నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న విక్కీ కౌశల్‌ సినిమా | Vicky Kaushal And Kiara Advani Govinda Naam Mera Film Gets Release Date | Sakshi
Sakshi News home page

Vicky Kaushal : ఓటీటీలో రిలీజ్‌ కానున్న విక్కీ కౌశల్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published Sun, Nov 20 2022 12:55 PM | Last Updated on Sun, Nov 20 2022 1:02 PM

Vicky Kaushal And Kiara Advani Govinda Naam Mera Film Gets Release Date - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శ‌శాంక్ ఖైతన్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ డిసైడ్‌ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్‌ 16 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement