అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. కానీ ఎక్కడ? పట్టపగలు కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఆడవారిపై వేధింపులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సాధారణ మహిళలే కాదు, సెలబ్రిటీలు సైతం ఎప్పుడో ఒకసారి వేధింపులకు గురవుతున్నారు. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్.
నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ..
ఆమె మాట్లాడుతూ... 'ముంబైలోని బాంద్రాలో జరిగిన సంఘటన నన్నింకా వెంటాడుతోంది. అప్పుడు టీనేజ్.. దాదాపు 14 ఏళ్లు ఉంటాయనుకుంటా.. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో అసభ్యంగా తాకుతున్నారు. అక్కడ చాలామంది జనం ఉండటంతో ఎవరలా చేస్తున్నారో అర్థం కాలేదు. నన్ను గిల్లుతున్నారు, పదేపదే అభ్యంతరకరంగా తాకడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు పిచ్చి పట్టినట్లయింది. అప్పుడు దీని గురించి కనీసం పేరెంట్స్‌కు కూడా చెప్పలేదు.
అప్పుడు బిగుసుకుపోతాం
ఎందుకంటే అప్పటికే నేను అయోమయంలో ఉండిపోయాను. కానీ ఇప్పటికీ ఆరోజును మర్చిపోలేను. నా శరీరం, మెదడు ఆ సంఘటనను పదేపదే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ ఘటన జరిగినప్పుడు మన బుర్ర పని చేయదు, భయంతో, అసౌకర్యంతో బిగుసుకుపోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ దమ్ లగాగే హైషా(2015) చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. త్వరలో భక్షక్ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి భక్షక్ స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment