డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే! | Crime Thriller Bhakshak Official Trailer Released Today | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Wed, Jan 31 2024 3:40 PM | Last Updated on Wed, Jan 31 2024 5:47 PM

Crime Thriller Bhakshak Official Trailer Released Today  - Sakshi

బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ 'భక్షక్'. పులకిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై షారుక్‌ఖాన్‌, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న  దారుణాలను బయటికి తీసే జర్నలిస్ట్‌ జర్నలిస్ట్‌ వైశాలీ సింగ్‌ పాత్రలో భూమి కనిపించనుంది. కాగా.. ఇప్పటికే టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 

ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో  ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement