
భూమీ ఫెడ్నేకర్
‘‘ప్రస్తుతం ఇండస్ట్రీకి చాలా కొత్త టాలెంట్ వస్తోంది. హీరోలు, హీరోయిన్లు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలు, అద్భుతమైన పెర్ఫార్మెన్సులతో ఆకట్టుకుంటున్నారు’’ అన్నారు భూమీ ఫెడ్నేకర్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మీకు ఎవరు పోటీ అని భావిస్తారని భూమిని అడగ్గా–‘‘ప్రస్తుతం పోటీకి అంత చోటు లేదనుకుంటున్నాను. ప్రతి యాక్టర్‌కు వాళ్ల స్పేస్ వాళ్లకుంది. అందరూ తమ స్టైల్లో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో అన్‌హెల్దీ కాంపిటీషన్‌కు చోటే లేదు. అందరూ అందరి పనిని సపోర్ట్ చేస్తున్నారు.. అభినందిస్తున్నారు. నా హీరోయిన్స్ అందరూ బ్రిలియంట్ యాక్టర్స్. వాళ్ల సినిమాలు చూసి పోటీ పడాలని ఇంకా కష్టపడి పని చేసేందుకు ప్రేరణ లభిస్తుంది’’ అన్నారు. భూమీ నటించిన ‘సాండ్‌కీ ఆంఖ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆయుష్మాన్ ఖురానాతో ‘బాలా’ అనే సినిమా స్టార్ట్ చేయనున్నారామె.