హీరోయిన్ల ముఖం అంతలా వెలిగిపోవడానికి కారణం ఇదేనా? | Bhumi Pednekar Tries Eye Makeup Hack And Makeup Routine | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: సొంతంగా మేకప్‌ ట్రై చేసి షాక్‌కి గురైన హీరోయిన్‌, ఏమైందంటే..

Published Wed, Dec 20 2023 11:34 AM | Last Updated on Wed, Dec 20 2023 12:56 PM

Bhumi Pednekar Tries Eye Makeup Hack And Makeup Routine - Sakshi

హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్‌ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భూమి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్,పతీ ఔర్ పత్నీ  వంటి సినిమాలతో బీటౌన్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

ఇ​క సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్‌, బ్యూటీకి సంబంధించిన పలు విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్‌ అవుతున్న ఐ మేకప్‌ హ్యాక్‌ను ట్రై చేసింది. స్మోకీ స్మడ్జ్ క్యాట్ ఐలైనర్‌ను సులభంగా ఎలా వేసుకోవాలో చూపించింది. అంతేకాకుండా ఈ హ్యాక్‌ తనకు బాగా నచ్చిందని, తన రెగ్యులర్‌ మేకప్‌లో దీన్ని తప్పకుండా వాడతానంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్‌ చేసింది.

ఇక మరో వీడియోలో కేవలం ఐదు నిమిషాల్లో మేకప్‌ ఎలా వేసుకోవాలో చూపించి ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్స్‌ తమ బ్యూటీ సీక్రెట్స్‌ను, మేకప్‌ రొటీన్‌ను ఎక్కువగా షేర్‌ చేసుకోరు. కానీ ఈ బ్యూటీ మాత్రం తాను మేకప్‌ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్‌ వాడుతుందో కూడా రివీల్‌ చేసింది. మరి మీకు నచ్చితే ఓసారి ట్రై చేసేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement