నారా? బుద్ధిహీనతకు అకేషన్ అక్కర్లేదు. ఈరోజు ‘డియర్ కామ్రేడ్’ విడుదల అవుతోంది కాబట్టి, అర్థం పర్థం లేని ఈ ప్రశ్న సందర్భోచితం అయింది. విజయ్ మోస్ట్ డిజైరబుల్ ఇప్పుడు. అమ్మాయిలు అతడి కోసం పడి చస్తున్నారు. రశ్మిక మోస్ట్ వాంటెడ్. అబ్బాయిలు ఆమె సినిమాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విజయ్–రశ్మిక కంబైండ్‌గా మోస్ట్ అసూయబుల్. విజయ్‌ని రశ్మికతో చూస్తున్న అమ్మాయిలు, రశ్మికను విజయ్‌తో చూస్తున్న అబ్బాయిలు.. గుండెలు బద్దలు చేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే విజయ్, రశ్మికల మధ్య రిలేషన్ ఉంటే.. ♦ రెండు జండర్లలో కొన్ని గుండెలు ఆగిపోతాయా! ఆగబోయే గుండెల్ని విజయ్, రశ్మిక కలిసి ‘మా మధ్య అలాంటిదేమీ లేదు’ అనే ఒక్క స్టేట్మెంట్తో ఆపగలరు. అయితే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను బాయ్‌కాట్ చెయ్యాలని కర్ణాటకలో మూడు రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆపడం మాత్రం ఒక్క రశ్మిక చేతుల్లోనే ఉంది.. చిన్న అపాలజీ స్టేట్మెంట్తో! అపాలజీనా? ఏం చేశారావిడ? ♦ ‘కన్నడం కష్టం’ అన్నందుకు! తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఒకే రోజు నాలుగు భాషల్లో ఇవాళ స్క్రీన్ల మీదికి వస్తోంది ‘డియర్ కామ్రేడ్’. ‘అర్జున్‌రెడ్డి’తో విజయ్ దేవరకొండ, ‘గీత గోవిందం’ తో రశ్మిక మందన్నా దక్షిణాదికి హార్ట్ బీట్ అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ హీరోయిన్ రశ్మిక ఇప్పుడు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో కూడా నటించబోతున్నారు. సినిమాలు తప్ప ఆమె మనసులో ఏమీ లేవు. దేవరకొండ అసలే లేడు. బాగా నటించాలి. అంతవరకే. ‘విజయ్ దేవరకొండ సినిమా అనగానే ఒప్పేసుకున్నారా’ అని మనవాళ్లు అడగ్గానే, ‘అంతలేదు’ అని రశ్మిక వెంటనే చెప్పేయలేదా? ఆమె క్లియర్‌గానే ఉన్నారు. భాష తెలియకపోయినా, భాష రాకపోయినా! సినిమా ప్రమోషన్‌కి చెన్నై వెళ్లినప్పుడు తమిళ్వాళ్లు అడిగారు.. ‘డబ్బింగ్ కష్టం కాలేదా?’ అని. ‘అంత తేలిక అయితే కాదు’ అని చెప్పారు రశ్మిక. ఆ ప్రశ్నకు ముందు వాళ్లు వేసిన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మిగతా మూడు భాషలతో కంపేర్ చేస్తే మీ మాతృభాష కన్నడలో మీకు డబ్బింగ్ ఈజీ అయి ఉంటుంది కదా’ అని. అది తమిళ్ ఇంటర్వ్యూ కనుక రశ్మిక తమిళ్లోనే ఆన్సర్ చేశారు. ‘అదు కష్టం. ఎనకు ఏ లాంగ్వేజ్ కరెక్ట్ అగి వరాదూంగా’ అన్నారు. ‘అది కూడా కష్టమే. నేను ఏ భాషనూ కరెక్టుగా మాట్లాడలేను’ అని. కన్నడ ఫాన్స్ ఈ మాటను పట్టుకున్నారు. ‘కన్నడ అమ్మాయికి కన్నడం కష్టం అవడమేంటి.. స్టెయిల్ కాకపోతే!’ అని సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ‘యాంటీ–కన్నడ కామెంట్స్ చేసినందుకు నిరసనగా రశ్మిక నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాను బాయ్‌కాట్ చెయ్యాలని ట్విట్టర్లో పెద్ద ఉద్యమమే లేవదీశారు. రక్షిత్‌శెట్టితో రశ్మిక విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ఉద్యమమే కొన్నాళ్లు నడిచింది. రక్షిత్ కన్నడ నటుడు. సినీ నిర్మాత. స్క్రీన్ రైటర్. రశ్మిత తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ (2016) నిర్మాత అతడే. ఆ సినిమా తీస్తున్నప్పుడు రక్షిత్‌కి, రశ్మికకు రిలేషన్ ఏర్పడింది. నిశ్చితార్థం కూడా జరిగింది. తర్వాత ఎందుకనో వద్దనుకున్నారు. అదే టైమ్‌లో ఇక్కడ గీత గోవిందం హిట్ అయింది. తెలుగులో గుర్తింపు వచ్చాక రక్షిత్‌ను వద్దనుకుందని రశ్మికపై రక్షిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. పాపం.. తననేమీ అనొద్దనీ, ఇద్దరం ఇష్టప్రకారమే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని రక్షిత్ తనకై తను చెప్పినా ఫ్యాన్స్ వినలేదు. రశ్మిక కూడా అప్పుడూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడూ ఏమీ మాట్లాడలేదు. ఈమధ్య మనవాళ్లెవరో విజయ్ దేవరకొండను అడిగారు.. ‘రశ్మిక బ్రేకప్ గురించి కామెంట్ ప్లీజ్’ అని! ‘ఎందుకు.. సంబంధంలేని వాటి చుట్టూ తిరుగుతారు’ అని విజయ్ మందలింపుగా అన్నారు. ♦ నాట్ మై దీపిక సినిమాతో సరిపెట్టుకోనివ్వదు అభిమానం. నచ్చిన హీరోనో, హీరోయిన్నో కలవాలని తపిస్తుంది. చేయి కలపాలని, ఫొటో తీయించుకోవాలని ప్రయత్నిస్తుంది. అభిమాన సంఘం పెట్టుకుంటుంది. క్షీరాభిషేకం చేస్తుంది. గుడి కట్టిస్తుంది. ఇవన్నీ పాత విధానాలు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫాన్స్ ఇప్పుడు డైరెక్టుగా సినీ స్టార్స్‌తో ఇంటరాక్ట్ అవుతోంది. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి, వృత్తిపరమైన నిర్ణయాల్లోకి కూడా వెళ్లిపోతోంది. రశ్మికతోపాటు ఇప్పుడీ తరహా అభిమానానికి ‘గురవుతున్న’ మరొక నటి దీపికా పడుకోన్. ఈమెకు వ్యతిరేకంగా తాజాగా ‘నాట్ మై దీపిక’ అనే మూవ్మెంట్ నడుస్తోంది! ‘నా దీపిక కాదు’ అని! ఫ్యాన్స్‌కి ఎందుకి ంతగా ఆవేదన కలిగింది? ‘మీటూ’ కేసులో నిందితుడిగా ఉన్న బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ నెక్ట్స్ సినిమాలో దీపిక నటించడం వారికి ఇష్టం లేదు. లవ్ రంజన్ తీసే సినిమాలు వెరైటీగా ఉంటాయి. ‘ప్యార్ కా పంచనామా’, ‘లైఫ్ సహీ హై’ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలే. ఇవి కాక, మరికొన్ని సినిమాలకు నిర్మాత కూడా. దీపిక ఈ మధ్య రణ్‌బీర్ కపూర్‌తో కలిసి లవ్ రంజన్ ఇంటికి వెళ్లి వస్తూ మీడియా కంటపడ్డారు. అంతే. ఇక వీళ్లిద్దరూ లవ్ రంజన్ కొత్త ప్రాజెక్టులో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని చూసిన అభిమానులు.. ‘చస్తే ఆ పని చెయ్యొద్దు’ అని దీపికకు ట్వీట్లు పెట్టారు. ‘‘స్త్రీలను లైంగికంగా వేధించే ఒక నీచుడి ప్రాజెక్టులో మీరు నటిస్తున్నట్లయితే మీటూకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఎందరో మహిళలకు మీరు అన్యాయం చేసినట్లే. మీరు మీ గౌరవాన్ని కూడా కోల్పోతారు’’ అని ఒక అభిమాని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ‘నాట్ మై దీపిక’ అనే హ్యాష్‌టాగ్ ఆవిర్భవించింది. లవ్ రంజన్ ప్రాజెక్టులో దీపిక నటించకూడదని కోరుకుంటున్న, ఆదేశిస్తున్న, విజ్ఞప్తి చేస్తున్న, ప్రాధేయపడుతున్న, ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేస్తున్న ఫ్యాన్స్ అంతా కలిసి దీపికపై ఇలా ఒత్తిడి తెస్తున్నారు! ‘ప్యార్ కా పంచనామా’ (2011) ఆడిషన్లలో లవ్ రంజన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, ఒంటిపై బట్టలన్నీ తీసి నిలబెట్టాడని ఇటీవల ఒక నటి ఆరోపించింది. అలాంటి వ్యక్తితో టై–అప్ కావడం ఏంటని దీపిక ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై దీపిక ఇంతవరకూ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే లవ్ రంజన్ సినిమాకు సంతకం చేశానని ఆమె చెప్పినప్పుడు కదా! బర్త్‌డే పార్టీలో ప్రియాంక : బికినీలో విహరిస్తూ.. స్మోక్ చేస్తూ.. ♦ బ్యాడ్ గర్ల్ ప్రియాంక నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక కూడా ప్రియాంక చోప్రా అభిమానులు ఆమె ఇంకా తమ మనిషే అనే భావనలోంచి బయటికి వచ్చినట్లే లేదు. ఇటీవల మయామీ బీచ్‌లో ప్రియాంక సిగరెట్ తాగుతున్న ఫొటోను, బికినీలో ఆమె ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి తట్టుకోలేకపోయారు ఫాన్స్. ‘ప్రియాంకా.. ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అని ఆవేదన చెందారు. ఆగ్రహం వ్యక్తం చేశారు! ప్రియాంక గ్లోబల్ స్టార్. ఆ గ్లోబల్ స్టార్ దేశవాళీ స్టార్లా ఉండాలని కోరుకోవడం అంటే అభిమానం హద్దులు విధించడమే కదా! జూలై 18న ప్రియాంక బర్త్ డే. ఆమె ఎంతో ముందుగా ప్లాన్ చేసుకున్న రోజు అది. ముంబై నుంచి ప్రియాంక తల్లి మధు చోప్రా, చెల్లి పరిణీతి చోప్రా కూడా మయామీ వచ్చి ప్రియాంక–నిక్లతో జాయిన్ అయ్యారు. పరిణీతి అయితే తన అప్‌కమింగ్ మూవీ ‘జబరియా జోడీ’ ప్రమోషన్ పనులను కూడా పక్కన పెట్టి అక్కకోసం ఆకాశంలో ఎగిరొచ్చారు. ఆ రోజు ప్రియాంక ఎంతో లవ్లీగా ఎంజాయ్ చేశారు. యాట్(విలాసవంతమైన నౌక) లో విహరించారు. ఘాటుగా ఉండని మేలు రకం సిగరెట్‌ను ఆస్వాదించారు. దేహానికి బికినీని తగిలించుకుని విహంగంలా మారిపోయారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. వాటిని చూసి ప్రియాంక ఫ్యాన్స్ విలవిల్లాడిపోయారు. ‘ది స్కయ్ ఈజ్ పింక్’ సినిమాలో (అదింకా మన దేశంలో విడుదల కాలేదు) ఒక తల్లిగా ప్రియాంక చెప్పిన నీతులేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అని ఒకరు ట్వీట్ పెట్టారు. ఇంకొకరు మరికాస్త ముందుకు వెళ్లి.. ‘అల్లుడి పక్కన అత్తగారు అలానేనా కూర్చోవడం! అసలు ప్రియాంక ఎలా చూస్తూ ఊరుకుంది? భారతీయ సంప్రదాయం ఏమిటో ఆ తల్లి మర్చిపోయినా, ఈ కూతురు గుర్తు చెయ్యొద్దా ’ అని ట్వీట్ చేశారు. మరికొందరైతే.. ‘ప్రియాంక తన లవింగ్ హస్బెండ్తో, లవింగ్ మదర్‌తో, బ్యూటిఫుల్ బికినీతో ఉన్న ఫొటోలు నాకేమీ సంతోషం కలిగించడం లేదు. ధ్వని లేకుండా దీపావళిని సెలబ్రేట్ చేసుకొమ్మనీ, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకొమ్మని, మూగజీవుల పట్ల మానవత్వంతో మెలగమని ఇక ముందు కూడా చెప్పేందుకు ప్రియాంక ఎలా ధైర్యం చేయగలుగుతారు’’ అని ఒక అభిమాని వాపోయారు. రశ్మిక, దీపిక లానే ప్రియాంక ఏమీ స్పందించలేదు. తను చేసింది తప్పు అనుకుంటే తన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోరు కదా.♦ భూమి పడ్నేకర్ జిమ్ సెల్ఫీ ‘ఎక్కడ తల్లీ నీ బ్రెయిన్?’ భూమి పడ్నేకర్ నాలుగేళ్లుగా బాలీవుడ్లో ఉన్నారు. మంచి సినిమాలు చేశారు. ‘టాయ్‌లెట్ : ఏక్ ప్రేమ్ కథ’లో మంచి రోల్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన డైలీ రొటీన్ ఫొటోలను తరచు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఈమధ్య జిమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ తీసుకున్న సెల్ఫీని కూడా అలాగే పోస్ట్ చేశారు. ఆ యాంగిల్లో (బ్రెస్ట్ ఎలివేట్ అయ్యేలా) తీసుకున్న ఫొటో ఆమె అభిమానులకు నచ్చలేదు. ‘భూమి ఏంటి? ఇలా కనిపించడం ఏంటి?’ అనుకున్నారు. ఒకరైతే చాలా బ్యాడ్‌గా కామెంట్ పెట్టారు. ‘నీ బ్రెయిన్ నీ బ్రెస్ట్‌లో ఉందా?’ అని పెట్టారు! ఇలాంటివే చాలా కామెంట్లు. ‘నిన్నెంత ఉన్నతంగా ఊహించుకున్నాం. నువ్వేమో ఇలాగా’ అని మరొక ఆవేదన. ఆ ఫొటోలో భూమిక ‘పీస్ ఆఫ్ మైండ్’తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దానిపైనే ఎక్కువ కామెంట్లు వచ్చాయి. ‘పీస్ ఆఫ్ మైండ్’ (పి.ఐ.ఇ.సి.ఇ.) ‘అందరికీ మీడియా అటెన్షన్ కావాలి’. ‘నీ పీస్ ఆఫ్ మైండ్ నీ బ్రాలో ఉన్నట్లుంది’. ‘ఇలాంటి యాంగిల్‌ను ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు’. ‘రెండు పెద్ద పీస్ ఆఫ్ మైండ్లు’. ‘నువ్వేం చూపించదలచుకున్నావ్?’ ఇలా ఉన్నాయి కామెంట్లన్నీ. తన వర్క్అవుట్ సెల్ఫీ తన ఫ్యాన్స్ మనసును ఇంతగా విరిచేస్తుందని ఆమె ఊహించినట్లు లేరు. కానీ తనేం తప్పు చేయలేదు కదా. ఎందుకు రెస్పాండ్ అవడం అని అనుకున్నట్లున్నారేమో.. కామ్‌గా ఉండిపోయారు భూమి పడ్నేకర్. తాప్సీ పన్నుది ఇంకో స్టోరీ. పై వాటికి పూర్తి భిన్నమైనది. ఆమెను ట్రోల్ చేసింది ఫాన్స్ కాదు. ఎవరో ముక్కూముఖం తెలియని వ్యక్తి. బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి భోంచేస్తూ ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టారు తాప్సీ. ‘మంచి ఆహారంతో ఒక కొత్త ప్రారంభం. ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్న ఒక పాత్ర దొరికిన ఆనందాన్ని నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను’ అని దానికి కామెంట్ పెట్టారు. దీనిపై ఆ వ్యక్తి ట్వీట్ చేస్తూ, ‘అనుభవ్ సార్.. మీరు ఇంకెవర్నయినా వెతుక్కోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తాప్సీకి యాక్టింగ్ రాదు’ అని ట్రోల్ చేశాడు. తాప్పీ దానిని ఇగ్నోర్ చెయ్చొచ్చు. చెయ్యాల్సిన ట్వీట్ కూడా. అయితే ఆమె సమాధానం ఇచ్చారు. ‘సారీ యార్, ఇప్పటికే మొత్తం సంతకాలయి పోయాయి. ఒక పని చెయ్యి, తర్వాతి దానికోసం వేచివుండు, బహుశా అది కూడా పూర్తి చేసేస్తా’ అని చాలా కూల్‌గా, బ్రైట్‌గా ఇచ్చారు. సినీ హీరోయిన్లపై చచ్చేంత అభిమానంతో వారిని ట్రోల్ చేసేవారు ఉన్నట్లే.. వాళ్లని పిచ్చిపిచ్చి కామెంట్లతో ట్రోల్ చేసేవారూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడం ఇవ్వక పోవడం వాళ్లిష్టం. ట్రోల్ చేసేవాళ్లే ఆలోచించుకోవాలి తమ అభిమానం గానీ, ద్వేషం గానీ, హద్దులు మీరడం లేదు కదా అని. -
పోటీకి చోటు లేదు
‘‘ప్రస్తుతం ఇండస్ట్రీకి చాలా కొత్త టాలెంట్ వస్తోంది. హీరోలు, హీరోయిన్లు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలు, అద్భుతమైన పెర్ఫార్మెన్సులతో ఆకట్టుకుంటున్నారు’’ అన్నారు భూమీ ఫెడ్నేకర్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మీకు ఎవరు పోటీ అని భావిస్తారని భూమిని అడగ్గా–‘‘ప్రస్తుతం పోటీకి అంత చోటు లేదనుకుంటున్నాను. ప్రతి యాక్టర్‌కు వాళ్ల స్పేస్ వాళ్లకుంది. అందరూ తమ స్టైల్లో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో అన్‌హెల్దీ కాంపిటీషన్‌కు చోటే లేదు. అందరూ అందరి పనిని సపోర్ట్ చేస్తున్నారు.. అభినందిస్తున్నారు. నా హీరోయిన్స్ అందరూ బ్రిలియంట్ యాక్టర్స్. వాళ్ల సినిమాలు చూసి పోటీ పడాలని ఇంకా కష్టపడి పని చేసేందుకు ప్రేరణ లభిస్తుంది’’ అన్నారు. భూమీ నటించిన ‘సాండ్‌కీ ఆంఖ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆయుష్మాన్ ఖురానాతో ‘బాలా’ అనే సినిమా స్టార్ట్ చేయనున్నారామె. -
హెల్త్ జీరో కాకూడదు
నాజూకు రాణులు సన్నజాజుల్లా ఉండాలట.వాళ్ల బరువు ఏడు మల్లెల ఎత్తు తూగాలట.కానీ... ఇక్కడో అందమైన, ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మాట కూడా ఉంది.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని ఓ వాడుక. అంటే మరి... చిక్కిపోకుండా బొద్దుగా ఉంటేనో? అప్పుడామె ఇంకా మరింత అందంగా ఉందనే కదా అర్థం!అన్నట్టు ఒక్కమాట...సైజ్ జీరో అయితే హెల్త్ కూడా జీరో కావచ్చు. హెల్త్ జీరో అయితే జీవితమూ జీరో కావచ్చు. హెల్త్ కొరవడిన లైఫ్ హెల్ అనిపించవచ్చు.అందుకే సన్నబడినా, కండపట్టినాఆరోగ్యానికి మించిన అందం లేదని గ్రహించాలి.అటు ఆ ఏడుమల్లెలూ, సన్నజాజులే కాదు...ఇటు ఈ బొండుమల్లెలూ, ముద్దబంతులూ ఇచ్చే‘అందమైన’ సందేశం ఇదే! ‘‘ఆద్యా.. ఏంటమ్మా ఇది? ఏమీ తినకుండానే చేయి కడుక్కుంటున్నావ్?’’ కంచంలో వడ్డించిన భోజనం వడ్డించినట్టే వదిలేసిన ఆరేళ్ల మనవరాలిని మందలించింది అమ్మమ్మ.‘‘అమ్మో.. కర్రీస్‌లో ఎంత ఆయిల్ ఉందో?’’ భయంతో కళ్లింత చేసుకొని జవాబిచ్చింది ఆద్యా.‘‘ఏయ్ వేషాలా? ఎక్కడుందే ఆయిల్?’’ గద్దించింది ఆద్యా పిన్ని.‘‘అంతంత ఆయిల్ తింటే రోడ్డు రోలర్లా తయారవుతారు. నేను కంగనా రనౌత్‌లా ఉండాలి’’ .. కళ్లు, చేతులు, నడుము తిప్పుకుంటూ ఆ పిల్ల.అక్కడున్న పెద్దవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంకానయం.. ఆరేళ్ల వయసులో ఆద్యా ఆ మాటలు మాట్లాడుతోంది.ఆ పిల్ల మేనత్త కూతురు.. నాలుగేళ్ల పసికూనకైతే బార్బీడాలే రోల్ మోడల్!విస్మయం చెందాల్సిన విషయమే. జీరో సైజ్.. ప్రభావం!తెల్లటి ఛాయే అందం అనే భ్రమను ‘నిజం’గా ఎలా నమ్మించారో.. బ్యూటీ అంటే జీరోసైజే అనే పిచ్చినీ అంతే ‘వాస్తవం’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మ్యాగజైన్లు, పత్రికలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, కథనాలు, కథలు, సీరియళ్లు.. అన్నీ ఆ అతి నాజూకుతనానికే కిరీటం పెట్టాయి. అందం అంటే తెల్లటి రంగుతో.. 36–24–36 శరీర కొలతలు కాదు మొర్రో.. అందం అంటే ఆరోగ్యంతో ఉన్న ఆత్మవిశ్వాసమని ఇవే పత్రికల్లో మానసిక విశ్లేషకులు, వైద్యులు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా కమర్షియల్ యాడ్స్ మాయలో.. హోరులో వినట్లేదు.. చూడట్లేదు!శారీరక వ్యాయామం లేకుండా డైట్‌తో ఫలానా రోజుల్లోగా ఫలానా అన్ని కేజీలు తగ్గుతారు.. మేము గ్యారెంటీ అంటూ.. ‘డైట్‌కి ముందు.. తర్వాత’ అని ఫోటోలు వేసి మరీ నిలబెట్టిన హోర్డింగులు చూసి.. క్యూ కడ్తున్నారు. సన్నబడ్డమేమో గానీ.. నీరసించి ఆసుపత్రి పాలైన టీనేజ్ అమ్మాయిలు కళ్లముందే కనిపిస్తున్నా! సన్నజాజి.. ముద్దబంతి వెనకట.. ‘‘ఆ అమ్మాయి చూడు.. సన్నజాజి తీగలా ఎంత నాజూగ్గా ఉందో?’’ అని అన్నవాళ్లే కాస్త బొద్దుగా కనిపించిన ఆడపిల్లను చూసి‘‘ముద్దబంతి పువ్వు’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు. అంటే అందం.. మనిషి మనిషికీ మారినట్టే కదా! సన్నజాజి తీగను, ముద్దబంతినీ అభినందించారు అంటే ఆరోగ్యాన్ని.. దానిద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టు కదా! కండ కలవాడే (కలది కూడా) మనిషని గురజాడ కూడా సెలవిచ్చాడు. మనిషి మనిషికీ ఒంటితీరు మారుతుంది. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ల బరువు ఉండాలి. కష్టే ఫలి. చెమటోడ్చే శ్రమే ఆరోగ్య సూత్రం. అందుకే జీరో సైజ్ అబ్సేషన్గా మారిన తరాన్ని ఆ వెర్రిలోంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నాలే మొదలయ్యాయిప్పుడు. ధమ్ లగాకే హైష్షా..! జీరో సైజ్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వెలిగిందీ.. అందులో ఆరోగ్యం జీరో అని చాటిందీ సినిమా స్టార్సే.. సినిమాలే అయినా ఇప్పడు తూచ్ అంటోందీ అవే.. వాళ్లే! కరీనా కపూర్‌తో ఈ తరహా నాజూకుతనం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. జీరో సైజ్ కొలతల్లో ఇమడడానికి కరీనా తీసుకున్న అతి శ్రద్ధ ఆమెను అనారోగ్యం పాలు చేసింది. దాంతో హెల్త్‌ను మించిన గ్లో, ఫేమ్ లేదని అంతే త్వరగా దాంట్లోంచి బయటకు వచ్చింది కరీనా. పాజిటివ్ దృక్పథం, చేస్తున్న పనిపట్ల నిబద్ధత, ప్లస్ పాయింట్స్.. ప్లస్ సైజ్‌ను బీట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదే అందానికి యూనివర్స్ ఇచ్చే నిర్వచనం. బ్యూటీ పేజెంట్స్‌లో క్రౌన్‌ను డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ కూడా వీటికి సంబంధించే ఉంటుంది. ఈ సత్యానికి సినిమాలు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లావుగా ఉన్న భార్యతో బయటకు వెళ్లడానికి సిగ్గుపడే భర్తను రక్షించి ఆత్మవిమర్శలోకి నెట్టిన హీరోయిన్ కథ తెలుగులో ‘కితకితలు’తో ప్రారంభమై.. హిందీలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా వచ్చిన ‘ధమ్ లగాకే ౖహె ష్షా’గా కొనసాగుతోంది. ప్లస్ సైజ్ కథానాయికతో తెలుగులో ‘సైజ్ జీరో’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం కోసం అనుష్క శెట్టి బరువు పెరిగి పాత్రకు ప్రాణం పోసింది. అయినా.. ఆమె పట్ల ప్రేక్షకుల అభిమానం గ్రాము కూడా తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల నటి ఆర్. వరలక్ష్మి (ఆర్. శరత్ కుమార్ కూతురు), బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎట్సెట్రా.. నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు తప్ప నాజుకుతనంతో కాదు. పాతకాలంలో సంధ్యా, సావిత్రి, దేవిక, రాజశ్రీ తర్వాత జయచిత్ర లాంటి వారు లేరా.. అంటే ఉన్నారు. స్లిమ్‌గా ఉండే ట్రెండ్‌లో కూడా కాన్ఫిడెన్స్ పాత్‌ను ఎంచుకున్న లేటెస్ట్ హీరోయిన్స్ ఉదాహరణగా చూపించింది.. ఈ తరం కనెక్ట్ అవడం కోసమే. ప్లేబాయ్ టు మాల్స్..! లావుగా ఉండే వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి ప్లస్ సైజ్ మోడల్స్ కూడా వచ్చారు. వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ప్లస్ సైజ్‌లో లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ టాప్ బ్రాండ్స్ వాటికి తమ బ్రాండ్నేమ్నిస్తున్నాయి. మాల్స్‌లో స్పెషల్ స్పేస్ దొరుకుతోంది. ప్లేబాయ్ లాంటి పత్రికలు ప్లస్ సైజ్ మోడల్స్‌ను తమ ముఖచిత్రంగా వేసి స్టీరియో టైప్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ పత్రిక ఫోటోగ్రాఫర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న ఎల్. రామచంద్రన్ ఆ మోడల్స్‌తో ఫోటో షూట్ చేస్తున్నాడు. ‘‘సన్నని మేను, తెల్లటి రంగు అంటూ అందానికి నిర్వచనాలుండవ్. అవి కథల్లో, కవితల్లో మాత్రమే. ఆత్మసౌందర్యమే అసలైన సౌందర్యం’’ అంటాడు ఎల్. రామచంద్రన్. ఆయన ఫోటో షూట్‌కు మోడల్‌గా పనిచేసిన అక్షయ నవనీతన్.. టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పలు టీవీ షోలకు యాంకర్ కూడా. ఎల్.రామచంద్రన్ ఫోటో షూట్లో ఆమె గుండు చేయించుకుని (క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ బాధితలకు సంఘీభావంగా) కూడా పాల్గొన్నారు. ‘‘బాడీ షేమింగ్‌ను బ్రేక్ చేయడానికి విజువల్ ఆర్ట్‌ను మించిన మీడియం లేదు’’ అంటాడాయన.క్లారిటీ, సింప్లిసిటీ, స్ట్రెంత్.. సెల్ఫ్కాన్ఫిడెన్స్కు గ్రామర్.. గ్లామర్! దీన్ని మించిన అందం ఏం ఉంటుంది? ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తుల జీవితాలను చదివినా.. ఈ సామాన్య లక్షణాలే కనిపిస్తాయి! – సరస్వతి రమ అన్కండిషనల్గా ప్రేమించుకోవాలి మనమంటే హోల్ ప్యాకేజ్.. దాన్ని మొత్తంగా చూడగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్ కండిషనల్‌గా. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. చేసుకోవాలి కూడా. అలాగని అప్పియరెన్స్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి.. అదీ ఓ భ్రమ కోసం మనల్ని మనం హింసించుకోవడం తప్పు. మోడల్స్‌ను రోల్ మోడల్స్‌గా తీసుకోకూడదు. వాళ్ల ఫోటోలు.. షూట్స్‌ను చూసి మనం ఫోలో కావద్దు. కారణం.. అవన్నీ ఎడిట్, గ్రాఫిక్‌ల గిమ్మిక్కులు. ఆరోగ్యం కోసం, ఒబేసిటీతో బాధపడ్తున్న వాళ్లు సన్నబడాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం కూడా. కాని అందం కోసం.. అదీ స్పెసిఫిక్‌గా జీరో సైజ్ ఫ్రేమ్‌లోకి రావాలని తాపయత్రయ పడడం మాత్రం ప్రమాదమే. దీనివల్ల శారీరకంగానే కాదు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఎప్పుడైనా .. ఎక్కడైనా సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది. – డాక్టర్ పద్మాపాల్వాయి, సీనియర్ సైకియాట్రస్ట్ -
దీపావళి వరకు ఆగాలి
‘‘సినిమాల్లో పోషించేది కేవలం పాత్రే అయినప్పటికీ కొన్నిసార్లు ఆ పాత్రలు మన మనసులో ఉండిపోతాయి’’ అంటున్నారు తాప్సీ. భూమీ ఫెడ్నేకర్, తాప్సీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆమె ఆ చిత్రానికి సంబంధించి తన మనోభావాలను వెల్లడించారు. ఆశయం ముందు వయసు ఎంత పెద్దదైనా చిన్నదే అవుతుందనే దానికి నిదర్శనంగా అరవై ఏళ్ల వయసులో షూటర్స్‌గా పతకాలు సాధించిన ధీర వనితలు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో తుషార్ హిరానందనీ దర్శకత్వం వహించారు. ‘‘ప్రకాషీ తోమర్ అనే పాత్ర ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. టీమ్ అందరం కలిసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అని తాప్సీ అన్నారు. ‘‘కొన్నిసార్లు గుడ్‌బైలు కష్టంగా ఉంటాయి. ఈ టీమ్‌కు గుడ్‌బై చెప్పడం కూడా అలాంటిదే. టీమ్‌ను బాగా మిస్ అవుతాను’’ అని భూమి అన్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల అవుతోంది. -
పిడికిలి బిగించారు
కొత్త చిత్రంలో గ్రామీణ మహిళలుగా తాప్సీ, భూమీ ఫెడ్నేకర్ కనిపించనున్నారు. దానికోసం పిడికిలి బిగించారు. పిడకలు తయారు చేస్తున్నారు. షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రాకాషీ తోమర్ జీవిత కథల ఆధారంగా ‘సాండ్‌కే ఆంఖ్’ అనే చిత్రం రూపొందుతోంది. తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఆల్రెడీ ఈ పాత్రలో నటించడానికి ఈ ఇద్దరూ షూటింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా తుషార్ హిరానందీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అనురాగ్ కశ్యప్, నిధి పరమార్ నిర్మాతలు. ఈ షూటింగ్లో భాగంగా భూమీ, తాప్సీ పిడకలు కొడుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన సువాసన వస్తోంది. ఏదో రుచికరమైనది తయారవుతోన్న భావన కలుగుతోంది’’ అని క్యాప్షన్ పెట్టారామె. బాలీవుడ్లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న తాప్సీ నటిస్తున్న ఈ సినిమాపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. -
షూటింగ్ సులువు కాదు
నా కెరీర్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్నానని అంటున్నారు కథానాయిక తాప్సీ. తుషార్ హీరానందన్ దర్శకత్వంలో తాప్సీ, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలుగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘శాండ్ కీ ఆంఖ్’. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షార్ప్ షూటర్స్ చంద్రోస్, ప్రకాషి తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రతిరోజూ ఉదయాన్నే గన్ షూట్ సాధన మొదలుపెడతాం. రోజూ నాలుగు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను. నా కోచ్ విశ్వజిత్ షిండే మంచి శిక్షణ ఇస్తున్నారు. గన్ ఎలా పట్టుకోవాలి? గన్ పేల్చుతున్నప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలనే అంశాలపై మరింత పట్టు సాధిస్తున్నాను. సరైన సాధనతో ఇప్పుడు షూటింగ్ బాగానే చేస్తున్నాను. కానీ గన్ షూటింగ్ అంత సులభంగా రాలేదు. మొదట్లో ప్రయత్నించడానికే భయం వేసింది. దాంతో మోస్ట్ చాలెంజింగ్ రోల్ అనిపించింది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి ‘బద్లా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారామె. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్యతారలుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. -
ట్రాక్‌లోనే ఉంది
తాప్సీ, భూమి ఫడ్నేకర్ ముఖ్య తారలుగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో తాప్సీ, భూమి గన్ షూటర్స్‌గా నటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రో అండ్ ప్రకాషి తోమర్ అనే షార్ప్ షూటర్స్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే అనురాగ్ కశ్యప్ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం గురించి అనురాగ్ స్పందించారు. ‘‘ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెల 10న షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. ‘‘ఈ సినిమా గురించి నన్ను ఇప్పటివరకు చాలా మంది అడిగారు. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా సరైన ట్రాక్‌లోనే ఉంది. త్వరలో మరిన్ని విషయాలు తెలుస్తాయి’’ అని తాప్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ సినిమాతో తాప్సీ, ‘పతీ పత్నీ ఔర్ ఓ’ చిత్రంతో భూమి బిజీ బిజీగా ఉన్నారు. -
ఆయుష్మాన్.. మరో కొత్త కథ
మేగజీన్ కవర్‌పేజీ మీద మోడల్స్ కూడా బయట సాధారణంగానే కనిపిస్తారు. కానీ యువత మాత్రం ఫెయిర్‌నెస్ ధ్యాసలో పడి వృథా ప్రయాసలు పడుతున్నారు. సమాజం కూడా అలానే ట్రీట్ చేస్తుంది. అబ్బాయిల విషయానికి వస్తే.. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకీ బ్యూటీ గురించిన బోధన అంటే.. ఆయుష్మాన్ ఖురానా కొత్త బాలీవుడ్ చిత్రం స్టోరీ లైన్ ఇది. ‘విక్కీ డోనర్’, ‘అంధాథూన్’ వంటి సరికొత్త స్క్రిప్ట్స్ ఎంచుకునే ఆయుష్మాన్ మరో డిఫరెంట్ క£ý కు సంతకం చేశారట.యవ్వనంలోనే బట్టతలతో బాధపడే హీరో, చామనఛాయ రంగులో ఉండి తెల్లతెల్లగా కనిపించాలని ఉవ్విళ్లూరే హీరోయిన్ మధ్య జరిగే కథ ఇది. అమర్ కౌషిక్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘బాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో ఆయుష్మాన్ సరసన భూమీ పెడ్నేకర్ నటించనున్నారు. ప్రస్తుతం ‘డ్రీమ్ గాళ్’ సినిమా చేస్తున్న ఆయుష్ వచ్చే ఏడాది ‘బాలా’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. -
విద్యా పోయే.. కోన్ వచ్చే!
గతేడాది రిలీజైన హిందీ చిత్రం ‘లిప్‌స్టిక్ అండర్ మై గుర్కా’ సినిమా బాలీవుడ్లో మంచి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణే లభించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకురాలు అలంక్రిత శ్రీవాత్సవ నెక్ట్స్ చిత్రంపై దృష్టిసారించారు. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లుకు చాన్స్ ఉంది. అందులో ఒక కథానాయికగా భూమి పడ్నేకర్ ఫిక్సయ్యారు. మరో కథనాయికగా విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చిన ఫైనల్‌గా ప్లేస్‌ను కోన్కోనా సేన్ శర్మ దక్కించుకున్నారు. ‘లిప్‌స్టిక్ అండర్ మై గుర్కా’ సినిమాలో లీడ్ రోల్ చేసింది కూడా సేన్ శర్మనే కావడం విశేషం. ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకురాలిగా తొలిసారి అశ్వనీ అయ్యర్ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా రనౌత్ ‘పంగా’ సినిమాతో అశ్వని బిజీగా ఉన్నారు. -
ప్రియాంక పోయి పెడ్నేకర్ వచ్చె?
హాలీవుడ్ నుంచి రిటర్న్ అయ్యాక ప్రియాంకా చోప్రా ‘భారత్, సెల్యూట్’ సినిమాల్లో కనిపిస్తారని ఊహించారంతా. ‘భారత్’ సినిమా షూట్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత తప్పుకున్నారు. కానీ ‘సెల్యూట్’ సినిమా విషయంలో మాత్రం ముందే రేసులో నుంచి తప్పుకున్నారట. దాంతో ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌లో భూమి పెడ్నేకర్ వచ్చారని బాలీవుడ్ టాక్. షారుక్ ఖాన్ హీరోగా మహేశ్ మతై దర్శకత్వంలో ‘సెల్యూట్’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) రాకేశ్ శర్మ బయోపిక్ ఇది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ప్రియాంకా చోప్రా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు భూమి పెడ్నేకర్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కేవలం రాకేశ్ శర్మ ప్రొఫెషనల్ లైఫ్‌ని మాత్రమే కాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. ‘ధమ్ లగా కే హైశా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూమి ‘టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, లస్ట్ స్టోరీస్’లతో పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు ఏకంగా షారుక్ పక్కన చాన్స్ కొట్టేయడమంటే మెల్లిగా టాప్ లీగ్‌లోకి ఎంట్రీ పాస్ కొట్టేసినట్టే. షారుక్ తాజా చిత్రం ‘జీరో’ పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. -
‘టాయిలెట్ హీరో’గా మారిన అక్షయ్
ప్రస్తుతం ఇండియన్ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాయి. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ సక్సెస్ తరువాత చైనా మార్కెట్‌పై కన్నేసింది బాలీవుడ్. సినిమాలో కంటెంట్ ఉంటే చైనాలో కూడా రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నాయి మన సినిమాలు. సీక్రెట్ సూపర్‌స్టార్, ఖానభజరంగీ భాయిజాన్, ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్మెయిల్’ అక్కడ కూడా సక్సెస్ సాధించాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్‌ప్రేమ్ కథా’ కూడా చైనా రిలీజ్‌కు సిద్ధమైంది. గతేడాది విడుదలైన ఈ మూవీ భారత్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేయనున్నారు. టాయిలెట్ హీరో అనే టైటిల్‌తో జూన్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మరి ఈ సినిమా అక్కడ కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్‌కు జోడీగా భూమి ఫెడ్నేకర్ నటించిన సంగతి తెలిసిందే. IT’S CONFIRMED... #ToiletEkPremKatha to release in China on 8 June 2018... Titled #ToiletHero for the local audiences... Here’s the OFFICIAL POSTER for China... #TEPK pic.twitter.com/VlQFufXN3Q — taran adarsh (@taran_adarsh) June 1, 2018 -
చెంబుతో కొట్టింది
షాజాహాన్ తాజ్‌మహల్ కడితేఈ అభినవ షాజాహాన్ భార్య కోసంటాయ్లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు.నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారుఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోనికేశవ్ చివరకు టాయ్‌లెట్ కట్టేస్తాడు.ఓ రాత్రి తన మనుషులతో దాన్నికూలగొట్టిస్తాడు తండ్రి. యూజువల్లీ తప్పు చేస్తే చెప్పుతో కొడ్తారు. కాని ఇంట్లో టాయ్‌లెట్ ఏర్పాటు చేయకపోతే చెంబుతో కొడ్తుంది ఈ మహిళ ఈ సినిమాలో. పదిమందికీ కనపడేలా భార్యనో, ఇష్టసఖినో ముద్దుపెట్టుకుంటే తప్పు మన దేశంలో. అదే భార్యను లేదా ఇష్టసఖిని పదిమంది తిరుగుతున్న చోటకు చెంబుతో పంపిస్తే తప్పు లేదు! ఇది మన న్యాయం! ఎంత అన్యాయం ఇది? అని నిలదీస్తుంది టాయ్‌లెట్. మహిళను పూజించే సంస్కారం మనదని చెప్తూనే ఆమె ఆత్మాభిమానాన్ని పోస్ట్‌మార్టమ్ చేస్తున్నాం ఇంట్లో టాయ్లెట్లు కట్టకుండా! ఆమె మొహం మీద నుంచి కొంగు తొలిగితే కొంపలేంటుకుపోవు.. కాని బహిర్భూమి కోసం ఆమె బయటకు వెళితేనే కాపురం కూలిపోతుంది అని చూపిస్తుందీ ఈ సినిమా! అవును.. ఇంట్లో టాయ్‌లెట్ కట్టించకపోతే మొగుడిని సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంది జయ (భూమి పడ్నేకర్). ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంక అనే అమ్మాయి అత్తింట్లో టాయ్‌లెట్ లేదని తెలిసి పీటల మీద పెళ్లిని వద్దనుకుంటుంది. తర్వాత ఆ అత్తామామా టాయ్‌లెట్ కట్టిస్తామని ప్రమాణం చేస్తే.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ నిజ జీవిత కథనే రీల్‌గా చుట్టుకుని వచ్చింది టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ. ఆ సినిమా కథ క్లుప్తంగా... ఎడ్డెం అంటే తెడ్డెం కేశవ్ (అక్షయ్ కుమార్)... ఇంటర్ ఫెయిల్డ్.. పెళ్లికాని ప్రసాద్ కేటగరీ 36 ఏళ్ల క్యాండిడేట్. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వరుడు. ఎంతటి సనాతనం అంటే అశుద్ధం ఇంట్లో జరక్కూడదని(ఉండకూడదని) టాయ్‌లెట్ కట్టించడు వాళ్ల నాన్న (సుధీర్ పాండే). సనాతనం పేరుతో అలాంటి చాలా అంధవిశ్వాసాలను పాటిస్తుంటాడు ఆయన. అందుకే 36 ఏళ్లు వచ్చినా కేశవ్ పెళ్లికాకుండా ఉంటాడు. ఆ సమయంలోనే కనిపిస్తుంది జయ. చదువుకున్నది, లోకజ్ఞానం తెలిసింది. ఈ ఇద్దరిదీ ఎడ్డెం అంటే తెడ్డం అనే వ్యవహారం. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్ల. ఇంట్లో కాస్త ఆధునిక వాతావరణం.. అటాచ్డ్ బాత్ వగైరాతో సహా! ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికీ దారితీస్తుంది. లోటా పార్టీ శోభనం తెల్లవారు ఝామున ఊసులాడుకుంటున్న ఈ జంటను కొందరు ఆడవాళ్లు కిటికీలోంచి చూసి డిస్టర్బ్ చేస్తారు. ఆ అంతరాయం సహజంగానే జయకు చిరాకు తెప్పించి వాళ్లను అడుగుతుంది ‘‘ఏంటీ’’ అని. అప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్న లోటాలను చూపించి ‘‘రావా.. తెల్లవారితే వెళ్లలేవు.. రా త్వరగా వెయిట్ చేస్తాం’’ అంటారు. అర్థంకాని జయ అయోమయంగా భర్త వంక చూస్తుంది. నీళ్లు నమిలి చెప్తాడు.. ‘‘వాళ్లు పొలాల్లోకి టాయ్‌లెట్‌కి వెళ్తున్నారు. నువ్వూ వెళ్లు త్వరగా’’ అని. ‘‘ పొలాల్లోకి వెళ్లడం ఏంటీ? ఇంట్లో టాయ్‌లెట్ లేదా?’’ అని అడుగుతుంది అంతే అమాయకంగా. తల అడ్డంగా ఊపుతాడు. కోపాన్ని దిగమింగి లోటాతో ఆ పార్టీలో జాయిన్ అవుతుంది జయ. అక్కడి నుంచి ఆమెకు, ఆమెతో కేశవ్కూ కష్టాలు మొదలవుతాయి టాయ్‌లెట్ కోసం! తండ్రి.. తాను.. భార్య జయ కోసం లోటా పార్టీ వస్తుందంటే చాలు కేశవ్‌లో వణుకు మొదలయ్యేది. చేత్తో లాంతరు, ఇంకో చేత్తో లోటాతో ఆ పార్టీతో కలవడం... అసలు బహిర్భూమికి ఊరు అవతలున్న చేను, చెలకలను ఎంచుకోవడం జయకు అసహ్యంగా అనిపించేది. దాంతో కేశవే భార్యను బయటకు తీసుకెళ్లడం మొదలుపెడ్తాడు.అలా ఒకసారి గుబురు పొద మాటున జయ ఉండగా.. బండీ మీద హెడ్‌లైట్‌తో ఆమె మామగారు వస్తుంటారు... ఆయన కంట కోడలు పడ్తుంది... ఆ కంగారులో బండీ బ్యాలెన్స్ తప్పి ఆయనా పడిపోతాడు. ఆ సమయంలో మామగారు తనను చూడ్డంతో సిగ్గు, అవమానంతో దహించుకుపోతుంటుంది జయ. అత్తలేని సంసారం కావడంతో వంటిల్లు జయదే. లోటా అవమానాన్ని కోపంగా వంటింటి పాత్రల మీద తీరుస్తుంటుంది. నిస్సహాయ స్థితిలో కేశవ్ ఉంటాడు. అప్పుడే మామగారూ వస్తారు బయట నుంచి. తనను చూసి కోడలు తల మీదకు పైట లాక్కోలేదని, లాక్కోమని కొడుకుకు సైగలతో చెప్తుంటాడు. కేశవ్ భార్యను హెచ్చరిస్తాడు. పొద్దున పూట జరిగిన విషయాన్ని ఎత్తిపొడుస్తుంది జయ ‘అప్పుడు పోని మర్యాద ఇప్పుడు తల మీద పైట లాక్కోకపోవడం వల్ల పోతుందా?’’ అని. అది కోడలి పొగరుగా వినిపిస్తుంది, కనిపిస్తుంది మామగారికి. కొడుకుకు చెప్తాడు భార్యను హద్దుల్లో పెట్టుకోమని. భార్యా చెప్తుంది ఇంట్లో టాయ్‌లెట్ కట్టించమని. ట్రైన్లో.. భార్య ఎలాంటి అభాసుపాలవకుండా.. హాయిగా పనికానిచ్చుకునే మార్గాన్ని అన్వేషించడంలోనే కేశవ్ జీవితం తెల్లారుతుంటుంది. అలాంటి ప్లాన్స్లోనిదే ట్రైన్. ఒక ట్రైన్ తెల్లవారు జామునే వాళ్ల ఊళ్లో ఏడు నిమిషాలు ఆగుతుంది. ఆ ట్రైన్ టాయ్లెట్లోకి వెళ్లొచ్చని భార్యకు సలహా ఇవ్వడమే కాక రోజూ తీసుకెళ్తుంటాడు. అలా ఒకరోజు టాయ్లెట్లో ఉన్నప్పుడునే ఆ బాత్రూమ్ బయట కొంతమంది ప్యాసెంజర్స్ తమ సామానంతా నింపేసి నిలబడ్తారు కంపార్ట్మెంట్లో జాగ దొరక్క. ఈలోపు ట్రైన్ కదుల్తుంది. ఆమె లోపలి నుంచి ఎంత ప్రయత్నించినా తలుపు రాదు. అరుస్తుంది. అయినా ఇవతల వాళ్లకు వినిపించదు. ట్రైన్ ప్లాట్‌ఫామ్ వీడి పోతుంటే అప్పుడు బాత్రూమ్ డోర్ దగ్గర ఉన్న వాళ్లకు తెలుస్తుంది లోపల ఎవరో ఉన్నట్లు. గబగబ సామానంత తీసి తలుపు తెరుచుకునే వెసులుబాటు చేస్తారు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటుంది. బాత్రూమ్లోంచి కంపార్ట్మెంట్ ఎగ్జిట్ దగ్గరకు వస్తుంది జయ.. ఎర్రబడ్డ మొహంతో. ప్లాట్‌ఫామ్ మీద నుంచి అరుస్తుంటాడు కేశవ్.. చైన్ లాగమని. కాని జయ లాగదు. ఆ రైలు ఆగి తాను దిగితే తన అత్తింట్లో టాయ్‌లెట్ రాదని ఆమెకు తెలుసు. అందుకే లాగదు.. భర్త మాటలను వింటూ అలాగే ఆ రైల్లో సాగిపోతుంది తన ఊరికి. అభినవ షాజాహాన్.. ఇంట్లో టాయ్‌లెట్ కట్టించేంత వరకు రానని భీష్మించుకుంటుంది జయ. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా తనేం చేయనని స్పష్టం చేస్తాడు కేశవ్. అయితే అత్తింటికి వచ్చే సమస్యే లేదని అంతకన్నా స్పష్టంగా చెప్తుంది ఆమె. పంతానికి సరే అన్నా చింత పడుతుంటాడు కేశవ్ పండిత్. టాయ్‌లెట్ సమస్య తీర్చి భార్యను రప్పించడం కోసం ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి టైమ్‌లోనే ఆ ఊళ్లో షూటింగ్ అవుతుంటుంది. అక్కడ రెడీమేడ్ టాయ్‌లెట్స్‌ను చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. ఓ రాత్రి వాటిల్లో ఒకదాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పెడ్తాడు. సినిమావాళ్లకు తెలిసి పోలీస్ కంప్లయింట్ ఇస్తారు. ఈ విషయం తెలియని కేశవ్ భార్యకు ఫోన్ చేసి టాయ్‌లెట్ వచ్చేసింది ఇంటికి రమ్మంటాడు. ఆమె ఆ ఏర్పాట్లలో ఉన్నప్పుడే కేశవ్‌ను పోలీసులు లాకప్‌లో వేస్తారు. ఈ సంగతి తెలిసిన జయ భర్తను అసహ్యించుకుంటుంది. టాయ్‌లెట్ కట్టించకపోతే విడాకులు ఇస్తాను అని అల్టిమేటం జారీ చేస్తుంది. తన చేతకాని తనానికి కేశవ్ సిగ్గుపడ్తాడు. లాభంలేదు.. సీరియస్‌గానే తీసుకోవాలి అని అనుకొని తండ్రి కట్టుబాటును ధిక్కరిస్తూ ఇంట్లో టాయ్‌లెట్ ఉండాలనే అభిప్రాయాన్ని చెప్తాడు. తండ్రి కోపగించుకుంటాడు. అయినా కొడుకు లెక్క చేయడు. ఊళ్లో వాళ్లంతా కూడా కేశవ్‌ను గేలి చేస్తుంటారు.. పెళ్లామ్కు బానిస అని. షాజాహాన్ తాజ్‌మహల్ కడితే ఈ అభినవ షాజాహాన్ భార్య కోసం టాయ్‌లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు. నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారు ఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోని కేశవ్ చివరకు టాయ్‌లెట్ కట్టేస్తాడు. ఓ రాత్రి తన మనుషులతో దాన్ని కూలగొట్టిస్తాడు తండ్రి. డైవోర్స్.. ఇది తెలిసిన జయ విడాకులు ఖాయం చేస్తుంది. అది దేశమంతా వార్త అవుతుంది. టాయ్‌లెట్ కోసం ఓ భార్య విడాకులిస్తోందని టీవీలు, పేపర్లు ఊదరగొడ్తాయి. అత్తగారి ఊరు ఆడవాళ్లు జయను కలుస్తారు. ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతమా అంటారు. ‘‘కాదు సిగ్గుచేటు. మీరూ నాతో కలిస్తే ఇంటింటికీ టాయ్‌లెట్ వస్తుంది లేకపోతే నా ఇంట్లోనే వస్తుంది. అదీ లేకపోతే టాయ్‌లెట్ ఉన్న మా అమ్మవాళ్లిల్లే నా సొంతిల్లు అవుతుంది’’ అని అంటుంది. భార్య అంటే ఆలోచన ఉన్నవాడు ఇంట్లో టాయ్‌లెట్ కడ్తాడు అని నినదిస్తుంది జయ. సోచ్ హోతో శోచాలయ్ హోగా అని. అది ఊరంతా వ్యాపిస్తుంది ఓ ఉద్యమంలా. చివరకు టాయ్‌లెట్ సాధిస్తుంది. ఆ ప్రేమ కథ సుఖాంతమవుతుంది. టాయ్‌లెట్.. నాలుగు అడుగుల విస్తీర్ణంతో నాలుగు గోడల గది మాత్రమే కాదు. స్త్రీ మానాభిమానాలు, ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే ఓ చూరు అని చాటుతుంది ఈ సినిమా! అంతేకాదు స్వచ్ఛ్భారత్కి అసలైన నిర్వచనం.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండడమే అనీ చెప్తుంది! మూఢనమ్మకాలను మరుగుదొడ్లలో వేసి ఒంటిని, ఇంటిని శుభ్రపరిచే తీరును చూపిస్తుంది. కేశవ్‌గా అక్షయ్‌కుమార్, జయగా భూమి పడ్నేకర్లు జీవించారు. మిగిలిన వాళ్లూ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. రిషికేష్ ముఖర్జీ కిసీసే నా కహెనా తరహాలో ఈ సినిమాను ఫ్రేమ్ చేయాలనుకున్న నారాయణ్ సింగ్ ప్రయత్నమూ కనిపిస్తుంది. ఈ సినిమాకు సహ నిర్మాతలు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేలు. ఒక కమర్షియల్ హీరో ఇలాంటి సామాజిక అంశాలను తెరకెక్కించడంలో చూపించిన చొరవ ప్రశంసనీయం. -
చాలా మందితో డేటింగ్ చేశా : హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అలరిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ భూమీ పెడ్నేకర్. తొలి సినిమాలో భారీకాయంతో కనిపించిన ఈ భామ తరువాత స్లిమ్ లుక్ లోకి మారిపోయిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ యువతినన్న భూమి, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపింది. అంతేకాదు తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాని, ఇంత వరకు ఏ హీరోతోనూ వరుస సినిమాలు చేయలేదు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలని అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తనూ తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి పెడ్నేకర్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. -
డైరెక్టర్ నాలుకపై కోటి రూపాయల నజరానా!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్టులలో 'టాయిలెట్-ఎక్ ప్రేమ్ కథా' ఒకటి. కొన్ని రోజుల కిందట షూటింగ్ మొదటిరోజు టాయిలెట్లో హీరోయిన్ భూమి పెడ్నేకర్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని అక్షయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేసింది. ఆ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి వివాదంతో ముందుకొచ్చింది. సాధువు బెహరీ దాస్ మహరాజ్ ఈ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండే నాలుక తెచ్చిన వారికి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలు, కొన్ని ఏరియాలలో ఇవి లేని కారణంగా ఏకంగా వివాహాలు రద్దయిన విషయం తెలిసిందే. మధుర పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే నందగావ్ పురుషులకు, బర్సానా గ్రామ మహిళలకు వివాహాలు జరగవు. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ప్రేయసి రాధకి వివాహం కాలేదని, ప్రస్తుతం ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఆ గ్రామాల వారైనందున స్టోరీని మార్చాలని బెహరీ దాస్ మహరాజ్ తో పాటు మరికొందరు సాధువులు హెచ్చరించారు. మూవీ స్టోరీని మార్చితీరాల్సిందేనని మూవీ యూనిట్‌ను డిమాండ్ చేస్తున్నారు. మహామండలేశ్వర్ నవల్ గిరి మహరాజ్ మధురలో మాట్లాడుతూ.. సమాజానికి సందేశాన్నిచ్చే స్టోరీ అయితే ఆ మూవీ పేరును 'టాయిలెట్- ఏ స్వచ్ఛ అభియాన్' అని మార్చుకోవాలని అన్నారు. రాధాకృష్ణుల పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సినిమా తీస్తూ, పెళ్లి లాంటి విషయాలను టచ్ చేశారని మహంత్ హరిబోల్ మహరాజ్ అన్నారు. టైటిల్ కచ్చితంగా మార్చితీరితేనే నందగావ్, బర్సానా, మధుర ప్రాంతాల్లో షూటింగ్ సజావుగా సాగనిస్తామని సాధువులంతా సోమవారం మధురలో జరిగిన ఓ సమావేశంలో నిర్ణయించారు. ఆ మూవీకి డైరెక్టర్ నీరజ్ పాండే కాగా నిర్మాతలుగా విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే వ్యవహరిస్తున్నారు. -
టాయ్లెట్లో హీరో-హీరోయిన్ సెల్ఫీ!
మురికి మరుగుదొడ్డి చూస్తే.. ఎవరైనా ఆ కంపునకు ముక్కు మూసుకుంటారు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ మాత్రం ఏకంగా హీరోయిన్ను వెంటపెట్టుకొని మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగాడు. ఎందుకంటే.. ఆయన మరో క్రేజీ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ భారత్’ పథకం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టాయ్‌లెట్- ఎక్ ప్రేమ్‌కథ’ సినిమాలో అక్షయ్ నటిస్తున్నాడు. సినిమా పేరులోనే టాయ్‌లెట్ ఉంది కాబట్టి.. తొలిరోజు మధురలో షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఇదిగో ఇలా భూమి పడ్నేకర్‌తో కలిసి మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పెట్టాడు. శ్రీ నారాయణ్‌సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ స్వచ్ఛత అంశం చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవల మరుగుదొడ్డి లేని కారణంగా దేశంలో పలుచోట్ల పెళ్లికూతుళ్లు పెళ్లిని నిరాకరించడం, భర్తను వదిలిపెట్టడం వంటి అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారని సమాచారం. ఇప్పటికే అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతని మూడు సినిమాలు సూపర్‌హిట్ అయి వందకోట్ల క్లబ్బులో స్థానం సాధించాయి. అంతేకాకుండా ‘జాలీ ఎల్ఎల్బీ-2’, రజనీకాంత్ ‘రోబో-2’, నీరజ్ పాండే ‘క్రాక్’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో అక్కీ నటిస్తున్నాడు. వరుస విజయాలు వస్తున్నా.. రోటిన్‌కు భిన్నంగా సామాజిక కథాంశంతో అక్కీ ఈసారి ‘టాయ్‌లెట్ ఎక్ ప్రేమ్‌కథ’లో నటిస్తున్నాడు.