ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకున్నారు కదా.. హీరోయిన్‌ సిస్టర్స్‌పై ట్రోలింగ్‌ | Trolling On Bhumi Pednekar and Her Sister Samiksha Over Plastic Surgery Remarks | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: చెల్లితో హీరోయిన్‌ రీల్‌.. నెట్టింట ట్రోలింగ్‌

Published Mon, Apr 15 2024 1:47 PM | Last Updated on Mon, Apr 15 2024 3:28 PM

Trolling On Bhumi Pednekar and Her Sister Samiksha Over Plastic Surgery Remarks - Sakshi

అందంగా కనిపించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. కొందరేమో డైట్‌, వర్కవుట్స్‌తో అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ‍ప్రయత్నిస్తారు. మరికొందరేమో పెద్దగా కష్టపడకుండా సర్జరీలు చేయించుకుంటారు. కానీ ముఖంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే పసిగట్టేస్తారు. కొన్నిసార్లయితే నిజమైన అందాన్ని కూడా ప్లాస్టిక్‌ సర్జరీ అని హేళన చేస్తారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ భూమి పడ్నేకర్‌ తన సోదరి సమీక్ష పడ్నేకర్‌తో కలిసి ఓ వీడియో చేసింది. నేను, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ప్లాస్టిక్‌ సర్జరీ..
ఇందులో ఇద్దరూ దాదాపు ఒకేలా ఉన్నారు. ఇద్దరిలో భూమి ఎ​వరో గుర్తుపట్టలేకుండా ఉండటంతో చాలామంది ఈ సిస్టర్స్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరికీ ఒకే వ్యక్తి ప్లాస్టిక్‌ సర్జరీ చేస్తే ఇలాగే ఉంటుంది అని ఓ వ్యక్తి సెటైర్‌ వేశాడు. దీనికి భూమి స్పందిస్తూ.. సర్జరీయే ఎందుకనుకోవాలి? ఇద్దరి పేరెంట్స్‌ ఒక్కరే అయుండటం వల్లే ఇలా ఉన్నామనుకోవచ్చుగా అని బదులిచ్చింది. మరొకరు ప్లాస్టిక్‌ జీవితం అని కామెంట్‌ చేయగా.. ఇక్కడ ఏం ప్లాస్టిక్‌ కనిపించింది? అని సమీక్ష ప్రశ్నించింది. భూమి ఫ్యాన్స్‌ మాత్రం మీరిద్దరూ ట్విన్స్‌లా ఉన్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

బంగారు నాణాలు
భూమి చివరగా.. భక్షక్‌ మూవీలో నటించింది. తన నటన నచ్చడంతో ఆమె తల్లి సుమిత్ర భూమికి బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చింది. 'నేను నటిగా ఎదిగిన ప్రతిసారి తను నాకు గోల్డ్‌ కాయిన్‌ ఇస్తుంటుంది. భక్షక్‌ చూశాక ఇంకో కాయిన్‌ ఇచ్చింది. నా సోదరి సమీక్ష అయితే ఏడ్వడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు అమ్మ నాకు ఏడు బంగారు నాణాలు ఇచ్చింది. ఇంతకంటే పెద్ద అవార్డు ఏముంటుంది?' అని హీరోయిన్‌ ఉప్పొంగిపోయింది.

చదవండి: ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌తో వైరల్‌.. హీరోయిన్‌ రెస్పాన్స్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement