'నేను హీరోయిన్‌ అంటే నమ్మలేదు, అంత సీన్‌ లేదన్నట్లు చూశారు' | Bhumi Pednekar: 'Ye heroine hai?' people were shocked | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని షాకయ్యారు.. అప్పుడే అనుకున్నా..

Published Tue, Oct 24 2023 5:53 PM | Last Updated on Sun, Feb 4 2024 11:06 AM

Bhumi Pednekar: 'Ye heroine hai?' people were shocked - Sakshi

స్టార్‌డమ్‌.. ఎవరికీ అంత ఈజీగా దక్కదు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చినవారికే స్టార్‌డమ్‌ దక్కుతుంది, ఎక్కువకాలం అది కొనసాగుతుంది. బాలీవుడ్‌ బ్యూటీ భూమి పడ్నేకర్‌ కూడా ఎన్నో అవమానాలు దాటుకుని టాప్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. 2015లో వచ్చిన దమ్‌ లగా కే హైషా సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఈ మూవీలో భూమి లావుగా ఉన్న అమ్మాయి పాత్రలో నటించింది. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుందీ హీరోయిన్‌.

నువ్వు హీరోయినా? అని ఓ లుక్కిచ్చారు
ఓ ఇంటర్వ్యూలో భూమి పడ్నేకర్‌ మాట్లాడుతూ.. 'దమ్‌ లగా కే హైషా' సినిమా షూటింగ్‌ కోసం హీరో ఆయుష్మాన్‌తో కలిసి విమానంలో ప్రయాణించాను. అప్పుడు అక్కడున్న జనాలు.. అ​ర్రె ఆయుష్మాన్‌.. షూటింగ్‌ కోసం వెళ్తున్నావా? ఇంతకీ హీరోయిన్‌ ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు నేను అతడి పక్కనే ఉన్నాను. ​తను నేనే హీరోయిన్‌ అన్నట్లుగా నావైపు చూశాడు. దీంతో అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. ఈమె హీరోయినా? అన్నారు. అప్పుడే నాలో ఇంకా కసి పెరిగింది. ఈ సినిమాతో నేనేంటో నిరూపించాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది.

విభిన్న కాన్సెప్టులతో అలరిస్తున్న బ్యూటీ
డిఫెంట్‌ కాన్సెప్టులతో పాటు మహిళా ప్రాధాన్యమున్న కథాంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది భూమి. ఈ క్రమంలోనే టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ, భీద్‌, అఫ్వా వంటి సినిమాలు చేసి గుర్తింపు పొందింది. ఇటీవలే థాంక్యూ ఫర్‌ కమింగ్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ద లేడీ కిల్లర్‌ మూవీ ఉంది.

చదవండి: ఓటీటీలో నయనతార సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement